Monday, September 2, 2013

అదృష్టవంతులు దురదృష్టవంతులు

లోకములో అదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మినవారు. దురదృష్టవంతులు ఎవరంటే దైవాన్ని నమ్మనివారు.

మనం
భగవంతుని నమ్మినప్పుడు వారికి ఇష్టమయిన పనులను చెయ్యటానికి ప్రయత్నించాలి. అంతేకానీ భగవంతుడుమెచ్చని అన్యాయమైన పనులను చేస్తే అది దైవభక్తి అనిపించుకోదు.


ఒకోసారి మన నిర్ణయములలో పొరపాట్లు జరగవచ్చు.


కానీ పరమాత్మ విషయంలో అలా జరగదు. పరమాత్మ చూపిన దారి, వారి నిర్ణయములు ఎప్పుడూ సరిగ్గానే ఉంటాయి. వాటి వెనుక కారణాలు ఒకోసారి మనకు తెలియవు అంతే....అందుకే పరమాత్మను నమ్మేవాళ్ళు అదృష్టవంతులు అనేది.


ఇంకా , భగవంతుని
నమ్మినవారు అదృష్టవంతులని ఎందుకు అంటారంటే , మనకు ఎప్పుడయినా ఆపదలు వస్తే ఆదుకునే శక్తి భగవంతునికి మించి విశ్వంలో ఎవరికీ ఉండదు కాబట్టి.


జీవితంలో
ఒక్కోసారి మనం సంపాదించిన సొమ్ము కానీ, మనవాళ్ళు అని అనుకున్న ఆప్తులు కానీ, విజ్ఞానశాస్త్రంకానీ, మనకు సహాయము చెయ్యలేని సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆపదలలో అన్నివేళలా అందరినీ ఆప్యాయముగా ఆదుకునే ఆపన్న అమృత అద్భుత హస్తం పరమాత్మదే.


అందుకే
అందరం ఆ దైవాన్ని సదా గుర్తుంచుకోవాలి. సత్ప్రవర్తనతో జీవిస్తూ వారిని ఆనందపరచాలి...........

టెక్నాలజీ

కొందరు ఏమంటారంటే............టెక్నాలజీని శాంతియుత ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు కదా......... అని .......

ఉదా....కత్తిని శాంతియుత ప్రయోజనాలకూ వాడొచ్చు,......అశాంతిని కలిగించే విధంగానూ వాడొచ్చు కదా అని........ కానీ కత్తి వేరు........ అణు శక్తి వేరు........... రెండిటికి ఎంతో తేడా ఉంది.

కత్తి వల్ల కొందరినే చంపగలరు. కానీ అణుశక్తివల్ల కొద్ది సమయంలోనే కొన్ని లక్షలమందిని చంపే అవకాశం ఉంది.


ఇంకా, కొన్ని వేలసంవత్సరాల వరకూ అణుధార్మికత యొక్క దుష్ప్రభావం రాబోయే తరాలను పీడించే అవకాశం ఉంది. అణుబాంబులకు ఎంతో వినాశనాన్ని కలగచేసే శక్తి ఉంటుందట.

*  కత్తివల్ల ఎక్కువ లాభాలు....తక్కువ నష్టాలు ఉన్నాయి.
అదే అణుశక్తి వల్ల తక్కువ లాభాలు........చెప్పలేనన్ని నష్టాలు ఉన్నాయి. 


ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.


నా అభిప్రాయంలో......టెక్నాలజీని మూడువిధాలుగా చెప్పుకుంటే....


1.ఈ    రకమైన టెక్నాలజీ మనకు నిత్యావసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ...................

దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రాచీన కాలం వాళ్ళు తాము కష్ట పడిపనిచేసి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వస్తువులను వాడుతూ, హానిలేని పధ్ధతులను పాటించేవారు.
ఆ విధంగా వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు.



ఆ రోజుల్లో కూడా గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అప్పట్లో కూడా ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, ఎన్నోరకాల వృత్తివిద్యలు, ఆర్ధికశాస్త్రం, గణితం ఇలా నిత్యావసరాలకు ఉపయోగపడే విజ్ఞానం వారికి తెలుసు.


