Saturday, October 27, 2018

చరవాణి స్తోత్రమ్


ప్రథమం  వాయుభాషణం| ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని    |
సప్తమం చిత్ర దర్శిని   |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ  సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం | సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ  | విద్యుత్ గ్రాస భక్షిణీ|| 1||

చిత్రగ్రహణ రూపేణ| యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |గృహ ప్రాంగణ దర్శిని|| 2 ||

సర్వ స్తోత్రాణి గానాని  |
కర్ణాంతరాళ శ్రావణి  |
దూర ప్రాంతేషుమార్గాణి |
అంతర్జాల సందర్శిని  || 3 ||

మధ్యమాంగుళ తర్జన్యా  |స్పర్ళ  మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥| 4 ॥

సర్వక్రీడా సముత్పన్న | సర్వ వస్తు విలక్షణ|
దూరభారాణి విచ్ఛేద |  వాయుమార్గ సంచారిణీ ॥ 5 ॥

ఖండాంతర నివాసిన్యాం |
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥ 6 ॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే |
సంభాషణే విశేషతః ॥ 7 ॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥ 8 ॥

వయో విత్తం జ్ఞాన శూన్యం |
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే  |
పశు రూపేణ గణ్యతే ॥ 9 ॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ|
దేవాలయె విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥ 11 ॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ |
వాయు మార్గేన గమ్యతే ॥12॥

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ|
  వ్యర్థేన కాలక్షేపాయ |
కుర్వంతి వ్యర్థ భాషణం ॥ 13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత |
ఇదం పత్ర వినాశేన |
సర్వ సంబంధ నాశనం ॥ 14 ॥

     ఫలశృతి

ప్రయాణే  భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతె |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥ 15 ॥

చరవాణీ యో జానాతి |
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన|
మృత్యు మార్గం చ గమ్యతే

ఇది వాట్సాప్ సేకరణ
రోజూ ఉదయం 0.01 నిముషములకు పఠిస్తే 30 కామెంట్లు , 60 లైకులతో వర్ధిల్లుతారు

వస్తువులను ఉపయోగించుకోవాలి! బంధాలను ప్రేమించాలి!!

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా  ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు, వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.

"నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. *"మీరు ఏం కావాలనుకుంటున్నారు"* అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.

"అయితే...?"

"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

*"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."*

అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!

నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా  స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
పడున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.

"మన కొడుకు" అంది భార్య  కన్నీరు కారుతుండగా!

*వస్తువులను ఉపయోగించుకోవాలి!*
*బంధాలను ప్రేమించాలి!!*

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!

వాట్సాప్ భగవద్గీత ఎదో నా చిలిపిచేష్టలు


శ్రీ మొబైల్ ఉవాచ:

నీవు గత మెసేజ్ ల గురించి చింతింపవలదు.
నీవు భవిష్యత్తునందు వచ్చే మెసేజ్ ల గురించి కూడా చింతింపవలదు.
వర్తమాన మెసేజ్ ల గురించి మాత్రమే ఆలోచించుము.

నీవు గతంలో ఇక్కడ లేనప్పుడునూ ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనేవుంది.
భవిష్యత్తులో నీవు లేకున్ననూ ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనే వుంటుంది.

ఇప్పుడు నీది అనుకున్న మెసేజ్ గతంలో వేరొకరిది.
అదే మెసేజ్ భవిష్యత్తులో ఇంకొకరి స్వంతమవుతుంది.
అది నీది అనుకుని భ్రమపడుతున్నావు.
అదియే నీ సమస్త దుఃఖములకు కారణమవుతున్నది.

'అద్భుతం' , 'బాగుంది' , 'ధన్యవాదములు' వంటి శబ్దములు నీ మనస్సు నుండి తొలగించుము.
నీవు పరులనుండి ఏమియును ఆశించక మెసేజ్ చేసి చూడుము.
వాట్సాప్ రూపమువంటి భవసాగరమునందు నీవు వుంటూ సమస్త సంకుచిత భావములనుండి వైదొలగి, నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగును.

వాట్సాప్ లో  జాయిన్ అయినందుకు మిన్నకుండక ఏదేని  ఒక పోస్ట్ అయిననూ పంపుతూ వుండుము.
ఈజన్మలో భగవంతుడు ఎన్నో బంధాలను సృష్టించెను... వాట్సాప్ కూడా కొత్త బంధాలని చేకూరుస్తుంది.

యదాయదాహి మొబైలస్య
గ్లానిర్భవతి సిగ్నలః
అవుట్ ఆఫ్ రీచ్ సూచనేన
త్వరిత జాగృత సంశయాః

విచ్ఛేదితం సంపర్కాః
కలహం మాత్ర భవిష్యతి
తస్మాత్ చార్జింగ్ ఏవం రీచార్జింగ్
కుర్వంతు తవ సత్వరం

మనసోక్తం చాటింగ్
హాస్యవినోదేన టెక్స్టింగ్
సత్వర సత్వర ఫార్వార్డింగ్
అఖండితం సేవాః ప్రార్థయామి

టచ్ స్క్రీనం నమస్తుభ్యం
అంగుళీస్పర్శం క్షమస్వమే
ప్రసన్నాయ ఇష్టమిత్రాణాం
అహోరాత్రం మెసేజం కరిష్యే

