Friday, October 25, 2013

తొలి చూపు..............

తొలి చూపు...............

మనిషి జీవితంలో...........

మనిషి జీవితంలో...........

ప్రేమేనేరమా...........

                                                                 ప్రేమేనేరమా...........


ఏం నేరం చేసానేమో ప్రాణం దురం అయ్యేలా ...........
ఏం శాపం సెలవిచిందో స్వాసే ఆగేలా............
గుండెలో అశే తానై ఎదిగే కలనే చూస్తునా...
ఇంతట్లో ఏమైందో ప్రేమే మారేలా......
ఓ ప్రేమా నీ ఎదలో ఉన్నానా ఉన్నానా...........
ఓ మాటేచెపమా సొంతాం కాగలనా.........

నీ..... జతలో వెధనలే జ్ఞాపకమా జ్ఞాపకమా........ఓ ప్రేమా...........

వొదిలేసి ధూరం చేసి ఉహలోనే ముంచి,
             ఉరితాడై మారావేంటి ఇంతేనా ప్రేమా.....

వెలుగేదో చూపించేసి ఆశేదో రేపి,
             చీకటి లో తోసేశావు పాపం నాదేనా.......

నది రేయి వేనేలవా ..
           నరికేసే ఓ ఉళివా..
                     ధరి చేరే దేవతవా..
                                 వెలివేసే ప్రేయసివా ......

            
నీ......... జతలో వెధనలే జ్ఞాపకమా జ్ఞాపకమా........ఓ ప్రేమా...........

ప్రతి ప్రేమా ఇంతేనేమో నీలానే ఉంటుందేమో.........
చేరలోకి చేరేలాగా ధీవిస్తుందేమో.....
కర్చేమి ఆశించిన్దే నాలొనీ ప్రేమా.........
పరివారం పరిహాసం గా మర్చేశావే.........

మురిపించే మేనకవా నను ముంచే.......
నన్ను ముంచే వేధనవా.......

కరుణించే కానుకవా..........
కడలెనీ  నా కలవా................

నీ జతలో ఈ జగమే సున్యమయే........... ఓ ప్రేమా.....

ప్రేమ - పెళ్లి

నిదురిస్తున్న రేయి ఎదురు చూసేది ఉదయం కోసం ,
నిదుర లేచిన నా నయనం ఎదురు చూసేది నిను చూసే క్షణం కోసం...
అధరాలు కదిలేది మాటల సడి కోసం ,
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం ...
గుండె చేసే అలజడి ప్రాణం కోసం ,
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం ...
పాదాల పయనం జీవిత గమ్యం కోసం ,
నా అడుగుల గమనం నిను చేరుకునే ఆశ కోసం...తొలిసారి నాకు నచ్చింది నువ్వేనని ,
చివరి వరకు నీ తోడు నాకు కావాలని ,
నీ ప్రతి అడుగులో నీ నీడగా పయనించాలని ,
నా ఆశవు నువ్వై నను చేరుకోవాలని ,
నీ శ్వాసను  నేనై నీలో కలసి పోవాలని ,
నీకు చెప్పాలనుంది, కాని ....
"మొమాటంతో మనసు నిను అడగలేక
మౌనంతో దేవుణ్ణి కోరుకుంటోంది "
ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెతుకుతున్న నీ ప్రాణం నేనేనని ,
నీ కోసమే కోవెలగా మార్చిన నా హృదిలో నిను చేర్చమని .......నీ ఆశల పల్లకిలో అందమైన తారకలా ,
నీ కన్నుల లోగిలిలో పచ్చని తోరనంలా ,
నీ గుండె గుడిలో ఆరిపోని దీపంలా ,
నీ పెదవుల మాటున చెరగని చిరునవ్వులా,
నీ అడుగుల వెనుక తోడుగా ఉండే నీ నీడలా ,
ఉండిపోవలనుంది .......
నువ్వు అనుమతిస్తే , నీ చేతుల చెరలో బందీనై,
నిన్నే ఆరాధిస్తూ , నీ జతగా మిగిలి పోవాలనుంది........నా తనువుకు ప్రాణం నువ్వు ,
నా గుండెకు సవ్వడి నువ్వు ,
నా కనులకు అందం నువ్వు ,
నా కళలాడు ఆశవు నువ్వు ,
నా అడుగుల సవ్వడి నువ్వు ,
నా జీవితానికి అంతం నువ్వు.......కమ్మగా పాడే కోయిలనడిగాను,
నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,
నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను ,
నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను ,
ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,
నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......నేను నీ మెడలో వేసే మూడుముళ్ళ బంధం కోసం ,
నీతో కలసి నడిచే ఏడడుగుల కోసం ,
ఏకాంతంగా నీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయే హాయి కోసం ,
నన్ను నిన్ను దగ్గర చేసే వెచ్చని కౌగిలి కోసం ,
నువ్వు ప్రేమతో నాకు ఇచ్చే తీయని ముద్దు కోసం ,
నీ అన్నింటిలో నేనూ సగమై పంచుకునే క్షణం కోసం ,
నీలో నన్ను కలిసే మధురమైన అనుభూతి కోసం ,
..................    ............  .................
ఆ ఏడు క్షణాల కోసం , ఏడు వసంతాలే కాదు ,
ఎన్ని జన్మలైనా ..... ఇలానే ఎదురుచుస్తూ ఉంటాను

అమృతం కురిసెను మదిలో


                                     అమృతం కురిసెను మదిలో

 

కలువ కల్లకేమో కాట్టుకను పెట్టి .................

కల్లలు కంటూ ఉన్నాను నీకోసమే................


నీలి కురుల జాజి పూలా మకరందాలు నీకోసమే........

జడను ఊపు నడక వయారాలు నీకోసమే.............

శంకమంటి చెవులకు ముత్యములు కూర్చీ వేచి ఉంది నీ తీపి పలుకులకే................


తేనేలురు పెదవి తెలుపు నీ మీద ప్రేమే............

ఆధారాల భాష నీకు తెలియనిదా భరువైన రోమ పదముల వంపుల మాధుర్యం నీకు తెలియనిదా ......
ఆది పలుకనిదా ..................


సన్నజాజి తీగ నడుము మడత హొయలు నీవు చుడనిదా...............

నాభి భిన్ధువు కింద జారు లోయ స్పర్స రుచి చూపించనా.............

కనుపాప నగ్ననీ చూడనిదే నిదురైన నీకు రాదు నాకు తెలుసు కదా .......


అరవిరిసిన పరువాల లేత పాన్పు అందిస్తాలే...........

మధురాల ముద్దు మధురంగా అందిస్తాలే.................


వెండి వెన్నెలలో తడచి ముద్దైన తనువు పొందు కానుకగా అందిస్తాలే...................



నడుము వంపు కుచ్చులు జారి చూపు వంపులు నీకోసమే..............

చందన సుగంధాలు విరజిము తనువు వంపుసొంపుల విందు నీకోసమే....................


తనువు తనువు కలిసి చేయు నాట్యం రుచి చూపించవా.....................

తెరిచిన వంపుసొంపుల వీణ లాంటి తనువు ఇక నీ ముందు............
ఆపై  నీ ఇష్టం సుమా..............

ఓ ప్రేమా ............. నా ప్రేమా

ఓ ప్రియతమా .................. నా ప్రియతమా

అలసిపోయాను ప్రేమ ప్రయాణంలో2

కలలో ఒక రూపమే కనులకి తెరతెస్తే మదిలో ఆ రూపమే నిలిచెను దైవమై...
ఎదలో ఒక మౌనమే తన గలమును విపె ఇలలో నా ప్రాణమే పిలిచఎనీ పేరు నే.

జతగా నువ్వు కావాలని కోరెను మనసు ఎందుకో...

అలసిపోయాను ప్రేమ ప్రయాణంలో

తొలి చూపు లో తపనలు మాలి చుపుఎపుదని తః తాహాలు....
ముంగురులు ముఖముపై నీలి కనుల కాటుక నీ రాకకై చీకటి గా ముసిరి...
కొత్త వేకువ నీ వెతుకుతూ కళలు కంటుంది...
లేత పెదవి లో ని తడబాటు ముగాభోయిన మౌనం తాలమై వినిఒపించి సంగీతం న గుండె లయ చేసే నాట్యం.

