Wednesday, October 31, 2018

సిరి సంపదలిచ్చే “లక్ష్మీ గవ్వలు"

గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం .

క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపమయ్యాయి. గవ్వలని లక్ష్మీ దేవి చెల్లెల్లు అని శంఖాలని లక్ష్మీదేవి సోదరులనీ పలువురు భావిస్తారు.గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉన్నాయి. ఇంకా శివుని జటాజూటం లోను, నందీశ్వరుని మెడలోను గవ్వలే అందం.

గవ్వలు కొందరికి అలంకరణ వస్తువుగాను, కొందరికి ఆటవస్తువుగాను, కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు. "అని ఉంది.కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.

ఉపయోగాలు

పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని, మొలతాడులోగాని కట్టాలి.

కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.

గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు.

కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.

గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.

గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.

వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.

వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.

గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది.కాబట్టి గవ్వలు కామప్రకోపాలు. వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.

వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.

లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల"

తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను ‘కలువలు’ అని కూడా అంటారు. తామరలకు ‘పుత్రజీవి’ అను పేరు కలదు. తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకొని కొద్దిగా వేడి చేసిన ఆవు పాలతో త్రాగవలెను. ఈ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును.

తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

స్పటికమాల, పగడాల మాలకంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

“ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా.”

అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి. చేతిలో ధనం నిలబడని వారు తామరమాలతో జపం చేసిన ధరించిన ఐశ్వర్యం, ధనం, స్ధిరాస్తులు పొందగలరు. తామరమాలతో అమ్మవారి పఠాన్ని గాని, విగ్రహాన్ని గాని, శ్రీయంత్ర మేరువుని గాని అలంకరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. సకలైశ్వర్య ప్రదాయిని, శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. మహాలక్ష్మిని కమలవాసిని అని కూడా అంటారు.

వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్య వలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు శుకాశ్రామాన్ని చేరి స్వర్ణముఖీ నదీ తీరాన సరోవరం నిర్మించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మ పురాణం తెలుపుతుంది.

పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జన్మించిన పద్మావతి లేదా అలమేలు మంగ. తమిళంలో అలర్‌ అనగా పువ్వు. మేల్‌ అనగా పైన. మంగై అనగా అందమైన స్త్రీ - అలమేలు అనగా పద్మంలో ప్రకాశించున సుందరి. చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలెన స్త్రీమూర్తి అని అర్థం.

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

తామర విత్తనాలను పద్మ, కమల, లోటస్ విత్తనాలని కూడ అంటారు. లక్ష్మీదేవి స్వరూపమైనతామర విత్తనాలు సహజ సిద్దమైనవి. తామరవిత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు, పటాలకు, శ్రీచక్రాలకు అలంకరించటం మంచిది.

తామరమాలను జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు మెడలో దరించటం గాని, జపంచేయటం గాని చేస్తే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి.

తామర విత్తనాలు లక్ష్మీ, శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి. తామర విత్తనాలు, తామరమాలతో పూజ చేస్తే దనాభివృద్ధి కలుగుతుంది.

జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, గొడవలు, అపోహలు ఉంటాయి. ఇలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి భాదలు ఉండవు.

దీపావళి రోజున "ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా". అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి.

లక్ష్మీదేవి అనుగ్రహానికి "శ్రీ లక్ష్మీ నారికేళం"

          శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం, లఘు నారియల్, లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటారు. శ్రీఫలాలు క్షార వృక్ష జాతికి చెందినవి. సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు పండుతాయి. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి. చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు , బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.   

        శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి. కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో చిన్న, పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. కొబ్బరి కాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది. పీచు దిగువున మామూలు కొబ్బరి కాయలకు ఉండే  విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

        శ్రీ లక్ష్మీ ఫలాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగిన స్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు, తెల్ల బట్ట, సుఖ వ్యాదులు, గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా లేనివారు, ఎప్పుడు జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నవారు శ్రీ లక్షీ ఫలంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని స్వీకరించిన అనారోగ్యాలు మటుమాయం అవుతాయి.  

       శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి. ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసు కొని పసుపు, గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి. తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలి. శ్రీఫలం చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు, యాలకులు, పండ్లు నైవేద్యం ఇవ్వాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపాలి. తరువాత పసుపు గాని, ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని, లాభలక్ష్మీ స్వరూపంగా పదకొండు శ్రీలక్ష్మీ ఫలాలను, కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. శ్రీలక్ష్మీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు, నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. "ఓం శ్రీం శ్రియై నమః" అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేసి పూజ అనంతరం శ్రీలక్ష్మీ ఫలాలను ఎర్రటి వస్త్రంలో కుంకుమ, నాణేలను మూటకట్టి వ్యాపార సంస్ధలలోగాని ఇంట్లోగాని ఉంచిన సుఖ సౌఖ్యాలు, ధన దాన్యాభివృద్ధి కలుగుతాయి.

లక్ష్మీ దేవి స్వరూపం "గోమతి చక్రాలు"

గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే "సముద్రపు శిల". గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభరాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే "నాగచక్రం" అని "విష్ణుచక్రం" అనికూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని "నత్త గుళ్ళ స్టోన్" అని కూడ అంటారు. గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతిచక్రం ముందుభాగం తెల్లగాను, కొన్నిఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకలకార్యసిధ్ధికి, ఆరోగ్యసమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్నగోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.

గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం, వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చక పోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి. గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో లేదా పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మీయంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.

గోమతిచక్రాలను “ఓం హ్రీం మహాలక్ష్మీ శ్రీ చిరాలక్ష్మీ ఐం మమగృహే ఆగచ్ఛ ఆగచ్ఛ స్వాహా” అనే మంత్రంతో గాని లలితాసహస్త్ర నామంతో గాని జపిస్తూ కుంకుమతో లేదా హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజుగాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించు కోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరం లో గాని ఉంచాలి. గోమతిచక్రాలను పిరమిడ్ లోపల గాని వెండి బాక్స్ లోపల గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

►‘ఒక్క గోమతిచక్రాన్ని’ త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడ పోతాయి.

►‘రెండు గోమతిచక్రాలను’ బీరువాలో గాని పర్సులో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

►‘మూడు గోమతిచక్రాలను’ బ్రాస్‌లెట్‌గా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద నల్లని కాటుక గాని బొగ్గు పొడితో గాని అతని పేరు వ్రాసి నీటిలో వేయటం లేదా వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

►‘నాలుగు గోమతిచక్రాలు’ పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహనిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహనానికి కట్టటం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాలనుండి నివారించబడతారు.

►‘ఐదుగోమతిచక్రాలు’ తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

►‘ఆరు గోమతిచక్రాలు’ అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాదించవచ్చు. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాదించవచ్చును.

►‘ఏడు గోమతిచక్రాలు’ ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి. ఏడు గోమతి చక్రాలను నదిలో విసర్జితం చేసిన దంపతుల మధ్య అభిప్రాయబేధాలు మటుమాయం అవుతాయి.

►‘ఎనిమిది గోమతిచక్రాలు’ అష్టలక్ష్మీ స్వరూపంగా పూజించిన ధనాభివృద్ధి కలుగుతుంది.

►‘తొమ్మిది గోమతిచక్రాలు’ఇంటిలో ఉండటం వలన మన ఆలోచన లని ఆచరణలో పెట్టవచ్చు. ఆద్యాత్మికచింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

►‘పది గోమతిచక్రాలు’ ఆఫీసులో ఉంచటం వలన ఆసంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

►’పదకొండు గోమతిచక్రాలు’ లాభలక్ష్మి స్వరూపంగా పూజించిన ఆర్ధికాభివృద్ధి కలుగుతుంది. భవననిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతి చక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్యదోషాలు ఉండవు.

►‘పదమూడు గోమతిచక్రాలను’ శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

►‘ఇరవై ఏడు గోమతిచక్రాలు’ వ్యాపార సముదాయములలో ద్వారబందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది.

జాతకచక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాలదృష్టి గాని, సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్న వారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్‌గా ధరించటం గాని చేయాలి.

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...