ఇతి శ్రీ మొబైల్ స్తోత్రం సంపూర్ణం

సోకాల్డ్ హైందవ స్వయంకృతాపరాధాలు


01. పిల్లలకి బొట్టెట్టుకోవటం నేర్పించటం నామోషీ...
02. కనీసం వారానికొక్కమారు గుడికెళ్ళటానికి నామోషీ
03. రోజూ త్రిసంధ్యలు చేసుకోటానికి నామోషీ
04. పొద్దునే దీపం వెలిగించి వచ్చిన నాలుగు స్తోత్రాలు చదవటానికి నామోషీ
05. భగవద్గీత ఇంట్లో పెట్టుకోటానికి నామోషీ
06. సాయంకాలం పురాణ పఠనం చేయటానికి నామోషీ...
07. పంచకట్టుకోవటం నామోషీ - పిలక పెట్టుకోవటం నామోషీ ..
08. రామాయణ భారత భాగవతాలని పిల్లలకి కథలుగా చెప్పటానికి బద్దకం.
09. జంధ్యప్పోగు ఒంటి మీదుంచుకోడానికి నామోషీ...
10. పండగల్లో పార్టీకో స్టేజి - కులానికో స్టేజి -ఊరంతటికీ ఒక్కటి సరిపోదు...
11. రికార్డింగు డాన్సులకి తగలెయ్యటానికి లచ్చలు లచ్ఛలు ఉంటాయి గానీ - ఊర్లో గుడి బడి బాగుచేయటానికి ఉండవు.
12. పంచాగాల్లో వీడు చెప్పింది తప్టని వాడు - వాడు చెప్పిందని తప్టని వీడు. పండగెప్పుడొచ్చి చస్తుందో క్లారిటీ ఉండి చావదు.
13. కిట్టీ పార్టీలని తలపిస్తున్న వారాంతపు  సత్సంగాలు
14. జాంబవంతుడెవర్రా అంటే జాంబియా దేశాద్యక్షుడు అని చెప్పుకునే స్థాయి చదువులు...

వీటన్నిటీనీ గాలికొదిలేసి - సోకాల్డ్ హైందవాన్ని వాడొచ్చి నాశనం చేసాడు - వీడొచ్చి నాశనం చేసాడనేడుస్తారేం ...

నీ ఇంట్లో నీకు నచ్చిన పద్దతినీ నువు సరిగ్గా పాటించేడిస్తే బలవంతంగా నీ బొట్టు చెరిపి మతం మార్చే దమ్మెవడికి ఉంటుంది.. ??

నీ ఇంటికి తాళం సరిగా వేసుకేడిస్తే ఎవడన్నా దొంగతనం చేయగలడా..?? ఒకడొచ్చి సర్వం దోచుకుపోతున్నాడంటే అది వాడి ప్రతిభా లేక ద్వారాలు బార్లా తెరుచుక్కూర్చున్న నీ అసమర్ధతా...??

మనసు తలుపులు మూసుకోవటం చేతకాక - వాడి మీద వీడి మీద పడేడిస్తే మార్పొస్తుందా...??

భావం అర్థమైతే ఇప్పటికైనా మారి బ్రతకండి - లేకుంటే ఇట్టాగే వాడ్నీ వీడ్నీ తిట్టుకుంటూ చావండి.. !!

గురువుల హృదయాన్ని పట్టుకోవడం

గురువుల హృదయాన్ని పట్టుకోవడం సగం మందికి చేతకాదు....90% మంది పట్టుకోవడం చేతకాక ముందుకు వెళ్లలేక పడిపోతుంటారు ....ఆగిపోతుంటారు....ఆ పది మంది మాత్రమే జ్ఞాన గంగను త్రాగుతూ ముందుకు వెళ్లగలరు....మిగతా వాళ్లు అసూయతో రగిలిపోతూ వుంటారు.....

గురువుల అనుగ్రహం, అమ్మ అనుగ్రహం మెండుగా వున్న వాళ్లు వంద మంది చేత,  కీర్తించబడుతారు...పది మంది చేత వాళ్లు వందనాలు స్వీకరింపబడుతారు..అమ్మ అనుగ్రహం, గురువుల అనుగ్రహం కోసం నిత్యం ఎవరు తహతహలాడుతుంటారో వారి మీద ఆ గురువుల అనుగ్రహం అపారంగా వుంటుంది...కామాక్షి అనుగ్రహం వుంటుంది...ఎల్లవేళలా అమ్మ కంటికి రెప్పలాగ కాపాడుతూ వుంటుంది....అమ్మ తలుచుకొంటే సింహాసనం మీద కూర్చోబెట్టగలదు, రోడ్డు మీదకూ ఈడ్చగలదు. మానాభిమానములను క్షణంలో తలక్రిందులుగా చేయగలదు....అమ్మ రక్షణలో వున్నవాడి జాతకము వెలిగిపోతూ వుంటుంది....అదే విధముగా గురువుల మరియు అమ్మ ఆగ్రహానికి గురైనవారు అథఃపాతాళానికి త్రొక్కివేయబడుతారు ....బహు జాగ్రత్తగా వుండాలి సుమా!