ఆచరించి చూపాలి

ఆచరించి చూపాలి

ఒకానొక అడవిలో ఓ పక్షుల గుంపు ఉండేది. ఆ గుంపులో అందరికంటే పెద్దదైన పక్షి రాజుగా, ఆ గుంపుకి పెద్దగా వ్యవహరిస్తూ ఉండేది. ఆ గుంపులో పక్షులన్నీ రోజంతా కష్టపడి గింజలు సంపాదించి, సాయంత్రం వేళ ఓ చోట చేరి అందరూ తెచ్చుకున్నవి పంచుకునేవి. ఆలా ఒకవేళ ఎవరికైనా ఆహారం దొరక్కపోయినా పెద్ద సమస్యగా ఉండేది కాదు. ప్రస్తుతం ఉంటున్న అడవిలో తిండి గింజలు సరిగా దొరకడం లేదని, అవి మరో కొత్త చోటికి ప్రయాణమయ్యాయి. ఆ కొత్త ప్రదేశానికి చేరగానే పక్షిరాజు అందరినీ ఉద్దేశించి “కొత్త ప్రదేశం కనుక ,జాగ్రత్తగా మసలుకోండి. ఇద్దరు, ముగ్గురుగా గింజలకోసం వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళకండి” అని హెచ్చరించింది. రోజులు గడుస్తున్నాయి. ఓసారి ఆ గుంపులో ఒక పక్షికి ధాన్యం బస్తాలతో అటుగా వెళ్తున్న బళ్ళు కంటబడ్దాయి. ‘ఆహా! ఎన్ని గింజలో!!’ అనుకుంది. ఈ దారిలో చాలా గింజలు దొరుకుతాయన్నమాట, ఎక్కువ కష్టపడక్కర్లేదు అనుకుంది. ఈ సంగతి మిగతా వాటికి తెలిస్తే అవన్నీ కూడా ఇటుగానే వచ్చేస్తాయి, అలా జరగకుండా చూస్తాననుకుంటూ గూటికి చేరింది. మర్నాడు గింజల వేటకి బయలు దేరుతూ అందరినీ ఉద్దేశించి "ఇదిగో నా మాట కాస్త వినండి. మనం ఉంటున్న ఈ ప్రదేశానికి కాస్త దూరంలో పెద్ద పెద్ద బళ్ళు ధాన్యం గింజలు తీసుకుపోతూ కనిపిస్తాయి.అటుగా గానీ వెళ్ళేరు , కష్టాల్లో పడగలరు
చాలా రద్దీగా ఉండే ఆ బాటలో ఏ బండి కిందో పడొచ్చు, లేదా ఆ బండి మీద వాళ్ళు దాడి చెయ్యవచ్చు. అతిగా ఆశ పడకండే! ప్రాణానికే ప్రమాదం" అంటూ జాగ్రత్తలు చెప్పింది. తను ఈ పూటకి బయటకు రాలేననీ, కాబట్టి తనకు జతగా ఎవరూ రావక్కర్లేదనీ చెప్పింది. సరే అనుకుని మిగతా పక్షులన్నీ గింజల వేటకి వెళ్ళిపోయాయి. ఎవ్వరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాక, తను మాత్రం ఆ ధాన్యం బళ్ళు తిరిగే బాటకు బయలుదేరింది. ఆ బాటలో కింద పడిన గింజలన్నీ కడుపు నిండా ఆరగించింది.
అంతలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అటుగా ఓ పేద్ద బండి వస్తోంది. ఆ బండి ఇంకా చాలా దూరంలో ఉందనుకుంది. మరి కాసిన్ని గింజలు తీసుకుని గూటికి చేరుకుందామనుకుంది. అంతలోనే ఆ బండి పక్షి దగ్గరకు రావడమూ, పక్షి మీదుగా వెళ్ళి పోవడమూ, ఆ పక్షి బండి చక్రాల కింద పడి చనిపోవడమూ జరిగిపోయాయి. ఆ సాయంత్రం గూళ్ళకి చేరిన పక్షులన్నీ పక్షిరాజు దగ్గర గింజలు పంచుకోవడానికి సమావేశమయ్యాయి. అందులో ఈ పక్షి కనిపించక పోయే సరికి ‘అదేమిటి? అసలు బయటకే రాలేనంది, ఈ కొత్త ప్రదేశంలో ఎక్కడైనా తప్పిపోయిందేమో చూసి రమ్మని’ పక్షిరాజు ఆదేశించేసరికి, వెతకడానికి వెళ్ళిన వాటికి, చనిపోయి పడి ఉన్న పక్షి కనిపించింది. అప్పుడు పక్షి రాజు
"అందరికీ నీతులు, జాగ్రత్తలు చెప్పి తనే ప్రాణాలు పోగొట్టుకున్న ఈ పక్షి జీవితం మీ అందరికీ ఓ గొప్ప గుణపాఠం. ఇతరులకి మనం ఏమైనా నీతులు, జాగ్రత్తలూ వంటివి చెప్పేటప్పుడు మనం ఆచరించి చూపాలి " అంది.

తనకు మాలిన పనులు

మగధ దేశంలో అరిదుర్గము అను పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో శుభదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు కోటీశ్వరుడు. కాని సంతానం లేదు. అందువలన అతడు తరచు ధనధాన్యములను దానం చేసే వాడు. అనేక కొలనులను కట్టించాడు. దేవాలయములను నిర్మించాడు.
అరిదుర్గంలో ఒక ప్రాచీన దేవాలయం ఉండేది. అది పూర్తిగా శిధిలమైపోయింది. దానిని పునఃనిర్మాణం చేయాలని శుభదత్తుడు సంకల్పించాడు. దాని కోసం అనేక మంది వడ్రంగులను పిలిపించి, తగిన జీతములను ఇచ్చి, గుడిని నిర్మించమని అడిగాడు. వారు గుడికి కావలసిన దూలములు, తలపులు, ద్వారములు తయారు చేయసాగారు.
ఒక రోజు వడ్రంగులు ఒక పెద్ద దూలాన్ని నిలువుగా రంపంతోకోస్తూ, అది సులభంగా చీలుటకు వీలుగా అక్కడక్కడ మేకులను దిగకొట్టారు. మధ్యాహ్న భోజన సమయాంలో వారందరు భోజనానికి వెళ్ళారు.
గుడికి సమీపంలో ఒక చెట్టు మీద అనేక కోతులు ఉన్నాయి. అవి క్రిందకు దిగి గుడి గోడలు ఎక్కి ఆడుకోసాగాయి. వాటిలో కొన్ని చెట్టుకొమ్మలపై తలక్రిందులుగా వ్రేలాడుతూ, ఇతర కోతులను వెక్కిరిస్తూ ఆనందించసాగాయి. వాటిలో ఒక ముసలికోతి సగం బయటబడిన దూలం పైన అటు ఒక కాలు, ఇటొక కాలు వేసి కూర్చొన్నది. దాని తోక దూలం మధ్యలో నున్న చీలికలో వ్రేలాడుతున్నది. కోతి దూలంలో దిగగొట్టిన మేకును బలవంతముగా ఊడదీసింది. దాని వలన చీలి ఉన్న దూలం ఒక్కటైపోయి, కోతి తోక, వేలు దానిలో ఇరుక్కుపోయి నలిగిపోయాయి.
కోతి ఆ బాధను భరించలేక ఏడ్చింది. చివరకు బాధను తట్టుకోలేక చనిపోయింది.
అందుకే అనవసరమైన పనులజోలికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోరాధని పెద్దలు చెబుతారు.

నీచులతో స్నేహం

భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో "జరద్గవము" అను ముసలి గద్ద నివసిస్తుండేది. పాపం ఆగద్దకు కళ్ళు కనిపించవు. అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది.
ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి. ఆ ఆహారంతో గ్రద్ద జీవిస్తూ ఉండేది.ఓకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టువద్దకు నిశబ్దముగా చేరింది. దనిని చూచిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి. వాటి అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. "ఎవరక్కడ?" అని గట్టిగా అరచింది.
గద్దను చూచి పిల్లి భయపడింది. దనికి తప్పించుకొనే అవకాశం లేదు. అందువలన అది వినయంగా గద్దతో "అయ్యా! నా పేరు దీర్ఘకర్ణుడు. నేనొక పిల్లిని. మీ దర్శనము కొరకు వచ్చాను" అన్నది.
గద్ద కోపంగా "ఓ మార్జాలమా! వెంటనే ఇచటి నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు"అన్నది. పిల్లి గద్దతో "అయ్యా మీరు పెద్దలు. మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను."
పిల్లి జాతిలో పుట్టినా నేను రోజు గంగలో స్నానం చేస్తాను, కేవలం శాకాహరం తింటూ జీవిస్తున్నాను. మాంసాహారం మానివేసిచాంద్రాయణ వ్రతంను ఆచరిస్తున్నాను.

ఉపాయంతో గెలుపు కధలు

యమునా నది ఒడ్డున ఒక అందమైన వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తుండేది. ఆ మర్రిచెట్టు క్రింద ఒక పుట్ట ఉన్నది.
ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటుండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తుండేవి. ఈ విధంగా చాలా సార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది.
కాకి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే ఒక నక్క చూసింది. అది కాకిని సమీపించి " కాకి బావ కాకి బావ! ఎందుకు ఏడుస్తున్నావ్ నీకు వచ్చిన సమస్య ఏమిటి? " అని అడిగింది. కాకి నక్కతో " నక్క బావా నక్కబావా నా గర్భశొకాన్ని ఎవరితో చెప్పుకొనేది నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అని కావ్ కావ్ మని అరుస్తుంటే విని ఆనందించాలను కున్నాను. కాని నాకు ఆ అదృష్టం లేదు" అని బాధపడింది.
నక్క కాకితో "మీ పక్షులు గుడ్లు పెట్టడం, వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా! "అన్నది.
కాకి "నిజమే కాని నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది" అని బధతో అన్నది.
నక్క "మరి ఆ పాముని చంపబోయావా?" అన్నది. ఆ పని నా వల్ల కాదుకదా" అన్నది కాకి.
అప్పుడు నక్క " శత్రువు బలవంతుడైనప్పుడు ఉపాయముతో అతనిని తప్పించాలి " అని నక్క వెళ్ళిపోయినది కాకి చాలా సేపు ఆలోచించినది. దానికి చక్కటి ఉపాయం తట్టింది. యమునకు సమీపమున విలాసధామం అను పట్టణం ఉన్నది. ఆపట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి ఆమె చెలికత్తెలు ఆ కొలనుకి వచ్చి జలక్రీడలు ఆడతారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులో దిగారు. కాకి రాణి గారి ముత్యాలా హారాన్ని ముక్కున కరచుకొని ఎగిరింది. చెలికత్తెలు దానిని గమనించి భటులను హెచ్చరించారు. రాజభటులు కాకి వెంటబడ్డారు.
కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్టవద్దకు వచ్చింది రాజభటులు కూడా దానిని వెంబడిస్తూ పుట్ట దగ్గరకు చేరారు. అపుడు కాకి ముత్యాలహారాన్ని పుట్టలో వేసి, చెట్టుపైకి ఎగిరింది. రాజభటులు హారంకోసం పుట్టను త్రవ్వారు. అపుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని ఈటెలతో పొడిచి చంపారు. భటులు ముత్యాలహారం తీసుకొని వెళ్ళిపోయారు.
పాము పీడ వదలినందుకు కాకుల జంట సంతోషించాయి.

