Sunday, December 15, 2013

దైవ దర్శనం తర్వాత ఆలయంలో ఎందుకు కూర్చోవాలి? (What's The Reason For We areSitting After The Darshan Of God)

దైవ దర్శనం తర్వాత ఆలయంలో ఎందుకు కూర్చోవాలి? (What's The Reason For We areSitting After The Darshan Of God)

దైవ దర్శనం తర్వాత ఆలయంలో ఎందుకు కూర్చోవాలి? (What's The Reason For We areSitting After The Darshan Of God) 
సాధారణంగా ఆలయంలో దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిపేపు కూర్చొంటారు. ఇలా ఎందుకు కూర్చొంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్ది సేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెపుతున్నాయి.

స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌనధ్యానంతో, కొంతసమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్రసమ్మతమని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అనికాదు. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.

అలాగే, ఆలయ ప్రవేశానికీ కొన్ని నియమాలున్నాయి. ఆలయం ప్రవవేశించబోయే ముందు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్థు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా.. ఎవరివద్దా ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతనూ దేవాలయాల్లో చూపించరాదు.

దేవుడు అందరికీ దేవుడే. దైవకార్యాలకు అందరూ పెద్దలే. దైవప్రీతికి అందరూ పాత్రులే. దైవపూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. 

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

పూజలో హారతి ఉద్దేశ్యం

పూజలో హారతి ఉద్దేశ్యం


భగవంతుని పూజలో చేసే అనేక ఉపచారాలలో హారతి ఒకటి. దీనినే నీరాజనం అని కూడా అంటారు. దీపం లేదా దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజా విగ్రహానికి ముందు త్రిప్పడం హారతిలో ప్రధాన విషయం. ఇందుకు అనుబంధంగా సంగీతం వాయిస్తారు. పాటలు, శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. దీనిని "హారతి" లేదా "ఆరతి" అంటారు. హారతి సమయంలో భక్తులు పాట లేదా భజనలో పాలు పంచుకొంటారు. అనంతరం హారతిని కళ్ళకద్దుకొంటారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి వెలుగులో కనుల పండువుగా భగవంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. ఇది హారతి సంప్రదాయానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఒక కారణం కావచ్చును.


నేతి వత్తులతో హారతి ఇవ్వడంలో అనేక సంప్రదాయాలున్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై - ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. హారతి తరువాత మంత్రపుష్పం పూజ జరుగుతుంది.

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ప్రయోజనం ఏమిటి..?



 

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ప్రారంభించిన వ్యక్తికి తాను నమ్ముకున్న 

మార్గాన్ని మరింత బలపరిచే అనుభవాలు 


అవసరమవుతాయి. అటువంటి అనుభవం కోసం కొన్ని ప్రాంతాలను, 

వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 




ఇలా వెతుక్కుంటూ వెళ్ళటమే తీర్థయాత్ర. గతంలో ప్రజలు మునీశ్వరుల 

దగ్గరకు వెళ్ళి తమ సందేహాలను 

తీర్చుకునేవారు.



 


ఆ మహానుభావులున్న ప్రదేశాలే పుణ్యక్షేత్రాలయ్యాయి. అటువంటి శక్తి 

ప్రతిష్ఠించిన దేవతామూర్తుల ద్వారా 

లభిస్తుంది. ఆ విశేష స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల 

మానవుల మనసులో మార్పువస్తుంది. 

మారిన మనసు మనిషికి ప్రశాంతతను చేకూరుస్తుంది.


 


 పుణ్యక్షేత్రాల సందర్శన మనస్సు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు 

వ్యాపారాభివృద్ధి, అనుకున్న కార్యాలు 

దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

అక్షతల పరమార్థం ఏమిటి?

అక్షతల పరమార్థం ఏమిటి?


మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.

‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.

మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము.

పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్ల కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లి దండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుం ది శిరస్సు.అది సరే కాని! అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మి కంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో
‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరిం చడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.

తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగు తూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరు డు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.

‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతు లుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

 

రావి చెట్టు , వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందా?

రావి చెట్టు , వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేస్తే సంతానం కలుగుతుందా?

పిల్లలు సరైన  సమయంలో కలగకపోతే  28  సార్లు ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చెయ్యటం చాలా చోట్ల , చాలా కాలం నుంచి ఉన్నదే. దానికి వైద్య కారణం వెదికితే  చిరంజీవి వంటి రావి చెట్టు పురుష అంశం  కలది. వేపచెట్టు స్రీ అంశం కలది. ఈ రెండు కలసిన ప్రదేశం వద్ద  ప్రదక్షిణలు   చేయటం వల్ల  శరీరం వాటి నుంచి అమ్లజనితం ఇట్టే గ్రహిస్తుంది.   గర్భ దోషాలను  అరికడుతుంది. ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయటం ద్వారా  వాటిపై నుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భ కోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే  అవకాశముంది. 
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

మన వివాహ సంప్రదాయం ప్రకారం స్ర్తిలు నల్లపూసలు ఎందుకు ధరించాలి?

