Thursday, March 29, 2018

శ్రీ యోగావసిష్టమ్-4

శ్రీ వసిష్ట మహా రామాయణము

      *ప్రథమ స్సర్గః*

*కర్మలయందు విముఖుడైన కారుణ్యునికి అతని తండ్రి అగ్ని వేశ్యుడు ఈ విధంగా చెప్పుచున్నాడు *

*అగ్నివేస్య ఉవాచ --:*

కిమే తత్ పుత్ర ! కురుషే పాలనం న స్వకర్మణః?।(12)

పుత్రా ఇదేమి ? నీవు స్వ ధర్మమును పాలించుటలేదు ?( కర్మలనాచరించుట లేదు )

అకర్మనిరతః సిధ్ధిం కథం ప్రాప్స్యసి తద్వద ।
కర్మణో ౽సాన్నివృత్తేః కిం కారణమ్ తన్నివేద్యతాం ॥
(13)
నీవు కర్మవివర్జితుడవై సిథ్థి నెట్లు పొందెదవో నాకు తెలియచెప్పుము! మఱియు కర్మల నెందులకు త్యజించితివో నుడువుము ( తెలుపుము)

🥀 *కారుణ్య ఉవాచ -:*

యావజ్జీవన  మగ్ని హోత్రం
నిత్యం సంధ్యా ముపాసయేత్।
ప్రవృత్తి  రూపో   ధర్మో౽యం
శ్రుత్యా స్మృత్యా చ చోదితః ॥ (14)

కారుణ్యుడు : చెప్పెను.

మరణపర్యంతము అగ్నిహోత్రము నొనర్చునది ,
నిత్యము సంధ్యావందనము ఆచరించునది - ఈ రూపములగు శ్రుతి స్మృతి వాక్యములన్నియు
ప్రవృత్తి ధర్మమునకు చెందినవి !

స  ధనేన   భవేన్మోక్షః
కర్మణా    ప్రజయా  నవా।
త్యాగ    మాత్రేణ కిం త్వేకే
యత  యో౽శ్నంతి చామృతమ్ ॥(15)

ధనమువలన కర్మల వలన సంతానోత్పాదనము వలన మోక్షము లభింపదు
త్యాగము అనగా * సర్వకర్మ* సన్యాసము వలననే
అమృతత్వము పొందును .
( ఇట్టి వాక్యములన్నియు నివృత్తి పరములు)

ఇతి శ్రుత్యోర్ధ్వ  యోర్మధ్యే
కం   కర్తవ్యం   మయా గురో ।
ఇతి   సందిగ్ధతాం గత్వా
తూష్ణీం  భూతో౽స్మి   కర్మణి ॥(16)

తండ్రీ ! ఈ రెంటిలో ఎద్దానిననుసరింపతగును?
అను సందియము , కలిగి సందిగ్ధ చిత్తుడనై కర్మలను త్యజించితిని!

🌻 *అగస్తిరువాచ-:*

ఇత్యు  క్త్వా    తాత   విప్రో౽సౌ
కారుణ్యో     మౌనమాగతః ।
తథా  విధం  సుతం దృష్ట్వా
పునః ప్రాహ గురుః సుతమ్ ॥ (17)

💐 *అగస్తిమౌని పల్కెను-:*

కారుణ్యడు తండ్రికి అట్లుపల్కి వూరకుండెను . అపుడు మౌనమును వహించిన పుత్రనితో అగ్ని వేశ్యుడు ఇట్లు పల్కెను .

🌞 *అగ్నివేశ్య ఉవాచ-:*

శ్రుణు   పుత్ర   కథామేకాం
తధర్ధం    హృదయే౽ఖిలమ్ ।
మత్తో౽వధారస్య   పుత్ర త్వం
యథేఛ్ఛసి   తథా కురు ॥ (18)

అగ్నివేశ్యుడు -:పుత్రా నీ కొక కథను చెప్పెదను; వినుము ! విని దానిని బాగుగా విచారించి చూచి నీకు నచ్చినట్లొనర్చుము !

