Tuesday, February 27, 2018

వసంతోత్సవం హోలీ

మన సంప్రదాయంలో ఉన్న అనేకానేక పండుగలలో హోలీ కూడా ఒకటి. ఇది ఆనందకేళీ రవళుల నడుమ జరుపుకొనే సంతోష తరంగహేల. పూర్వకాలం నుంచి దేశమంతటా ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగనే వసంతోత్సవమని, ఫాల్గుణోత్సవమని కూడా పిలుస్తారు.

ఈ పండుగ పలు పురాణాల్లో తారకాసుర సంహారానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. రుషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. ఆ అసురుడి పీడ తొలగాలంటే పార్వతీపరమేశ్వరులకు జన్మించే కుమారుడే సమర్ధుడని దేవగురువు బృహస్పతి దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు మన్మధుడిని పిలిచి దేవకార్యాన్ని చక్కబెట్టమన్నాడు. మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది.

దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. ఆ కాముడు దహనమైంది పూర్ణిమనాడు. ఆ పూర్ణిమే ఫాల్గుణశుద్ధ పూర్ణిమ. అందుకే ప్రతి ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధపూర్ణిమను ఇలా కామ దహన పూర్ణిమగా పిలుచుకోవడం ఆచారంగా వస్తోంది. కామదహనోత్సవం అని కూడా దీన్ని పిలుస్తారు. కాముడు దహనమైనప్పుడు రతీ దేవి విలపించింది. అలాంటి విలాపాన్ని పురస్కరించుకుని ఉత్సవం జరుపుకోవడం ఏమిటని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే దీన్ని ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ఫాల్గుణశుద్ధ పూర్ణిమను మహాఫాల్గుణి అని, హోలికా, హోలికాదాహో అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే హుతాశనీ పూర్ణిమా, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, శశాంక పూజ, చంద్రపూజ లాంటివి జరుపుతూ ఉంటారు. తెలుగునాట మాత్రం కామునిపున్నమగా ఇది బాగా ప్రసిద్ధం. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున పంగుని ఉత్తిరం అనే పండుగ జరుపుతారు. ఫాల్గుణశుద్ధ పూర్ణిమనాడు చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడంటారు. ఫల్గుణి అనే పదం పంగుని గాను, ఉత్తర అనే పదం ఉత్తిరంగాను, తమిళ భాషలో పలకడం వల్ల పంగుని ఉత్తిరంగా దీన్ని వ్యవహరిస్తారు.

హోలికా పూర్ణిమా, హోలి అనే పేర్లు రావటానికి మళ్ళీ పురాణకథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. పూర్వం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి హరిభక్తిని సహించలేక అతడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. హిరణ్యకశిపుడికి హోలికా అనే ఒక సోదరి ఉండేది. ఆమెకు అగ్ని బాధ లేకుండా ఓ వరం ఉండేది. హిరణ్యకశిపుడు హోలికను పిలిచి ప్రహ్లాదుని ఆమె చేతికిచ్చి మంటల్లోకి ప్రవేశించమన్నాడు. మంటల వల్ల హోలికకు ప్రమాదం ఉండదని ప్రహ్లాదుడే మరణిస్తాడనేది ఆ రాక్షసుడి భావన. అయితే దైవచిత్రంగా మంటల్లోకి ప్రవేశించిన హోలికా దగ్ధమైంది. ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చాడు. హోలికా దహన సందర్భాన్ని పురస్కరించుకుని హోలీ పండుగ వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇలాంటిదే రఘు మహారాజు కాలంలోను ఓ కథ జరిగిందంటారు. ఆ రోజుల్లో దుంధ అనే ఓ రాక్షసి ఉండేది. ఆమె ఆ రాజ్యంలోని పసి పిల్లలందరిని చంపి తింటూ ఉండేది. ఇతర పీడలేవీ ఆ రాజ్యంలో లేకపోయినా ఈ భయంకర పీడ మాత్రం నాటి ప్రజలందరిని బాధిస్తూ ఉండేది. ఈ బాధకు విరుగుడుగా ఫాల్గుణశుద్ధ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం చేస్తే ఆ రాక్షసి బాధ తొలగిపోతుందని నారదుడు రఘుమహారాజుకు చెప్పాడు. రఘువు అలానే చేసి ఆ రాక్షసి బాధను తొలగించాడు. అందుకే పూర్వకాలం నుంచి ఈ పూర్ణిమ రోజున కల్యాణ వ్రతం కొంతమంది జరుపుతుంటారు.

