Tuesday, December 17, 2013

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు

శ్రీ విఘ్నేశ్వర ప్రార్ధన :

శ్లో|| శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే…

ఆది దేవుడిని పూజించుకుంటూ విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం..
కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.
మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గ్రండ గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరము నుంచి బయటికి వచ్చారు.
నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని “ఏకదంతుడి”గా పేరు పొందా

పూజా సమయం

మన పూర్వులు పూజా విధానాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. 5,16,18,226 విధాలుగ పూజలనూనుసరించడం జరుగుతోంది. అసలు మెలకువ్ వచ్చిన వెంటనే భగవంతుని స్మరిస్తూ కుడి అరచేతిని చూసుకుంటూ కళ్ళు తెరవాలని చెప్పారు. ఎందుకనే ప్రభాత కాలంలో కరదర్శనం కల్యాణప్రదం.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరపృష్ఠే చ గోవింద: ప్రభాతే కరదర్శనం
ఇక పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమీదని నిర్ణయించారు. త్ర్సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. త్రిసంధ్యలను -
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్నసంధ్య
3. సాయంసంధ్య అని మూడు రకాలుగా విభజించారు.
1. ప్రాత:సంధ్య – ఇద్ మరలా మూడు విధాలు. అ) ఉత్తమం (భ్రాహ్మీముహూర్తం) , ఆ) మధ్యమం (తారకా రహీం), ఇ) అధమం (సూర్యోదయం అనంతరం అంటే, సూర్యోదయానికి ముందు ఘడియలకు ముందన్నమాట.
2. మధ్యాహ్నసంధ్య – మిట్ట మధానానికి ఒకటిన్నర ఘ్డియల్ ముందు, ఒకిన్నర ఘడియల వెనుక
3. సాయంసంధ్య – అ) ఉత్తమం, సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు , ఆ) మధ్యమం, సూర్యాస్తమయకాలం. ఇ) అధమం, నక్షత్రాలు కనిపించిన తరువాత.
అన్ని సంధ్యలలో బ్రాహ్మీమూహూర్తకాలమే ప్రశస్తమైనది. బ్రాహ్మీముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్కు. బ్రాహ్మీముహూర్తసమయంలో ప్రకృతి సత్త్వ గుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ సమయం జప తపాలకు చాల అనుకూలమైన సమయమని చెప్పబడింది. ఇక, ఘడియకాలన్ని ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు లెక్కగడతారు. ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు 60 ఘడియలకాలం. అంటే 30 ఘడియలు పగలైతే, మిగతా 30 ఘడియలు రాత్రన్నమాట. సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని ఉష:కాలమని, 57 ఘడియలు దాటిన తరువాత మూడు ఘడియల కాలాన్ని అరుణోదయకాలమని అంటారు. 58 ఘడియలు దాటిన తదనంతరపు 2 ఘడియల కాలన్ని ప్రాత:కాలమని అంటారు. ఆ ప్రాత:కాలం తరువాతే సూర్యోదయం. ఇలా పరిశీలించినపుడు 55 వ ఘడియ నుంచి 58 ఘడియల మధ్యకాలం పూజలు, జపధ్యానాదులకు ప్రశస్తమైన సమయం గా చెప్పబడుతోంది. ఇక, ప్రాత:కాలన్నే నిద్రలేచి, స్నానాదికాలను ముగించి పూజ చేయడానికి ఉద్యుక్తులైన భక్తుల మనసులలో పూజ ఎలా, ఎక్కడ చేయాలన్న సందేహాలుంటాయి.
గృహే జపం సమం విద్యాగోష్ఠే శతగుణం భవేత్
నధ్యాం శత సహస్రం స్యాత్ అనంతం దైవ సన్నిధౌ
సముద్రతీరే చగ్రాదౌ గిరఒ దేవాలయేషు చ
పుణ్యాశ్రమే అర్వేషు జనం కోటి గుణోభవేత్
మన ఇంట్లో చేసే జపం సామాన్య పలితన్ని కలిగిస్తుంది. గోశాలలో చేసే జపం ఇంట్లో చేసే జపానికంటే నూరురెట్లు అధికమైన ఫలితాన్ని కలిగిస్తుంది. నదీతీరంలో చేసే జపం లక్షరెట్లు ఫలితాన్ని కలిగిస్తుండగా, సముద్ర తీరం, పర్వతశిఖరాలు, పుణ్యాశ్రమాలలో చేసే జపం కోటి ఫలితాలను ఇస్తుండాగా, దైవసన్నిధిలో చేసే జపం అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని ఋషివాక్కు.
అయితే నేటి పరిస్థితులలో, కాలంతో పోటి పడుతున్న మనిషికి అంత తీరిక లేకపోవచ్చు. అందుకే కాస్త పెద్ద ఇల్లుగలవాళ్ళు పూజగదిని, ఇరుకు ఇళ్ళూగలవాళ్ళు ఓ వైపు పూజాప్రదేశాన్ని ఏర్పాటుచేసుకుని పూజలను నిర్వహించుకుంటునారు. పూజా ప్రదేశాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవడంతో పాటూ మనసును కూడ ప్రశాంతముగా ఉంచుకోవాలి. అప్పుడే పూజలను నిర్విఘ్నంగా చేసేందుకు వీలవుతుంది.
పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడ అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నంగా జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకె ఆసనం గురించి ఈ క్రింది విధంగా చెప్పారు.
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం
ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి, నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, ‘ఆసనం’ అత్యంతావశ్యకమైయున్నదని చెప్పబడుతోంది.
ఇక ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, ‘ స ‘ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం. ఆ రోజులలో పులిచర్మాన్ని, కృష్ణాజినం, కంబళి, దర్భాసనం, పట్టు వస్త్రం, నూలువస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించేవారు. నేటి పరిస్థితులకు తగినట్లుగా పులిచర్మం, కృష్ణాజినం తప్ప మిగితావాటిని అసనాలుగా ఉపయోగించుకోవచ్చు.
కొంతమంది పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.
పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్యానంతో ప్రారంభిస్తాం. ధ్యానం ద్వారా భక్తునికి, తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు. అన్ని కర్మలను విడిచిపెట్టి మన మనస్సును లీనం చేయడం ఆవాహనమనబడుతుంది. ఆ స్వామే అన్నింటికి ఆధారమన్న జ్ఞానాన్ని ఆసనం. స్వామిపట్ల అంకిత భావాన్ని కలిగిఉండటం పాద్యం. మనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం గంధం. కర్మవాసనలకు దూరంగా ఉండటమే అక్షతలు. మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం ధూపం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీ ఆయనవలననే లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని సమర్పిస్తుంటాం.
నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. మౌనంగా ఉండటం స్త్రోత్రం. సర్వసంతోషమే విసర్జనం అని చెప్పబడింది. ఇలా మన నిర్వహించే పూజలోనిఉపచారాలు అంతరార్థమై ఉంది.
అలాగే మన పెద్దలు అధ్యాత్మిక సాధనలో ఇంద్రియాలే సాధనాలని, ప్రాణాలే సేవకులని, షట్ కమలాలే పువ్వులని, శరీరంలో ఉన్న అగ్నే ధూపమనీ, జీవకళలే దీపాలని, అనందమే నైవేద్యమని, లోనున్న సూర్యచంద్ర జ్యోతులే హారతులనీ, బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది.
త్వం సర్వభూతేషు విరాజసే సదా
సర్వేషు జీవేస్వపి జీవనం స్వయం
త్వద్దర్శనం సర్వగమేస్తు సర్వత
స్తలైన పూజాస్తు చ కర్మభిర్మమ
ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు. సర్వత్రా నీ దఋశ్నం మాకు కలుగుగాక. నా సమస్త కర్మలతోనే నీ పూజ అగుగాక.
నీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి స్వామీ!!
“మన పూజా విధానాలలో అనేక అంతరార్థాలున్నయి. పెద్దలు మన కోసం ఏర్పరిచిన ఈ విధానాలు, మన జీవితాలనుసన్మార్గం వైపు నడిపించి, జీవితాన్ని అనందమయం చేస్తాయి. పూజా విధానంలో ప్రతిఒక్క ఉపచారం వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంది.”
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ  

