Tuesday, November 15, 2016

కుజ దోష నివారణకు "శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం"

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః

సదాశివ సమారంభాం

శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం

వందే గురు పరంపరాం

1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II

2. నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం I
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II

3. మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం I
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం II

4. యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ I
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II

5. యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం II

6. గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః I
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II

7. మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే I
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II

8. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ II
9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే I
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే II

10. సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ II

11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్ I
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ II

12. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II

13. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II

14. స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II

15. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః II

16. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II

17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః I
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II

18. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II

19. కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ I
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II

20. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II

21. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు I
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం II

22. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II

23. సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II

24. అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II

25. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II

26. దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః II

27. మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే II

28. కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః I
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II

29. మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే I
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II

30. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ I
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ II

31. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II

32. జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే I
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో II

33. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ  వేద పండితులు
     దూరవాని 9848288711

Wednesday, September 14, 2016

నక్షత్రేష్టి

తైత్తిరీయ బ్రహ్మణమ్ | అష్టకమ్ – 3 ప్రశ్నః – 1
తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1
ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నాని సర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||
ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” | విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః | సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు | యథా జీవే’మ శరదస్సవీ’రాః | రోహిణీ దేవ్యుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 2 ||
సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ | శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ | ఆప్యాయ’మానో బహుధా జనే’షు | రేతః’ ప్రజాం యజ’మానే దధాతు | యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ | ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ | తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 3 ||
ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ | నక్ష’త్రమస్య హవిషా’ విధేమ | మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ | హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు | ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ | ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ | || 4||
పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు | పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ | పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” | పునః’ పునర్వో హవిషా’ యజామః | ఏవా న దేవ్యది’తిరనర్వా | విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా | పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ || 5||
బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః | తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ | శ్రేష్ఠో’ దేవానాం పృత’నాసుజిష్ణుః | దిశో‌உను సర్వా అభ’యన్నో అస్తు | తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ | బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ | బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ | సువీర్య’స్య పత’యస్యామ || 6 ||
ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” | ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ | యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ | తే న’స్సర్పాసో హవమాగ’మిష్ఠాః | యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః | యే దివం’ దేవీమను’సంచర’ంతి | యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | తేభ్య’స్సర్పేభ్యో మధు’మజ్జుహోమి || 7 ||
ఉప’హూతాః పితరో యే మఘాసు’ | మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః | తే నో నక్ష’త్రే హవమాగ’మిష్ఠాః | స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ | యే అ’గ్నిదగ్ధా యే‌உన’గ్నిదగ్ధాః | యే’‌உముల్లోకం పితరః’ క్షియంతి’ | యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ || 8||
గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ | తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ | తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ | జీవా జీవ’ంతముప సంవి’శేమ | యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా | యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ | అర్యమా రాజా‌உజరస్తు వి’ష్మాన్ | ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 9 ||
శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి | తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ | అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” | గోమదశ్వ’వదుపసన్ను’దేహ | భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా | భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ | భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ | || 10 ||
ఆయాతు దేవస్స’వితోప’యాతు | హిరణ్యయే’న సువృతా రథే’న | వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ | ప్రయచ్ఛ’ంతం పపు’రిం పుణ్యమచ్ఛ’ | హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః | దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ | దాతార’మద్య స’వితా వి’దేయ | యో నో హస్తా’య ప్రసువాతి’ యఙ్ఞమ్ ||11 ||