హోలీ పండుగ నాడు ఒక్కో ప్రాంతంలో రాత్రివేళ, అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున పాత వస్తువులను మంటల్లో వేసి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాటలు పాడుతూ ఉండడం కనిపిస్తుంది. ఈ మంటలు వేయడం, మంటల్లో మన్మధుడు, రతీదేవి బొమ్మల్ని కూడా వేయడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఏ ప్రాంతంలోని వారైనా సరసంగా వరసైన వారి మీద రంగు నీళ్ళు చల్లుకోవడం, పెద్ద హోలీ మంట వేయడం అనే రెండింటిని మాత్రం సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. హోలీ నాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో ప్రజలంతా కాలం గడుపుతూ ఉంటారు. ఇలాంటి వేడుకంతా రాబోయే ఆనందకర వసంత రుతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సంప్రదాయంగా పరిణమించిందని పెద్దలు చెబుతున్నారు.

హోలీ పండుగ నాడు రాత్రి కొన్ని ప్రాంతాల్లో రాజ వీధుల్లో, నాలుగు వీధులు కలిసే చోట పెద్ద పెద్ద భాండాలలో రంగునీళ్లను నింపి ఉంచుతారు. ఆ నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. ఆ తర్వాత యువకులంతా హోలీ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి పాత వస్తువులను సేకరించి హోలీ మంటల్లో వేస్తూ ఉంటారు. హోలీ పండుగ వ్రతం చేసుకొనే పెద్దవాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు పీడలను పోగొడుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబర హేలగా తరతరాలుగా దేశమంతటా జరుగుతూ వస్తోంది.

మనసు అద్వైత చైతన్యజాగృతి

మనసును స్వేచ్ఛగా వదిలేయకూడదు.

దానిలోని భావాల్ని నిత్యం కనిపెడుతుండాలి.

అసలు కొన్ని ఆలోచనలు మనిషికి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తాయా అనిపిస్తుంది ఒక్కోసారి.

అప్పుడు అతడు తనను తాను మరచి, వాటికి వశమవుతుంటాడు.

ప్రతి ఆలోచనకూ అవకాశమిస్తే, మనిషి తుపానులో ఇరుక్కుపోతాడు.

తనకు తానే గందరగోళ పరిస్థితి సృష్టించుకుంటాడు.

అందువల్ల అతడు తన మనసును ఎప్పుడూ వేయి కళ్లతో కనిపెట్టాలి.

ఒక భావాన్ని మనసు పట్టుకొని వస్తుంది.

దానితో మనిషి స్నేహం చేసి, మరిన్ని భావాలకు ఆస్కార మిస్తాడు.

అవి మంచివైతే మంచి వైపు, లేదంటే చెడు వైపు లాగుతుంది.

మనసు పనిగట్టుకుని అన్నీ మంచి భావాలనే ఇవ్వదు.

అతడే ప్రతి భావనలోనూ మంచిని చూడాలి.

తన మనసుకు నిరంతర ధ్యానం ద్వారా శిక్షణనివ్వాలి.

ఒక్క ప్రతికూల ఆలోచననైనా రానివ్వకూడదు. దానికి అవకాశమూ ఇవ్వకూడదు.

పలు రకాల ఆలోచనలతో, మానవ జీవన ప్రయాణం చిల్లులు పడిన పడవలా మారుతుంది.

‘నా సాధన అంతా నా మనసుతోనే’ అనేవారు అరుణాచల *రమణ మహర్షి* .

ప్రతీ మనషీ కూడాను ధ్యానం ద్వారా తన మనసు యెుక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించు కోవాలని ఆయన చెబుతుండేవారు.

గొప్ప భావాలనే మనిషి పోషించాలి.

భ్రమల్లోకి బలవంతంగా నెట్టే వూహల్ని మొగ్గలోనే ధ్యానం ద్వారా తుంచాల్సిన బాధ్యత అతడిదే.

వూహను ఉపయోగించుకునే నేర్పరితనం పెంచుకోవాలి.

వీటన్నింటికీ ముందు, అతడికి తెలియాల్సింది తన మనసు పోకడ !సంపర్కం తీరుతెన్నులు.

మనసు గురించి తెలియకుండా, ఆధ్యాత్మికతపై మాట్లాడే అవకాశమే మనిషికి లేదు.

