Saturday, August 18, 2018

ఋణ విమోచన గణపతి స్తోత్రం

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

సంకష్టనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ –
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ప్రజ్ఞావివర్ధన శ్రీ కార్తికేయ స్తోత్రం

స్కంద ఉవాచ II
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II

శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II

శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II

మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II 

II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II

కార్తికేయుని 28 నామములు -
1.    యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
2.    మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3.    కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4.    అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5.    స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6.    కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7.    సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8.    స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9.    గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10.          తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11.          బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12.          శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13.          తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14.          ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15.          క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16.          షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17.          శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18.          సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19.          సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20.          గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21.          భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22.          భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23.          శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24.          గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25.          పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26.          ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27.          సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28.          వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

స్కంద ఉవాచ-
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు  జ్ఞానమును పొందుతారు.

సంధ్యావందనం ప్రయోజనం

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.

సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.

త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.

ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి

సావిత్రీం ఆవాహయామి

సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...