Thursday, July 2, 2015

విండోస్ 10

 విండోస్ 10 పేరు వింటున్నాము. కాని  దీని గురించి క్లారిటీ గా కరెక్ట్ ఇంఫర్మషన్ తెలియటంలేదా. ఇక మీకు ఆ కన్ఫుజన్ ఏమీ లేకుండా..

విండోస్ 10 వాడటానికి కావాలనినవి?
విండోస్ 10 గతంలో పైరేటెడ్ విండోస్ 7 మరియు 8 వెర్షన్స్ కు ఫ్రీ అప్ డేట్ వస్తుంది అని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది మైక్రోసాఫ్ట్, కాని మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకుంది.
కేవలం జెన్యూన్ విండోస్ 7(సర్వీస్ ప్యాక్ 1) మరియు విండోస్ 8.1 వెర్షన్స్ కు మాత్రమే 10 ఫ్రీ గా అప్ డేట్ రానుంది. ఈ ఫ్రీ అప్ డేట్ కూడా కేవలం ఒక సంవత్సరం మాత్రమే. ఆ తరువాత ఎడిషన్లు బట్టి 6,355 రూ నుండి 12,717 రూ డబ్బులు కట్టాలి.

జెన్యూన్ విండోస్ 7, 8 వెర్షన్ OS లు ఉన్న వాళ్లు ఇలా 10 ఫ్రీ అప్ డేట్ ను పొందవచ్చు..
జెన్యూన్ విండోస్ వెర్షన్ వాడుతున్న వారి సిస్టం ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఉంటే, వారికి ఆటోమేటిక్ గా క్రింద టాస్క్ బార్ లో టైమ్ పక్కన విండోస్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి విండోస్ 10 ఫ్రీ అప్ గ్రేడ్ అవ్వటానికి రిజర్వ్ చేసుకోవచ్చు.  రిజర్వ్ చేసుకున్న వాళ్లకి జులై 29 న (జెన్యూన్ విండోస్ OS యూజర్స్ కు మాత్రమే) విండోస్ 10 OS ఫైల్స్ అన్ని ఇంటర్నెట్ నుండి బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా డౌన్‌లోడ్ అయ్యి, విండోస్ 10 ను ఇంస్టాల్ చేసుకోమని నోటిఫికేషన్ ఇస్తుంది కంప్యూటర్ లో.

విండోస్ 10 ఎప్పుడు వాడటానికి అందుబాటులోకి వస్తుంది?
జులై 29 అఫిషియల్ కంప్లీట్ ఫైనల్ విండోస్ 10 OS విడుదల కానుంది. కాని ఈ లోపు దానిపై టెస్టింగ్ చేయటానికి టెక్నికల్ ప్రివ్యూ అనే పేరుతో విండోస్ 10 ను ప్రస్తుతానికి జెన్యూన్ లేదా నాన్ జెన్యూన్ విండోస్ యూజర్స్ అందరూ వాడే అవకాశం ఇస్తుంది మైక్రోసాఫ్ట్. అంటే మీరు వాడవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని బగ్స్ మరియు ఇన్ కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయి. అవి మన డైలీ యూసేజ్ కు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. విండోస్ 10 ఎలా ఉంటుంది అనే ఔత్సాహికులు దీనిని వాడగలరు. ఇది 90 పర్సెంట్ ఫైనల్ విండోస్ 10 వెర్షన్ లుక్స్ తో ఉంటుంది.

విండోస్ 10 టెక్నికల్ ప్రివ్యూ ఎక్కడ దొరుకుతుంది?  ఇది వాడటానికి ఏమి కావలి? ఎలా చేయాలి?
టెక్నికల్ ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకోవటానికి ముందుగా Windows Insider Program అనే దానికి సైన్ అప్ అవ్వాలి. Windows Insider Program కు ఈ లింక్ లోకి వెళ్లి సైన్ అప్ అవగలరు. ఇందులో సైన్ అప్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ ID లేదా Outlook మెయిల్ అడ్రస్ ఉండాలి. సైన్ అప్ అయ్యాక, ఫాస్ట్ రింగ్ మరియు స్లో రింగ్ అని రెండు రకాల విండోస్ 10 OS బిల్డ్స్ ను ఎంచుకోవటానికి ఆప్షన్ ఇస్తుంది. 


