Thursday, May 24, 2018

సుదంతుడు చేసిన హనుమంతుని స్తోత్రం

నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే |
అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1|

ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునాకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము

యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ |
భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2|

యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణమూల రోగమునకు ఔషధమువంటివానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము

రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే |
సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3|

శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము.

గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే |
వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4|

పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము.

బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే |
శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే |5|

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతలా స్వరూప మయినవానికి, శతకంఠరావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణానక్షత్రమున.

అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః |
నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం |6|

అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము. ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.

మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః |
అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద |7|

నా అపరాధములను నీవుకూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు

పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ సురాంత కాక్షాసుర మర్ధనాయ |
నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ |8|

తోకనిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి, దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి వారధి నిర్మించు బీభత్సకార్యంలో బీభత్స రాసోత్సవమున నున్న నీకు నమస్కారము

జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్ |
ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్ |9|

జనన మరణములు లేనట్టియు, శాంతస్వరూపము కల్గినట్టియు, వానర సమూహంచే సేవింపబడునట్టి, పాపములను పటాపంచలు చేయగల్గినట్టి, తాబేలు వెన్ను నధిరోహించినవానిని

కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్ |
వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే |10|

అర్జనుని రథపుటెక్కెమున సంచరించువానిని, వాలాభిల్యాది మునులచే స్తుతింపబడినవానిని, వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను

ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో
దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః |
ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్
యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే |11|

ఇంద్రవ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని, పూర్వపశ్చిమాద్రుల పాదము లుంచియున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహం చేశాడు. అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...