అతడి సాధన అంతా మనసుతోనే! తను చేసే యుద్దం తన మనస్సుతోనే.

మనసు లోపలికి, తనలోకి తానే అతడు ప్రయాణించాలి.

తన అంతరంగ ప్రయాణం అద్భుతంగా సాగాలి.

అందమైన మనసు. రంగురంగుల మనసు. ఇంతవరకు ఒక ప్రపంచాన్ని చూపించింది.

మనసు లో ఎన్ని ప్రపంచాలో! వాటి  నుంచి బయటకు వెళ్లాలి మనిషి.

అలా లేనప్పుడు అది పురోగమనం కాదు- తిరోగమనం!

మనసుకు మించిన దేవుడు లేడు*.

నేను ను మించిన మంత్రం లేదు*.

మనసులోనే అంతరాలయంలో మూల విరాట్టు సేదతీరుతున్నాడు*.

నీలోపల  దివ్యంగా ఉన్నాడు.

పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నాడు

నీవు ధ్యానం చేసి మేల్కొలుపు.

మంచిగా మల్చుకొంటే*

నీ మనసే దైవం*

నువ్వే దైవం*

అహం బ్రహ్మాస్మి*  అని ఓంకారం చెట్టుమీద గల *ఆత్మపక్షి* అరిచి చెబుతోంది.

అదొక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన దృశ్యం. అనంతమైన అనుభూతి.

దాని కోసమే మనిషి జన్మించాడు.

తన మనసుతోనే అతడు బతుకుతాడు.

ఆ మనస్సును ధ్యానం అనే అద్దంలోనే అన్నీ చూస్తాడు.*

అంతరంగంలో అంతర్ముఖుడైనవాడికి ఆకలిదప్పులు ఉండవు.*

ఇంతకాలం ఏ మనసైతే అతణ్ని పట్టి పీడించిందో- అదే మనస్సు  వేషం, భాషలు మార్చుకొని ‘జ్ఞాన బ్రహ్మ’గా దర్శనమిస్తుంది.*

అదే మనసు యెుక్క విశ్వరూపం!*

‘తన ధర్మం వైపు అడుగు వేసే ఉత్తమ మానవుణ్ని దేవుడుగా  తయారుచేయడమే దేవతల లక్ష్యం.

ఆ లక్ష్యసాధనకు ముందుగా కావాల్సింది మనస్సును ధ్యానంతో వశపర్చుకోవడం.

‘మర్రి విత్తనంలోనే మహావృక్షం ఉంది’ అని పెద్దల మాట.

అలాగే సర్వ లోకాలూ మనిషి మనసులోనే ఉన్నాయి.

ఆలోకాలతోనే అతడికి పని.

ఆకాశంలా విశాలత్వం,
వాయువులా సర్వ వ్యాపకత్వం. మనిషిికి
అవసరమవుతాయి.

మనసు సంపర్కం తేజస్సును అగ్నిలా, స్వచ్ఛతను జలంలా, సుగంధాన్ని మట్టిలా అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది మనిషే!

తన మనసును దాటిపోవాల్సింది, హృదయంగా మారిపోవాల్సింది, దివ్యత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేయాల్సింది అతడే!

మారిన మనసే ఉదాత్త హృదయం.

ఆ హృదయ నివాసి దైవమే!*

అలా అన్నింటినీ చూస్తుంటే, మనిషి మనసు నిర్మల మవుతుంది.

బుద్ధుడు బోధించినట్లు- తాపీగా ఒడ్డున ఉండండి. మనసును అలాగే నిశితంగా గమనిస్తుండండి.

ఏం జరుగుతుందో అప్పుడు మీరే చూడండి!

ఇదియే మనస్సు
యెుక్క విశ్వరూపమైన
"దైవ స్వరూపం ".

యోగశాస్త్ర దర్శనం

యోగశాస్త్ర దర్శనం అనగానే నేడు చాలామంది పొరబడుతున్నట్లుగా యోగాసనాలు, ప్రాణాయామము మాత్రమే కాదు, దీనికి అతీతంగా జీవాత్మని పరమాత్మతో అనుసంధానంచేసి, బ్రహ్మానందస్థితిని పొందటమే దాని పరమలక్ష్యం. అదే మోక్షస్థితి.