మన వివాహ సంప్రదాయం ప్రకారం స్ర్తిలు నల్లపూసలు 

ఎందుకు ధరించాలి?

స్ర్తి జీవి సంతానోత్పత్తికి అనుకూలంగా చేయబడిన 

శరీరం కలది. సంతానాన్ని పురుషుడు కూడా కొద్ది 

కాలం తన గర్భంలో మోస్తాడు. కాని స్ర్తి ఒక సంవత్సర 

కాలం తన గర్భంలో మోసి, వేరొక ప్రాణికి జన్మ 

నిస్తుంది. అందువల్ల స్ర్తి నాడులకు అనుకూలమైన 

పదార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు. 

వాటిల్లో ఒకటి నల్లపూసలు. దీన్నిబట్టి 

ఆర్భాటాలకుపోయి ఏవేవో పూసలు ధరిస్తే రావాల్సిన 

ప్రయోజనం రాదు.


ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

వివాహం ఎన్ని విధాలు?

వివాహం ఎన్ని విధాలు?

వివాహం ఎనిమది విధాలు 

బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం.
1. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానం బ్రహ్మ వివాహం.
2. యజ్ఞంలో ఋత్విక్‌ కు అలంకరించిన కన్యాదానందైవ వివాహం
3. గోమిధునాన్ని వరుని నుండి స్వీకరించి కన్యాదానం చేస్తే అది ఆర్ష వివాహంఅవుతుంది.
4. మీరిద్దరూ కలిసి ధర్మాచరణ చేయండి అని వరుని పూజించి కన్యాదానం చేస్తే... ప్రాజాపత్య వివాహం.
5. జ్ఞానులమ కన్యకు తన శక్తిననుసరించి డబ్బిచ్చి వివాహం చేసుకుంటే... అసుర వివాహం.
6. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే అది గాంధర్వ వివాహం.
7. కొట్టి బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే �రాక్షస వివాహం
8. నిద్రిస్తున్న మత్తులో వున్న స్ర్తీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే... అది పైశాచ వివాహం. ఇలా వివాహాల్లో ఎనిమిది రకాలుంటాయి.

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

గుడిలో శడగోప్యం (శతగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?


గుడిలో  శడగోప్యం (శతగోపనం)  తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?

దేవాలయం లో దర్శనం అయ్యాక  తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి.  శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి  కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి.  అంటే మీ కోరికే శదగోపం.   మానవునికి శత్రువులైన   కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు  వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం.
షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు.  పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్
బయటికివేలుతుంది.  తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నరకంలో ఏ పాపాలకి ఏ శిక్షలు?

నరకంలో ఏ పాపాలకి ఏ శిక్షలు?



  • అమాయకులని  బాధిస్తే   వాతలు పెడతారు.
  • స్రీ ధనాన్ని ఆశిస్తే  మహాముళ్ళతో నిండిన    అడవుల్లో కళ్ళు పోగొట్టి పడవేయటం .
  • కుటుంబం కోసం  సంపాదించినా  లేదా సంపాదించినది ఒక్కడే అనుభవిస్తే  పచ్చి మాంసాన్ని పిక్కుతినే వారు పిక్కు తింటారు.
  • డబ్బు మదంతో  అందర్నీ హింసిస్తే, సూదులతో గుచ్చి గుచ్చి చిత్రహింస.
  • ధర్మాన్ని, వేదాల్ని అవహేళన చేస్తే  సకల అవయవాల్ని  ఒక్కొటిగా  కోస్తారు.
  • పరుల, ధన, మాన ఆస్తులను  దౌర్జన్యంతోను , బలంతోను  దోచుకుంటే వజ్రాలను కూడా ఖండించ గలిగే  వాడియైన  కోరలుగల  వందలాది కుక్కలతో  కరిపిస్తాడు యముడు.
  • అబద్దాలను చెప్పిన వారికి వందలాది యోజనములు ఎత్తున వుండే పర్వతాల మీద నుంచి రాతిబండల మీద పడేలా విసిరివేయటం ద్వారా జీవుడికి శిక్ష   విధిస్తాడు సమవర్తి.  


  • ఇట్లు 

    మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఎలాంటి వాడిని మహానిందితుడు అంటారు?

ఎలాంటి వాడిని మహానిందితుడు అంటారు?



  • బిడ్డలకి  తగిన  వయసులో  పెళ్ళిళ్ళు  చేయలేనివాడు.
  • బహిష్టు సమయంలో భార్యతో  సంగమించినవాడు.
  • తల్లితండ్రుల  మంచిచెడులను  చూడనివాడు.
  •  
  •  
  •  
  •  
  • ఇట్లు 

     

    మీ  సుబ్రహ్మణ్య శర్మ  
     

ఏ తిధిలో ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?