ఇంకా, ప్రాచీనుల విజ్ఞానాన్ని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వాళ్ళు కలలు కంటున్న ( టెలి పోర్టేషన్ ) వంటి ఎంతో విజ్ఞానం వారికి తెలుసు.


మనిషి మాయమయి తిరిగి ప్రత్యక్షమవటం, అణిమ, గరిమ వంటి సిధ్ధులు, పరకాయప్రవేశం , టెలిపతి ఇవన్నీ నేటి శాస్త్రజ్ఞులు భౌతికశాస్త్ర పధ్ధతులలో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.


కానీ ప్రాచీనులు వీటిని దైవసహాయంతో ఆధ్యాత్మికయోగశక్తి ద్వారా సాధించారు.

కానీ ....ఇప్పటి కాలపు భౌతికశాస్త్ర టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.



ఎక్కువగా పర్యావరణానికి హానికలగని ........... విధంగా   ఆ నాటి వారి జీవితం ఉండేది.
అంతే కానీ,   అభివృధ్ధి పేరుతో వస్తువులను విపరీతంగా ఉత్పత్తి చేసి గుట్టలుగా పోయటం వారికి అలవాటు లేదు..


ఇంకా,   వారు తమ నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు ........ ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. ఉదా..... కత్తి చూడండి.   మనకు దీని అవసరం ఎంతో ఉంది.



పంటలు పండించటానికి , కూరగాయలను తరగటానికి, వైద్యులు శస్త్రచికిత్సలు చేయటానికి, అలాగే యుధ్ధంలోశత్రువులనుచంపటానికి ............. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.


కానీ ఒకోసారి దుర్మార్గుల చేతిలో పడితే హత్యలు లాంటివి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొద్ది నష్టాలు తప్పితే ..............
దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని లేదు.


.
ఈ రకమైన టెక్నాలజీ వల్ల నష్టాల కన్నా లాభాలే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

*  దుర్మార్గుల చేతిలో ఉన్న కత్తి వల్ల ..........జరిగే నష్టం కొద్దిగానే ఉంటుంది. దుర్మార్గుల చేతిలో ఉన్న అణుశక్తి వల్ల ........... జరిగే నష్టం ఎంతో ఎక్కువగా
ఉంటుంది.


అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.



2.   ఈ   రెండో  రకమైన టెక్నాలజీ వల్ల ..... లాభమా.....నష్టమా ? అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానిని మనం వాడుకునే విధానం బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చేమో !


మానవులకు కష్టాన్ని తగ్గించే యంత్రాలు, వాహనాలు, టివీలు, సినిమాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఇలా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి వచ్చే వస్తువులు ఉన్నాలేకపోయినా మనిషి బ్రతకగలడు.


ఇవన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. వీటిని తగిన పరిమితిలో వాడుకోవాలి.

మరీ ఎక్కువగా వాడితే పర్యావరణానికి ముప్పు, సహజ వనరులు ఖాళీ అయిపోవటం, రాబోయే తరాలకు సహజ వనరులు లేని ఖాళీ భూగోళాన్ని ఇవ్వటం ,.... ఇప్పుడు ఉన్నవాళ్ళకి పనిలేకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, శారీరిక శ్రమ లేకపోవటం వల్ల శరీరం బలహీనపడటం , జబ్బులు రావటం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది.


అందుకని ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువా ? నష్టం ఎక్కువా ? అన్నది ఇతమిధ్ధంగా చెప్పలేము. అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది.

అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.


3.    ఈ  మూడో  రకమైన టెక్నాలజీ వల్ల లాభాలు ఉంటాయని జనం ( ఎండమావి లాంటి ) భ్రాంతిలో మునిగిపోతారు దానివల్ల ......... అంతా నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు.




ఉదా........అణుశక్తి. దీని సంగతి ఇప్పుడు చాలామందికి తెలుసు. తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆశపడితే ........ వేలసంవత్సరాలు భూమిని పీల్చిపిప్పిచేసే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి , అణుశక్తిని వాడటం పూర్తిగా విడిచిపెట్టెయ్యటమే ఏకైక మార్గం.



ఇలా టెక్నాలజీని వాడుకోవటంలో ....... ప్రపంచం పైన వాటి ప్రభావాన్ని బేరీజు వేసుకుని మాత్రమే ఉపయోగించుకోవాలి... ....
.......