క్యారెట్ అట్టు

కావలసిన పదార్థాలు

  • క్యారెట్లు.పెద్దవి 2
  • ఉల్లిపాయలు. 4
  • పచ్చిమిర్చి. 2
  • కారం. 1 టీస్పూ//.
  • బేకింగ్ సోడా. చిటికెడు
  • గరంమసాలా. 1 టీస్పూ//.
  • కస్టర్డ్ పౌడర్. 2 టీస్పూ//. .
  • చైనా ఉప్పు. 8 పలుకులు
  • కొబ్బరిపొడి. 4 టీస్పూ//.
  • లెమన్ ఎల్లో కలర్. తగినంత
  • ఉప్పు. సరిపడా
  • దోశె పిండి. కావాల్సినంత

తయారీ విధానం

క్యారెట్‌ని బాగా సన్నగా తురుముకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగి. క్యారెట్‌తోపాటు కలుపుకోవాలి.
దీనికి గరంమసాలా, కస్టర్డ్ పౌడర్, చైనా ఉప్పు, కొబ్బరి పొడి, లెమన్ ఎల్లో కలర్, కారం, బేకింగ్ సోడా, ఉప్పులను కూడా కలపాలి.
మామాలుగా దోశెలు వేసేందుకు వాడే పిండిలో పై ముద్దను వేసి బాగా కలియబెట్టి దోశెలు పోయాలి.
అయితే ఈ దోశెలను నేతితో మాత్రమే కాల్చాలి. అలాగే, వీటిని తినేటప్పుడు వెన్నపూసను రాసి తరువాత తినాలి.

కుమార షష్ఠి విశిష్టత

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి (5,6 తేదీల్లో) రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే.
శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు.
ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం... ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు.
అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.
పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. 


కుజుడు - సుబ్రహ్మణ్య స్వామి
కుజుడు కోపానికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఒక మామిడి పండు విషయంలోనే తల్లితండ్రుల పై అలిగి కోపగించి పళని కి ఏగిన విషయం విదితమే. ఇక కుజుడు అగ్నికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి తొలూత శివుని మూడవ కంటనుండి 6 నిప్పు రవ్వలుగా బయటపడ్డాడన్నది పురాణం. కుజుడు క్రిమి కీటకాదులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల కణాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా దేవుళ్లకే సైన్యాధిపతి. కుజుడు ఆయుధాలకు కారకుడు. గుహుడు తన పండ్రెండు చేతుల్లోను ఆయుధాలు కలిగి ఉంటాడుగా. ఇలా కుజ గ్రహానికి ,గుహబ్రహ్మ అయిన సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో సంబంధాలున్నాయి. అందుకే కుజ దోషం వలన కలిగే రుగ్మతలకు ఉపశమనం కోరువారు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలని సూచించియున్నాం.
మూలమంత్రం:
ఓం సౌం శరహణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమహ
భీజం:
సౌం.
స్వామి !
సుబ్రహ్మణ్యస్వామి ని పూజిస్తే కుజ దోషం కారణంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది.

స్కందుని జననము, వృత్తాంతము:
కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన. తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు. జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.
పఈ సుబ్రహ్మణ్య లక్షణాలు అన్నీ సంపుటంగా ఈ ధ్యాన శ్లోకంలో వివరించ బడ్డాయి.
శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం ,
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి
గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం :

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పంకజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౧

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౨

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౩

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండితదివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౪

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౫

హారాదిరత్న మణియుక్తత కిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౬

పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౭

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్
సిక్త్వా తు మా మవ కళాధరకాంతకంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౮

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి. ౯

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్

 

సుబ్రహ్మణ్య తత్వం
దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు. గుళ్ళ సంగతి పక్కకు పెట్టి, సుబ్రహ్మణ్య తత్త్వము గురించి కొంచెం చెప్పుకుందాం.
అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.

 



అయ్యప్ప పూజ

దీక్షలో పాటించవలసిన నియమాలు :

దీక్షా కాలమందు బ్రహ్మచర్యము పాటించవలెను.
ప్రతి దినము ఉదయము సూర్యోదయమునకు ముందు సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత చన్నీటి స్నానము ఆచరించవలెను.
శుభ, అశుభ కార్యములందు పాల్గొనరాదు.
గురుస్వామి ఆజ్ఞలను పాటించవలెను.
శాఖాహారము మాత్రమే భుజించవలెను.
శవము ఎదురైన వెంటనే తలస్నానము చేయవలెను.
మత్తు పానీయములు సేవించరాదు.
నల్ల దుస్తులు మాత్రమే అయ్యప్పలకు శ్రేష్టము.
కుల, మత బేధములు పాటించరాదు.
ధూమపానము తాంబూలములు సేవించరాదు.
ఇరుముడి కట్టుకొనుటకు 41 రోజుల దీక్ష పూర్తి చేసి ఉండవలెను.
దీక్షా కాలములో ఏ విధమైన అనుమానము వచ్చినను గురుస్వామివారిని అడిగి తెలుసుకొనవలెను.
దీక్షలో ఉన్న అయ్యప్పలు తమ శక్తి కొలది తోటి అయ్యప్పలకు ఇంటి యందు భిక్ష పెట్టవలెను.
అహంకారము, ఆడంబరములు వదలి మామూలు జీవితము గడుపవలెను.
ఉదయం, సాయంకాలము తప్పక శరణుఘోష చేయవలెను.
ప్రతి అయ్యప్ప రాత్రివేళల్లో అయ్యప్పకు పవళింపుసేవ చెయ్యాలి.
ఎన్నిసార్లు అయ్యప్పను దర్శించిన వారైనా తోటి అయ్యప్పలను గౌరవించవలెను.
స్త్రీలలో బాలికలు 10 సం. లోపు పెద్దలకు 50 సం.లు పైబడి వయస్సు ఉన్నవారు మాత్రమే మాలాధారనకు అర్హులు.
బహిష్టు అయిన స్త్రీని చూడడము, వారి మాటలు వినడము చేయరాదు. అటుల చూచిన వెంటనే స్నానము చేసి శరణుఘోష పలుకవలెను.
41 రోజుల వ్రత దీక్షలో పూర్తిగా ఆధ్యాత్మిక చింతన అలవరుచుకొనవలెను.
గోళ్ళు తీయుట, వెంట్రుకలు కత్తిరించుట చేయరాదు.
ఆహారం సేవించునపుడు సాధ్యమైనంత వరకు ఉప్పు, కారం తగ్గించవలెను.
భోజనము ఒక పూట మాత్రమే ( మధ్యాహ్నం ) చేయవలెను.
ప్రతివారిని " స్వామి " అని మాత్రమే సంభోదించవలెను. పిల్లలను " మణికంఠ " అని సంభోదించవలెను.
బాలికలను, స్త్రీలను 'మాత' అని, భార్యను 'మాలికాపురత్తమ్మ' అని సంభోదించవలెను.
రాత్రి అల్పాహారం లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకొనవలెను.
పాదరక్షలు ధరించరాదు. చిరుతిళ్ళు తినరాదు. ఏ విధమైన చెడుఅలవాట్లు ఉండరాదు.
పడుకునేటప్పుడు పరుపు, దిండ్లు ఉపయోగించరాదు. చాపమీద మాత్రమే పడుకొనవలెను.
దీక్షలో వారు వారి ఇంటిలో ఎవరైనా మరణించిన వారి వద్దకు వెళ్ళరాదు. అటుల వెళ్ళవలసి వచ్చిన, మాలను గురుస్వామితో తీయించి స్వామి ఫొటోకి వేయవలెను. ఆ సంవత్సరము అతను శబరిమల యాత్ర చేయరాదు.
స్వామి దీక్షలో ఉన్నప్పుడు పగలు ఎంత మాత్రము నిద్రించరాదు.
నిరంతరం శరణుఘోష జపించవలెను. "స్వామియే శరణం అయ్యప్ప" అను వేదమంత్రోచ్ఛారణ నిరంతరము జపించవలెను.
తాను చేయు ప్రతికార్యమును , ప్రతి జీవిలోను అయ్యప్ప భగవానుని దర్శించుచుండవలెను.
ప్రతి స్త్రీ (భార్యసైతము) దేవి స్వరూపమే.
అయ్యప్ప ఎల్లపుడు విభూది, చందనం, కుంకుమ బొట్టులతో విలసిల్లుచూ, అస్కలిత బ్రహ్మచర్యము అవలంభించవలెను.
ఎదుటివారిని తన యొక్క మాటల, చేతల వలన గాని నొప్పించక ఎల్లపుడూ దయ, శాంతమును కలిగి యుండవలెను.
'మానవ సేవయే మాధవ సేవ' అన్న సూక్తిని మరువక తోటివారికి సాధ్యమైనంత వరకు సహాయ పడుట అయ్యప్ప కర్తవ్యము.
నియమములను క్రమం తప్పకుండా ఆచరించు భక్తులను శబరిమల సన్నిధానమందు పదునెట్టాంబడి నెక్కు అర్హత కలుగును. భగవత్ సాక్షాత్కారము లభించును. శబరి యాత్ర ఫలితమును పొందగలరు.

