Wednesday, August 15, 2018

పాదరస లక్ష్మీదేవి

         ‘పాదరస లక్ష్మీదేవి’ని పాదరసంలో మూలికలు కలిపి లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమ నిష్ఠలతో అనుభవమున్నవారు తయారుచేస్తారు. పూర్వం ఇంద్రుడు, కుబేరుడు, దిక్పాలకులు, వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యుల వారు  పాదరస లక్ష్మీదేవిని పూజించారని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహాలు గొప్ప అతీంద్రియశక్తి కలిగి ఉంటాయి. యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టతను తెలిపారు అందులో పాదరస లక్ష్మీ దేవి విశిష్టత గురించి  కూడా తెలియజేశారు.

      అక్షయతృతీయ, దీపావళి, వరలక్ష్మీ పూజలోను, శుక్రవారాలలో ఉదయాన్నే స్నానం చేసిన తరువాత  పూజామందిరంలో బియ్యపు పిండి ముగ్గుతో స్వస్తిక్ గుర్తు వేసి దాని పైన అష్టలక్ష్మీ పీఠాన్ని గాని, శ్రీ యంత్రాన్ని గాని ఉంచి ఎరుపు రంగు వస్త్రం పరచి దానిపైన రాగి గాని ఇత్తడి ప్లేటు గాని ఉంచి స్వస్తిక్ ఆకారంలో పూలతో,అక్షితలతో అలంకరించి పాదరస లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.అనంతరం బంగారు వర్ణంకలిగిన నాణేలను అమ్మవారి ముందు ఉంచి ధీపారాధన చేసి ధ్యాన,ఆవాహనాధి విదులతో పూజించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామానంతరం కమల మాలతో,శంఖ మాలతో,వైజయంతి మాలతో, “ఓం ఐం ఐం శ్రీం శ్రీం హ్రీం హ్రీం పారదేశ్వరీ సిద్ధమ్ హ్రీం హ్రీం శ్రీం శ్రీం ఐం ఐం ఓం”అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని పవిత్రమైన కుంకుమతో కుంకుమార్చన చేస్తూ పుష్పాలు,సుగంధ ద్రవ్యములు ,గంధం,స్వీట్స్,పండ్లు, తామరమాల మొదలైన పూజా ద్రవ్యములు ఉపయోగించి పూజించవచ్చును.. శ్రీసూక్తం మంత్రం ఉపయోగించి తామరమాలతో జపం చేయవలెను.పూజ అనంతరం పూజాక్షిత లను,పుష్పాలను శిరస్సున ఉంచి తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన పిదప పాదరస లక్ష్మీ దేవి విగ్రహాన్ని బీరువాలో గాని, ధనం,నగలు,బంగారం ఉండే చోట భద్ర పరచుకోవాలి.

       పాదరస లక్ష్మీదేవిని నిత్యం పూజచేసిన వారికి దీర్ఘకాలం సంపదను కలిగిస్తుంది. సమాజంలో గౌరవాలను, సంపదను, ఉన్నతవిద్యను కలిగిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది.పాదరస లక్ష్మీ దేవి ఇంటిలో ఉంటే డబ్బు కొరత రాదు.మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా చంచలత్వం కూడా ఉండదు. పాదరస లక్ష్మీదేవిని పూజించి కార్యసాదనలో ఎన్ని ప్రయత్నాలు చేసిన విజయం పొందని వారు కూడా కార్యసాధనలో విజయం పొందవచ్చును. జీవితంలో ఒడుదుడుకులు లేకుండా చేస్తుంది.పాదరస లక్ష్మీదేవి వాణిజ్య,వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది.షాపు లేదా వ్యాపారస్ధలంలో  పాదరస లక్ష్మీదేవిని ఉంచిన నిరంతర వ్యాపారాభివృద్ధి ఉండటమే కాకుండా ధనాభివృద్ధిని కలిగిస్తుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...