ఫాస్ట్ రింగ్ బిల్డ్స్ లో ఎక్కువ బగ్స్ ఉంటాయి కాని ఫాస్ట్ గా లేటెస్ట్ అప్ డేట్ లు వస్తాయి. స్లో రింగ్ బిల్డ్ వెర్షన్స్ లో స్టేబుల్ గా తక్కువ బగ్స్ తో ఉంటుంది OS, కాని ఫాస్ట్ రింగ్ బిల్డ్ వాళ్లకి వచ్చిన తరువాత వస్తాయి ఇందులో లేటెస్ట్ os బిల్డ్ అప్ డెట్లు. ఎలా డౌన్లోడ్ చేయాలి..ఎక్కడ చేయాలి..ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి అనే వాటిపై మీకు అది స్టెప్ బై స్టెప్ instructions ఉంటాయి. జులై 29 న ఫైనల్ కంప్లీట్ విండోస్ 10 వెర్షన్ వచ్చినప్పుడు టెక్నికల్ బిల్డ్స్ పనిచేయవు. లేటెస్ట్ గా విండోస్ 10 10159 టెక్నికల్ ప్రివ్యూ బిల్డ్ ను రిలీజ్ చేసింది. దీనిలో 300 బగ్స్ ను ఫిక్స్ చేసి కొత్త లాగిన్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ను పొందుపరిచింది.

విండోస్ 10(టెక్నికల్ బిల్డ్ / ఫైనల్ రిలీజ్)  సిస్టం Requirements?
మీ సిస్టం లో విండోస్ 7(సర్వీస్ ప్యాక్ 1) కాని విండోస్ 8.1 కాని పనిచేస్తే, విండోస్ 10 కూడా దర్జాగా పనిచేస్తాది. విండోస్ 8.1 రన్ అయ్యే విండోస్ ఫోనులకు కూడా ఫ్రీ అప్ డేట్ రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ కాని విండోస్ ఫోనులకు మాత్రం ఆ ఫోన్ కంపెని మీద ఆధారపడి ఉంటుంది 10 అప్ డేట్.

అసలు విండోస్ 10 ఏమున్నాయి?
కొత్త os అంటే మేజర్ గా ఉండే మార్పు యూజర్ ఇంటర్ఫేస్ (UI). సెకండరీ గా కొత్త ఫీచర్స్. విండోస్ 10 లో కావలసిన అన్ని UI మార్పులు ఉన్నాయి. అయితే కొత్తగా ఇందులో ఉండే ఫీచర్స్...


 విండోస్ 10 లో ఆండ్రాయిడ్ మరియు ఐ os అప్లికేషన్లు రన్ చేసుకోవచ్చు.ప్రాజెక్ట్ స్పార్టాన్ అనే పేరుతో మొదలై “మైక్రోసాఫ్ట్ ఎడ్జ్” అని పేరు మార్చుకొని కొత్త ఫీచర్స్ తో ఇంటర్నెట్ బ్రౌజర్ వస్తుంది.ఇంటిగ్రేటెడ్ స్కైప్ కాలింగ్ సాఫ్ట్ వేర్వర్చ్యువల్ డెస్క్ టాప్స్ ద్వారా బెటర్ మల్టీ టాస్కింగ్అన్నిటికి మించి వాయిస్ స్పీచ్ అసిస్టంట్ లోని కొన్ని మంచి మార్పులు తో Cortanaఆండ్రాయిడ్ ఫోనుల్లో మాదిరి నోటిఫికేషన్ సెంటర్windowed మెట్రో యాప్స్Continuum మోడ్ ద్వారా టచ్ మరియు రెగ్యులర్ డెస్క్ టాప్ ఇంటర్ఫేస్ కు మరే అవకాశంపూర్తిగా మారిన విండోస్ మెయిన్ సెట్టింగ్స్ లుక్స్మెయిల్ Revamped యూజర్ ఇంటర్ఫేస్
 

డిజిట్‌తో అనుసంధానం అవ్వండి

- See more at: http://www.digit.in/te/internet/all-about-windows-10-21454.html#sthash.oNwWPsXf.dpuf

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...