కన్నెస్వాములకు కొన్ని ముఖ్య సూచనలు :
అయ్యప్పలు వ్యర్థ ప్రసంగములు చేయరాదు.
అయ్యప్పలు చెప్పినట్లు యాత్రలో అనుసరించవలెను. కాని బృందాన్ని వదలి ముందుకు నడవరాదు. ఆ భక్త సమూహంలో తప్పిపోయిన గుర్తు పట్టడం చాలా కష్టమౌతుంది.
ఇరుముడి నెత్తిపై పెట్టుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కాని, వెళుతున్నాని కాని, కుటుంబసభ్యులకు కాని మరెవ్వరికి చెప్పరాదు.
ఇరుముడిని శిరస్సుపై వుంచుకుని చిరుతిళ్ళు తినుట వంటివి చేయరాదు.
ఇరుముడిని కన్నె అయ్యప్పలు ఎట్టి పరిస్థితులలోను దించుకొనరాదు. అవసరమైతే బృందంలోని అయ్యప్పలే ఇరుముడిని క్రిందకు దించుతారు. బృదంలోని వారు కాక యాత్ర చేసే వేరే అయ్యప్పలెవరైనా సాయం చేయవచ్చును.
కన్నె అయ్యప్పలలో భక్తితో మహత్తర శక్తి నిబిడీకృతమై వుండుట వలన ఉత్సాహముతో ఉరకలు వేయడానికి మనసు ఆరాటపడుతుంది. కాని ఎట్టి పరిస్థితులలోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు.
యాత్రలో తినిబండారాలను అందరికీ పంచి పెట్టి తినాలి..
స్వామి శరణుఘోషను చెప్పుకుంటూ నడకను సాగించాలి.
యాత్రలో మనసును అయ్యప్పస్వామి పైనే లగ్నము చేయాలి.
యాత్రలో ఆలయములు, పుణ్యక్షేత్రములు దర్శించేటప్పుడు అందరితో కలసి దర్శించవలెను. కాని వేరుగా పూజలు జరపించరాదు. అందరితో కలసి వెళ్ళాలి. ఎవరిదారిన వారు వెళ్ళకూడదు.
స్నానము చేయునపుడు విలువైన వస్తువులు, డబ్బు మిగిలినవన్నీ అందరితో బాగా పరిచయము ఉన్న అయ్యప్పలకు ఇచ్చి వెళ్ళాలి.
కన్నె అయ్యప్పస్వాములు బృదంతో కాకుండా ఎప్పుడూ యాత్ర చేయరాదు. ఒంటరిగా కూడా వెళ్ళకూడదు.
సాటి అయ్యప్ప కనిపించనప్పుడు " స్వామిశరణం " అని చెప్పాలి. ఎవరినీ కూడా పేరుతో పిలవకూడదు. వారి వారి పేరు చివర 'అయ్యప్ప' అని కానీ 'స్వామి' అని కాని పిలవవలెను.
విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు విధి నిర్వహణలో అశ్రద్ధ చేయరాదు. పూజలకు, భజనలకు అవకాశము లేని యెడల చింతించక, వారి వారి విధులు నిర్వహిస్తూనే శరణు ఘోష మనసులో తలచుకున్నా చాలు.
పూజా, భజన సమయాలలో ఒంటి మీద చొక్కా ఉంచుకోకూడదు. తువ్వాలును మాత్రం నడుముకు చుట్టుకోవాలి.
అయ్యప్పలు లుంగీ పంచను పైకి మడచి కట్టుకోరాదు. ఒక వేళ విధి నిర్వహణలో అడ్డుగా ఉంటే పైకి కట్టుకొనవచ్చును.
మాలవేసినపుడు, భజన పూజ నిర్వహించునపుడు ఇరుముడి కట్టినపుడు , మాల తీయునపుడు, గురుస్వామికి అయ్యప్పలు వారి శక్తి కొలది దక్షిణ చెల్లించవలెను.
అయ్యప్పలు సాటి అయ్యప్పలకు ,గురుస్వాములకు, తల్లిదండ్రులకు పాదనమస్కారములు చేయవలెను.
అయ్యప్పలు గుడిలోనికి వెళ్ళగానే ఒంటిపై చొక్కావిప్పి స్వామివారిని దర్శించాలి.

మాలాధారణ మంత్రము :

మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను.
జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||

మాల విసర్జన మంత్రం :

మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను. అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||

దీక్షాపరులకు గమనిక

అయ్యప్ప దీక్షాపరులు పూజవిధానము మెదట గణపతిని పూజించి అనంతరము బ్రహ్మణ్యస్వామి ని అయ్యప్పస్వామిని విధిగా పూజిచవలెను. శరణుఘోష, శ్రీ అయ్యప్ప నినాదాలు, మరియు శ్రీ అయ్యప్ప స్వామి పంచరత్నములు విశేషాంశములలో పొందుపరిచినాము గమనింపగలరు.

శ్రీ పసుపు గణపతి పూజ


శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)
శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.
(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానం

ఘంటానాదం :

శ్లో || అగమార్ధంతు దేవనాం గమనార్ధంతు రక్షసాం కుర్యా
ద్ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనమ్,
ఘంటానాదం కృత్వా
( గంటను మ్రోగించి, అక్షింతలు, పువ్వులతో ధ్యానం చేయాలి.)

ధ్యానము :

శ్లో || అశ్యామ కోమల విశాల తనుం విచిత్ర
వాసోపసానం అరుణోత్పల వామహస్తం
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తార మిష్ట వరహం శరణం ప్రపద్యే

ఆవాహనమ్ :

భవద్భవం శివాతీతం భానుకోటి సమప్రభం
ఆవాహయామి భూతేశం భవానీ సుత ముత్తమం
శ్రీ హరిహరసుత గణపతిసోదర అయ్యప్ప స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి.
స్వామియే శరణం అయ్యప్ప.

ఆసనమ్ :

( అక్షింతలతో పూజించి ఆసనం చేయాలి )
అనేక హార సంయుక్తం నానామణి విరాజితం
రత్నసింహాసనం దేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం.
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆసనమ్ సమర్పయామి.

పాద్యమ్ :

స్లో || భూతనాధ నమస్తేస్తు నరకార్ణవతారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్థయ
శ్రీ హరిహరసుత లోకరక్షక అయ్యప్పస్వామినే నమః
పాద్యమ్ సమర్పయామి.

అర్ఘ్యమ్ :

( ఉద్దరణితో నీళ్ళు చల్లవలెను.)
జ్యేష్ట రూప నమస్తుభ్యం భస్మోద్ధూళిత విగ్రహ
జైత్రయాత్ర విభూతత్వం గృహాణార్ఘ్యం మయార్పితం
శ్రీ హరిహరసుత శబరిగిరీశ అయ్యప్పస్వామినే నమః
హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయమ్ :

జనార్థనాయ దేవాయ సమస్త జగదాత్మనే
నిర్మల జ్ఞాన రూపాయ గృహాణాచమనం విభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
శుద్దాచమనీయమ్ సమర్పయామి.
( అని ఉద్దరణితో నీళ్ళు పళ్ళెంలో విడువవలెను.)

పంచామృత స్నానం :

( పాలుతో అభిషేకం )

శ్లో || ఓం అప్యాయస్వ సమేతు తే విశ్వతోస్సోమ వృష్టియం
భవా వాజస్య సంగథే క్షీరేణ అనాపయామి.

( పెరుగుతో అభిషేకం )

ఓమ్ దది క్రావుణ్ణోఆకారిషం జిష్ణోరశ్వస్య వాజివః
సురభిణో ముఖాకార త్ప్రాణ ఆయూగంషి తారిషత్ ద్ధి స్నపయామి.

( నెయ్యితో అభిషేకం )

ఓం శుక్రమపి జ్యోతిరపి, తేజోసి దేవోవస్పవి
తోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణవసోస్సూర్యస్యరశ్మిభిః అజ్యేన స్నపయామి.

( తేనె తో అభిషేకం )

ఓమ్ మధువతా ఋతయతే మదుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సవంత్వోషధీః మధునక్తముతో షపి మధుమత్పార్ధివగంజః
మధు ధ్యౌరస్తునః పితా, మధు మాన్నోపవనస్సతి ర్మధుమాగం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః మధునా స్నపయామి.

( పంచదారతో అభిషేకం )

ఓం స్వాధుః వపస్వదివ్యాయ జన్మనేస్వా ద్రింద్రాయ
మహాస్వాదు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ
వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః శర్కరయా స్నపయామి.

ఫలోదకం (కొబ్బరినీళ్ళు)

యాః ఫలినీర్యా ఫల పుష్పాయశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
ఫలోదకేన స్నపయామి.
పంచామృత స్నానానంతరం

శుద్ధోదక స్నానం

తిర్ధోదకైః కాంచన కుంభం సంస్థైస్సు
వాసితైరథేవ కృపారసాద్రైః
మయా ర్ఫితంస్నాన విధిం
గృహాణ పాదాబ్జనిష్ఠుత్వ నదీ ప్రవాహ
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.

వస్త్రమ్ :

విద్యు ద్విలాస రమ్యేణ స్వర్ణ వస్త్రేణసంయుక్తం
వస్త్రయుగ్మం గృహాణేదం భక్త్య దత్తం మయాప్రభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
వస్త్రం సమర్పయామి.
( అని వస్త్రాన్ని స్వామికి సమర్పించాలి.)

యజ్ఞోపవీతమ్ :

రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం
యజ్ఞోపవీతం గృహాణేదం భక్త్యా దత్తం మయా ప్రభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధమ్ :

సర్వభూత ప్రమధణ, సర్వజ్ఞ సకలోకోద్భవసర్వాత్మన్
సర్వభూతేశ సుగంధం సంగృహోణభో
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి.

ఆభరణం :

హిరణ్యహార కేయూర గ్రైవేయమణి కంకణైః
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

అక్షతలు :

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రామిశ్రితాన్ తుభ్యం గృహాణాసుర సంహార
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్పము :

అఘోర పరమ ప్రఖ్య అంచిత్యావ్యక్త లక్షణ
అనంతాదిత్య సంకాశం, పుష్పాణి ప్రతిగృహ్యతాం
ఈక్రింది నామములతో పుష్పములతో పూజింపవలెను.
ముందుగా గణపతిని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని, అమ్మవారిని పుష్పాక్షతలతో పూజించి తదుపరి అయ్యప్పను పూజించవలెను.

శ్రీ కన్నెమూల మహా గణపతి షోడశనామావళి

ఓం బాల గణపతయే నమః
ఓం తరుణ గణపతయే నమః
ఓం భక్త గణపతయే నమః
ఓం వీర గణపతయే నమః
ఓం శక్తి గణపతయే నమః
ఓం బ్రహ్మ గణపతయే నమః
ఓం పింగళ గణపతయే నమః
ఓం ఉచ్చిష్ట గణపతయే నమః
ఓం వినాయక పతయే నమః
ఓం క్షిప్ర గణపతయే నమః
ఓం హేరంబ గణపతయే నమః
ఓం లక్ష్మీ గణపతయే నమః
ఓం మహా గణపతయే నమః
ఓం విఘ్న పతయే నమః
ఓం నృత్త గణపతయే నమః
ఓం ఊర్ధ్వ గణపతయే నమః

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామావళి

పువ్వులు అక్షతలతో పూజించవలెను.
ఓం జ్ఞాన శక్త్యాత్మనే నమః
ఓం స్కంధాయ నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం బాహంలేయాయ నమః
ఓం గాంగేయాయ నమః
ఓం శరవణోద్భాయ నమః
ఓం కార్తికేయాయ నమః
ఓం కుమారాయాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం కక్కుట ధ్వజాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం గుహాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం షాణ్మాతరాయ నమః
ఓం క్రౌంఛభిదే నమః
ఓం శఖివాయ నమః

శ్రీ మాళిగాపురత్తమ్మ (లక్ష్మీ) దేవి షోడశ నామావళి.