త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ | సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ | నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ | రూపాణి’ పిగ్ంశన్ భువ’నాని విశ్వా” | తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | గోభి’ర్నో అశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 12 ||
వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ | తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః | సమీరయన్ భువ’నా మాతరిశ్వా” | అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః | తన్నో’ వాయస్తదు నిష్ట్యా’ శృణోతు | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | యథా తరే’మ దురితాని విశ్వా” || 13 ||
దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః | తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే | తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు | నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే | శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ | విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | అపక్షుధ’న్నుదతామరా’తిమ్ | || 14 ||
పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తా”త్ | ఉన్మ’ధ్యతః పౌ”ర్ణమాసీ జి’గాయ | తస్యాం” దేవా అధి’సంవస’ంతః | ఉత్తమే నాక’ ఇహ మా’దయంతామ్ | పృథ్వీ సువర్చా’ యువతిః సజోషా”ః | పౌర్ణమాస్యుద’గాచ్ఛోభ’మానా | ఆప్యాయయ’ంతీ దురితాని విశ్వా” | ఉరుం దుహాం యజ’మానాయ యఙ్ఞమ్ |
ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ | మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు | అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః | శతం జీ’వేమ శరదః సవీ’రాః | చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ | అనూరాధా స ఇతి యద్వద’ంతి | తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 16 ||
ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి | యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ | తస్మి’న్వయ-మమృతం దుహా’నాః | క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ | పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” | అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” | ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | ఉరుం కృ’ణోతు యజ’మానాయ లోకమ్ | || 17 ||
మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ | పరా”చ్యేతు నిరృ’తిః పరాచా | గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ | అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” | అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు | మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి | పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 18 ||
యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః | యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః | యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు | యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః | యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః | యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||19 ||
తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః | తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ | తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ | కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః | కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః | విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ || 20 ||
యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ | అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” | తన్నో నక్ష’త్రమభిజిద్విజిత్య’ | శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ | తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ | తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” || 21 ||
శృణ్వంతి’ శ్రోణామమృత’స్య గోపామ్ | పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” | మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ | ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః | త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే | మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ | తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | పుణ్యగ్గ్ శ్లోకం యజ’మానాయ కృణ్వతీ || 22 ||
అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ | చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః | తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ | సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి | యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ | దక్షిణతో’‌உభియ’ంతు శ్రవి’ష్ఠాః | పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | మా నో అరా’తిరఘశగ్ంసా‌உగన్న్’ || 23 ||
క్షత్రస్య రాజా వరు’ణో‌உధిరాజః | నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః | తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ | శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః | యఙ్ఞన్నో రాజా వరు’ణ ఉప’యాతు | తన్నో విశ్వే’ అభి సంయ’ంతు దేవాః | తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | దీర్ఘమాయుః ప్రతి’రద్భేషజాని’ || 24 ||
అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః | తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” | ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః | విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః | ఆ‌உంతరి’క్షమరుహదగంద్యామ్ | తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే” || 25 ||
అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ | తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ | ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతి సర్వే” | చత్వార ఏక’మభి కర్మ’ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి | తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | అహిగ్‍మ్’ రక్షంతి నమ’సోపసద్య’ || 26 ||
పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ | పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ | ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా | సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః | గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా | అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | వాజగ్‍మ్’ సనుతాం యజ’మానాయ యఙ్ఞమ్ || 27 ||
తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ | శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః | స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ | మధ్వాసంపృ’క్తౌ యజు’షా సమ’క్తౌ | యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ | విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | నమో‌உశ్విభ్యాం” కృణుమో‌உశ్వయుగ్భ్యా”మ్ || 28 ||
అప’ పాప్మానం భర’ణీర్భరంతు | తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ | లోకస్య రాజా’ మహతో మహాన్, హి | సుగం నః పంథామభ’యం కృణోతు | యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” | యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ | అప’ పాప్మానం భర’ణీర్భరంతు || 29 ||
నివేశ’నీ సంగమ’నీ వసూ’నాం విశ్వా’ రూపాణి వసూ”న్యావేశయ’ంతీ | సహస్రపోషగ్‍మ్ సుభగా రరా’ణా సా న ఆగన్వర్చ’సా సంవిదానా | యత్తే’ దేవా అద’ధుర్భాగధేయమమా’వాస్యే సంవస’ంతో మహిత్వా | సా నో’ యఙ్ఞం పి’పృహి విశ్వవారే రయిన్నో’ ధేహి సుభగే సువీరమ్” || 30 ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ |

Friday, September 2, 2016

విశ్లేషణ

మనస్సు అనేది చాలా విచిత్రమైనది. అది చెడుకు లొంగినంత సులభంగా మంచికి లొంగదు. మనస్సే బంధనానికి కాని, ముక్తికి కాని కారణమవుతుంది. మనస్సును నిగ్రహించడం జీవునికి అతిముఖ్యమైన పని. అర్జునుడంతటి స్థితప్రజ్ఞుడే, స్థిరచిత్తుడే, శ్రీకృష్ణునితో కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది. అది సమస్త ఇంద్రియాలను క్షోభింపజేస్తుంది. ఇంద్రియ సుఖాలలోనే దృఢంగా ప్రవర్తిస్తుంది. అట్టి మనస్సును నిగ్రహించడం ప్రతికూలమైన వాయువును అడ్డుకోవడమంతటి దుష్కరం అని వాపోవడం గమనార్హం. మనశ్చాంచల్యం చాలా చిత్రమైనది కూడా. అది నిరంతరం అభ్యస్తమైన విషయాలలో కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనస్సును భగవంతునియందు నిలపడం అనుకున్నంత సులభమైన పని కాదు. వేపమానును పాలుపోసి పెంచితే చేదు వదలనట్లుగా, కుక్కతోక వంకర వదలనట్లుగా, గొడ్డలిని నీట నానబెడితే మెత్తబడనట్లుగా, తేలుతో స్నేహం చేసినా అది కుట్టక మాననట్లుగా, చిత్తం అనేది ఎన్ని మంచి మాటలువిన్నా, మరల మరల అదే చెడు తలంపులతో పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని అన్నమయ్య చెప్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య.

పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా || భారమైన||

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా || భారమైన||

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా || భారమైన||
(ఆ.సం.రాగి రేకు 47 – వ.సం.287)

విశ్లేషణ:
పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

ఆ.వె. వేము పాలు వోసి ప్రేమతోఁ బెంచిన / చేదు విఱిగి తీపి చెంద బోదు/ ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
విశ్వదాభిరామ వినురవేమ ! – ఈ వేమన పద్యం అందరికీ విదితమే! వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి వానిగా మార్చలేము అంటూ ఆటవెలదులను ఈటెగా విసిరిన దిట్ట చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేము. అలాగే అన్నమయ్య కూడా చిత్తాన్ని గూర్చిన చిత్రాలు అనేకం అంటూ రకరకాల దృష్టాంతాలు తెలియజేస్తున్నాడు.

జీవునికి మనస్సనేది వేపమాను లాంటిది. నిత్యం చెడు తలంపులే దాని వృత్తి. ఎంత తియ్యటి పాలను అనుదినము పోసినా చేదే తప్ప తీపిరాదు అనగా చెడు తలపులు చిత్తాన్ని వీడడంలేదు అంటున్నాడు అన్నమయ్య. రోజూ ఎన్నో మంచి మాటలను, ఉపదేశాలను వింటాం. దాలి గుంటలోని కుక్కరీతిగా అవన్నీ ఆ క్షణం మాత్రమే. అయ్యో! పాపం చేస్తున్నాం అనుకుంటాం. కానీ వెనువెంటనే అన్నీ మర్చిపోయి దైనందిన జీవితంలో తప్పులనే బురదలో పొర్లుతూ ఆనందిస్తూ ఉంటాము. అర్జునుడు భగవద్గీతలో మనందరి తరఫున భగవానునిని అడిగినది ఏమిటంటే..”చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం”. దాని అర్ధం “ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. బాగా మథించే స్వభావం కలది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దాన్ని నిగ్రహించడం గాలిని ఆపడంలా చాల దుష్కరంగా భావిస్తున్నాను” . అని శ్రీకృష్ణునితో అనగా.. జగద్గురువైన కృష్ణుడు అంటాడు.. “అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం,అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే” అనగా…”ఓ మహాబాహూ! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే. దాన్ని వశపరచుకోవడం మహా కష్టం. కాని, అర్జునా! అభ్యాసం మరియూ వైరాగ్యం అనే రెండింటి ద్వారా దాన్ని వశం చేసుకోవడం సాధ్యమే.” అని చెప్పడం జరిగింది. అభ్యాసం అంటే అనుదినం నిరంతరం సాధనకై యత్నించడం, రాగం (రక్తి, అనురాగం) లేకపోవడమే విరాగం. దాని భావమే వైరాగ్యం అని శెలవిస్తాడు భగవానుడు. కనుక అభ్యాసం, వైరాగ్యం నిరంతర సాధనల ద్వారా మనిషి చిత్తాన్ని జయించవచ్చు.