గురువులు ఎంత దూరమైనా వుండవచ్చు, గురువుల పట్ల నీకు వున్న ఆ అభిమానం, గౌరవం నిన్ను దగ్గరగా చేస్తుంది.....ఓ గురువు చెప్పలేదని ఇంకో గురువు, ఓ గురువు కోపపడ్డారు అని మరోక గురువు, ఓ గురువు నచ్చలేదని ఇంకో గురువు ....ఇలా చేయకూడదు...
మీ అనుష్ఠాన సందేహాలను, ఉపాసన రహస్యములను మీ గురువుల దగ్గరనే నేర్చుకోవలయును....ఓ గురువు దగ్గర దీక్ష తీసుకొని, ఇంకో గురువును సంప్రదించడం మహా పాపం.....ఇలా నా దగ్గరకు చాలా మంది వస్తున్నారు...వారినందరినీ నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను...మీకు నామీద కోపం వస్తే రావచ్చు గాక....ఏమి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని.....

మా గురువులు చెప్పలేదండీ...మీరు చెబుతారా అని అసలు ఎలా అడుగుతారు నన్ను.....మీ గురువులు అసలు ఎందుకు మీకు చెప్పలేదో ఓక్కసారైనా ఆలోచించారా .....మీకు శ్రధ్ధ లేదు కాబట్టి మీ గురువులు చెప్పలేదు....

ఇది మంచి పద్దతి కాదు ....గురువులు అందరూ ఓక్కటే....ఈ సత్యం తెలుసుకోకుండా మీ గురువులను అవమానపరిస్తే, ఈ జన్మకు మీకు జ్ఞానం లభించదు....మీ గురువే దేవుడు.
గురువులను మార్చినంత మాత్రాన మీకు జ్ఞానం లభించదు ....మీ గురువులు చెప్పినదే వేదం....మీ గురువులు తప్పు జెప్పినా ఓప్పే అది....శ్రీమాత్రేనమః .....

మాటలు/మంత్రములు - శ్రీసూక్తం..

శ్రీ గురుభ్యో నమః

శ్రీసూక్తం:
ఇంకొకసారి మననం  చేసుకుంటే..
సూక్తం అంటే -
1. సు + ఉక్తం = బాగుగా చెప్పబడినది
2. సుష్టు ఉక్తం = పూర్ణముగా చెప్పబడినది  (complete)
3. సుందర కధనం సూక్తం = సుందరముగ చెప్పబడినది
శ్రీ గురించి అత్యంత వైభవముగా , సుందరముగా చెప్పబడిన

శ్రీ అంటే -
1. శ్రీయతే సర్వైః ఇతి - అందరి చేత ఆశ్రయింపబడినది.. ధనం, ధాన్యం, ఆరోగ్యం మొదలైన సంపదలకై అందరిచేత ఆశ్రయింపబడినది
2. శ్రుణోతి ఇతి శ్రీ - ఎవరు బాగా వింటారో వారు శ్రీ..ఎవరు భక్తుల ప్రార్ధనలను విని స్వామికి చెపుతుందో ఆ తల్లి.
3. శ్రుణాతి ఇతి శ్రీ - నాశనము  చేసేటివంటిది. ఎవరు తనను ఆశ్రయించిన భక్తుల పాపములను నశింపచేస్తుందో ఆ తల్లి శ్రీ ..
4. శ్రయతే భగవంతం ఇతి శ్రీ - ఎవరైతే భగవంతుని సతతము ఆశ్రయించి ఉంటుందో , సర్వదా భగవంతునియందే ఉంటుందో అది శ్రీ..బ్రహ్మాశ్రయమైన మాయ అని చెప్పడం.. శక్తివంతునికంటే శక్తి వేరుగా ఎలా వుండజాలదో అలా ఆ తల్లి లక్ష్మీ ఎప్పుడూ విష్ణువునందే ఉంటుంది. ఆయనను సర్వదా ఆశ్రయించి ఉంటుంది..
ఆ తల్లి పేరు శ్రీ. ఆ శక్తి పేరు శ్రీ.. ఆ తత్వమునకు శ్రీ అని పేరు..
                 
మంత్రం - 1
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

సాధరణముగా ఏ దేవతను ప్రార్ధించినా మొదలు ఆ దేవత యొక్క సంబోధన, ఆవహన మొదలైనవి ఉంటాయి.. కాని ఈ మంత్రములో ఈ దేవతను సంబోధించడము లేదు, ఆవహన చెయ్యడము లేదు.  ఇక్కడ
హే జాతవేదః లక్ష్మీ మే ఆవహ -ఓ జాతవేదుడా! నా కొరకు లక్ష్మిని ఆహ్వానించు అని ఉంది..
ఇక్కడ సంపదను కోరినటువంటి ఋషి లక్ష్మిని అహ్వానించమని జాతవేదుని ప్రార్ధన చేస్తున్నారు.
ఎందుకు ??

ఒక్కొక్క పద్దతిని బట్టి ఒక్కొక్కరు ఆహ్వనిస్తేనే పని జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఉన్నత పదవిలో ఉన్న పెద్దవారిని ఆహ్వనించాలంటే వారికి సంబందించిన వారికి చెప్పి వారి ద్వారా పెద్దవారిని అహ్వనించినట్లుగా
     
1. అత్యంత పూజ్య భావన కలిగిన వారిని నేరుగా సంబోధించడం కుదరదు. ఇది శిష్టాచార పద్దతి.
2. వైదిక దేవతలను అగ్ని ద్వారనే పూజించాలి. ఇక్కడ జాతవేదుడు అంటే అగ్నిదేవుడు. అందుకే
ఓ అగ్నిదేవా! నా కొరకు శ్రీలక్ష్మీదేవిని ఆవాహన చేసి తీసుకొని రండి  - అని ఆ ఋషి ప్రార్ధన చేస్తున్నారు.