.......................


ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి,......అణుశక్తి విషయంలో ప్రమాదాలను నివారించటం అసాధ్యం. ఇంకా, వైద్యరంగంలో దీని సహాయంతో చికిత్సను అందించేవారికి కూడా రేడియేషన్ ప్రభావం వల్ల మొండివ్యాదులు త్వరగా వచ్చే అవకాశముందట.


కొద్ది లాభం కోసం ఎంతో వినాశనాన్ని కలిగించే ప్రమాదం గల దాన్ని ఎవరైనా కోరుకుంటారా ? అందుకే నాకు అనిపిస్తుంది......ఈ అణుశక్తిని కనిపెట్టకుండా ఉంటే బాగుండేది అని....

 ఈ  టపా  పాతదే .  మరల    వ్యాఖ్యలతో   వేసాను.

మతమూ చెడ్డ విషయాలను బోధించదు

ఏ  మతమూ  చెడ్డ  విషయాలను  బోధించదు.    గ్రంధాలలోని  విషయాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోని  వారి  వల్ల  మరియు  కొందరు  స్వార్ధపరుల   వల్ల   తరతరాలుగా సమాజంలో  అపార్ధాలు  ఏర్పడ్దాయి.

ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే , ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

కొందరు స్వార్ధం వల్ల ,  మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.


 ప్రాచీన  గ్రంధాలను  సరైన  తీరులో  అర్ధం  చేసుకుంటే  సమాజం  ఎంతో  బాగుంటుంది.

.......................

ఓం.

శ్రీ  కృష్ణ  పరమాత్మ  బోధించిన  భక్తి యోగములో   కొంత భాగము.....


వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.

సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.



ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,  లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.

.....................................................

గీత  మరియు  
ప్రాచీన  గ్రంధాల  ద్వారా  మనము  ఎన్నో  చక్కటి  విషయాలను  తెలుసుకోగలము.  తెలుసుకున్న  విషయాలను  ఆచరణకు  ప్రయత్నించాలి.  

అప్పుడు,   అత్యాశ,  అవినీతి,  ఇతరులతో  అనవసరంగా  పోటీపడటం, ఇతరుల  సొమ్మును  అపహరించటం,  వంటి  దుర్లక్షణాలు  తగ్గిపోతాయి.  నైతికవిలువలతో  జీవించటం  అలవాటవుతుంది.

  లోకం  ప్రశాంతంగా  ఉంటుంది. 

 
ఈ  రోజుల్లో  నైతికవిలువలకు  ప్రాధాన్యత  తగ్గి,  ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలి . అనుకునే   వారి  సంఖ్య  పెరిగింది.  



అత్యాశ,  అనవసరపు  పోటీ  , అధికారదాహం  వల్ల    అణ్వాయుధాల  పోటీ     పెరుగుతుంది.  



 అందువల్ల , సమాజంలోని  ఎంతో  సొమ్మును  ఆయుధ  పోటీకే  ఖర్చు  చేయవలసి  వస్తోంది. 


అందువల్ల ,  పేదరిక  నిర్మూలన  కార్యక్రమాల  కోసం    డబ్బు  సరిపోవటం  లేదు.


పరస్పర  అపనమ్మకాల  వల్ల   ఇప్పుడు  ప్రపంచదేశాల  వద్ద  అణ్వాస్త్రాలు  గుట్టలుగా  పడి  ఉన్నాయి. 



  ఆయుధాల  గుట్టల  మధ్య   ప్రపంచం  ఇంకా  క్షేమంగా  ఉందంటే  దైవం  దయ   వల్లనే.  



 ఈ  ఆయుధాలు  చెడ్డవారి  చేతిలో  పడకూడదని  దైవాన్ని  ప్రార్ధించటం  మినహా  సామాన్య  ప్రజలు  ఏం  చేయగలరు  ?


ఆధునిక  విజ్ఞానాన్ని కూడా  కొందరు  వ్యక్తులు   మితిమీరి  ఉపయోగిస్తున్నారు. 


 ఈ  ప్రపంచంలో  మనుషులే  మాత్రమే  కాదు.  ఇతర  జీవులు  ఎన్నో  ఉన్నాయి.   