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

సంస్కృతం లో “శ్వాన పుచ్ఛ న్యాయం” అనగా తెలుగులో “కుక్కతోక న్యాయం” అని అర్థం. దానినే మనం “కుక్కతోక వంకర” అని వాడుకలో ఉపయోగిస్తూ ఉంటాము. కుక్క తోకని తిన్నగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దాని వంకరపోదు.”ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు” అని వేమన అన్నట్లు, వంకర గుణాలు,వక్ర బుద్ధి ఉన్నవారిలో ఎంత ప్రయత్నించినా మార్పు రాదు. దీనినే అన్నమయ్య ఉదాహరణగా గ్రహిస్తూ… కుక్కతోకను కొయ్య బద్దలు పెట్టి ఎన్నిరోజులు కట్టి మరల విప్పినా వంకరను చక్కగా చేయలేము. అలాగే మనసు కూడా మాట వినినట్టే ఉంటుంది మరలా జారిపోయి పాతవాసనలతో గుభాళిస్తుంది. మన దేహంలోని రకరకాల వికారాలకు మనసుకు ఎన్ని మార్లు ఎన్నివిధాలుగా బుద్ధి చెప్పినప్పటికీ కుక్కతోక వంకర వలె తిరిగి అదే పోకలు పోవడం మరలా అదే స్థితి కొనసాగడం గురించి వాపోతున్నాడు అన్నమయ్య.
ఇంద్రియాలను, బుద్ధిని అదుపులో ఉంచుకోవడమే సంయమనం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి చలించినా దానివల్ల చిల్లులున్న పాత్రలోని నీరు దిగజారిపోయినట్లు బుద్ధి దిగజారిపోతుంది. అంతఃకరణాన్ని అదుపు చేయడాన్ని శమము అనీ, ఇంద్రియాలను అదుపుచేయడాన్ని దమము అనీ అంటారు. మోక్షం పొందటానికీ, బంధంలో చిక్కుకుపోవడానికి కానీ ఇంద్రియాలే ప్రధాన కారణాలు అవుతున్నాయి. విషయ భోగాలందే శాంతి, సౌఖ్యాలు లభిస్తాయని భావించడం కేవలం మన భ్రాంతి మాత్రమే అవుతుంది. సహనం కలిగి ఉండడంవల్ల ధైర్యం గాంభీర్యం, వీరత్వం, ఆత్మబలం పెంపొందుతాయి. సహనానికి మూలం క్షమాబుద్ధి. ఎప్పుడు మానవుడు సంతోషదుఃఖాలకు లొంగకుండా ఉంటాడో, మానవుని మనస్సు ఇంద్రియాలతో సంపర్కం పొందినపుడు చిత్తంలో వికారం ఉదయింపకుండా ఉంటుందో అప్పుడే మానవుని జితేంద్రియునిగా లెక్కింపవచ్చు. అలాంటి షోడశవికారములు లేని బుద్ధిని ప్రసాదించమని అన్నముని విజ్ఞాపన!