స్వామి శరణమయ్యప్పా

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది.
అయ్య (=విష్ణువు),
అప్ప (= శివుడు)
అని పేర్ల సంగమం తో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే “కుళతుపుళ”లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. “అచ్చన్ కోవిల్”లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
మహిషి కధనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. ‘తధాస్తు’ అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి – సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు — మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో
శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు ‘అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది

భారతీయుల ఆచార వ్యవహారాల్లో వివాహానికి ఎంతో విశిష్టత వుంది. అలాగే పితృకార్యాలు నిర్వహించడంలోను ఈ ఆచార వ్యవహారాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ ఇంట్లో వివాహ వేడుకను జరిపించిన కొద్ది కాలానికే తమ పెద్దలకు తద్దినాలు పెడుతుంటారు. తెలిసి చేసినా … తెలియక చేసినా ఇందు వల్ల దోషం కలుగుతుందని చెప్పబడుతోంది.
వివాహ వేడుక జరిగిన ఇంట్లో ఆరునెలలు దాటకుండా తద్దినాలు పెట్టకూడదు. మనకి ఆరునెలల సమయం అంటే అది పితృదేవతలకు ఒక పూటతో సమానం. ఆరు నెలలు కాకముందే తద్దినాలు పెట్టవలసి వస్తే, రెండు కార్యక్రమాలకు వారిని ఒకే పూట ఆహ్వానించినట్టు అవుతుంది. వివాహ సమయంలో పితృ దేవతలను ఆహ్వానించి వారి ఆశీర్వచనం కోరుకునే సందర్భం వుంటుంది. అలా వివాహ వేడుకకి వచ్చిన పితృదేవతలను, అదే పూట తద్దినానికి ఆహ్వానించడం వారి మనసుకి కూడా కష్టం కలిగిస్తుంది.
అందువలన వివాహమైన ఇంట్లో ఆరునెలల వరకూ తద్దినాలు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితే అయితే ఆ కార్యక్రమాన్ని నదీ తీరాల్లో జరిపించడం ఉత్తమమని అంటోంది. ఇక నూతనంగా గృహప్రవేశం చేసిన వారి విషయంలోనూ ఇదే పద్ధతి వర్తిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. అందువలన శాస్త్రం చేస్తోన్న సూచనలను దృష్టిలో పెట్టుకుని ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించాలి.