కొందరు  తమ అత్యాశ ,అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  పాడుచేస్తూ , ఇతరజీవులకు  ముప్పును  కలిగిస్తున్నారు.



మితిమీరిన   పారిశ్రామీకరణ  వల్లే   ఆమ్ల  వర్షాలు  పడుతున్నాయట.


  ఇలాంటి  ఎన్నో  పెను  ప్రమాదసూచికలు  కనిపిస్తున్నా  కూడా  ప్రజలు  సరిగ్గా  పట్టించుకోవటంలేదు.  నిమ్మకు  నీరెత్తినట్లు    ఉంటున్నారు.   



  ఇక   ప్రపంచాన్ని  దైవమే  రక్షించాలి.

దేశంలో, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు


జై  తెలంగాణా  జై  సమైక్యాంధ్ర , అంటూ  తెలుగు  వాళ్ళు  చేస్తున్న  ఉద్యమాలు  ముచ్చటగా  ఉన్నాయి. 

అయితే,  దేశంలో,  రాష్ట్రంలో  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.  పేదరికం,  అవినీతి,  లంచగొండితనం,  ఆర్ధిక  అసమానతలు, .ఇలా  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి.   ఈ   సమస్యల  పరిష్కారానికి  ప్రజలు  ఎందుకు  ఉద్యమాలు  చేయరు  ?  అన్నదే అత్యంత  ఆశ్చర్యంగా  ఉంది. 

స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  ఏళ్ళు  గడిచిపోయాయి.  రాష్ట్రంలో   ఎన్నో   ప్రాంతాలలో  ఫ్లోరైడ్  సమస్య  అలాగే  ఉంది. అవయవాలు  కొంకర్లు  పోయిన   ఫ్లోరైడ్  బాధితులను  చూస్తే    ఎంతో  బాధగా  ఉంటుంది.  ఈ  సమస్య  వల్ల  ఎందరో  బాధలు  పడుతున్నారు.   ఫ్లోరైడ్  సమస్య  తగ్గించటానికి  కుటుంబానికి  రోజు  వంటకు,  త్రాగటానికి  రెండు  బిందెల  శుద్ధజలం  అందిస్తే  చాలు.  ఫ్లోరైడ్  సమస్య  తీవ్రత  చాలా  వరకు  తగ్గుతుంది. 

రాష్ట్రంలో   ఎందరో  రైతులు,  చేనేత    శ్రామికులు  పేదరికాన్ని  తట్టుకోలేక    వేలాది  మంది  ఆత్మహత్యలు  చేసుకున్నారు.

..............................................

తమ  ప్రాంతపు  సమస్యలు  పరిష్కారం  కాకపోవటానికి  ఇతర ప్రాంతాల  వారే  కారణమని   ఒకరినొకరు  తిట్టుకోవటం    ఏమిటో  అర్ధం  కావటం  లేదు.

...............................................

 సీమాంధ్ర  వాళ్ళు  కూడా    రాష్ట్ర  విభజన  విషయంలో  తమ  అభిప్రాయాన్ని  ఇంతకుముందే   గట్టిగా  వినిపించితే  బాగుండేది.

 హైద్రాబాద్ లో  ఎన్నో  పెద్ద  సంస్థలు  ఉన్నాయి,  ఎన్నో  ఉద్యోగ  అవకాశాలు  ఉన్నాయి  హైదరాబాద్  బాగా  అభివృద్ధి  చెందింది.  సీమాంధ్ర  సరిగ్గా  అభివృద్ధి  చెందలేదు.  హైదరాబాద్  సహా  తెలంగాణా  విడిపోతే  మా  ప్రాంతాలలో  అభివృద్ధి  చెందాలంటే  చాలా  కాలం  పడుతుంది.  అని  సీమాంధ్రం  వాళ్ళు  అంటున్నారు.

  సీమాంధ్ర  వాళ్ళు   ముందుచూపుతో   తమ  పెట్టుబడిని  హైదరాబాద్  లో  కాకుండా  తమ  ప్రాంతపు  నగరాలలో  పెట్టుబడి  పెట్టి  అభివృద్ధి  చేసుకుంటే   ఇప్పుడు  ఈ  పరిస్థితి  వచ్చేది  కాదు.

............................................

