జ్యోతిష్య శాస్త్రము మూడు భాగములుగా విభజించ బడినది.
1. గణిత
భాగము ; ఈ భాగములో గ్రహలయొక్క సంచారము తిధి, వార, నక్షత్రములు, యోగములు,
కరణములు, గ్రహ గతులు గ్రహణములు , మూడమి మొదలగు అనేక విషయములను తెలియపరచుచు
పంచాంగమును వ్రాయుట గురించి తెలుసుకొన వచ్చును.
2. జాతక భాగము ; ఈ భాగములో గ్రహముల యొక్క సంచారమునుబట్టి మానవుని జీవితములో కలుగు శుభాశుభములను, లాభ నష్టములను తెలుసు కొనవచ్చును.
3. ముహూర్త
భాగము ; ఈ భాగములో మానవుడు నిత్య జీవితములో జరుగు ప్రతి కార్యము అనగా
జన్మించిన నాటి నుండి నామకరణము, బారసాల,అన్నప్రాశనం, అక్షరాభ్యాసం,
ఉపనయనము, వివాహము, గృహారంభము, గృహప్రవేశం మొదలగు అనేకరకముల శుభ కార్యముల
గురించి ముహూర్తములు నిర్ణయించుటకు ఉపయోగ పడును.
No comments:
Post a Comment