ఈ జాతవేదుడంటే ఎవరు ?
1. జాతః వేదః ఇతి - పుడుతూనే అన్ని తెలిసినవాడు. సకలము తెలిసినవాడు. - వైదిక క్రతువులో అరణి మధనము ద్వార, మంత్రోఛ్ఛారణ ద్వార యాగాగ్నిని ఉత్పాదన చేస్తారు. అలా ప్రకటింపబడిన అగ్ని అత్యంత పవిత్రమైనది. ఆహితాగ్నుల ప్రకారము ఈ అగ్ని ప్రత్యక్ష దైవము.. వేదములో కర్మకాండ ప్రకారముగా ఈ అగ్ని లేనిదే ఏ క్రతువు నడవదు.
2. అగ్రణీ - అగ్రే నయతి - అందరికంటే ముందు ఉండేవాడు. దేవతలలో ప్రధముడు. అగ్ని లేకుందా ఏ ధార్మిక కార్యక్రమము నడవదు..   ఋగ్వేదము లొని ప్రధమ  మంత్రము
"ఓం ఆగ్నిమీడే పురోహితం యజ్ఞస్యదేవమృత్విజం  హోతారం రత్నధాతమం"    వేదము ప్రారంభం అవ్వడమే అగ్ని స్తుతితో ప్రారంభమయ్యింది.
===========
out of context - The very first sound that is recorded by Prof. Max Muller when gramaphone was invented by Thomas Alva Edison is this first Veda mantram.
http://www.metroindia.com/news/article/26/06/2015/edison-gramophone-record-max-muller-the-rig-veda/7178
==================
3. ఇంకా ఈ అగ్నిదేవునికి దేవముఖుడు అని పెరు.. వైదిక దేవతలు దేనిని భుజించాలన్నాఅగ్ని ద్వారానే భుజిస్తారు.
4. అలాగే - హవ్యవాహనుడు అని  ఇంకొ పేరు. యజ్ఞములో అగ్నిదేవుడు మన పక్షము వహించి మన కొరకు దేవతలను ఆహ్వానిస్తాడు. యజ్ఞమునందు సమర్పించిన వాటిని ఏ దెవతను ఉద్దెశ్యించి వేస్తామో ఆ దేవత దగ్గరకు మోసుకొని తీసుకువెళతాడు.
ఇవాళ కూడా ఇంట్లో నిత్య పూజలో మొదట దీపము వెలిగిస్తాము. ఇది అగ్నిదేవునికి సంకేతము. దీపము వెలిగించి ఏమి సమర్పించినా ఆ దేవతకు సమర్పింపబదుతుంది అనే భావన.                   

పైన చెప్పినవి బాహ్యమైన భావన..
5. తాత్వికపరముగా చూస్తే - జాతః వేదః యస్మాత్ సః - ఎవరినుండి వేదములు జన్మిస్తాయో  అతనికి జాతవేదుడు అని పేరు. ఇక్కడ జాతవేదుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని సూచిస్తున్నారు.. (ఋచస్సామాని జిజ్ఞిరే - పురుష సూక్తము ..) సమస్త జ్ఞానము నారయణుని నుండే పుడుతోంది. అందుకు , ఓ నారాయణా! నా కొరకు ఆ లక్ష్మీదేవిని ఆహ్వనించు అని ప్రార్ధన చెయ్యడము.. ఈశ్వరుడు ఇయ్యకుండా మనకు సంపద రాజాలదు.. ఇక్కడ సంపద అంటే జ్ఞాన సంపద అని కూడ.       
లక్ష్మీ నారయణుని శక్తి. కనుక నారయణుడే లక్ష్మిని ఆహ్వానించగలడు.
ఇక్కడ నారయణుడే అంటూ అగ్నికే నమస్కారము చేస్తున్నాము. ఎందుకు?
యజ్ఞోవై విష్ణుః - శ్రుతి వాక్యము
త్వం యజ్ఞః - పురుష సూక్తము               
ఇక్కడ యజ్ఞము అంటే అగ్ని కార్యము అనే ప్రధానమైన అర్ధముగా గ్రహిస్తే విష్ణువే అగ్నిదేవుడై ప్రకటింపబడినాడు అని గ్రహించాలి..     

హే ఆగ్నిదేవా!, అగ్ని రూపముగా మా ముందర సాక్షాత్కరించిన హే విష్ణూ!,మా ధర్మాచరణ కొరకై కావలసిన సంపదలను అనుగ్రహించేందుకై  శ్రీమహాలక్ష్మిని  మా కొరకై ఆహ్వానించండి - అని ఋషి ప్రార్ధన చేస్తున్నారు

ఇప్పుడు అసలు ఈ లక్ష్మి ఎవరు ?
శ్రీదేవి సంపదకు అధిస్టానాదేవత అని చెప్పుకున్నాము. మరి మళ్ళీ లక్ష్మీ అని ఎందుకు సంభోదించేరు ఋషులు ?  ఈ లక్ష్మి అంటే ఎవరు ?  ఈ విషయమును మళ్ళీ చెప్పుకుందాము.

సర్వం శ్రీబాలాత్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

హిరణ్యగర్భుడు - అంటే అర్ధము ఏమిటి ?

