Saturday, November 3, 2018

దీపదానం

సాయంకాలం ప్రదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ, మఠము లందునూ ఇవి పెట్టవలెను.

అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|

యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||

ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే.

ఉల్కాదానం (దివిటీలు):-

దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి.

లక్ష్మీపూజ:-

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.

విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి.

అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.

'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత-' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసిచేయడం జ్ఞానంతో చేయడం దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ, సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నవని మనం తెలుసుకోవాలి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

దీపారాధన ఫలితాలు



దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః


దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు ఇచేది దీపజ్యోతియే !
అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను.


దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హిందూవుల ఆచారం. ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని "అఖండ" దీపం అంటాము. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుందంటున్నారు పెద్దలు. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము. సంప్రదాయబద్దంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.

రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.అలాగే రకరకాల గుళ్ళల్లలోనూ కూడ దీపారాధన కు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేసాయి.ఆర్ధికంగా ఉన్నవారు స్వర్ణదీపాలు, నవరత్నములు పొదిగిన దీపాల సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.

దీపారాధనలు కొన్ని ప్రదేశాలలో వెలిగించడం వల్ల విశే షమైన ఫలితాలు ఇస్తాయి.
మనము ఇంట్లో చేసే నిత్య దీపారాధన ను "వ్యష్టి " దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసంపద కలిగించేది ....అలాగే దేవాలయాలలో చేసే దీపారధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది...విశే ష ఫలితాలు .తులసి కోట వద్ద చేసే దీపారాధనని " బృందావన" దీపారాధన అంటారు.
దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను "అర్చనా" దీపాలు అంటారు.
నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు.
గర్భగుడిలో వెలిగించే దీపాన్ని "నందా" దీపము అని అంటారు.
లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో గుడిలో వెలిగించే దీపాన్ని "లక్ష్మి దీపం" అంటారు.
దేవాలయ ప్రంగణములొనున్న బలిపీఠం పై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా "బలిదీపం" అని అంటారు.ఆ సమీపాన ఉన్న ఎత్తూయిన స్థంబం పై వెలిగించిన దీపాన్ని "ఆకాశదీపం" అంటారు.

పంచాయతన దేవాలయాలలో దేవతలు.. శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు(సూర్యుడు) లున్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి.

విష్ణువు వద్ద దీపకృతులు :శంఖు,చక్ర,గద,పద్మ"రూపాలు కనిపిస్తాయి.
ఏక ముఖం- మధ్యమం, ద్విముఖం - కుటుంబ ఐక్యత, త్రిముఖం-ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం -పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.
అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం.
వెండి కుందులు అగ్రస్థానం . పంచ లోహపు కుందులు ద్వితియ స్థనం.
దీపారాధన చేసే తప్పుడు తప్పనసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి.
ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనసరిగ చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమముగా ఉంటారు.

దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.దీపారాధనకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు. దీపం కొండెక్కితే "ఓమ్ నమః శివాయ" అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.

 దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

" గంగిగోవు పాలు గరిటడైన చాలు"

గోవు అగ్నిమయం ,అమృత మయం ,దేవమయం .
ఇలా గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు కలరు .
ముక్కోటి దేవతలకు నిలయం గో మాత .
అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి , ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు .
అందుకే గోమాతకి ప్రదక్షిణం చేస్తే సకలదేవతలకి చేసినంత ఫలితం
గోవు పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ప్రతీతి
తల్లుల వద్ద పాలు లేని పిల్లలకు ఆవుపాలే శరణ్యం
సకలదోష నివారణకు ఆవు పంచితాన్నివ్వటం హిందువుల ఆచారం
గోపూజ , గో రక్షణ , గోదానం , గో వధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం .
భారతదేశానికి రైతు వెన్నెముక , అటువంటి రైతు వెన్నెముక వంటిది ఈ ఆవు .

ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత
భారతీయులకు అనాదినుంచి ఆరాధ్యదేవత
మానవ జాతికి ఆవుకన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు.
గోసేవ వలన ధీరోదత్త గుణాలు అలవడగలవనీ , ధన సంపదలు వృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది .
మాహానుభావులెందరో గోసంపద యొక్క రక్షణావశ్యకతను నొక్కి వక్కాణించారు .
శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి ,సేవించి గోపాలుడైనాడు .
దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు .
జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేసాడు .
గోవులే ఐశ్వర్యం .గోవులే ఇంద్రియ బలవర్ధకాలు ..

ప్రాణవాయువును (ఆక్సిజన్) తీసుకుని ప్రాణవాయువును(ఆక్సిజన్) వదిలే ఏకైక ప్రాణి
విషాన్ని హరించే గుణం ఆవుపాలకుంది .
గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని .
గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది .
ఇళ్లను , వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు .
ఒక తులం ఆవు నెయ్యిని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది .
ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది .

గోవు యొక్క పాలు (గో క్షీరం) , పెరుగు (గో దధి) , నెయ్యి , మూత్రం , పేడ (గోమయం) మొదలగు వాటిని
'పంచ గవ్యములు' అంటారు .
ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది .
గో మూత్రం పుణ్యజలం
గో సేవ ఇచ్చును కోటి యజ్ఞ యాగాదుల పుణ్యఫలం
భూమాత గో రూపంలోనే దర్శనమిస్తుందని శ్రీ మద్బాగవతం లో ఉంది .
గోధనంతో సమమైన ధనం లేదు .
గోవును స్తుతించటం , గోవును గూర్చి వినటం , గోదానం , గోదర్శనం గొప్ప పుణ్యాన్ని ఇచ్చేవని ఎన్నో విశేషాలలో చెప్పబడినాయి .
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...