ఏ తిధిలో ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?



  • శుక్లాపాడ్యామి దుఖాన్ని కలిగించే సంఘటనలు  జరుగుతాయి.
  • విదియ రోజు కార్య సిద్ది జరుగుతుంది.
  • తదియనాడు ప్రయనములు సకల కార్యాలను సిద్దించేల  చేస్తుంది.
  • చవితినాడు  ఆపదలను తెచ్చే అవకాశం.
  • పంచమినాడు శుభం.
  • షష్ఠి  నాడు  ఆకలవిరాలను తెస్తుంది.
  • సప్తమినాడు ప్రయాణం చేస్తే  ఆత్మారాముడు సంతృప్తి చెందేలా  అతిధి మర్యాదలు ఎక్కడికెళ్ళిన జరుగుతాయి.
  • అష్టమినాడు ప్రయాణం చేస్తే అష్టకష్టలే .
  • నవమిరోజు నష్టములతో పాటు అనేక వ్యధలు కలుగుతాయి.
  • దశమి రోజు  ప్రయాణం చేస్తే  ధనలాభం.
  • ఏకాదశి  కన్యలాభామంతా సౌఖ్యం.
  • ద్వాదశి మహా నష్టాలను తెచ్చే పెడుతుంది.
  • త్రయోదశి శుభాలను తెచ్చే తిధి.
  • బహుళ  చతుర్ది నాడు ప్రయాణం చేస్తే ఎంతో కీడును కలిగిస్తుంది.
  • అమావాస్య నాడు ప్రయాణం చేస్తే మహా ఆపదలు సంభవించవచ్చు.
  • శుక్ల చతుర్దశి నాడు ప్రయాణం చేస్తే ఏ పని పూర్తి అవ్వదు.
  • పూర్ణిమ నాడు ప్రయాణం చేస్తే పనులైనట్టే  వుంటాయి. కానీ అవ్వవు
  •  
  •  
  •  
  •  
  • ఇట్లు 

    మీ  సుబ్రహ్మణ్య శర్మ 
     

పూర్వకాలంలో దేవదాసీల ధర్మలేంటి?

పూర్వకాలంలో దేవదాసీల ధర్మలేంటి?




పున్నములప్పుడు,  విశేషదినముల  అప్పుడు దైనిక  

కార్యక్రమాల్లో  నృత్యం చేసేవారు.  కొంత మంది 

రాజులు వారిని తమ గూఢచరులుగా  కూడా 

నియమించుకునేవారు.  వారి పని, దేవుణ్ణి భర్తగా  

కొలిచి దేవస్ధాన  కార్యక్రమాల్ని  చూడటంతో పాటు 

ధర్మకార్యాల్లో  పాలుపంచుకోవటం.  నృత్యగానాల వల్ల 

వారు ధనాన్ని  పొందేవారు. అంతేగాని మరొకలా 

కాదు.


ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

వధూవరుల వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

వధూవరుల వివాహ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?



  •   గోత్రములు అనగా మూల పురుషులవి విచారించాలి. ఏకగోత్రం అనగా  ఒకే ఇంటి  పేరుగల వాళ్ళు వివాహానికి పనికి రారు.
  •  తండ్రి వంశమున ఏడుతరాల వరకు , తల్లి వంశమునకు ఐదు తరాల వరకు  వివాహం చేయరాదు.
  • మేనత్త , మేనమామ  బిడ్డల వివాహం వల్ల  అనర్ధములు కలుగుతాయి.
  • గురువు పుత్రికను వివాహమాడరాదు  .
  • వరునికన్న వధువు  చిన్నగా  వుండాలి.
  • అక్కకి పెళ్లి చెయ్యకుండా  చెల్లికి పెళ్లి చేయరాదు.
  • సవతి తల్లి వుంటే ఆమె వైపు కూడా విచారించి వివాహాన్ని నిశ్చయించాలి.
  • ఒకరిని ప్రేమించిన యువతిని పురుషుడు వివాహం చేసుకోనరాదు.
  • తల్లి తండ్రి వంశ పారంపర్య  వ్యాధులున్నచో  వివాహం చేసుకోవడం వల్ల  ఆర్ధిక , ఆనంద నాశనములు.
  • వివాహం చేసుకునే వదువులో  పురుషుడు చూడాల్సింది కులం కాదు గుణం.
  • అదేవిధంగా  పురుషుడు విషయంలో  వధువు ప్రధానముగా చూడాల్సింది  సంపద కాదు గుణము, సమర్ధత.  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • ఇట్లు 


    మీ  సుబ్రహ్మణ్య శర్మ 

     

పుత్రుడ్ని తండ్రి ఎలా పెంచాలి? (Father Love)

పుత్రుడ్ని తండ్రి ఎలా పెంచాలి? (Father Love)





పసివానిగా అయిదేళ్ళు  వచ్చే వరకు రాజుగా లాలించి, 

ప్రేమించి పెంచాలి. పదేళ్ళు వచ్చే వరకు అదిరించి ,  

బెదిరించి, తప్పకపోతే కొట్టి సరైన దారిలో నడిపించాలి. 

