Sunday, December 15, 2013

మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు.

మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు.
1. స్వజనుల పట్ల దాక్షిణ్యభావం. 2. సేవకుల పట్ల దయాగుణం. 3. దుష్టుల పట్ల అప్రియభావం. 4. సాధువుల పట్ల ప్రీతి. 5. పండితుల పట్ల గౌరవం. 6. శత్రువుల పట్ల పరాక్రమం. 7. పెద్దల పట్ల సాహస భావం. 8. కోపతాపాలు ప్రదర్శించకూడదు. 9. స్త్రీల పట్ల దిట్టభావం... తప్పనిసరిగా కలిగివుండాలి.

స్వజనులు అంటే బంధువులు. బంధువులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కలసిమెలసి ఉండాలి. ఒకరు సమస్యల్లో ఉంటే మరొకరు సాయం చేయడానికి ముందుకు రావాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవించాలి. సేవకులను బానిసలుగా భావించకూడదు. వారిశ్రమను దోపిడి చేయకూడదు. వారిపట్ల జాలి, దయ, కరుణ చూపాలి. చెడ్డవారితో స్నేహం పాము విషంతో సమానం.

సాధువులు అంటే మతపెద్దలు. వీరిని గౌరవంగా చూడాలి. భక్తి వినయం వంటివి హృదయం నుంచి పుట్టుక రావాలి. మోక్షం పేరుతో నిరుపేదలకు దాన ధర్మాలు విరివిగా చేయాలి. ఆత్మశుద్ధికి ఉపకరించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాలి. రాజులయిన వారు రాజ్యం పట్ల నీతినిజాయితీలతో ప్రవర్తించాలి. రాజ్యం ప్రజలకు రక్షణ కనిపిస్తుంది. 

అజ్ఞానం అనే చీకటిని తరిమి జ్ఞానం అనే వెలుగును ఇచ్చేది పండితుడు. పండితుని ద్వారా భావిపౌరులు తయారయ్యి, దేశపరిస్థితులను నిర్దేశిస్తారు. ఇటువంటి పండితుని పట్ల సదా గౌరవాన్ని కలిగి ఉండాలి. దేశానికి హాని చేసే శత్రుమూకల్ని పరాక్రమంతో పారదోలాలి. జీవితానుభవాలను అనుభవించిన పెద్దలు చెప్పే మాటలను విశ్వసించాలి. తొందపరాటు, కోపతాపాలు ప్రదర్శించకూడదు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుష అహంకారంతో స్త్రీలపట్ల చులకన భావం ఉండకూడదు.

మంచిపుస్తకాలు చదవటం, క్రమశిక్షణతో మెలగటం, ప్రకృత్తి పట్ల ప్రేమ దానిని పరిరక్షించడం మొదలైనవి విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి. మంచి నడవడిక వ్యక్తిత్వ వికాసానికి పునాది. మహత్కార్యలకు వరం. గౌరవానికి హేతువు. కీర్తికి మార్గం. కాబట్టి మనిషికి మంచి నడవడిక చాలా అవసరం. మంచి నడవడికతోనే పురుషులు పుణ్యపురుషులు అవుతారు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...