సురుచిర్నామ   కాచిత్ స్త్రీ
అప్సరోగణ    ఉత్తమా ।
ఉపవిష్టా    హిమవతః
శిఖరే    శిఖ   సంవృతే ॥ (19)

రమంతే కామ సంత ప్తాః
కిన్న ర్యో యత్ర కిన్నరైః ।
స్వర్ధున్యో ఘేన సంసృష్టే
మహా ఘౌఘ వినాశినా ॥ (20)

దూతమింద్రస్య గఛ్ఛంత
మంతరిక్షే దదర్శసా ।
తమువాచ మహాభాగా
సురుచిశ్చాప్సరోవరా ॥(21)

పూర్వము, కామతప్తులగు కిన్నరకిన్నరీ సమూహములు విహారములు సల్పునది
మయూరీ మయూరములు - ప్రమోదక్రీడలు నొనర్చునదియు , పాపనాశినియగు గంగానది ప్రవహించునదియు నగు హిమవత్పర్వత శిఖరమున -- అచ్చోట "సురిచి" యను అప్సరస కూర్చుని యుండెను . ఆ పై ఆకాశమున అరుగుచున్న ( వచ్చుచున్న) ఇంద్ర దూతను గాంచి ఇట్లనెను!

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ

                        శ్రీ మత్రై నమః

👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

👉 *జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*
*పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

. అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.
పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు కనుక , యథాతథంగా ఇచ్చాను.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

ధర్మ సూక్ష్మాలు


84 లక్షల జీవరాసులలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది. దీన్ని సార్ధకం చేసుకోండి.

*ఉదయం నిద్రలేవగానే కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.*

ఏ మానవుడు కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో, నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో, పాము పుట్టల దగ్గర , తల్లిదగ్గర, అక్క చెల్లెలు దగ్గర,  పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.

*ఇద్దరు బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి మధ్య ,భార్య భర్తల మధ్య, గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య, ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన పూర్వపుణ్యం నశించును.*

సహపంక్తి భోజనం చేయుచుండగా మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం సంభవించును.

*భోజనం చేయుటకు ముందుగా, భోజనం అయిన తర్వాత పాదప్రక్షాళన చేయనిచో దరిద్రం సంభవించును.*

దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.

సంధ్యాకాలంలో భోజనం, నిద్ర, చదువు ,దానము, భార్యా సంగమము, ప్రయాణం చేయరాదు. ఒకవేళ చేసినచో దరిద్రం, వ్యాధి, మరణం సంభవిస్తాయి.

*భోజనమునకు తూర్పు , పశ్చిమ , దక్షిణ దిక్కులు ఉత్తమమైనవి. భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.*

భోజనమునకు ముందు ఉప్పు వడ్డించినచో కీర్తి ,తేజస్సు హరించును.

*ప్రతి మానవుడు నుదుటన స్వరూపం (బొట్టు)తప్పక ధరించవలెను. దానివలన భూత ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.*

దేవాలయాలలో , పడవలలో , తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో ఇతరులును తగిలినా దోషములేదు,.

*భార్య గర్భవతి అయినపుడు భర్త సముద్ర స్నానము , క్షవరము, ౬పర్వతారోహణము , కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట , ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట పనికిరాదు.*

సూర్యోదయమునకు ఏ తిధి వుండునో ఆ రోజు చేయు స్నాన , దాన, జప, వ్రత , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.

*సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు, అశ్ర్పుస్య స్పర్శ లందు , వేడినీటి స్నానం చేయరాదు.*

భోజనము చేయు కంచము పట్టుకుని, ఒళ్ళోపెట్టుకుని , కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.

*నీటిని త్రాగునప్పుడు చిన్న పాత్రలోనికి తీసుకుని కూర్చుని మాత్రమే త్రాగవలెను.*

జపము పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములు నములుతూ క్రతువు చేయరాదు. అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.

అనుష్ఠానపరులు మంచినీరు నోటిలో ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) త్రాగవలెను.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ .....

క్షీరసాగరమథనం

దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనంజరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండ లోను మహాభారతంలోని ఆది పర్వము లోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది.
క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణంసవరించు
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతంపుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.

ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువుగరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి వాసుకికి అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆరొదకు ఎన్నో జీవరాశులు మరణించాయి.

🌹 *హాలాహలం పుట్టడం-* 🌹

అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికీ తాపం అణగడానికి క్షీరసాగర మథనం లోనుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకొన్నాడు; గంగమ్మతల్లిని నెత్తిపైన ఉంచుకొన్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతోనే ఉంటుందిట శివుడిని. కనుకనే, భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు

ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా కామధేనువుపుట్టింది. తరువాత ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మిపుడతారు. కామదేనువును, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకొంటాడు. ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తికి ఇస్తారు.
క్షీరసముద్రంలో లక్ష్మీదేవి అవతరణ....
పాలసముద్రపు మీది మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చెసాడట...క్రొమ్మేఘపు మెరుపులు ఆమె మేను మెఱుగుగా కుర్చడట
మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తార
సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి (శ్రీదేవి), దేవదానవులతో, "మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీమహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళి గా ఉంటాను" అని చెప్పి మహావిష్ణువు మెడలో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలం పై విరాజిల్లచేశాడు.