శుక్రవారాల నోము నోచుకోవడానికి కారణమైన కథ ?

నోములన్నింటిలోకి ‘శుక్రవారాల నోము’కి ఎంతో ప్రాధాన్యత … ప్రాముఖ్యత వున్నాయి. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి, తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గానీ, ఏ వూరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్ర వారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ, 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత ‘లక్ష్మీ తులసి’ దగ్గర 20 దీపాలు పెట్టి, 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు వాయన దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను … దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త, ఉన్న పళంగా బయల్దేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన, అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా, తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరాడు.
ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే వున్నారు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి, ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే వున్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా, ఆ పెద్దమనిషి బండి దగ్గరికి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమనీ, అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందనీ, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.
ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి … అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయనీ, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమనీ, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం … అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శ్రీ కాల భైరవ అష్టమి

images kalabhairava-yantra-be-ahead-of-time-250x250
కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు … కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.
“శ్రీ కాల భైరవ అష్టమి”. ఎంతో మంచి రోజు. పిలిస్తే పలికేవాడు భైరవుడు. మహా రక్షకుడు.
కాలభైరవునికి ….. ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్హి (wik) గా చేసి , భైరవుని తలచుకుంటూ, దేవుని ముందు .. 2 దీపాలు నువ్వుల నూనె తో వెలిగించి పెట్టండి. ఎంతో మంచిది . భైరవుడు ఎంతో సంతోసిస్తాడు . దీవిస్తాడు .
మఖ నక్షత్రం లో అష్టమి రావడం మరీ శుభ ప్రదం. 12 సంవత్సరాలకు ఒక సారి ఇలా వస్తుంది. స్త్రీలకు మరీ శుభ ప్రదం.
గాయత్రి …..
ఓం కాల కాలాయ విద్మహే
కాలాతీతాయ ధీమహి
తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ॥
శ్రీ కాళభైరవాష్టకమ్
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం l
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం l
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే l
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ll
కాల భైరవం భజే l
కాల భైరవం భజే ll
~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~

బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా?

శివునికి ప్రీతిపాత్రమైన బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా..! తెలియనట్లైతే ఈ కథనం చదవండి. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె “ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.
మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?” అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.
అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.
గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.
అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ‘ఆకలి! ఆకలి!!’ అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.
అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, “తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో ‘విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః’ అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి” అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

గ్రహదోషాలు తొలగిపోవడానికి వివిధ రకాల స్నానాలు

నవగ్రహాలలో ఒక్కో గ్రహం … దాని తాలూక దోషం … ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి నానారకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
కుంకుమ – ఎర్ర చందనం కలిపిన ‘రాగిపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ – గంధం కలిపిన నీటిని ‘శంఖం’తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం – తిలలు కలిపిన ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల బారినుంచి బయటపడవచ్చు.
ఇక నదీ సాగర సంగమంలోని నీటిని ‘మట్టిపాత్ర’లో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి – మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇక నువ్వులు … మినువులు కలిపిన ‘లోహపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు … పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వలన ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

సప్తపది

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటి చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పూరోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది. తలంబ్రాల కార్యక్రమం తర్వాత వధూవరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. ఇప్పుడు జరిగేది సప్తపది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. పూరోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.
“సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం”
“సభాసప్తపదాభవ”
ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.
మొదటి అడుగు..
“ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!”
రెండవ అడుగు..
“ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు”
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక
మూడవ అడుగు…
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.
నాలుగవ అడుగు..
“చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.
ఐదవ అడుగు..
“పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.
ఆరవ అడుగు..
“షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు “
ఈ ఆరవ అదుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.
ఏడవ అడుగు..
“సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.
సప్తపది మంత్రార్ధం గురించి తెలుసుకుందాం..
“సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదా బభూవ! సఖ్యంతే గమేయం సత్యాత్, తేమాయోషం సఖ్యాన్నే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ! ఇష మూర్జం అభిసంపసానౌ సం నౌమనాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం”
“ఓ నా అర్ధాంగి! ఈ ఏడడుగులతో నీవు నా స్నేహితురాలవయ్యావు. ఈ స్నేహాన్ని ఎన్నటికీ వీడకుండా నాతో సహవాసిగా ఉండిపో. ఒకరినొకరు విభేదించక సమానమైన ఆలోచనలతో కలిసి ఉందాము. మన బంధం శాశ్వతమైనది. నీవు నన్ను ఎన్నటికీ విడిచిపోరాదు” అంటాడు వరుడు.
“సాత్వమసి అమూహం! అమూహమస్మి! సాత్వం ద్యౌః అహం పృధివీ! త్వమ్ రేతో అహంరేతో భృత్ ! త్వం మనో అహమస్మివాక్! సామాహమస్మి! ఋక్తం సా మాం అనువ్రతాభవ !”
” ఓ స్వామి! నీవు ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండుము. నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో కలిసి మెలిసి ఉంటాను. నీవు ఆకాశమైతే నేను ధరణిని. నీవు శుక్రమైతే నేను శోణితాన్ని. నీవు మనసైతే నేను వాక్కును. నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు. మనిద్దరిలో బేధం లేదు. ఎప్పటికీ ఒక్కటే. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉందాము ” అని సమాధానమిస్తుంది పెళ్లి కూతురు.
ఎంత చక్కని సన్నివేశమిది..
భార్యను భర్త ఎలా ప్రేమించాలో, ఆదరించాలో , భర్తను భార్య ఎలా గౌరవించాలో వివాహ మంత్రాల్లొ స్పష్టంగా చెప్పబడింది. కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహధర్మం. ప్రతీ వివాహంలో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న కలతలు, కలహాలు సహజమే. 
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?

బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు “భూసురుడు” అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.
ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.
ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.
౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము
ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి
ప్రస్తుత కాలంలో మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?.
దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.
ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.
ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.
అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.
పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.
బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :
యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :
కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.
నిత్య సంధ్యావందనం :
నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.
శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :
బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.
పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.
ప్రశాంతంగా ఉండుట :
ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.
స్పష్టంగా మాట్లాడుట :
మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.
చెడు వ్యసనములు లేకుండుట :
మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.
సమ భావన :
ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.
కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.
కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

చిత్రగుప్తుని దేవాలయం

చిత్రగుప్తుని దేవాలయం

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంచాచార్యులు చెప్పారు.అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

 

దర్భ యొక్క ప్రాముఖ్యం

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం
అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!
అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.
వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.
దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.
వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ
ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఆహారశుద్ధి నియమం

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడద,భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము,
ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట. మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము.శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెది దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను.
సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.”జంతూనాం నరజన్మ దుర్లభం”–అన్నా రు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా– చెదారము తినేటి తువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,. .ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?

గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.
1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.
2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి
3 సర్వ సమర్ధత :- తాను సిశ్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.
ఇటువంటి వారిని మనపు పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.
అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు…గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.
శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.
కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.
మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?
గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఆండాళ్‌ (గోదాదేవి)-ఆళ్వారులు