సీమాంధ్ర  ప్రాంతాలు  హైదరాబాద్ లా  అభివృద్ధి  చెందకపోవటానికి    తెలంగాణా  ప్రజలు  కారణం  కాదు కదా  ! 

తమ  ప్రాంతాలను  కూడా  హైదరాబాద్ లా   అభివృద్ధి  చేయమని  సీమాంధ్ర  ప్రజలు  తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   అభివృద్ధి  చేయించుకోవలసింది . 

 ..........................................

 తెలంగాణాలోని   ఫ్లోరైడ్  సమస్యలు  , రైతుల  సమస్యలు,    చేనేత  శ్రామికుల  సమస్యలు,  పరిష్కారం  కాకపోవటానికి  సీమాంధ్ర  ప్రజలు  కారణం  కాదు కదా  ! 

 ఫ్లోరైడ్  వంటి  ఎన్నో  సమస్యలు  పరిష్కారం  చేయాలని   తెలంగాణా  ప్రజలు   తమ  ప్రజాప్రతినిధులను  గట్టిగా  అడిగి   పరిష్కారం   చేయించుకోవలసింది .

...........................................

 

 సమస్యలు  పరిష్కారం  కావాలంటే ఆ ప్రాంత  ప్రజలు  మరియు  ప్రజా  ప్రతినిధులు ,  అధికారులు   కృషిచేయాలి.    తమ  ప్రాంత  అభివృద్ధి    మరియు   సమస్యలు   పరిష్కారం  కోసం   ప్రజలు  ఉద్యమాలు   చేస్తే  బాగుంటుంది.

............................................

. ఇంకా  ఏమనిపిస్తుందంటే,.............

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన   వెంటనే   హైదరాబాద్ ను   రాష్ట్ర ముఖ్య రాజధానిగాచేసి....... కర్నూలు, వైజాగ్, విజయవాడలను ...... మిగతామూడు   ప్రాంతాలకూ   ఉప రాజధానులుగా చేసి , అభివృద్ధి చేస్తే బాగుండేదని అనిపిస్తుంది.

అంటే ,  ఒక ముఖ్య రాజధాని , మూడు ఉప రాజధానులు అన్నమాట.........

 అంటే,  రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతిచిన్నపనికీ హైదరాబాదుకు రాకుండా హైదరాబాదులోని ముఖ్య కార్యాలయాలకు ఉప కార్యాలయాలను ... ఉప రాజధానుల్లోనే ఏర్పాటు చేస్తే   బాగుండేది అనిపిస్తుంది. .

 అన్ని ప్రాంతాల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను తమ ప్రాంతంలోనే పెట్టి అభివృద్ధి చేసుకుంటే ........ ఇప్పుడు ఇలా బాధపడవలసి వచ్చేది కాదు అనిపిస్తుంది.

అప్పుడు ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు రాకుండా అందరూ బాగుండేవారు అనిపిస్తుంది.

..............................................

 ఇప్పుడు  కృష్ణా,  గోదావరి,  నీటి  వాటాల  కోసం   తెలుగువాళ్ళు  తమలో  తాము  తిట్టుకుంటున్నారు. 

 ఎగువ  రాష్ట్రాలైన  కర్ణాటక,  మహారాష్ట్రలు    మరిన్ని  నీటి  ప్రాజెక్ట్స్  కట్టుకుంటే  కృష్ణా,  గోదావరి  నీటి  కోసం  తెలంగాణా  , సీమాంధ్ర  వాళ్ళు  కొట్లాడుకునే  అవసరం  భవిష్యత్తులో  ఉండదు.

.....................................................

   ఈ  దేశ  ప్రజలు  ఎందరో  పేదరికంతో  అల్లాడుతుంటే   అభివృద్ధి  చెందిన   విదేశాల  వాళ్ళు  కూడా   మరింత  అభివృద్ధి  కోసం  ఈ  దేశం   వచ్చి  సంస్థలు  పెట్టి   లాభాలను  పొందుతున్నారు. మన  దేశంలోని   చిల్లర  మరియు  మధ్య  తరగతి   వర్తకులతో  పోటీ  పడుతున్నారు. 