పదహారేళ్ళు దాటినా పుత్రునితో స్నేహితుడిగా 

ఉండాలి..

   చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి తేకూడదు.  ఆపై 

పెళ్ళైన తర్వాత తన బిడ్డగా కాక కోడలి భర్తగా మాత్రమే 

చూడాలి. అప్పుడు తండ్రిని తండ్రిగా చూస్తాడు, 

గౌరవిస్తాడు .


ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

పురుషులలో పుణ్యపురుషులు వేరయా.....అంటాము.....అంటే ఏమిటి ?

పురుషులలో పుణ్యపురుషులు వేరయా.....అంటాము.....అంటే ఏమిటి ?




  • తన  క్షేమముల   కంటే   తనవారి   క్షేమాన్ని  నిరంతరమూ  
  • చూసేవాడు  ఉత్తమ పురుషుడు .
  • తనకి  వచ్చిన  ఫలమును  బట్టి   ప్రత్యుపకార  ఫలాన్ని  
  • ఇచ్చువాడు  మధ్యమ  పురుషుడు .
  • తన  సుఖం  కోసం , తన  వ్యసనాల  కోసం  కుటుంబాన్ని , 
  • తన  వారిని  నాశనం  చేయువాడు  అధమ  పురుషుడు .
  • తనకున్న  దుర్గుణాల  ద్వార  తను, తన వారిని పాడు 
  • చెయ్యటమే కాక, ఏ సంబంధం లేని వారిని కూడా మాయ 
  • ప్రలోభాలతో ఆ వైపు మళ్ళించు వాడు అధమాధమ 
  • పురుషుడు. 

భగవంతుడు కామాన్ని ఎందుకు పెట్టాడు?

భగవంతుడు కామాన్ని ఎందుకు పెట్టాడు?




మహా అప్సరసల్ని  భగవంతుడు సృష్టించినది 

మానవుడి బుద్ధిని  తెలుసుకోవటానికే.

                   ధర్మ మార్గంలో కామాన్ని పొంది  తనని 


వేరు చేసుకుంటాడో, కామాన్ని స్వాధీనంలో 

ఉంచుకొనక  పశువుగా మారి రాక్షసుడవుతాడోనని  

పెట్టిన అతి పెద్ద పరీక్షే  ఈ కామము.

        స్రీ  వ్యామోహం అన్ని వ్యసనముల కన్నా  


భయంకరమైనది. నాశనం చేసేది.



ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

గోకులాష్టమి రోజు అర్ధరాత్రి నైవేద్యం పెట్టేది ఎందుకో వివరించగలరు?

గోకులాష్టమి రోజు అర్ధరాత్రి నైవేద్యం పెట్టేది ఎందుకో వివరించగలరు?




ఈ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా 

చేసుకుంటారు. చిన్న కృష్ణుడి పాదముద్రలు ఇంటి 

బైటనుంచి ఇంట్లోకి వేస్తారు. బుడి బుడి అడుగులతో 

తమ ఇంట్లోకి చిన్ని క్రిష్ణయ్య రావాలని కోరుకుంటారు. 

  

   రాత్రి పన్నెండు గంటలకి అనగా శ్రీ కృష్ణుడు పుట్టిన 

సమయానికి .....అప్పుడే పుట్టిన బాలకృష్ణునికి 

నైవేద్యం పెడతారు.



ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర(ManasaSarovara Yathra)

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర(ManasaSarovara Yathra)



సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే మహాశివుడి కటాక్షం లేనివారికి ఈ యాత్ర చేయడం దుర్లభమే.  శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.. మహాశివుడికి నివాసం అయ్యింది కైలాసగిరి. ఎన్నో వ్రతాల ఫలాన్నిచ్చే మానససరోవరం.. పాపప్రక్షాళన చేసే కైలాస పర్వతాన్ని దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తుంది మానససరోవర యాత్ర. కైలాసయాత్ర కైలాస్ మానసరోవర్ యాత్రను రెండు రకాలుగా చేయవచ్చు. మొదటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే.. ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లడం రెండో పద్దతి. ।ప్రతీ ఏడాది జూన్‌ 9 నుంచి సెప్టెంబర్ 9 మధ్య కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతిస్తుంది. ఈ ఏడాది వెయ్యా 80 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిని 60 మంది చొప్పున 18 బృందాలుగా విభజించి యాత్రకు పంపిస్తుంది. దీనికోసం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఆన్‌లైన్‌లో అయితే, మార్చి నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ప్రింటవుట్ తీసుకుని మార్చి 11 వ తేదీ లోగా విదేశీ మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. నేరుగా దరఖాస్తు చేసుకునేవారికి కూడా మార్చి పదకొండే ఆఖరు తేది. రానుపోను 27 రోజుల పాటు సాగే మానసరోవరయాత్రకు ఎన్నో రకాలుగా సిద్దం కావాల్సి ఉంటుంది. చైనా వీసాతో పాటు, ఆరోగ్యపరీక్షలు చేసుకోవడానికి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20వేల అడుగుల ఎత్తున పర్వతాలపై నడవాల్సి ఉంటుంది కాబట్టి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లకే అనుమతి లభిస్తుంది. గుండెజబ్బులు, రక్తపోటు, శ్వాససంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ యాత్ర చేయడానికి అనర్హులు. వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఢిల్లీ నుంచి యాత్ర మొదలవుతుంది. పగలు ప్రయాణం రాత్రి పూట విశ్రాంతి పద్దతిలో ఈ యాత్ర సాగుతుంది. మూడోరోజు దార్‌చులాకు చేరుకుంటారు. 25 కిలోలకు మించి లగేజ్‌ను మోసుకు వెళ్లడానికి ఇక్కడినుంచి అనుమతి ఉండదు. గుర్రాలను, పోర్టర్లను అద్దెకు కావాలంటే.. ఇక్కడే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోరోజు ప్రయాణం మొదలై.. నారాయణస్వామి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు టెక్కింగ్ చేసిన యాత్రికులు గుంజి అనే గ్రామానికి చేరతారు. పచ్చని ప్రకృతి అందాలు, కాళీ నది పరవళ్లు.. పర్వతాలను ముద్దాడుతున్నట్లు కనిపించే మేఘాల మధ్య ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతుందీ యాత్ర. ట్రెక్కింగ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఈ ప్రకృతి అందాలు మాయం చేస్తుంటాయి . మధ్యలో ఎదురయ్యే గ్రామాల్లో స్థానికులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ఏడో రోజుకు యాత్ర గుంజి గ్రామానికి చేరుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ఇక్కడ సమనోహరంగా కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడగానే బంగారు రంగులో ప్రకాశిస్తూ.. అచ్చెరువొందిస్తాయి. రెండు రాత్రుళ్లు గుంజిలోనే గడపాల్సి ఉంటుంది. ఎనిమిదో రోజు ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అధికారులు యాత్రికులకు మళ్లీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫిట్‌గా ఉన్నారని తేలినవారికే.. ముందడుగు వేయడానికి అనుమతి లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారిని వెనక్కి పంపించేస్తారు. తొమ్మిదో రోజు గంజి నుంచి ప్రయాణం నవీడాగ్‌ అనే ప్రాంతానికి సాగుతుంది. మధ్యలో వ్యాసమహర్షి గుహ కనిపిస్తుంది. ఇక్కడే ఆయన మహాభారతాన్ని రచించారట. నవీడాగ్ చేరుకున్నాక.. ఓం పర్వత దర్శనం లభిస్తుంది. అయితే.. ఎప్పుడూ మేఘాలు ముసురుకుని ఉండే ఈ పర్వతంపై ఓం ఆకారాన్ని చూడాలంటే, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. పర్వతాల మధ్య ఓం రూపంలో కనిపించే ఆకారం.. ప్రతీఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది. నవీడాగ్ నుంచి టిబెట్ సరిహద్దు ప్రాంతమైన లిపులేక్ వరకూ మరుసటి రోజు ట్రెక్కింగ్ సాగుతుంది. మంచుపై నడుస్తూ యాత్రికులు ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. టిబెట్ సరిహద్దు దాటిన తర్వాత, తటలా కోట్‌కు బస్సులో ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాతి రోజు, అక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి తటలా కోట్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. పన్నెండో రోజు.. కైలాస పర్వతం బేస్ క్యాంప్ అయిన డార్చెన్‌ కు యాత్ర మొదలవుతుంది. మధ్యలో రాక్షసతాల్ అనే సరస్సు ఎదురుపడుతుంది. మానసరోవరానికన్నా ముందు కనిపించే సరస్సిది. శివ కటాక్షం కోసం రావణాసురుడు ఇక్కడే తపస్సు చేశాడని ప్రతీతి. కైలాస పర్వతం యాత్రికులకు తొలిసారి ఇక్కడి నుంచే కనిపిస్తుంది. కొండలమధ్య మహాశివలింగం కొలువైనట్లు కనిపించే.. ఆ దృశ్యం చూడగానే, యాత్రికులు అంతవరకూ పడ్డ అలసట మాయమైపోతుంది. కైలాస శిఖరం దగ్గరకు ఎప్పుడెప్పుడు చేరుకుందామా... అన్న ఆతృత పెరుగుతుంది. కాస్త ముందుకు వెళ్లగానే.. అతిమనోహరమైన మానసరోవరం దర్శనమిస్తుంది. సూర్యకాంతి పడి నక్షత్రాలు నేలకు దిగినట్లు కనిపించే దృశ్యం.. యాత్రికులను మదిని పులకరింపచేస్తుంది. డార్చెన్‌కు చేరుకున్న యాత్రికులు.. పవిత్రమైన