ఆండాళ్‌ (గోదాదేవి)-ఆళ్వారుల (విష్ణుభక్తులు)
ఆండాళ్‌ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్‌ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్‌ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది.
తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరి యాళ్వారు)తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. ( గోదా -భూమి, గోదాదేవి – భూమిలో ఉద్భవించినది)
ఆ పసిపిల్ల దిన దిన ప్రవర్ధమానమగుచు అందరిని సంతోషపెట్టుచుండెడిది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణనుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ, ఇంకిత జ్ఞానము వచ్చు సరికి శ్రీమన్నారాయణుని తప్ప మనుజుల నెవ్వరిని వరించబోనని తన నిశ్చయము తెలిపినది.
తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యము చేయుచుండట చూసి గోదాదేవి పరవశించెడిది. తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యము చూచుకొనుచు తిరిగి ఆ మాలలను యధాస్థానమున నుంచెడిది. ఒక నాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్రశాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగ మందలించాడు. అమ్మా! స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా! అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు సమర్పించకుండుటకు విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ యెనరించిన చిన్ని అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు.
వటపత్రశాయి చిరునగవుతో విష్ణుచిత్తుని చూసి నీవు చింతించవలదు. సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చని మాలికలు మాకు వద్దు. ఆమె విషయము మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని చెప్పాడు.
గోదాదేవి యుక్త వయస్సు నొందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్రశాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనస్సులో ఊహించుకొని ధనుర్మాసములో తోడి బాలికలతో స్నానము చేసి వటపత్రశాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగను, తోడి చెలులు గోపికలుగను, వటపత్రశాయి శ్రీకృష్ణునిగను, తాను ఒక గోపాంగనగ భావించి వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యములతో దినమున కొక్క పాశురమును ద్రావిడ భాషలో (తమిళములో)వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచూ చెలులతో కాత్యాయనీ వ్రతము చేసింది. ఒక రోజున తన తండ్రిని 108 దివ్యతిరుపతలలోని మూర్తుల కళ్యాణగుణములను చెప్పవలసిందిగా కోరింది. పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.
ఆ వర్ణనలను వింటూంటే శ్రీరంగమున వేంచేసి యున్న శ్రీరంగనాయకుని మహాదైశ్వర్యవిభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడ దలచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహ మెట్లు జరుగుతుందని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్రశాయి నీకుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్ము అని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అరోజు రాత్రి విష్ణుచిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడెదను. సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళములతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగమునకు తీసుకొని వెళ్లిరి.
ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహము చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయములోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది.
శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని చూసి నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి ఇతర సత్కారములొనర్చి పంపాడు.
గోదాదేవికి ఆండాళ్‌ ( భక్తుల మేలుకొనునది), చూడి కొడుత్తామ్మాల్‌ (స్వామికి తాను ముడుచుకుని పూమాలలు ఇచ్చునది) అని పేర్లు వచ్చాయి.
గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగత్‌ విఖ్యాతినంది అన్ని వైష్ణవదేవాలయాలలోను ధనుర్మాసమందు ప్రతియేటా అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పది రోజులు పాశురములను పాడుచు లోకోత్తరముగ సేవలు చేయుచున్నారు. ఆమె తిరుప్పవై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతింపబడుచున్నవి. తిరుప్పావై దివ్య ప్రభందమే. 30 రోజులు పాడినవి మేలుపలుకుల మేలుకొలుపులు.
12alvars
ఆండాళ్‌ గురించి ముచ్చటైన విషయం తిరువాలుపాటి రాఘవయ్యగారు ముచ్చటించారు. ఒక రోజున విష్ణుచిత్తుడు గోదాదేవి వెనకాల శ్రీవిల్లి వుత్తూరులోని శ్రీకృష్ణాలయమున ప్రవేశించారు. గోదాదేవి నిచ్చల చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించింది. మీరు సర్వాంతర్యాములు. 108 దివ్య తిరుపతులలోను మీరే ఉన్నారు. ఇచ్చట మీరు శ్రీకృష్ణులు. శ్రీ రంగములో శ్రీరంగ నాయకులు. మీరే శ్రీరంగనాథులయిన నన్ను మీ దేవేరిగా పరిణయమాడండి. మీకు 100 కప్పుల చెక్కర పొంగలిని, 100 కప్పుల వెన్నెను సమర్పించుకొందును అని అన్నది.
శ్రీరామానుజుల వారు తమ సంచారములో శ్రీవిల్లి వుత్తూరులో శ్రీకృష్ణుని సందర్శించారు. కృష్ణునకు ఈ విధంగా విన్నవించారు. స్వామీ! జగత్పితా! మా సోదరి ఆండాళ్‌ (గోదాదేవి) తనను శ్రీరంగనాథుడు స్వీకరించిన మీకు 100 కప్పుల చెక్కెరపొంగలి, 100 కప్పుల వెన్నను సమర్పించుకొందును అని చెప్పింది. ఆమె మొక్కు తీరకుండా నుండగూడదు. నేను ఇప్పుడు మీకు ఆమె సోదరునిగా ఆమె మ్రొక్కును చెల్లించుచున్నానని 100 కప్పులు కాదు 100 కుండలు చెక్కెరపొంగలిని, 100 కుండలు వెన్నెను శ్రీవిల్లి వుత్తూరు వటపత్రశాయి శ్రీకృష్ణులకు సమర్పించి అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆ దినము నుండి శ్రీరామానుజులు గోదాగ్రజలుగా ప్రసిద్ధి నొందారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శ్రీ దత్తాచల క్షేత్రం