నమో హిరణ్యగర్భాయ 


1. హిరణ్యము అంటే ఒక అర్ధము బాగా ప్రకాశించునది అని.. ప్రకాశము చేత జ్ఞానము సూచింపబడుతున్నది.. 
హిరణ్యగర్భుడు అంటే జ్ఞానముతో సంపూర్ణముగా నిండిఉన్నవాడు.. ఇక్కడ జ్ఞానము అనగా స్వస్వరూప(ఆత్మ)జ్ఞానమునే main గా సూచిస్తున్నది. 

2. ఇంకొక అర్ఢము - సమస్టి సూక్ష్మ ప్రపంచమునందు అభివ్యక్తమవుచున్న బ్రహ్మమునకు(చైతన్యమునకు) హిరణ్యగర్భుడు అని పేరు. ఇక్కడ సమస్టి (Macro/Universal) సూక్ష్మ ప్రపంచము అంటే - వ్యస్టి(Micro/ Individual) జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణ పంచకములు, అంతఃకరణ చతుస్టయముల సముదాయము.. సత్వ రజోగుణముల సముదాయము.. జ్ఞానేంద్రియ సముదాయము మరియు అంతఃకరణ సముదాయము కలిగి ఉండడము వలన జ్ఞానమునకు main గా ఈ సూక్ష్మ ప్రపంచము link అయి ఉన్నది.. 
ఈ హిరణ్యగర్భుని ధ్యానము ఈ విధముగా చెయ్యడము వలన నాకు కూడా అజ్ఞాన రూపములో అడ్డుగా ఉన్న పాపములను తొలగి సమ్యక్ జ్ఞానము కలుగుతుంది. ఇది శాస్త్ర వాక్యము.

సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాద దివ్య చరణార్పణమస్తు

శ్రీసూక్తము: అనగా

శ్రీ గురుభ్యో నమః 
శ్రీ అనగా సంపద.. మన వేదము సంపద ద్వార పరమత్ముని ఎలా చేరుకొవాలి అని పతిపాదన చేస్తున్నది. వేదము నందలి  కర్మ కాండలొని ఈ సూక్తము యొక్క వివరణ , దీని యొక్క వినియోగము చక్కగా  చెప్పబడినది.  శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరమ కటాక్షమును పొందుటకై  శ్రీసూక్తమును జప హోమాదీ రూపముగా వినియొగింపబడుతున్నది.

సూక్తము - అంటే సు + ఉక్తము - అంటే బాగా చెప్పబడినది..
శ్రీసూక్తము - అంటే - సంపదగురించి బాగా చెప్పబడిన మంత్ర సముదాయము.

శ్రీసూక్తము యొక్క స్వరూపము - ఇది ఋగ్వేదములో ఐదవ మండలమైన ఆత్రేయ మండలమునందు ప్రతిపాదింపబడినది. ఇందులొ 15 మంత్రములు ఉన్నాయి.. మిగిలినవి ఫలస్రుతిగా, ఋషి స్మరణగా ఉన్నాయి. ఈ విషయము శ్రీసూక్తమునందే చెప్పబడినది.
"శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్సతతం జపేత్"

ఈ మంత్ర సముదాయము 4 రకములైన ఛందస్సులను కలిగి ఉంది (అనుష్తుప్పు, భృహతి, త్రిష్టుభ్, ప్రస్తార పంక్తి)
ఈ మంత్రముల యొక్క ఋషులు - ఆనందుడు, కర్ధముడు, చిక్లీతుడు. వీరు చాలా ప్రసిద్ధమైన ఋషులు.. 
ఈ మంత్రముల యొక్క అధిస్టానదేవత - సాక్షాత్ శ్రీదేవి అయిన శ్రీ మహాలక్ష్మీదేవియే

మన సంప్రదాయములొ పారాయణ చేసెటప్పుడు - ఆ మంత్రము యొక్క ఛందస్సును, ఋషిని, మంత్రాధిస్టాన దేవతను  స్మరించడము పద్దతిగా ఉంది. 
ఛందోస్మరణ అంటే ఆ వేద స్మరణయే
ఋషిస్మరణ అంటే -  ఏ మంత్రములను ఋషి తాను దర్శించి, తన శిష్య, ప్రశిష్యులద్వార మనవరకు అందేలా ప్రవర్థమానము చేసారొ వారిని స్మరించడము ద్వార మన కృతజ్ఞతను ప్రకటించడమే..
ఈ మంత్రముల యొక్క అధిస్టానదేవత - ఆ మంత్రములకు ఎవరు అధిస్టానమై ఉన్నారో  ఆ దేవత యొక్క స్వరూప స్మరణ.. శ్రీసూక్తమునకు సాక్షాత్ శ్రీదేవి అయిన శ్రీ మహాలక్ష్మీదేవియే మంత్రాధిస్టానదేవత..  అసలు ఈ తల్లి ఎవరు ? ఈమె తత్వం/స్వరూపము ఏమిటి ?

ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఉన్నవాడు ఒక్కడు, తాను ఏ మార్పుచెందకుండా అనేక రూపములుగా ఆ పరమత్ముడే ఇన్ని రూపములుగా దర్శనమిస్తున్నాడు. దేవత అంటే ఆ పరమత్ముని యొక్క శక్తి యొక్క రూపము..
ఉదాహరణకి:
దక్షిణాముర్తిగా  ఆ పరమత్ముని ప్రార్ధన చేస్తే - ఆయనలోని జ్ణానమనే దేవతను/శక్తిని మనము ప్రార్ధిస్తున్నట్టు లెక్క.. అప్పుడు మనకు కూడా ఆ శక్తి ప్రసాదింపబడుతుంది.
సూర్యుని గా ధ్యానము చేస్తె  పరమత్మునిలోని ఆరోగ్యమనే శక్థి ఇవ్వబడుతుంది ..
శ్రీ మహాలక్ష్మీదేవిగా  ప్రార్ధన చేస్తే - పరమత్మునిలోని సంపదను అనుగ్రహిస్తుంది
ఉన్నది ఒకే పరమాత్ముడు నన్ను అనుగ్రహించేందుకై ఇన్ని రూపములుగా ఉన్నాడు..నామ రూపములు, మంత్ర సముదాయము వేరుగా ఉన్నా తత్వతహా ఇవి అన్ని ఒక్కటే. శక్తిమాన్ కంటే శక్థి వేరుగా ఉండజాలదు కనుక. 

శ్రీదేవి/శ్రీ మహాలక్ష్మీ ఒక దేవతగా ఆ పరమాత్ముని సంపత్ప్రసాద శక్తి, కాని, పారమార్ధికముగా చూస్తె సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపమే..

వేదాంతపరమైన భాషలో
పరమాత్మ - నిష్క్రియము, అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అవ్యపదేశ్యం, ఏకాత్మప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం,  శివం, అద్వైతం అయిన శుద్ధ బ్రహ్మము
శ్రీదేవి - మాయశక్తి. బ్రహ్మాశ్రయమైన మాయశక్తి..

శుద్ధబ్రహ్మము ఈ మాయశక్తి కారణముగ ఈ జగత్తుని సృస్టి చేస్తున్నాడు, స్తితి, లయములు కూడా చేస్తున్నాడు.
శుద్ధబ్రహ్మము గా ఏమి చేయలేడు (నిష్క్రియుడు అవ్వడము వలన). "శివశక్త్యాయుక్తో " అని సౌందర్యలహరి మొదటి శ్లోకము.

ఈ మాయశక్తి కారణము వలన  సృస్టి, స్తితి లయములు చేస్తున్నాడు.  ఈ కోణములొ చతుర్ముఖ బ్రహ్మ, శ్రీమహావిష్ణువు, మహేశ్వరులు గా ఆ శుద్ధబ్రహ్మమునే భావన చెయ్యడం జరిగినది. అలాగే  మాయశక్తి కూడ మూడు రకములుగా , శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ పార్వతి గా వ్యక్తమైనది.. వీటిని విడదీసి చెప్పడము కుదరదు. మాయశక్తి వల్లనే బ్రహ్మము విశిష్టమైనాడు.

శ్రీ మహాలక్ష్మీ వల్లనే శ్రీమహావిష్ణువు విశిష్టుడైనాడు. వీరిరువురు వేరుగా లేరు. రెండుగా లేరు..ఇది దేవతా స్వరూపము.

నా చిత్త సౌలభ్యము కొరకు , నా ఉపాసనా సౌలభ్యము కొరకు నేను శ్రీ మహాలక్ష్మీని శ్రీసూక్తము ద్వారా మంత్రధిస్టాన దేవతగా ధ్యానము చేస్తున్నను, నిజానికి ఆమె సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణియే.. ఈ విధమైన ధ్యానము, ప్రార్ధన సంపూర్ణ ఫలితములను ప్రసాదిస్తుంది అని ఆర్యుల వాక్కు..

శ్రీసూక్తము యొక్క మరిన్ని విషయములతొ మళ్ళీ  మీ ముందు ఉంటాను

శ్రీ గురుభ్యో నమః
సర్వం శ్రీ బాలత్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

అట్లతద్దె పండుగ

ఒకప్పుడు మన దేశంలొ అన్ని జిల్లాలలలో ప్రతీ గ్రామంలోనూ ఎంతో వైభవంగా జరుపుకునే ఈ అట్లతద్దె పండుగ ఇప్పుడు ఆచరించేవారు లేక వెలవెలబోతుంది.  అట్లతద్దె చేస్తే మంచి మొగుడొస్తాడనీ, అందగాడు భర్తగా లభిస్తాడనీ, అట్లతద్దె నాడు ఉపవాసం ఉంటే  అధిక ధనవంతుడో , పెద్ద ఉద్యోగస్ధుడో కోరి వచ్చి మరీ పెళ్ళి చేసుకుంటాడనీ చెప్తూ  చాలామంది పెద్దలు నమ్మించి  ఈ పూజలు చెయ్యిస్తారు. కానీ  ప్రాక్టికల్ గా అవన్నీ జరిగేవి కావు.  దీనివల్ల  అప్పటివరకూ ఊహల్లో తేలిపోతూ , ఆశగా ఎదురుచూసే చాలామంది అమ్మాయిలు నిజజీవితంలో అందుకు విరుద్ధంగా జరిగేసరికి  దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, అసంతృప్తికీ, నిరాశానిస్పృహలకీ లోనౌతున్నారు. 