మానసరోవరం స్నానమాచరించి.. మరుసటి రోజు కైలాస్ పరిక్రమకు సిద్ధమవుతారు. ఇలా ప్రభుత్వం ద్వారా డార్చెన్ చేరుకోవాలంటే.. పన్నెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేని వారి కోసం ప్రైవేటు సంస్థలు మానసరోవరయాత్రను అందిస్తున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు మీదుగా సాగే ఈ యాత్ర ద్వారా అయితే, ఐదు రోజుల్లోనే మానససరోవర్‌కు చేరుకోవచ్చు. అయితే, చిన్నపాటి విమానాల ద్వారా ఈ యాత్రంతా సాగుతుంది. వాతావరణం అనుకూలించకపోతే, యాత్రకు మధ్యలోనే అడ్డంకులు ఏర్పడవచ్చు. పరిక్రమంతో పుణ్యం  కైలాస పర్వతాన్ని, మానసరోవరాన్ని వేరువేరుగా చూడలేం. హిమాలయాల్లో ఉన్న ఈ రెండు ప్రాంతాలు పరమపవిత్రమైనవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కైలాస పర్వతాన్ని చూస్తే.. అమరేశ్వరుడిని చూసిన అనుభూతే కలుగుతుంది. గడ్డకట్టే చలిలో.. మంచు పర్వతాల మధ్య.. ఎప్పుడూ స్వచ్చమైన నీళ్లతో కనిపించే మానసరోవరం.. అందరికీ మిస్టరీలానే ఉంటుంది. అందుకే, అటు కైలాస పర్వత పరిక్రమను, మానసరోవర పరిక్రమనూ పూర్తి చేసి పుణ్యం కట్టుకుంటారు భక్తులు. కైలాస పర్వత పాదభాగంలో ఉన్న డార్చెన్ నుంచి యాత్రికులు ముందుగా మానసరోవర పరిక్రమను మొదలుపెడతారు. బ్రహ్మమానస సరోవరాన్ని చుట్టూ తిరిగి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. తొలిరోజు డార్చెన్ నుంచి కుహు కు.. రెండో రోజు కుహూ నుంచి కుగుకూ యాత్ర సాగుతుంది. కుగు నుంచి చూస్తే.. మానసరోవరం, కైలాసపర్వతం కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. ఇదో అద్భుతమైన దృశ్యం. అంతేకాదు.. ఒక్కోసారి కైలాస శికరం నుంచి కాంతిపుజం మానస సరోవరంలోకి ప్రవహిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది.. తిరిగి డార్చెన్‌కు చేరుకోవడంతో మానసరోవర పరిక్రమ ముగుస్తుంది. భూమ్మీద మరెక్కడా కనిపించని స్వచ్చమైన నీరు.. కేవలం మానసరోవరంలో మాత్రమే కనిపిస్తుంది. గంటగంటకూ ఒక్కో తరహాలో కనిపించే సరోవరం పర్యాటకులకు అంతులేని అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత రోజు డార్చెన్ నుంచి కైలాస పరిక్రమ మొదలవుతుంది. కైలాసనాథుడి కొలువైన పర్వతాన్ని చుట్టిరావడానికి మూడురోజుల సమయం పడుతుంది. మొత్తం యాత్రలో అత్యంత కష్టమైన ప్రయాణమిది. యమద్వారం మీదుగా తొలిరోజు భక్తులు నడకసాగిస్తారు. ఈ ద్వారాన్ని దాడటం ద్వారా మృత్యుభయం తొలిగిపోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాతే, బ్రహ్మపుత్ర నది దర్శనమిస్తుంది. కైలాసపర్వతంపైనే బ్రహ్మపుత్ర నది జన్మస్థలం ఉంది. దీంతో పాటు గంగ, సింధు, సట్లైజ్ నదులు కూడా ఇక్కడే పుట్టి దక్షిణాసియాను సస్యశ్యామలం చేస్తున్నాయి. అది మహాశివుడు మానవాళికిచ్చిన మహా ప్రసాదం. కష్టమైన దారిలో జాగ్రత్తగా నడుస్తూ.. కైలాసగిరి అందాలను చూస్తూ.. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగుతారు శివ భక్తులు. మధ్యలో బ్రహ్మపుత్రానదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేరాపుక్ క్యాంప్ వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కైలాస పర్వత శిఖరం.. ఇక్కడికి అత్యంత సమీపం నుంచి కనిపిస్తుంది. వాతావరణం త్వరత్వరగా మారిపోతుంటుంది. కైలాస శిఖరం కూడా దానికి తగ్గట్లే రంగులు మార్చుతూ, యాత్రికులను భక్తపారవశ్యంలో ముంచెత్తుతుంది. డేరాపుక్ నుంచి డోల్మా పర్వతం మీదుగా యాత్ర సాగుతుంది. ఈ దారి దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. సముద్రమట్టానికి దాదాపు 20 వేల అడుగుల ఎత్తున ఉండడం కారణంగా ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణ చేస్తూ, భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదులుతారు యాత్రికులు. ఆ శివనామ స్మరణే.. భక్తులకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మధ్యలో గౌరీకుండ్ కనిపిస్తుంది. ఎమరాల్డ్‌ లా కనిపించే ఈ కొలనులోనే పార్వతీదేవి స్నానమాచరిస్తుందట. కొండల నడుమ కనువిందు చేస్తుందీ ప్రాంతం. జోంగ్‌ జెర్బును చేరుకోవడంతో ఆరోజు యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాతి రోజు.. అక్కడి నుంచి డార్చెన్‌కు ప్రయాణం సాగడంతో కైలాస పరిక్రమ ముగుస్తుంది. ఈ యాత్రలో నాలుగు వైపులా నాలుగు రకాలుగా కనిపిస్తుంది కైలాస పర్వతం. ఒక వైపు నుంచి చూస్తే స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణంలో మెరుస్తుంది. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా సాక్షాత్కరిస్తుంది. ఇక నాలుగు వైపులా నాలుగు రూపాలు భక్తులకు దర్శమనిస్తాయి. హయగ్రీవ రూపమైన గుర్రం, పార్వతీ దేవి వాహనమైన సింహం, వినాయకుడికి ప్రతిరూపమైన ఏనుగు, కుమారస్వామి వాహనమైన నెమలి రూపాలు కనిపిస్తాయంటారు భక్తులు. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలే పరమపవిత్రమైన కైలాస శిఖర పరిక్రమే భక్తులు పరిమితమవుతారు తప్ప, శిఖరాన్ని అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించారు. పదో శతాబ్ధంలో ఓ బౌద్ధగురువు శిఖరాధిరోణ చేసినట్లు చెప్తారు. ఆ తర్వార ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అత్యంత ఎత్తైన ఎవరెస్టును ఎంతోమంది ఎక్కగలిగారు గానీ, కైలాస పర్వత అంచును మాత్రం ఎవరూ చూడలేకపోయారు. అందుకే, ఇది మహాఅద్భుతంగా మిగిలిపోయింది. కైలాస,మానసరోవర పరిక్రమ యాత్రను పూర్తి చేసుకున్నవాళ్లకు ఎంతో పుణ్యాన్ని, అంతులేని ఆధ్యాత్మిక అనుభూతులను మూటగట్టుకుని తిరుగు ప్రయాణవుతారు.