కుంకుమ, పువ్వులు, అక్షతలతో పూజించండి.
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః
ఓం శర్వశ్య నమః
ఓం ఈశానస్య నమః
ఓం పశుపతేర్దేవస్య నమః
ఓం ఉగ్రస్య నమః
ఓం భీమస్య నమః
ఓం రుద్రస్య నమః
ఓం మహతో నమః
ఓం శ్రీ మహాగౌరీ దేవతాయై నమః
ఓం హరిద్రకుంకుమ పూజాం సమర్పయామి.

శ్రీ అయ్యప్పస్వామి అథాంగపూజ

పంపాలాయై నమః - పాదౌ పూజయామి.
గహ్యతి గుహ్యగోస్తే నమః - గుల్ఫౌ పూజయామి.
అంకుశధరాయ నమః - జానునీం పూజయామి.
ఉద్దామవైభాయ నమః - ఊరూ పూజయామి.
ఖండేందుకేళి తనయాయ నమః - కటిం పూజయామి.
హరిహరపుత్రాయ నమః - గుహ్యం పూజయామి.
దక్షిణామూర్తిరూపకాయ నమః - నాభిం పూజయామి.
వరదానకీర్తయే నమః - ఉదరం పూజయామి.
త్రిలోక రక్షకాయ నమః - వక్షస్థం పూజయామి.
మణిపూరాబ్జనిలయాయ నమః - పార్శ్వౌ పూజయామి.
పాశాస్తాయ నమః - హస్తాన్ పూజయామి.
మంత్రరూపాయ నమః - హృదయం పూజయామి.
వజ్రమాలాదరాయ నమః - కంఠం పూజయామి.
సూర్యకోటి సమప్రభాయ నమః - ముఖం పూజయామి.
గ్రామపాలకాయ నమః - గళం పూజయామి.
తీక్షదంతాయ నమః - దంతాన్ పూజయామి.
కారుణ్యమృత లోచనాయ నమః - నేత్రాణి పూజయామి.
రత్నకుండల ధారిణే నమః - కర్నౌ పూజయామి.
లాస్య ప్రియాయ నమః - లలాటం పూజయామి.
శ్రీశివప్రదాయ నమః - శిరః పూజయామి.
జటామకుట ధారిణే నమః - అలకాన్ పూజయామి.
శ్రీ హరిహరపుత్ర స్వరూప ధర్మశాస్త్రే నమః
సర్వాణ్యంగాని పూజయామి.
తదుపరి శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళిని చదువవలెను.
తదుపరి శరణు ఘోష చదువవలెను.

ధూపమ్ :

( అగరవత్తుల ధూపమును చూపించవలెను. )
ధూపమ్ నానాపరిమళం యక్షోర్ధమమిశ్రితం
దశాంగద్రవ్య సంయుక్తమంగేకురు మాయార్పితం
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ధూపమాఘ్రాపయామి. దూపం దర్శయామి.

దీపమ్ :

( అయ్యప్పకు దీపమును చూపించాలి.)
ఘృతాక్తవర్తి సంయుక్తం వహ్నినాయోచితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహాం
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః దీపం దర్శయామి.

నైవేద్యమ్ :

ఓమ్ భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య దీమహి ధియోయోనః
ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి.
అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః నైవేద్యం సమర్పయామి. 5 సార్లు నైవేద్యం చూపవలెను.
ఓం ప్రాణాయస్వాహా,
ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
ఓం అమృతాపిధానమపి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి
శుద్ధాచమనీయమ్ సమర్పయామి.

తాంబూలమ్ :

తమలపాకులు, వక్కలు, తాంబూలమును నెయ్యాభిషేక ప్రియుని వద్ద ఉంచాలి.
పూగీఫలైశ్చ స్సకర్పూరై ర్నాగవల్లీదళైర్యుతమ్
ముక్తాచూర్ణసమాయుక్తంతాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనమ్ :

( కర్పూరం వెలిగించి దేవునికి చూపించవలెను. )
చతుర్వర్తి సమాయుక్తం ఘృతేనచ సుపూరితం
నీరాజనం గృహాణేదం భూతనాథ జగత్పతే ( నాలుగు వత్తుల దీపములతో నీరాజనము చేయవలెను. )
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహేలక్ష్మీ
రాష్ట్రస్యయా మఖేతయామాసగం సృజామసి
సంతత శ్రీరస్తు సమస్తమంగ ళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీహరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం శుద్దాచమణీయం సమరపయామి.
హారతి పక్కన నీటి చుక్క వదిలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.

మంత్రపుష్పమ్ :

( చేతిలో పువ్వులు, అక్షింతలు పట్టుకొని ఈ మంత్రాన్ని చదువవలెను.)
నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాంకాయ త్రికాలాగ్ని
కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహ దేవాయ నమః
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
సువర్ణ దివ్య మంత్రపుష్పమ్ సమర్పయామి.

ప్రార్థన నమస్కారం :

బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వన్ధ్వాతీతతం గగన సదృశం తత్త్వమస్యాదిలక్ష్యం
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
తత్వాతీతం త్రిగుణ రహితం సద్గురం తం నమామి
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ప్రార్ధన నమస్కారం సమర్పయామి.

ఆత్మప్రదక్షిణ నమస్కారం :

3 సార్లు ప్రదక్షిణ చేయవలెను.
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత కారుణ్య భావేన రక్షరక్ష మణీకంఠా
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం :

ఉరసా శిరషా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి.

సర్వోపచారాలు :

ఛత్రమచ్ఛాదయామి - పుష్పములుంచవలెను.
చామరణ వీజయామి - పుష్పములుంచవలెను.
నృత్యం దర్శయామి - పుష్పములుంచవలెను.
గీతం శరావయామి - పుష్పములుంచవలెను.
ఆందోళికానారోహయామి - పుష్పములుంచవలెను.
అశ్వనారోహయామి - పుష్పములుంచవలెను.
గజానారోహయామి - పుష్పములుంచవలెను.
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే నమః
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవం పరిపూర్ణం తదాస్తుతే
అనయాధ్యానావాహనాది షొడశోపచారపూజయా భగవాన్ సర్వాత్మకః
సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
శ్రీ అయ్యప్ప అనుగ్రహ ప్రసాద సిద్దిరస్తు

అపరాధ క్షమాపణ :

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం
మయా దసీహ మితిమాం మత్వాక్షమస్వ
పరమేశ్వర ఆవాహనం నజానామి నజానామి
విసర్జనం పూజావిధం నజానామి క్షమస్వ
పరమేశ్వర సర్వాపరాధాన్ క్షమసత్వం
శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి.
( పూజ చేసిన అక్షతలు, పూలు తలపై వేసుకొనవలెను.)

తీర్ధము :

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం శ్రీ అయ్యప్ప పాదోదకం పావనం శుభం
స్వామికి సమర్పించిన వాటినే తీర్ధమును స్వీకరించాలి.
శ్రీ అయ్యప్ప స్వామి వారి పూజా విధానము సంపూర్ణము.


శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం మహాశాస్త్రే నమః
ఓం విశ్వశాస్త్రే నమః
ఓం లోకశాస్త్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం కాలశాస్త్రే నమః
ఓం మహాతేజసే నమః
ఓం గణాధిపాయ నమః
ఓం అంగపతయే నమః
ఓం వ్యాఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం మహాగుణగణాయ నమః
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలాహకాయ నమః
ఓం దుర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూరదృష్టే నమః
ఓం అనామయాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారాయ నమః
ఓం కాలాంతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః
ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః
ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదాలసాయ నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం మహాసర్ప విభూషిటహాయ నమః
ఓం మహాసురాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాప వినాశకాయ నమః
ఓం కపి హస్తాయ నమః
ఓం శరదరాయ నమః
ఓం హలహలధరసుతాయ నమః
ఓం అగ్ని నయనాయ నమః
ఓం అర్జునపతే నమః
ఓం అనంగ మదనాతురాయ నమః
ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజ రాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహనాయ నమః
ఓం వజ్రాంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గప్రాణయే నమః
ఓం బలోద్యతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పుష్కలేశాయ నమః
ఓం కృపాలయాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయాపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం పాషండ రుథి రాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర కుమారాయ నమః
ఓం పంచాక్షర పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధరసుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచినే నమః
ఓం కరీణామ్ధిపాయ నమః
ఓం కాంఢయజుషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్యధన్యాయ నమః
ఓం సత్సంతాప వినాశకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మ ధర్మాయ నమః
ఓం శూలినే నమః
ఓం కృపాలాయ నమః
ఓం వేనువదనాయ నమః
ఓం కంబు కంఠాయ నమః
ఓం కళరవాయ నమః
ఓం కిరీటాదివిభూషితాయ నమః
ఓం దూర్జటినే నమః
ఓం వీర నిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్రవందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిధార్థఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చతుర్భాహువే నమః
ఓం పరిపాపవిమోచకాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం నాగాలంకార నమః
ఓం నానారత్న విభూషితాయ నమః
ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి.

శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి

ఓం వినాయకాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గౌరీపుత్రాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూతాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం అధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం అగ్నిగర్భిచ్ఛిదే నమః
ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః
ఓం వాణీప్రదాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం శర్వతనయాయ నమః
ఓం శర్వరీప్రియాయ నమః
ఓం సర్వాత్మకాయ నమః
ఓం సృష్టికర్త్రే నమః
ఓం దేవాయ నమః
ఓం అనేకార్చితాయ నమః
ఓం శివాయ నమః
ఓం శుద్దాయ నమః
ఓం బుద్ది ప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం గజాననాయ నమః
ఓం ద్వైమాత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బాహువే నమః
ఓం శక్తిసంయుతాయ నమః
ఓం లమ్బోదరాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హరయే నమః
ఓం బ్రహ్మవిదుత్తమయ నమః
ఓం కాలాయ నమః
ఓం గ్రహపతయే నమః
ఓం కామినే నమః
ఓం సోమ సూర్యాగ్ని లోచనాయ నమః
ఓం పాశాంకుశదరాయ నమః
ఓం చండాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం నిరఞ్జ్ఞనాయ నమః
ఓం అకల్మశాయ నమః
ఓం స్వయంసిద్ధాయ నమః
ఓం సిద్ధార్చితపదామ్బుజాయ నమః
ఓం బీజ పూర ఫలాస్తకాయ నమః
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం కృతినే నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం గదినే నమః
ఓం చక్రిణే నమః
ఓం ఇక్షు చాపధృతే నమః
ఓం శ్రీదాయ నమః
ఓం అజాయ నమః
ఓం ఉత్పలకరాయ నమః
ఓం శ్రిపతయే నమః
ఓం స్తుతిహర్షితాయ నమః
ఓం కులాద్రిభేత్త్రే నమః
ఓం జటిలాయ నమః
ఓం కలికల్మషనాశనాయ నమః
ఓం చంద్రచూడామణయే నమః
ఓం కాంతాయ నమః
ఓం పాపహారిణే నమః
ఓం సమాహితాయ నమః
ఓం ఆశ్రితాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం సామ్యాయ నమః
ఓం భక్తవాఞ్చతదాయకాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం కైవల్యసుఖదాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం దయాయుతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
ఓం శ్రీకణ్ఠాయ నమః
ఓం విబుధేస్వరాయ నమః
ఓం రమార్చితాయ నమః
ఓం నిధయే నమః
ఓం నాగరాజయజ్ఞోపవీతయే నమః
ఓం స్థూలకణ్ఠాయ నమః
ఓం స్వయంకర్త్రే నమః
ఓం సామఘాషప్రియాయ నమః
ఓం పర్టస్మై నమః
ఓం స్థూలతుండాయ నమః
ఓం అగ్రణ్యై నమః
ఓం ధీరాయ నమః
ఓం వాగీశాయ నమః
ఓం సిద్దిదాయకాయ నమః
ఓం దుర్వాబిల్వప్రియాయ నమః
ఓం అవ్యక్తమూర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే నమః
ఓం శైలేన్ద్రతనూజ్యోత్లఖేల నమః
ఓం నోత్సుకమాన్సాయ నమః
ఓం స్వలావణ్యసుధాసారజిత నమః
ఓం మన్మథ విగ్రహాయ నమః
ఓం సమస్తహజగదాదారాయ నమః
ఓం మాయినే నమః
ఓం మూషికవాహనాయ నమః
ఓం హృష్టాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం పసన్నత్మనే నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి

ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం ఆదిశేషాయ నమః
ఓం మహాత్మే నమః
ఓం అహయే నమః
ఓం అహమే నమః
ఓం వృషాకపే నమః
ఓం భుజగాయ నమః
ఓం వ్యాళాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం వాసుకయే నమః
ఓం తక్షకాయ నమః
ఓం కాద్రవేయాయ నమః
ఓం ఫణామణి విభూషితాయ నమః
ఓం తీక్ష దంష్ట్రాయ నమః
ఓం శంఖపాలాయ నమః
ఓం కాలింగాయ నమః
ఓం భూధరాయ నమః
ఓం ఫణినే నమః
ఓం ద్విజిహ్వాయ నమః
ఓం గూఢప్దే నమః
ఓం చక్రిణే నమః
ఓం కంతిమంతాయ నమః
ఓం భుజంగమాయ నమః
ఓం కాకోదరాయ నమః
ఓం చండకోపినే నమః
ఓం పన్నగాయ నమః
ఓం శివభుషణాయ నమః
ఓం పాతాళవాసినే నమః
ఓం బ్రహ్మస్తుతాయ నమః
ఓం అశీర్విష్ఠాయ నమః
ఓం దందశూకాయ నమః
ఓం దీర్ఘవృష్టాయ నమః
ఓం భిలేశయాయ నమః
ఓం సువర్ణారయే నమః
ఓం శివాయ నమః
ఓం స్వామినే నమః
ఓం సుదాత్మనే నమః
ఓం అతిభీషణాయ నమః
ఓం చక్షుశరవనే నమః
ఓం హరిశ్చంద్రసుఖకృతే నమః
ఓం నలపీడకాయ నమః
ఓం బలినే నమః
ఓం కరళద్రంష్టాయ నమః
ఓం వేగవతే నమః
ఓం వాయుభక్షకాయ నమః
ఓం కర్కోటకాయ నమః
ఓం కరాళాన్యాసాయ నమః
ఓం వర్మిణే నమః
ఓం వేదవిప్రియాయ నమః
ఓం సుపుత్రదాయ నమః
ఓం సురారాధ్యాయ నమః
ఓం సహస్రవణ మండితాయ నమః
ఓం ఉరదేశాయ నమః
ఓం శివాహ్లాదినే నమః
ఓం శిపివేష్టేష్టగాయకాయ నమః
ఓం అతిప్రియాయ నమః
ఓం ఆలిక్షుదితాయ నమః
ఓం క్షీరాన్నసతత ప్రియాయ నమః
ఓం ధృతరాష్ట్రాయ నమః
ఓం క్షేమకారిణే నమః
ఓం పంగళాయ నమః
ఓం జిహ్మగాయ నమః
ఓం వరాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం వంద్యాయ నమః
ఓం వరదాయ నమః
ఓం భక్తాభీష్టసుఖప్రదాయ నమః
ఓం కోమలాంగాయ నమః
ఓం శుభవర్నాయ నమః
ఓం విమలాయ నమః
ఓం కోటరస్థితాయ నమః
ఓం మార్గశిరాచ్ఛష్డిజ్యాయ నమః
ఓం విషభృతే నమః
ఓం నిగమస్తుతాయ నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం నిరుపమాయ నమః
ఓం హరయే నమః
ఓం హింసాకరాయ నమః
ఓం శుచయే నమః
ఓం కామరూపాయ నమః
ఓం లేవిహానాయ నమః
ఓం విఘ్నేశోదరబంధనాయ నమః
ఓం గంగోద్భవాయ నమః
ఓం శివానందదాయనే నమః
ఓం నకులశాత్రవాయ నమః
ఓం నకృష్ణవాసుదేవతాగమనే నమః
ఓం వర్షాదివారణాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం రోగహృతే నమః
ఓం దేవాయ నమః
ఓం కుండలినే నమః
ఓం భువనేశ్వరాయ నమః
ఓం భోగినే నమః
ఓం భోగప్రదాయ నమః
ఓం భూతదాయినే నమః
ఓం భూభృతే నమః
ఓం భరయహరాయ నమః
ఓం భవ్యరూపధరాయ నమః
ఓం బాల బ్రహ్మచారిణే నమః
ఓం బలాధికాయ నమః
ఓం నిత్యానందననిరతాయ నమః
ఓం నిరవధ్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం జనాధారాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కాళీయాయ నమః
ఓం కుళికస్థిరాయ నమః
ఓం సర్పరాజాయ నమః
ఓం ఉమాపుత్రాయ నమః
ఓం వల్లీ సహిత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః


శ్రీ అయ్యప్ప శరణుఘోష

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం హరిహరసుతనే శరణం అయ్యప్ప
ఓం ఆపద్భాందవనే శరణం అయ్యప్ప
ఓం అనాధరక్షకనే శరణం అయ్యప్ప
ఓం అఖిలాండకోటిబ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
ఓం అయ్యప్పనే శరణం అయ్యప్ప
ఓం అరియంగావు అయ్యవే శరణం అయ్యప్ప
ఓం అర్చన్ కోయిల్ అరసే శరణం అయ్యప్ప
ఓం కుళుత్తపుళై బాలకనే శరణం అయ్యప్ప
ఓం ఎరుమేలిశాస్తావే శరణం అయ్యప్ప
ఓం వావరు స్వామినే శరణం అయ్యప్ప
ఓం కన్నెమూల మహా గణపతి భగవానే శరణం అయ్యప్ప
ఓం నాగరాజావే శరణం అయ్యప్ప
ఓం మాలికాపురత్తులోకదేవి మాతావే శరణం అయ్యప్ప
ఓం కరుప్పు స్వామియే శరణం అయ్యప్ప
ఓం సేవిప్పర్ కానందమూర్తియే శరణం అయ్యప్ప
ఓం కాశివాసియే శరణం అయ్యప్ప
ఓం హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప
ఓం రంగపట్టణవాసియే శరణం అయ్యప్ప
ఓం గొల్లపూడి ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
ఓం సద్గురు నాధనే శరణం అయ్యప్ప
ఓం విల్లాలి వీరనే శరణం అయ్యప్ప
ఓం వీర మణీకంఠనే శరణం అయ్యప్ప
ఓం ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
ఓం శరణుఘోషప్రియనే శరణం అయ్యప్ప
ఓం కాంతమలై వాసనే శరణం అయ్యప్ప
ఓం పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప
ఓం పంబాశిశువే శరణం అయ్యప్ప
ఓం పందళరాజ కుమారనే శరణం అయ్యప్ప
ఓం వావరిన్ తోళనే శరణం అయ్యప్ప
ఓం మోహిని సుతనే శరణం అయ్యప్ప
ఓం కణ్ కండదైవమే శరణం అయ్యప్ప
ఓం కలియుగ వరదనే శరణం అయ్యప్ప
ఓం సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణం అయ్యప్ప
ఓం మహిషి మర్థననే శరణం అయ్యప్ప
ఓం పూర్ణపుష్కలనాధనే శరణం అయ్యప్ప
ఓం వన్ పులి వాహననే శరణం అయ్యప్ప
ఓం భక్తవత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూలోకనాధనే శరణం అయ్యప్ప
ఓం అయిందుమలై వాసనే శరణం అయ్యప్ప
ఓం శబరిగిరీశనే శరణం అయ్యప్ప
ఓం ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప
ఓం అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం వేదప్పొరులే శరణం అయ్యప్ప
ఓం నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప
ఓం సర్వమంగళదాయకనే శరణం అయ్యప్ప
ఓం వీరాధి వీరనే శరణం అయ్యప్ప
ఓంకారప్పొరులే శరణం అయ్యప్ప
ఓం ఆనందరూపనే శరణం అయ్యప్ప
ఓం భక్తచిత్తాది వాసనే శరణం అయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూత గణాధిపతయే శరణం అయ్యప్ప
ఓం శక్తిరూపయే శరణం అయ్యప్ప
ఓం శాంతమూర్తియే శరణం అయ్యప్ప
ఓం పదునెట్టాంబడికి అధిపతివే శరణం అయ్యప్ప
ఓం కట్టాళ విషరామనే శరణం అయ్యప్ప
ఓం ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప
ఓం వేదప్రియనే శరణం అయ్యప్ప
ఓం ఉత్తర నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప
ఓం తపోధననే శరణం అయ్యప్ప
ఓం యంగల్ కులదైవమే శరణం అయ్యప్ప
ఓం జగన్మోహననే శరణం అయ్యప్ప
ఓం మోహనరూపనే శరణం అయ్యప్ప
ఓం మాధవ సుఅతనే శరణం అయ్యప్ప
ఓం యదుకుల వీరనే శరణం అయ్యప్ప
ఓం మామలై వాసనె శరణం అయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే శరణం అయ్యప్ప
ఓం వేదాంత రూపనే శరణం అయ్యప్ప
ఓం శంకర సుతనే శరణం అయ్యప్ప
ఓం శత్రు సంహారనే శరణం అయ్యప్ప
ఓం సద్గుణ మూర్తియే శరణం అయ్యప్ప
ఓం పరాశక్తియే శరణం అయ్యప్ప
ఓం పరాత్పరనే శరణం అయ్యప్ప
ఓం పరంజ్యోతియే శరణం అయ్యప్ప
ఓం హోమప్రియనే శరణం అయ్యప్ప
ఓం గణపతి సోదరనే శరణం అయ్యప్ప
ఓం మహాశాస్తావే శరణం అయ్యప్ప
ఓం విష్ణుసుతనే శరణం అయ్యప్ప
ఓం సకలకళా వల్లభనే శరణం అయ్యప్ప
ఓం లోకరక్షకనే శరణం అయ్యప్ప
ఓం అమిత గుణాకరనే శరణం అయ్యప్ప
ఓం అలంకార ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కన్నిమారై కాప్పవనే శరణం అయ్యప్ప
ఓం భువనేశ్వరనే శరణం అయ్యప్ప
ఓం మాతాపితా గురుదైవమే శరణం అయ్యప్ప
ఓం స్వామియిన్ పుంగావనమే శరణం అయ్యప్ప
ఓం అళుదానదియే శరణం అయ్యప్ప
ఓం అళుదామేడే శరణం అయ్యప్ప
ఓం కళ్ళిడం కుండ్రే శరణం అయ్యప్ప
ఓం కరిమళై ఏట్రమే శరణం అయ్యప్ప
ఓం కరిమలై ఇరక్కమే శరణం అయ్యప్ప
ఓం పెరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం చిరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం పంబా నదియే శరణం అయ్యప్ప
ఓం పంబాయిల్ విళక్కే శరణం అయ్యప్ప
ఓం నీలిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
ఓం అప్పాచ్చిమేడే శరణం అయ్యప్ప
ఓం శబరి పీఠమే శరణం అయ్యప్ప
ఓం శరంగుత్తి ఆలే శరణం అయ్యప్ప
ఓం భస్మకుళమే శరణం అయ్యప్ప
ఓం పదునెట్టాంబడియే శరణం అయ్యప్ప
ఓం నెయ్యిభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కర్పూర జ్యోతియే శరణం అయ్యప్ప
ఓం జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప
ఓం మకరజ్యోతియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ హరి హరసుతన్, ఆనందచిత్తన్, అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
.

శ్రీ అయ్యప్ప నినాదాలు

స్వామి శరణం – అయ్యప్పశరణం
భగవాన్ శరణం - భగవతి శరణం
దేవన్ శరణం - దేవీ శరణం
దేవన్ పాదం - దేవీ పాదం
స్వామి పాదం - అయ్యప్ప పాదం
భగవానే - భగవతియే
ఈశ్వరనే - ఈశ్వరియే
దేవనే - దేవియే
శక్తనే - శక్తియే
స్వామియే - అయ్యప్పో
ఏల్లికట్లు - శబరిమలక్కు
యిరుముడి కట్టు - శబరిమలక్కు
కట్టుంకట్టి - శబరిమలక్కు
కల్లుంముల్లుం - కాలికిమెత్తై
ఏందివిడయ్య - తూక్కి విడయ్యా
దేహబలందా - పాదబలందా
యారైకాణాన్ - స్వామియై కాణాన
స్వామియే కాండల్ - మోక్ష కిట్టుం
స్వామీ మారే - అయ్యప్పమారే
నెయ్యాభిషేకం - స్వామిక్కే
కర్పూర దీపం - స్వామిక్కే
ఆలాభిషేకం - స్వామిక్కే
భస్వాభిషేకం - స్వామిక్కే
తేనాభిషేకం - స్వామిక్కే
చంనాభిషేకం - స్వామిక్కే
పూలాభిషేకం - స్వామిక్కే
పన్నీరాభిషేకం - స్వామిక్కే

శ్రీ అయ్యప్ప పంచరత్నములు

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభు ప్రియంసుతం
క్షిప్ర ప్రసాద నిరతమ్ శాస్తారం ప్రణమామ్యహం
మత్తమతాంగ గమనం కారుణ్యామృత పూతం
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంశ తిలకం భారతీ కేళీ విగ్రహం
అర్తత్రాణ పరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
ఓం భూతనాధ సదానందః సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహూః శస్తారం త్వాం నమామ్యహం
పంచరత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్దః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తారం ప్రణమామ్యహం
అరుణోదయ సంకాశం నీలకుండల ధాణం
నీలాంబరదరమ్ దేవ - వందేహం బ్రహ్మనందనం
చాపబాణం వామహస్తే రౌప్యవేతన రజ్ఞదక్షిణే
విలసత్ కుండల ధరమ్ వందేహం విష్ణు నందనం
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్నమాలా విభూషణం
వీరాట్టధరం దేవం వందేహం నందనం
కింకిణి దండ్యాణ సద్భూషం పూర్ణ చంద్ర నిభాననం
కిరాత రూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూతభేతాళ సంపేవ్యం కాంచనాది నిభాననం
మణికంఠ మితిఖ్యాత వందేహం శక్తి నందనం
యస్య ధన్వంతరీ మాతా పితారుద్రోభీషక్ నమః
శాస్తారం త్వామహం వందే మహావైద్యం దయానిధిం
భూతనాధాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్.

మంగళం

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం
శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురవరాయ మంగళం దత్తాత్రేయ మంగళం
గజాననాయ మంగళం షడాననాయ మంగళం
రాజారామ మంగళం రామకృష్ణ మంగళం
సుబ్రహ్మణ్య మంగళం వేల్ మురగా మంగళం
శ్రీనివాసా మంగళం శివబాలా మంగళం
ఓం శక్తి మంగళం జై శక్తి మంగళం
శబరీశా మంగళం కరిమలేశ మంగళం
అయ్యప్పా మంగళం మణికంఠా మంగళం
మంగళం మంగళం శుభమంగళం
మంగళం మంగళం జయ మంగళం.

శ్రీ ధర్మశాస్త్ర హరిహరాసనం

( పవళింపు సేవ రాత్రి సమయంలో పాడాలి.)
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శరణకీర్తనం స్వామి శక్తిమానసం
భరణతోలుకం స్వామి నర్తనాలసం
ఆరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
తుర్గవాహనం స్వామి సుందరానానం
వరగదాయుధం స్వామి దేవవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళావాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
కలమృదుస్మీతం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||





సౌందర్య లహరి


గ్రంథ పరిచయం



జగన్మాతను ఆది శంకరాచార్యుడు స్తుతించిన అపూర్వ గ్రంధము సౌందర్యలహరి. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. సౌందర్య లహరి అంటే అమ్మవారి సౌందర్యం యొక్క తరంగాలు. హైందవ ధర్మానికి ఆది శంకరుడు ఇచ్చిన అద్భుతమైన వరం సౌందర్య లహరి.
సౌందర్య లహరి స్తోత్రా విర్భావం గురించి ఒక కధ చెప్పబడుతుంది. ఒకనాడు, ఆది శంకరుడు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఒక శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రింది నుండి చెరిపేశాడట. అది మానవులకు అందరాని అత్యంత గుహ్య విద్య గనుక గణేషుడు అలా చేసాడు. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. తను చదివిన 40 శ్లోకాలు, వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచనం చేసాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కధకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.
సౌందర్యలహరి ఒక ప్రక్రియలో చెయ్యబడ్డ శ్లోక మాలికగా చెప్పలేము. అది ఒక స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), ఇంకా ఒక కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. అందుకే సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
  • ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.
  • ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
  • ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
  • ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.
సౌందర్యలహరి రెండుభాగాలలో కనిపిస్తుంది - ఆనందలహరి మరియు సౌందర్యలహరి. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు ఉన్నాయి. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్ట పరుస్తున్నాయి. సౌందర్యలహరి అన్న పేరులో సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు కనిపిస్తున్నాయి.
సౌందర్యలహరిని తెలుగులోకి శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు అనువదించడం జరిగింది. ఆ అద్భుత శ్లోకరాజాన్ని ఇక్కడ మీకోసం పొందు పరిచాము.



1.ప్రథమ భాగము - ఆనంద లహరి

 


కైలాసము నుండి తేచ్చినవి

ఆనందలహరి అనబడు మొదటి భాగములో 41 స్లొకములు ఉన్నవి. వీనిని ఆచార్యులవారు కైలాసము నుండి తేచ్చినారని నమ్మకము.

1
శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మాపి |
అతస్త్వా మారాధ్యం హరిహర విరించా దిభి రపి
ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభావతి ||
భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?

2
తనీయాం సం పం సుంతవ చరణ పంకేరు హ భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా న వికలమ్ |
వాహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సక్షుద్వైనం భజతి భాసితో ద్దూళన విధిమ్ ||
దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు

3
అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.

4
త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ
స్త్వమేక నైవాసి ప్రకటతి వరాభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వంఛా సమాధికమ్
శరణ్యే లో కానాం తవ హి చరణా వేవ నిపుణౌ ||
తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.