దత్తాత్రేయని అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తపోభూమి, ఆయన ప్రధాన శిష్యులు నామధారకుల వారు తపస్సు చేసి, నిర్యాణం పొందిన పుణ్యభూమి శ్రీ దత్తాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు బ్రహోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దత్తాచలక్షేత్రం, బ్రహ్మోత్సవ విశేషాలు.
భాగ్యనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లాలోని మాధుర గ్రామంలోని శ్రీ దత్తాచల క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మాధురలోని శ్రీ దత్తాచల క్షేత్రం దత్తాత్రేయ స్వామి మరో అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న పుణ్యభూమి. అలాగే నృసింహ సరస్వతి పరమ శిష్యులైన నామధారకుల వారు ఈ క్షేత్రంలోనే సుదీర్ఘకాలం తపస్సు చేసుకుని, నిర్యాణం చెందారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో నిర్వహిస్తున్న దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 12న దత్త, సుదర్శన హోమాలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 14న తొగుట పీఠాధిపతి శ్రీ మాధనవానంద సరస్వతి చేతుల మీదుగా సుదర్శన హోమాలు, ప్రవచనాలు జరుగుతాయి. 15న శ్రీదత్త, రుద్ర సహిత చండీయాగం నిర్వహిస్తారు. దత్తాత్రేయుని జయంతి అయిన మార్గశిర పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
తపోభూమి..దత్తాచల క్షేత్రం
సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదత్తాచల క్షేత్రం దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి స్వామి, వారి పరమ శిష్యులు నామధారకుల వారు సుదీర్ఘకాలం తపస్సు చేసుకున్న తపోభూమి. నృశింహ సరస్వతి స్వామి వారు పూర్వం శ్రీ దత్తాచల క్షేత్రంలో కొంతకాలం తపోదీక్ష చేపట్టారు. ఆ తరువాత ఆయన మహారాష్ట్రలోని గాణుగాపురం వెళ్లారు. ఆయన శిష్యులలో ముఖ్యుడు అయిన నామధారకుల వారు దైవాంశ సంభూతులు, వేదాధ్యయనపరులు. నృసింహ సరస్వతి స్వామి ఉపదేశం మేరు నామధారకులు వారు దత్తాత్రేయుల బోధల్ని ప్రచారం చేయసాగారు. దత్తాచలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీరా నది తీరంలో ఉన్న అటవీ ప్రాంతంలో నామధారకులు తపస్సు చేసుకునే వారు. ఆ సందర్భంలో అప్పటి రాజు నిజాం తన కూతురు రాచపుండుతో బాధపడుతుండటంతో విశ్రాంతి కోసం అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. తపస్సు చేస్తున్న నామధారకుల వారిని చూసి, తన కుమార్తె జబ్బును నయం చేయాల్సిందిగా నిజాం ప్రార్థించాడు. “నేను సన్యాసిని. నా వద్ద మహిమలు ఏవీ లేవు.
మీరు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ పుష్కరిణిలో తీర ్థం దత్రాత్రేయున అనుగ్రహజలం. వాటిని సేవించండి” అని చెప్పారు. నిజాం కుమార్తె ఆ తీర్థం సేవించగా కొంతకాలానికి ఆమెకు జబ్బు నయం అయింది. దాంతో నిజాం నామధారుకుల వారికి కొంత భూమిని దానంగా ఇచ్చారు. ఆ తరువాత నామధారకుల వారు తన వారసుల్ని పిలిచి, నేను దత్తాచలంలో తపోనిష్ఠలో ఉంటాను. తపోభంగం చేయవద్దని కోరి, ఆ గుట్టలోని గుహలో తపస్సు చేస్తూ జీవితాన్ని చాలించారు. ఆ తరువాత తన కుమారుడు సూర్యభట్టుకు స్వప్నంలో కనిపించి తాను దత్తాత్రేయునిలో ఐక్యం అయ్యానని, ఏటా దత్తజయంతి సందర్భంగా దత్తాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కోరారు. అప్పటి నుంచి నామధారకుల వారసులు శ్రీదత్తాచల క్షేత్రంలో శక్తిమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 17 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దత్తాత్రేయునికి ఆలయం
పటాన్‌చెరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, హత్నూర మండల కేంద్రానికి చేరువన దత్తాచల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి స్వామి, నామధారుకుల వారు తపస్సు చేసుకున్న గుహ, నామధారకుల వారి సమాధి ఉన్నాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేసి, శ్రీదత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేయాలని క్షేత్ర నిర్వాహకులు సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో పనులు కొంతవరకు చేపట్టారు. దత్తాత్రేయ స్వామివారి ఆలయంతో పాటు ఈ క్షేత్రంలో పుష్కరిణి పునరుద్ధరణ, నిత్యాన్నదాన సత్రం, గోశాల, వేదపాఠశాల, సత్రం నిర్మించే యోచనలో ఉన్నారు. బ్రహోత్సవాల్లో పాలుపంచుకోవాలనుకునే వారు, దత్తాత్రేయ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడే వారు సభాపతి శర్మ, 9000167890లో సంప్రదించవచ్చు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

అరుణాచలం

శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణ గిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.
అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.
amaraLingeswarua swamy (1) amaraLingeswarua swamy (2)
ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది.
అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను..’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే, పాపరాశి ధ్వంసమవుతుంది.
రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణము చేసినా, ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి. గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం.
దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అన్రుగహంతో ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైఋతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది. నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, పద్యమో, శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేర లింగము. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఉజ్జయిని

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాళ్లి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ ్రగహిిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.
mahakaleshwar (1)
ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి- చెట్టు నుండి పండు పడిపోయినట్టు ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.
ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.
దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.
కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు. ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.
Mahakaleshwar-Temple-Ujjain
అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శని రాజునైనా బిక్షకునిగా మారుస్తుంది

జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే కుటుంబ సంబంద బాందవ్యాలపై తగువుపెట్టి చివరకు ఒంటరితనాన్ని అనుభవిస్తు సన్యాసి జీవితాన్ని అనుభవిస్తు తపస్సు చేసుకుంటు వైరాగ్య జీవితాన్ని గడుపుతాడు.
ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.
అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.
పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి
“ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:”
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది

అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి

చారిత్రక కధనం ప్రకారం – కర్ణాటకలోని, హంపీవద్ద గల ‘ గుంలవ్య తోట ‘ అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని ‘అంజని గుహ ‘లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేఱి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు , యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గుఱు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా , ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలోఉంది. అందుచేతే శ్రీరాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.

images
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కఱచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ‘ హనుమ ‘అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తన గురువుగా భావించి సేవించి ,ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాగ్ దీక్షకూ, గురుభక్తికీ తార్కాణం.
మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో – అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ‘ పంచముఖ ఆంజనేయులుగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .
యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ ‘హనుమద్రామాయణాన్ని’ తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపఱచగా , హనుమ కారణం అడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి ‘ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించనందున అది అసంపూర్తిగా ఉన్నది కనుక తనకు అసంతృప్తికలిగించినదని ‘ చెప్పారు. అప్పుడు హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందఱూ హనుమను పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

రవిగ్రహ దోష నివారణకు..

ఆదివారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఆదిత్యుడైన సూర్యభగవానుడిని ఆదివారం దర్శించుకుని ఆయనకు గోధుమలను సమర్పించుకుంటే సౌభాగ్యం చేకూరుతుందని విశ్వాసం.
images (1) images surya-bhagavan-veemeswarar-temple-serappananchery
ఆదివారం ఉదయమో లేదా సాయంత్రం పూటనో సూర్యదేవుని ఆలయానికి చేరుకుని, సూర్య స్తోత్రం పఠించి.. నేతితో దీపమెలిగించే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఇంకా నవగ్రహాల్లో ఆదిదేవుడైన సూర్యభగవానుడిని పూజిస్తే ఈతిబాధలు తొలిగిపోతాయని విశ్వాసం.
ఇంకా ప్రతి ఆదివారం సూర్యదేవునికి సజ్జలు, గోధుమలు, రాగి గింజలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించేవారిని.. నరాలు, కంటికి సంబంధించిన వ్యాధులు సోకవని పురోహితులు అంటున్నారు. అలాగే ప్రతిరోజూ సూర్యనమస్కారం చేసే వారికి కంటిచూపు మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు.
ఇకపోతే.. ఆదివారం గోధుమలతో చేసే పదార్థాలు, పూరీ, చపాతీ వగైరాలు భుజించడం మంచిది. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నవగ్రహాల్లో రాహుగ్రహానికి పరిహార క్రియలు

నవగ్రహాల్లో రాహుగ్రహానికి దుర్గాపూజ, సరస్వతీ పూజ, కుమారీ పూజ, దుర్గాస్తోత్ర పారాయణ, దేవి భాగవత పురాణ పారాయణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధస్సు, శిరోపరిభాగం, గడ్డం అనే శరీర భాగాలకు రాహువు ప్రాతినిధ్యం వహిస్తాడు.
1460091_406259216143111_126438057_n
రాహువు పరిహార క్రియల విషయానికొస్తే.. శక్తిగలవారు దున్నపోతును దానం చేయవచ్చును. స్కందపురాణ, సుబ్రహ్మణ్య చరిత్రను మండల దీక్షతో పారాయణ చెయ్యాలి. నవగ్రహాల్లో రాహు గ్రహం వద్ద 18 వత్తుల దీపారాధన-గోధుమ రంగు వస్త్రదానం చేయడం మంచిది.
దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా ప్రసాదాన్ని పంచిపెట్టడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కావున దుర్గాక్షేత్ర సందర్శన, సర్వక్షేత్రాలు (మోపిదేవి, తిరుత్తణి మొదలగునవి) సందర్శించడం మంచిది.
శ్రీకాళహస్తి, పెద కాకాని దేవాలయాల్లో 9సార్లు రాహుదోష నివారణ పూజ చేయించాలి. ఆదివారం రోజున మినపగారెలు లేదా మినుములతో చేసిన పదార్థాలను సాధువులకు పంచడం మంచిది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగ ప్రతిష్టలు చేయించడం మంచిది. రాహువునకు 18వేల జపం చేయించి, ఐదు కిలోల 250 గ్రాముల మినుములు దానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికవృద్ధి, వ్యాపారాభివృద్ధి. విద్యాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా గ్రహణం రోజున కాని, అమావాస్య ఆదివారం రోజున కాని, శక్తిని బట్టి బంగారం లేదా వెండి సర్ప ప్రతిమను పడగ ఉండే విధంగా చేయించి దానం చెయ్యాలి. 18 శనివారాలు ఉపవాసం ఉంటూ, చివరి శనివారం రాహువుకు అష్టోత్తర పూజ, దుర్గాదేవికి కుంకుమ పూజ జరిపించాలి. దర్భలతో, ఆవునెయ్యి, తేనె హోమం చేయించడం శుభఫలితాలనిస్తుంది. మినపగారెలు, మినుములతో చేసిన పదార్థాలతో సద్భ్రాహ్మణోత్తమునికి ఆదివారం రోజు సంతృప్తికరంగా భోజనం పెట్టాలి.నిమ్మ డొప్పలతో రాహుకాల దీపాలు పెడితే రాహు దోషం పోతుంది.
ఇకపోతే.. సంఖ్యాశాస్త్ర ప్రకారం 04 సంఖ్య వారు రాహు సంఖ్య అవుతారు. 04 అంటే ఏ నెల, ఏ వారం, ఏ సంవత్సరంలో అయినా 4,13,22 సంఖ్యల వారు పై నివారణోపాయాలను పాటిస్తే సత్ఫలితములు పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

చంద్ర గ్రహ దోష నివారణలు............