యాత్రిక రచయిత :-
శ్రీవల్లీ సుబ్రహ్మణ్యం శర్మ 

ఇంటికి పచ్చతోరణాలు ఎందుకు కడతారు ?

ఇంటికి పచ్చతోరణాలు ఎందుకు కడతారు ?




సాధారంగా  పండుగరోజులో  లేదా  ఇంటిలొ  ఏ రకమైన  శుభకార్యం  జరిగేటప్పుడు  ఇంటికి పచ్చతోరణం కడుతూఉంటారు .ఇదొక సంప్రదాయంగా  పాటిస్తునం .దేనికి సైన్సుటిఫిక్  REASON  దాగి ఉంది

                              ఇంటికి మామిడి ఆకులతో పచ్చతోరణం కట్టడం వల్లన , ఆ ఆకులలోనీ  క్లోరోఫిల్ సూర్యరశ్మి తో  కిరణజన్య సంయోగా క్రియ  జరిగి  ఆక్సీజన్ ఆదికంగా విడుదల అవుతుంది .అందుకే పండుగ రోజున ఇంటి వాతారణం ఎంతో ఆహ్లదంగా ,ఇల్లు కళకళలాడుతో  ఉంటుంది .


ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఎన్ని యజ్ఞాలు చేసిన పోనీ పాపాలు ఏవి?

ఎన్ని యజ్ఞాలు చేసిన పోనీ పాపాలు ఏవి?




పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికి , 

పరాయివాని భార్యని ఆశించి పొందిన వానికి ,  ఇంటి 

యజమాని లేదా పెద్దలు లేనప్పుడు పిల్లలకి 

చెందాల్సిన ఆస్తిని  కాజేసినవారికి  శ్రద్దాదులు  పెట్టిన , 

ఎన్ని దానాలిచ్చిన వారి  పాపాలు నశించవు  .   ఆ 

పాపాలకి  శిక్ష  పైలోకాల్లోను , ఇక్కడ 

అనుభవించాల్సిందే.



ఇట్లు 


మీ  సుబ్రహ్మణ్య శర్మ 

పర స్త్రీని తాకితే ఎంతటి పాపం?

పర స్త్రీని తాకితే ఎంతటి పాపం?

అవకాశం దొరికిందికదాని రద్దీ ప్రదేశాల్లో స్త్రీ స్పర్శా 

సుఖాన్ని పొందితే అది పాపంగా రూపుదాలుస్తుంది. 