మోక్షము, సాధన అనగానే అదేదో బ్రహ్మపదార్ధమన్నట్లు, కేవలం యోగులు, సిద్ధులు, సాధకులకి మాత్రమే పట్టుబడే విద్య, మనకి కాదు అనుకుని చాలామంది దానికి దూరంగా ఉంటారు.

కానీ పతంజలిమహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగదర్శనం అందరూ నిత్యం ఆచరించదగ్గ, అనుష్ఠానంలోకి తెచ్చుకోదగ్గ దర్శనం. నిత్యమూ ప్రయత్నపూర్వకంగా ఆచరణలోకి తెచ్చుకోవలసినది.

అష్టాంగ యోగం(యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి)లో మొదటి రెండు అంగాలైన యమ, నియమములు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ సామాజికంగా, వ్యక్తిగతంగా తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి తోడ్పడేవి.

ఇవి నిష్ఠతో పాటిస్తే మిగిలినవి వాటంతట అవే దైవానుగ్రహం వల్ల సమకూరతాయి.

యమ, నియమాల గురించి తెలుసుకుందాం.

యమము
యమము అంటే అదుపులో ఉంచవలసినది, నియంత్రించవలసినది. అని అర్ధం.

వ్యక్తి సంఘపరమైన నైతికవిలువలు పాటించేలా చేసి, అతణ్ణి సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.
యమములు ఐదు.

1. అహింస
2. సత్యము
3. అస్తేయము
4. బ్రహ్మచర్యం
5. అపరిగ్రహము

*అహింస –*

అహింసను ఒక వ్రతంలా పాటించాలి.

భౌతికమైన హింసే కాదు, మానసికంగానూ , వాక్కుపరంగానూ కూడా హింసని నిరోధించాలి.

శరీరపోషణ కై ప్రకృతిలోని కొన్ని జీవజాతులలోనూ మరియు ధర్మరక్షణకై కొన్ని పరిస్థితులలో మాత్రమే హింసకు అనుమతి ఉంది.

*సత్యము –*

త్రికరణ శుద్ధియైన ఋజుప్రవర్తన. నీతీ, నిజాయితీ పాటించడం.

ఎట్టిపరిస్థితుల్లోనూ సత్యాన్ని విడువకపోవడం.

*అస్తేయము –*

పరుల సొమ్మును ఆశించకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం.

కనీసం అలాంటి తలంపు కూడా మనసులోకి రాకుండా నిరోధించుకోవాలి.

దీన్ని పాటించడం వల్ల మనకు అవసరమైనది, అర్హమైనది ఆ భగవానుడే మనకు సమకూరుస్తాడనే నమ్మకం పెంచుకోవాలి.

మనకు కావలసింది ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి.

*బ్రహ్మచర్యం –*

వంశాభివృద్ధి కోసమే దాంపత్యం అని త్రికరణశుద్ధిగా నమ్మి, అది ఒక యజ్ఞంలా భావించాలి.

ఏకపత్నీవ్రతుడైన గృహస్థు బ్రహ్మచారే అంటోంది శాస్త్రం.

*అపరిగ్రహం –*

ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, దురాశ లేకుండా అవసరమైనంత లేదా ఒక్కోసారి తక్కువగా కూడా గ్రహించడం
నియమాలు అంటే ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినవి, ఆచరించవలసినవి.

ఇది వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తుంది.

నియమాలు కూడా ఐదు.
1. శౌచము
2. సంతోషము
3. తపస్సు
4. స్వాధ్యాయము
5. ఈశ్వర ప్రణిధానము.

*శౌచము –*

ఇది ప్రతీ ఒక్కరూ శారీరికంగా, మానసికంగా పాటించవలసినది.

దాని వల్ల బాహ్య, అంతఃశుద్ధి జరిగి, ఆరోగ్యం చెంత చేరుతుంది, మనస్సు తేలికగా ఉంటుంది.

*సంతోషము –*

జీవితంలో కష్టసుఖాలు ఎదురైనప్పటికీ, అవి సహజమే అన్న దృష్టితో ఎల్లప్పుడూ సంతోషాన్ని వీడకూడదు.
ప్రయత్నపూర్వకంగానైనా సంతోషంగా ఉండాలి.

తనకు లభించిన దానితో తృప్తి చెందటమే సంతోషం.

*తపస్సు –*

తపస్సు అంటే జనాలకి దూరంగా ఉండి అడవుల్లో చేసేది కాదు.

శారీరిక, వాఙ్మయ, మానసికమని మూడు విధాలైన తపస్సులు.