దేవదానవులు మళ్లీ మథనం ఆరంభించారు. అప్పుడు వారుణి (సుర లేదా కల్లు) పుట్టింది. వారుణి తమకు కావాలని రాక్షసులు అడుగగా వారుణిని దానవులకు ఇస్తారు. క్షీరసాగర మథన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు ఉద్భవించాయి. అన్నింటినీ దేవతల లోని ముఖ్యులు పంచుకున్నారు. రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు, స్వేచ్ఛగా సురను త్రాగి, సాగర మథనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి (కాబోలు) .

క్షీరసాగర మథన సమయం లో పుట్టిన అనర్ఘ రత్నాలు
సురాభాండం, కల్లుకు అధిదేవత
అప్సరసలు - రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష
కౌస్తుభము, అమూల్యమైన మాణిక్యం
ఉచ్చైశ్రవము, ఏడు తలల దేవతాశ్వము
కల్పవృక్షము, కోరిన కోరికలు ఇచ్చే చెట్టు
కామధేనువు, కోరిన కోరికలీడేర్చే గోమాత, సకల గో సంతతికి తల్లి
ఐరావతము, ఇంద్రుని వాహనమైన ఏనుగు
లక్ష్మీదేవి, ఐశ్వర్య దేవత
పారిజాత వృక్షము, వాడిపోని పువ్వులు పూచే చెట్టు
హాలాహలము, కాలకూట విషము
చంద్రుడు, చల్లని దేవుడు, మనస్సుకు అధిదేవత
ధన్వంతరి, దేవతల వైద్యశిఖామణి
అమృతము, మరణము లేకుండా చేసేది.
ధన్వంతరి అమృత కలశం తో పుట్టడం-మహావిష్ణువు మోహిని అవతారం దాల్చడం
ఆ తరువాత ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారి పోతోంది. దేవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహినిఅవతారం ఎత్తి ఆ దానవుల వద్దకు వస్తాడు. జగన్మోహినీ రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు ఒలక పోసుకొంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు ఆ జగన్మోహిని వెంటబడి అప్పటి వరకు జరిగిన గాథ చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని, సాగర మథనం వల్ల అమృతం వచ్చిందని, ఆ అమృతాన్ని వారిద్దరకి పంచమని కోరుతారు. అప్పుడు ఆ జగన్మోహిని దేవదానవులను రెండు పంక్తులలో కోర్చోబెట్టి, దర్భలమీద అమృతకలశాన్ని పెట్టి, దేవతలకు అమృతం పోస్తూ, దానవులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. రాహువు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల పంక్తిలో కూర్చొంటాడు. ఆ విషయాన్ని సూర్యచంద్రులు సంజ్ఞ ద్వారా మహావిష్ణువు (జగన్మోహిని) కి తెలుపగా విష్ణువు సుదర్శన చక్రముతోవాడి తల తెగ నరికాడు. ఆ విషయం ప్రక్కన ఉన్న దానవులకు తెలియలేదు. అమృతం పంచడం అయిపోయింది. జగన్మోహిని అదృశ్యమై పోయింది.

సూర్య, చంద్ర గ్రహణాలు
కాని అప్పటికే అమృతం తీసికొని ఉన్నందున రాహువు చావలేదు. తల, మొండెము విడిపోయి, తల రాహువు గాను, మొండెము కేతువు గాను పిలువబడుతూవచ్చారు. సూర్య, చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం రాహు, కేతువులు సూర్య, చంద్రులను మ్రింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అంటాము.
పాములకు రెండు నాలుకలుస
జరిగిన విషయం అంతా చూసి, వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో, కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి, ఏమీ చెయ్యలేక, అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి, దర్భలను నాకేడు, వాటిమీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం దక్కలేదు కాని, దర్భల పదునుకి నాలుక నిలువునా చీరుకు పోయింది. అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుక లున్నట్లుగా అనిపిస్తుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...