కర్కాటక రాశి నాథుడైన చంద్ర భగవానుడి శాంతికి సోమవార వ్రతము చేయటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. చంద్ర గ్రహానుకూలత కోసం నవరత్నాలలోని ముత్యాన్ని ధరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇంకా పౌర్ణిమనాడు చంద్రోదయ సమయమున రాగి పాత్రయందు తేనెకలిపిన పాయసమును వండి చంద్రునికి సమర్పించినట్లైతే వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు వంటి శుభఫలితాలు చేకూరుతాయి.
పౌర్ణమి రోజున శివోపాసనం, శివస్తుతి చేసినట్లైతే సర్వసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇంకా సోమవారం వ్రతం చేసి వెండి, శంఖము, తెల్లని చందనము, శెనగలు, శ్వేతపుష్పములు పెరుగు, పాలు,ముత్యాలు వంటివి బ్రాహ్మణులకు దానమిస్తే సకల సంపదలు, వంశాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇక నవగ్రహాల్లో రెండో స్థానానికి అధిపతి అయిన చంద్రుడి ఆకారవర్ణన ఎలా ఉంటుందంటే..? చంద్రుడు గౌరవర్ణం కలవాడు. చంద్రగ్రహ మహాదశకాలము పది సంవత్సరాలు. చంద్రుని వస్త్రము, అశ్వము, రథము శ్వేత వర్ణములే. స్వర్ణమకుటము, ముత్యాలహారము ధరిస్తాడు. హస్తగధాయుధుడు. మరో హస్తమున వరముద్రను కలిగి ఉంటాడు. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, పురుషస్వరూపుడని అంటారు.
శ్రీ కృష్ణభగవానుడు జన్మించకముందే చంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడందురు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించియుంటాడు. అత్రి మహర్హి, అనసూయలపుత్రుడైన చంద్రభగవానుడిని సర్వమయుడని కూడా పిలుస్తారు. బీజ, ఓషధి జలపూరుడైన చంద్రుడు అశ్విని, భరణిలతో కూడిన 27మంది నక్షత్రాలను వివాహమాడాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చంద్రుడిని సతీమణులైన ఈ 27 మంది నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మములను పాలిస్తూ… వర్షములను, మాసములను విభజించుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇక చంద్ర భగవానుడి వాహనమైన శ్వేత రథములో మూడు చక్రములు, దివ్యమైన పది అశ్వాలుంటాయి. అశ్వాల నేత్రములు కూడా శ్వేత వర్ణమును కలిగియుంటాయని పురోహితులు అంటున్నారు.
ఇకపోతే.. చంద్రునికి బుధుడు అనేపుత్రుడు కలడు. ఇతడు తారకకు జన్మించిన వాడు. చంద్రునికి అధిదేవత, ప్రత్యధిదేవత గౌరీదేవి. అందుచేత గౌరీదేవిని పూజించడం ద్వారా చంద్రగ్రహ ఆధిపత్యంతో కలిగే కొన్ని సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

బుధగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజించండి

బుధవారం.. ఆదిదేవుడైన గణపతిని ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని పురోహితులు అంటున్నారు. అందుచేత బుధవారం ఉదయం, సాయంత్రం సమయాన సమీపంలోని బొజ్జగణపతి ఆలయానికి వెళ్లి.. గజనాథుడిని దర్శించుకోవడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇంకా బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి గరికను సమర్పించడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.
అదే రోజున పెసల పప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసలతో చేసిన హల్వా, లడ్డు వంటి పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చింత, సీమచింత పండ్లు స్వీకరించడం కూడా శ్రేయస్కరం.
ఇదేవిధంగా.. బుధవారం ఆకుపచ్చ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా చేపట్టిన కార్యాలు విజయవంతమవడంతో పాటు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా… స్త్రీలు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు పువ్వులు అంటే సంపంగి వంటివి తలలో ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది.

మహా విష్ణు పూజ

బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుధవారం రోజున పేదలకు పెసర హల్వా పంచిపెడితే మంచిది.కుడిచేతి వేలికి పచ్చ జాతిరత్నంతో బంగారపు ఉంగరం చేయించి పెట్టుకోండి.నవగ్రహములలో బుధగ్రహమువద్ద బుధవారం 17 ఆకువచ్చ దారముల ఒత్తులతో దీపారాధన చేసి, ఆకుపచ్చ వస్త్రాన్ని దానము చేయండి
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నన్ను నన్నుగా గుర్తించలేని సమాజం కోసం {మంచోడు అనే చేద్దపెరు నాకు వద్దు}

ఎప్పటికైనా నా దెగ్గరకె వచ్చే సంతోషాన్ని వెతుకుతూ నేను పోను''
ఎప్పుడు నేను  అనుభవిస్తున్న భాదని వదిలి నేను  ఉండలేను"
నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చెయ్యను
చేసిన  వాగ్దానాలని మరవను
నన్ను నన్నుగా   గుర్తించలేని సమాజం కోసం {మంచోడు అనే చేద్దపెరు నాకు వద్దు}

I Hate This Kind Of People

మనిషి బ్రతికి ఉన్నంత వరకు ఏడిపిస్తారు 
చనిపోయాక ఫోటో పట్టుకుని ఏడుస్తారు 
నేను ఇతరుల నుండి కోరుకునేది లేదు కోల్పోయేది లేదు 
 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...