హిందూమతంలో ఉన్న ప్రతీ ఆచార వ్యవహారాల వెనుక, పండుగల వెనుక కొన్ని  సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక  కారణాలూ ప్రయోజనాలు  ఉంటాయి, వాటిని నేటితరానికి  అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ప్రతీఒక్కరూ శృద్ధగా, మనస్పూర్తిగా ఈ పండుగలను ఆచరిస్తారు,  కానీ దురదృష్టం కొద్దీ గుడ్డిగా వీటిని ఆచరించేవారే తప్ప వీటిపై అవగాహన ఉన్నవారు మనలో చాలా తక్కువ. 

అట్లతద్ది సమయంలో ఔషద విలువలు ఉన్న ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ఈ సీజన్ లో వచ్చే చర్మ, నఖ, కీళ్ళ  వ్యాధులు రావనీ, అట్లను దానం ఇవ్వడం వల్ల కుజదోష ప్రభావం తగ్గుతుందనీ, ఉయ్యాల ఊగడం  వల్ల వారి శరీరానికి అవసరమైన  రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందనీ,  ఆటపాటలతో అందరితో సరదాగా గడపడం  మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, ఉదయాన్నే లేచి  పూజలు చేయడం వల్ల దైవభక్తి పెరగడంతో  పాటు దైవకృప వల్ల మంచి జరుగుతుందనే మానసిక ధైర్యం కలుగుతుందనీ, పరగడుపునే పప్పు బెల్లం కలిపి తినడం వల్ల ధాతుపుష్టి కలుగుతుందనీ, పండుగ పేరుతో చీరలు ఆభరణాలు కొనడం ద్వారా వారి వివాహానికి అవసరమయ్యే వస్తువులను ఒకొకటిగా సమకూర్చుకునే ఆర్ధిక ప్రణాళిక ఉంటుందనీ,  ఇప్పటిలా  కాబోయే భర్త గురించి ఇలాంటివాడే కావాలని  నోరు తెరచి తెగేసి  చెప్పలేని ఆరోజుల్లో అట్లతద్ది రోజున  ఆటపాటల్లో సరదాగా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎలాంటి భర్త కావాలని  అడగడం ద్వారా  ఆమె మనసుని తెలుసుకుని ఆమెకు తగిన భర్తను తీసుకొచ్చే ప్రయత్నం చేసే అద్భుతమైన  ఆలోచన ఉందనీ చెబితే అందరికీ ఆ పండుగ విలువ తెలుస్తుంది.  ఇవి చెప్పేవారు లేకే ఇలాంటి పండుగలు ఈ కాలం అమ్మాయిలకి చాదస్తంగా కనిపించి పండుగలకూ పూజలకూ దూరంగా ఉంటున్నారు.  

నిజానికి   మనసుతో చెయ్యాల్సిన వాటిని మభ్య పెట్టి, భక్తితో చెయ్యాల్సిన వాటిని భయపెట్టీ   చెయ్యిస్తూ అర్ధాంతరంగా పుట్టుకొచ్చిన  కొన్ని ఆచారాల వల్ల, మూఢంగా ఏర్పరుచుకున్న కఠిన నియమ నిబంధనల వల్లే చాలామందికి ఈ పండుగలూ పూజలూ చాదస్తంగా అనిపించి,  మతం మారి ఇతర మతాలకు వలస పోతున్నారనేది ఒప్పుకుతీరాల్సిన వాస్తవం. పండుగల వెనుక ఉన్న రహస్యాలనూ, ఆచారవ్యవహారాల వెనుక ఉన్న   సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలనూ ప్రతీ ఒక్కరూ తెల్సుకుని  తెలియనివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగిన నాడే దూరమైపోతున్న మన సంస్కృతినీ,  అంతరించిపోతున్న  సంప్రదాయాలనీ కాపాడుకోగలం.  ....
ఇట్లు 
మీ శ్రేయోభిలాషి 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ 

భక్తి ద్వారా ముక్తి


శాస్త్ర చోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉంది.  ఇది అవసరమా, అనవసరమా అన్న ప్రశ్నకు తావులేదు.  ఇలా కర్మానుష్టానం చేసిన తురువాత క్రమంగా మనకు రాగాద్యేషాలు  క్షీణిoచి చిత్తశుద్ది ఏర్పడుతుంది..  మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధానం  పటిష్ట మవుతుంది.  ఇది రెండవ స్తితి.  భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి.  ఇదే చరమ స్తితి
అందుచే భక్తిని వదలి ముక్తికోసం ప్రత్యేకం ప్రాకులాడ వలసిన పనిలేదు.  మనలోనో భక్తే తుదకు ముక్తిని అందిస్తుంది. భక్తీ కోశం భగవంతుని ప్రార్ధిస్తే చాలు.   అందుచే మహాను భావులందరూ  భక్తీ ప్రాధాన్యాన్ని  ఉద్ఘాటిస్తు, " భక్తి బిక్ష పిట్టవే " అని అమ్మవారిని ప్రార్ధిస్తూ ఉంటారు.  ఆ భక్తీ మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే.   