కామంతో పరస్త్రీని తాకితే నిప్పుని తాకినట్టే... ఆ స్త్రీ 

ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పాపం మాత్రం 

పురుషుడు భరించాల్సిందే. 

అలాంటి పాపానికి శరీరంలో ఏదో ఒక అవయవం 


కాలటమో, కుళ్ళఃటమో, జరుగుతుంది. పరస్త్రీని అనగా 

వేదవతి జుట్టు తాకినందుకూ ఇంకా అనేక స్త్రీలను 

బలవంతంగా పొందినందుకే ముల్లోకాల్లోనూ జయించిన 

రావణుడి దశకంఠాలూ నేలరాలాయి.

ఇట్లు 

మీ  సుబ్రహ్మణ్య శర్మ 

హొమగుండం వద్ద ఎలాంటి ముగ్గులు వేస్తారు ?

హొమగుండం వద్ద ఎలాంటి ముగ్గులు వేస్తారు ?



సర్వత్ర  చక్రం  హొమగుండం  వద్ద , అలాగే  

యజ్ఞయాగాదులప్పుడు  అష్టదళపద్మం , ఓంకారం  , 

స్వస్తిక్   వంటివి  వేస్తారు . ఇలా   

వేయల్సివచ్చినప్పుడు   అవకాశముంటే  భగవత్  

ప్రసాదంగా  భావించి  ముగ్గును  స్వయంగా  వేయండి 

. ఆ  ప్రాంతంలో   వేసిన  ముగ్గువలన  సప్తజన్మల  

వరకు  సౌభాగ్యం  లభిస్తుంది .



ఇట్లు 

మీ  సుబ్రహ్మణ్య శర్మ

గర్భగుడిలో ప్రదక్షిణలు చేయవచ్చా?

గర్భగుడిలో ప్రదక్షిణలు చేయవచ్చా?




దేవాలయాల్లో ఈ మధ్యన అర్చనలు చేయించేటప్పుడు 

ప్రదక్షిణ నమస్కారాలని చెప్పి ఆత్మ ప్రదక్షిణ 

నమస్కారాలు చేయిస్తున్నారు. అక్కడ ఆత్మ ప్రదక్షిణం 

చేయకూడదు అంటారు. అది ఎంతవరకు సబబు?


ఎప్పుడైనా సరే చుట్టూ తిరగడమే ప్రదక్షిణం. మన 

ఇళ్లలో అది సాధ్యం కాదు కనుక, ఆత్మ ప్రదక్షణం అనే 

విధానాన్ని మనకు అనుమతించారు. గుళ్లలో చక్కగా 

చుట్టూరా తిరిగొచ్చే ఏర్పాటు వుంటుంది. ఒకోసారి 

గుళ్లల్లో కూడా ఆ దారులు కట్టేస్తూ వుంటారు. 

అలాంటప్పుడు ఆత్మప్రదక్షిణం చేసుకుంటే 

చేసుకోవచ్చునేమోగానీ గుళ్లల్లో ప్రదక్షిణం చేసేందుకు 

ఆవకాశం ఉన్నప్పుడు మాత్రం ఆత్మ ప్రదక్షిణలు 

మంచిదికాదు. కానీ, అలా పూర్తి ప్రదక్షిణం పెట్టుకుంటే 

పూజలు ఆలస్యం అయిపోతాయి అనే అసౌకర్యం కోసం 

కొన్ని గుళ్లల్లో మరికొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి 

వస్తుంది. అప్పుడు ఆత్మ ప్రదక్షిణ కాకుండా వట్టిగా 

శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి తప్పితే దేవుడి 

ఎదురుగుండా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. 

చేసినట్టయితే వాహనానికి కాళ్లొచ్చేస్తాయి. వెనకాల 

వున్న ఆంజనేయుడో, గరుత్మంతుడో ఎవరో వుంటారు. 

అంచేత ఇటువంటి కొత్త సంప్రదాయాలను 

తయారుచేసేటప్పుడు ఆలయ వ్యవస్థ వాళ్లే ఎక్కువ 

జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంమీద తేలిందేమిటంటే 

గుడికి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం. 

లేకపోయినట్టయితే పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం 

కూడా పుచ్చుకున్నాక చివరకు గుడి ప్రదక్షిణ 

చేసుకున్నా తప్పేమీ కాదు. కానీ లోపల ప్రదక్షిణం 

చేయడం మాత్రం అంత ఉత్తమం కాదు. గర్భగుడిలో 

సాష్టాంగపడడం అంటే తోటి భక్తులకు ఇబ్బందికరంగా 

ఉంటుంది. వీరిని ఎవరైనా తొక్కినా తొక్కవచ్చు. మనం 

ఇంకొకళ్లకు ఇబ్బంది కలగకుండా మన కష్టాన్ని 

దేవుడికి విన్నవించుకోవాలి కదా!

ఇట్లు 

మీ  సుబ్రహ్మణ్య శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...