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా

ఇనుప గొడ్డలిని నీటిలో ఎన్నిరోజులు నానబెట్టినా మెత్తబడుతుందా? అలాగే జీవుని చిత్తం సహితం ఎన్ని సార్లు ఎన్ని మంచి విషయాలు చెప్పినా లొంగక లౌకికమైన పాడు విషయ వాంఛల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తెలిసో తెలియకనో పంచమహాపాతకాల వంటి పాపాల పొదలో సదా సంచరించే మనసును దారికి తేగలగాలి. స్త్రీ హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, గురు హత్యలను పంచ మహాపాతకాలు అంటారు. దైనందిన జీవితంలో కూడా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు పెద్దలు. అయితే అన్నం మాని వీటిని నివృత్తి చేయలేం కనుక జీవుడు పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. అవి దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. ఇవన్నీ పంచమహా యజ్ఞాలే! ఇలాంటివన్నీ హరించి కేవలం పాపాలవైపే లాగేస్తున్న మనసును అరికట్టడం ఎలా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అను ఆరింటిని శమాది షట్కసంపత్తి అంటారు. ఈ ఆరు లక్షణములు కలిగి ఉన్నవాడు తప్పనిసరిగా అత్మస్వరూపుడే అయి ఉంటాడు. ఏ పరిస్థితిలోను ఆకార బ్రాంతికి లోనవడు. అయితే.. నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగమును సంపాదించ కుండా శమాది షట్కసంపత్తిని ఆచరించుట వలన ప్రయోజనము ఏమి ఉండదు. అలాంటి వైరాగ్యాన్ని ప్రసాదిచమని కోరుతున్నాడు అన్నమయ్య.

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా

ఎంతో స్నేహభావంతో తేలును తెచ్చుకొని తమ అంగ వస్త్రం లో పెట్టుకున్నా అది తన నిజ స్వభావం తో మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది గానీ స్నేహితత్వం పాటిస్తుందా? అలాగే మనిషి యొక్క చిత్తం ఎన్నిసార్లైనా చెడు తలంపులతోనే ఉంటుంది కానీ బయటపడడానికి ఏమాత్రం ప్రయత్నించదు. బాహ్య వస్తువులను మనం చూసేది, వినేది, కేవలం బాహ్య ఇంద్రియాల సహాయం ద్వారా మాత్రమే. బాహ్యేంద్రియాలు ఎంతవరకు విషయాలను సేకరించి తెలుపగలవో అంతవరకు మాత్రమే మన మనస్సు తెలుసుకోగలదు. అదే భగవంతుని కృప కలిగితే తెర తొలగిపోతుంది. అప్పుడు అంతఃచేతన యొక్క అంతర్నేత్రం విడివడి భగవంతుని ముఖాముఖి స్పష్టంగా చూడగలుగుతుంది. అంతర్నేత్రం యొక్క దివ్యదృష్టి బాహ్యేంద్రియాలను కూడా సచేతనంగా మార్చగలదు. వీటన్నింటికీ ప్రాణాలను కూడా ఇవ్వగలంత ప్రేమ, పరిపూర్ణంగా అతని వద్ద తనని తాను నివేదించుకోగల సమర్పణ భావం కావాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహపరలోక ఫలభోగ వైరాగ్యము, శమాది షట్కసంపత్తి, ముముక్షత్వము అను నాలిగింటిని సాధనా చతుష్టయ సంపత్తి అంటారు. సాధకుడు బ్రహ్మజ్ఞానమును అధ్యయనము చేసి అనుభవమునకు తెచ్చుకొనుటకు ఈ లక్షణములను అలవరచు కొని సంసిద్ధుడు కావలెను. సాధనా చతుష్టయ సంపత్తియే సాధకునికి నిజమైన సంపద. అటువంటి సాధనా బలంతో మహిమగల స్వామి శ్రీవేంకటేశ్వరుని కృపకు పాతృలు కాగలగడం గొప్ప అదృష్టం. కానీ అనేక ఘోరమైన ఆశలతో ఉన్న ఈ మానవులు అలాంటి మేలు కోరనిస్తుందా? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు: పాయ = రెండుగా చీల్చు; కాయపు = శరీరపు; వికారము = మనసు యొక్క మాఱుపాటు; కోక = వలువ, వస్త్రము; సారె = మాటిమాటికి; మేలుకోర = మేలుకోరే దిశగా.

విశేషాంశములు: షోడశవికారములు = జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనో బుద్ధి అహంకారములు 3, రజస్సత్వతమోగుణములు 3 షోడశవికారములు. జ్ఞానేంద్రియములు = కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము; కర్మేంద్రియములు = కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...