                        గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

శాంతోమహాంతో నివసంతి సంతః


జీవితంలో ఒడుదోడుకులకు లోంగిపోని శాంతత మనం అలవరుచుకోవాలి. కామ మొహాదులకు చలించని స్తితి మనం పొందాలి.  మనలో ఒక సామెత ఉంది. " నవ్వుతూ చేసిన తప్పును ఏడుస్తూ అనుభవించాలి " అని.  ఐతే ఆ నవ్వడం ఏడవడం ఎలా జరుగుతుంది ?  మనం చేసే మంచి పనికాని చెడ్డ పనిగాని  వాని స్వరూపము పై ఆధారపడి ఉంటుంది.  వాటి కారణాలను బట్టి ఉంటుంది.  కామంతో, క్రోధంతో, చేస్తే అది తప్పు. కామం కలిగించే పనియైనా కామభావం మనస్సులోకి రానివ్వకుండా చేస్తే అది ఉత్తమ కార్యం అవుతుంది. ద్వేషం , క్రోధం, మనస్సులోకి రాకుండా ద్వేష క్రోధాలు  కలిగించే పనులు చేసినా అవి తప్పు కావు.  అంటే మన మన మనస్సును ఒక్క శాంతం మినహా ఇతర భావాలపైకి పొనీయక,  మనం ప్రపంచంలో చేసేపనులన్ని ఉత్తమకార్యాలే అవుతాయి.  సాధువులు మహాను భావులు ఐన పెద్దలను గురించి  "  శాంతో మహంతో నివసంతి సంతః , వసంతవల్లోక హితం చరంతః  "  అని చెబుతారు. మన మనస్సు ఆ స్తితికి వచ్చినప్పుడే అది జన్మ సాఫల్యం.  అంటే కామ, క్రోధ,ద్వేష, భయ, జిగుప్స , మొదలయిన  భావాలను రెచ్చగొట్టే పరిస్తితులు ఏర్పడినప్పుడు, అటువంటి పనులు చెయ్యవలసి వచ్చినప్పుడు , మన మనస్సు ఒకే విధంగా ఉండాలి. 
                          
                         గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

1648లో జరిగిన అద్భుత సుబ్రహ్మణ్యుని లీల.....


డచ్ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకు వెళ్ళాలనుకున్న మన సుబ్రహ్మణ్యుని మూల విరాట్టు . ఎంతో మహిమాన్విత క్షేత్రం .

సునామీ కూడా సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని ఏమి చేయలేకపోయింది. 


ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

స్థల పురాణము…

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు తన సోదరులగు సింహముఖుడు మరియు తారకాసురుడితో ముల్లోకాలను ఏలుతుండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, తిరుచెందూరుకు అసుర సంహారమునకై వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, తన శక్తి ఆయుధంతో రెండు ముక్కలుగా చీల్చి సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలి స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.

స్కాంద పురాణంలో…

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

స్వామివారి రూపం…

తిరుచెందూర్ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపంతో పాటు పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ క్షేత్రములో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

విభూది మహిమ…

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.

ఆలయశోభ…

సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహాసన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో తిరుచెందూర్ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

షణ్ముఖ విలాసం…

దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. ఇక్కడే మరో మండపం ఉంది. ఈ మండపంలో ఉత్సవ దేవతా విగ్రహాలు దర్శనమిస్తారు. ఫల్గుణీ మాసంలో ప్రతి ఏటా ఈ మంటపంలో వల్లీ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొన్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. దీనికి సమీపంలో గణపతిస్వామి మూర్తి ఉంది. ఈయనను ఇక్కడ ‘ముక్కురిణి పిళ్లయర్’అని పిల్వడం జరుగుతోంది. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు.

ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి. తూర్పువాకిలి మధ్య భాగాన, తూర్పుగోపురం హద్దుగా తామ్రంతో నిర్మితమైన ధ్వజస్తంభం ఉంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.

మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం…
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్‌ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు.

ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్‌, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.

మరొక ప్రత్యేక స్థానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.

పురాణ విగ్రహం…

షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట. ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు! M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు.

నాయిక్కనర్ వింత బావి…

షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి.

సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.
ఆలయంలో ఆర్జిత సేవలు…

స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతంగా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

బ్రహ్మోత్సవాలు…

ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో ఒకటి తమిళ ఆవణఇ మాసంలో (ఆగస్టు – సెప్టెంబరు), రెండోది మాసి మాసంలో (ఫిబ్రవరి- మార్చి) నిర్వహిస్తారు. అలాగే చిత్తరై మాసంలో (ఏప్రిల్-మే) వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పది రోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖిలో (మే-జూన్) 12 రోజులు విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తారు. శూరసంహారం ముగిసిన అనంతరం, మరుసటిరోజున తిరుకళ్యాణ మంటపంలో దేవయాని తిరుకళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ కావడి పూజలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. తమ కోర్కెలు తీరిన భక్తులు తమ శక్త్యానుసారం పాలకావడి, పన్నీరు కావడి, పుష్పకావడిలు సుదూర ప్రాంతాలనుంచి కాలినడకన తీసుకొచ్చి, స్వామికి సమర్పిస్తారు.

వసతి సదుపాయము…

ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానపు వసతి గృహాలు అనేకము గలవు. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.
ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

తిరుచెందూరు పట్టణం తిరునల్వేలి పట్టణానికి రైలు మార్గంలో సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి తిరునల్వేలికి చేరుకుని అక్కడి నుంచి రైలులో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

తరువాతి లీల : బ్రిటిష్ భక్తురాలి కోసం శివుడే స్వయంగా వచ్చిన శివలీల  ... దయచేసి ఈ లీలను కూడా పూర్తిగా చదవండి 

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .

దయచేసి అందరికీ షేర్ చేయండి 

అందరం " ఓం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 
ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 
ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...