పెద్దలు, గురుజనుల సేవ, ఎల్లప్పుడూ సేవాభావంతో ఉండటం, సేవ చేయటం శారీరిక తపస్సు.

మన మాటని మృదువుగా, అర్ధవంతంగా, వినసొంపుగా, తగుమాత్రంగా, వినియోగించుకోవడమే వాక్ తపస్సు.

మనసు సదా పవిత్ర భావనలతో, పరిశుద్ధంగా ఉంచుకోవడమే మానసికమైన తపస్సు.

*స్వాధ్యాయం –*

తనకు అధ్యాత్మికోన్నతిని కలిగించే పవిత్ర గ్రంథాలని అధ్యయనం చేస్తూ, ఇష్టదేవతా ప్రార్థన సదా చేస్తూ, తనకు కలిగే సందేహాలను తీర్చుకోవడమే స్వాధ్యాయము.

*ఈశ్వర ప్రణిధానము-*

మనస్సును దైవానికి శరణాగతి చేయడం, ఆ దైవానికి, ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తించడమే ఈశ్వర ప్రణిధానము.

ఈ యమ నియమాలు పదింటినీ నిత్యం అనుష్ఠానం లోకి తెచ్చుకుంటే మానవ జీవితం ఉన్నత పథంలో నిలుస్తుంది.

మనస్సు నిర్మలత్వాన్ని, స్థిరత్వాన్ని పొందుతుంది.

జీవ, బ్రహ్మ ఏకత్వానికి కావలసిన పునాది పడుతుంది.

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురా రోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతా రామచంద్ర  ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత జగత్రయ  వజ్ర దేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయు పుత్ర అంజనీ గర్బసంభూత శ్రీ రామ లక్ష్మణా నందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవసాహా య్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మ చారిన్ గంభీరనాథ సర్వపాపనివారణ సర్వ జ్వరోచ్చాటన  డాకినీ విద్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ సర్వ దు:ఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూత మండల సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరైకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది బింది బింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌమ్ హ్రః  ఆం హాం హాం హాం ఔమ్ సౌమ్ ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానం శాకినీ డాకినీ విషమ దుస్తానాం సర్వ విషం హార హార ఆకాశం భువనం భేదయ భేదయ చేదయ చేదయ మారాయ మారాయ సోషయ సోషయ మోహాయ మోహాయ జ్వాలాయ జ్వాలాయ ప్రహారాయ ప్రహారాయ సకల మాయం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ బంధన మోక్షం కురు శిరః శూల గుల్మ శూల సర్వసూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రిమ్చర దివాచర సర్పా న్నిర్విశం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాన్ చ్చేదయ చ్చేదయ స్వమంత్ర స్వయంత్ర స్వ విద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||

కర్ణుడు కవచకుండలాలతో ఎందుకు పుట్టాడు?

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని' కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం'. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే....

పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు' అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను' అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు.

నర రూపం ‘నరుని'గానూ., ‘సింహ' రూపం ‘నారాయణుని'గా ‘ధర్ముని' కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు' అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు.

వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు' అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి' అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది.

తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి' అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి' అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు' వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను' అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు.

ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను' అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురా రోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతా రామచంద్ర  ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత జగత్రయ  వజ్ర దేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయు పుత్ర అంజనీ గర్బసంభూత శ్రీ రామ లక్ష్మణా నందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవసాహా య్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మ చారిన్ గంభీరనాథ సర్వపాపనివారణ సర్వ జ్వరోచ్చాటన  డాకినీ విద్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ సర్వ దు:ఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూత మండల సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరైకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది బింది బింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌమ్ హ్రః  ఆం హాం హాం హాం ఔమ్ సౌమ్ ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానం శాకినీ డాకినీ విషమ దుస్తానాం సర్వ విషం హార హార ఆకాశం భువనం భేదయ భేదయ చేదయ చేదయ మారాయ మారాయ సోషయ సోషయ మోహాయ మోహాయ జ్వాలాయ జ్వాలాయ ప్రహారాయ ప్రహారాయ సకల మాయం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ బంధన మోక్షం కురు శిరః శూల గుల్మ శూల సర్వసూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రిమ్చర దివాచర సర్పా న్నిర్విశం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాన్ చ్చేదయ చ్చేదయ స్వమంత్ర స్వయంత్ర స్వ విద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...