5
హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్ |
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.

6
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా
వసంత స్సామంతో మలయ మరుదాయోధనరథః |
తథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపా
మాపాంగా త్తే లభ్ద్వా జగదిద మనంగో విజయతే ||
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.

7
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తన నతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధను ర్భాణా న్పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమధితు రాహోపురుషికా
శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.

8
సుధాసింధో ర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||
"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.

9
మహీం మూలాధారే కమపి మణిపురే హుతవహం
స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి |
మనో పి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహా రహసి పత్యా విహరసే ||
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.

10
సుధా ధారా సారై శ్చరణ యుగళాంత ర్విగళితై:
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసాః |
అవాప్య స్వాం భూమిం భుజగ నిభ మధుష్యవలయం
స్వమాత్మానాం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.

11
చాతుర్భిః శ్రీ కంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభి శ్శంభో ర్నవభిరపి మూల ప్రకృతిభిః |
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్ర త్రివలయ
త్రిరేఖాభి స్సార్థం తవశరణ కోణాః పరిణితాః ||
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

12
త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః |
యదా లోకౌత్సుక్యా ధమరలలనాయాంతి మనసా
తపోభిః దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీమ్ ||
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి

13
నరం వర్షీ యంసం నయనవిరసం నర్మసు జడం
త వాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః |
గళ ద్వేణీబంధాః కుచకలశ విస్త్రస్త సిచయాః
హఠాత్త్రు ట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః ||
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.

14
క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశ దుధకే
హుతాశే ధ్వాషష్టి శ్చతురిధిక పంచాశదనిలేః |
దివి ద్విషట్త్రింశ న్మనసి చ దుతుష్షష్ఠి రితి యే
మయూఖా స్తేషా మప్వుపరి తవ పాదాంబుజయుగం ||
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

15
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటమ్
వరత్రాసత్రాణస్ఫటిక ఘుటికా పుస్తక కరామ్
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.

16
కవీంద్రాణాం చేతః కమకవన బాలాతపరుచిం
భజన్తే యే సన్తః కతిచిదరుణా మేవ భవతీమ్
విరించి ప్రేయస్యాస్తరళతర శృంగారలహరీ
గభీరాభి ర్వాగ్భి ర్విదధతి సభారంజనమమీ
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.

17
సవిత్రీ భిర్వాచాం శశి మణి శిలా భంగరుచిభి
ర్వశిన్యా ద్యా భిస్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరిచిభిః
వచో భి ర్వాగ్ధేవీ వధన కమలా మోద మధురైః ||
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.

18
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్వద్వన హరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః ||
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.

19
ముఖం బిందుంకృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హకారార్ధం ధ్యాయే ద్దరమహిషి లే మన్మథకలామ్ |
స సద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాసు భ్రమయతి రవీందు స్తన యుగాం ||
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.

20
కిరంతీ మంగేభ్యః కిరణనికురుంబామృతరసమ్
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తి మివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయాః ||
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.

21
తటిల్లే ఖాతన్వీ తపనశశి వైశ్వానరమయీమ్
నిషణ్ణం షణ్ణామ ప్యుపరి కమలానాం తవ కలామ్ |
మహాపద్మాతన్యాం మృదితమలమాయేన మనసా
మహానద్తఃపశ్యన్తో దధతి పరమాహ్లాద లహరీమ్ ||
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.

22
భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణా
మితిస్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వంమితియః |
తదైవ త్వం తస్మైదిశసి నిజసాయిజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుతమకిత నీరాజతపదామ్ ||
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.

23
త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్థం శంభో రపర మపి శంకే హృత మభూత్ |
యద్తత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్
కుచాభ్యా మానమ్రం కుతిలశశిచూడాలమకుతమ్ ||
శివశక్తుల సంపూర్ణైక్యత

24
జగత్సూతే ధాతా హరి రవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేత త్స్వమపి వపు రీశ స్థిరయతి |
సదా పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః
తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతిక యోః ||
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.

25
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవే త్పూజా తవ చరణయోర్యా విరచితా |
తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్య న్ముకుళితకరో త్తంస మకుటాః ||
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.

26
విరించిః పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశాం
మహాసంసారేంస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ ||
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.

27
హపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిఃప్రాదక్షిణ్య హ్రమణ మశనాద్యాణ్యహుతివిధిః |
ప్రణామ స్సంవేశః సుఖ మభిలామాత్మార్పంఅదృశా
సపర్యా ప్ర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ||
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."

28
సుధా మప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్
విపద్యం తేవిశ్వే విధి శత మఖము ఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేళం కబళితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.

29
కిరీటం వైరించం హరిహర పుర కైటభభిదః
కఠోరే కోతీరే స్ఖలసి జహిజంభారి మకుటమ్ |
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముపయాతస్య భవనమ్
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.

30
స్వదేహోద్భూ తాభిర్ఘృణిభి రణిమాద్వాభి రభితః
నిషేవ్యే నిత్యేత్వా మహి మితి సదా భావయతి యః |
కి మాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ||
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.

31
చతుష్షష్ట్యా తం త్రై స్సకలమతి సంధాయ భువనమ్
స్థిత స్తత్తత్త్సిద్ధి ప్రసవపరతమ్ త్రైః పసుపతిః |
పునం స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థై కఘటనా
స్వతంత్త్రం తే తంత్రం క్షితి తల మవాతీతరదిదమ్ ||
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.

32
శివశ్శక్తిః కామః క్షితి రథః రవి శ్శీతకిరణః
స్మరో హమ్స శ్శక్ర స్తదనుచ పరామారహరయః |
అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ||
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)

33
స్మరంయోనిం లక్ష్మిం త్రితయమిద మాదౌతవమనో
ర్ని ధాయైకే నిత్యేనిరవధి మహాభోగ రసికాః |
భజన్తి త్వాం చింతామణి గుణ నిబద్దాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వాంతస్సురభిఘృతధారాహుతిశతైః ||
కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.

34
శరీరం త్వం శంభో శ్శశిమిహిరవక్షోరుహయుగమ్
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్ ||
అతశ్శేష శ్శేషీత్వయ ముభయ సాధారణతయా
స్థిత స్సంబంధో వాం సమరసపరానందపరయోః ||
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.

35
మనస్త్వం వ్యోమ త్వం మరు దసి మరుత్సారథి రసి
త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహిపరం |
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ||
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.

36
తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరమ్
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్యం పరచితా |
యమారాధ్య న్భక్త్వా రవిశశి మవిషయే
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే ||
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.

37
విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ - మపి శివ సమాన వ్యవసితామ్ ||
యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య
విధూతాం తర్థ్వాం విలసతి చకోరీవ జగతీ ||
విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.

38
సమున్మీల త్సంవిత్కమల మకరందైక రసికమ్
భజే సంసద్వంద్వం కిమపిమహతాం మానసచరమ్ |
యదాలాపా దష్టాదశ గుణిత విద్యా పరిణతిః
యధాద త్తేదోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ ||
అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి

39
తవ స్వాధిష్టానే హుతశాహ మధిష్టాయ నిరతమ్
త మీడే సంవర్తం జనని మహతిం తాంచ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతిః క్రోధకలితే
దయార్ద్రా యాదృష్టి శ్శిశిర ముపచారం రచయతి ||
స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ

40
తటి త్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా
స్పుర న్నానార త్నాభరణ పరిణద్థేంద్ర ధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హర మిహిరత ప్తం త్రిభువనమ్ ||
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని

41
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవనతమ్ |
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా
సనాభాధ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ ||
మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)

 

2.ద్వితీయ భాగము - సౌందర్యలహరి

 

 


ఆచార్యులవారు పూరించినవి

42వ శ్లొకము నుండి 59 శ్లొకములను ’సౌందర్యలహరి’ గా పరిగణింపబడుచున్నది. వీటిని ఆచార్యులవారే పూరించినారు.

42
గతైర్మాణిక్యత్వం గగన మణిభిః సాంద్రఘటితమ్
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః |
స నీడేయచ్ఛాయా చ్ఛురణ పటలమ్ చంద్రశకలమ్
ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ||
ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.

43
ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనమ్
ఘన స్నిగ్థ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌతభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మి న్మన్యే బలమథన వాటీ విటపినామ్ ||
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.

44
తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ
పరీవాహ స్తోత స్సరణిరివ సీమంతసరణిః |
వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర
ద్విషాం బృదైర్బందీకృత మిప నవీనార్కకిరణమ్ ||
దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.

45
అరాళైస్వాభావ్యా దళికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిరమ్ |
దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్క రుచిరీ
సుగంధౌమాద్యంతి స్మరదహన చక్షుర్మధుతిహః ||
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.

46
లలాటం లావణ్యద్యుతి విమల మా భాతి తపయత్
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసా దుభయ మపి సంభూయ చ మిధః
సుభాలేప స్యూతిః పరిణమతి రాకాహిమకరః ||
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించినది.

47
భ్రువౌ భుగ్నే ద్భువన భయ భంగవ్యసనీ
త్వదీయే నేత్రాభ్యాం మభుకరరుచిభ్యాం ధృత గుణమ్ |
ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతౌః
ప్రకోష్టే ముషౌచ స్థగయతి నిగూఢాన్తరముమే ||
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.

48
అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా
త్రియామం వామంతే సృజతి రజనీనాయకతయా |
తృతీయాతే దృష్టి ర్ధరదలిత హేమంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశమో రంతరచరీమ్ ||
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.

49
విశాలా కళ్యానీ స్ఫుటరుచి రయోధ్యా కునలయైః
కృపాథారా ధారా కిమపి మధురా భోగవతికా |
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే ||
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.

50
కవీనాం సందర్భ స్తబకమకరం దైకరసికం
కక్షటావ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం |
ఆముంచంతౌదృష్ట్వా తవనవర సాస్వా దతరళౌ
అసూయాసంసర్గా దళిక నయనం కించి దరుణం ||
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.

51
శివేశృంగారార్ద్రా తదితరజనేకిత్సు నపరా
సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజయనీ
సఛీషుస్మేరాతే మయిజనని దృష్టి స్సకరుణా ||
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు భీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.

 


నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...