ఇతరదేశాల  వాళ్ళు  ఇక్కడికి  వచ్చి   వ్యాపారాలు,  సంస్థలు  పెట్టుకుని  లాభాలను  పొందుతున్నా  మనకేమీ  బాధ  ఉండదు.  సాటి  తెలుగువారు  వచ్చి  సంస్థలు  పెట్టి  లాభాలు  పొందితే  మాత్రం  మనకు  బాధ  కలుగుతుంది.

మనలో  మనమే  కొట్టుకోవటం    మానివేసి  దేశాభివృద్ధికి  కృషిచేసినప్పుడే  అందరికి  అభివృద్ధి  ఉంటుంది. 

................................................

ఇక  ఉద్యోగాలు  గురించి    తెలుగువారి  మధ్య  జరుగుతున్న  మాటల  యుద్ధం  గమనించితే   ఎంతో  ఆశ్చరంగా  ఉంటుంది.  హైదరాబాద్లో  సీమాంధ్ర  వాళ్ళే  కాదు  ఇతరరాష్ట్రాల    వాళ్ళు  ఎందరో  వచ్చి  ఉద్యోగాలు,  వ్యాపారాలు  చేసుకుంటున్నారు. 

రాజధానిని  త్యాగం  చేసిన  సీమాంధ్ర  వాళ్ళు  వస్తే  మాత్రం  వలసవాదుల  వల్ల  మా  ఉద్యోగాలు,  వ్యాపారాలు  పోతున్నాయి .  అనటం  ఆశ్చర్యంగా  ఉంది.

ఆ  మాటకొస్తే   అన్ని  ప్రాంతాల  తెలుగు  వాళ్ళు    మెరుగైన  ఉపాధి  కోసం  ఇతర  రాష్ట్రాలకు  ,  ఇతర  దేశాలకూ   వెళ్తున్నారు. 

 మనము   ఉపాధి  కోసం  ప్రపంచం  అంతా  తిరుగుతున్నప్పుడు  మన ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అంటే  న్యాయం  కాదు  కదా ! 

 మన  ప్రాంతానికి  ఎవరూ  రాకూడదు  అన్నప్పుడు  మనమూ  ఇతర  ప్రాంతాలకు  వెళ్ళకూడదు ,  వెళ్ళిన   వాళ్ళు   తిరిగి  వచ్చేయాలి..  భవిష్యత్తులో  మన  పిల్లలను  విదేశాలకు  పంపకూడదు.

ఉపాధి  కోసం   మనము  ఇతర  దేశాలకు   వెళ్తే   కొంతకాలానికి  అక్కడి  వాళ్ళూ  మనల్ని  పొమ్మంటారు.  వాళ్ళ  ఉపాధి  అవకాశాలను  మనం  కొల్లగొడుతున్నామని.

 స్థానికులు  వలసవాదుల  మధ్య  జరుగుతున్న  గొడవలు  ప్రపంచమంతటా  ఎన్నో  దేశాలలో  జరుగుతున్నాయి.  అయితే  ఒకే  భాష   మాట్లాడే  వారి  మధ్య  ఇలాంటి  విభేదాలు  రావటం  పరిస్థితి  తీవ్రతను  తెలియజేస్తోంది. 

 ఇవన్నీ  గమనించే  మన  పూర్వీకులు  జననీ  జన్మభూమి  స్వర్గాని  కంటె  గొప్పవని  తెలియజేశారు. అందుకే   ఎక్కడివారు  అక్కడే  ఉండి  తమ  ప్రాంతాలను  అభివృద్ధి   చేసుకునేవారు.  అప్పుడు  ఇన్ని  సమస్యలు  ఉండేవి  కాదు.

............................

కొందరు  ఉద్యోగస్తులకు  ట్రాన్స్ఫర్ల  బాధ  ఒకటి. 

 ట్రాన్స్ఫర్ల  వల్ల  అక్కడికి  ఇక్కడికి  మారే  ప్రజల  పరిస్థితి  మరీ  ఘోరం    వారికి  తమ  స్థానికత  ఏమిటో  తెలియదు.    స్థానికులు  వలసవాదులు  అంటూ  గొడవలు  వచ్చినప్పుడు  తాము  ఏ  ప్రాంతానికి  చెందుతామో  దిక్కుతోచని  పరిస్థితి  వారిది. 

 అందుకే  సంస్థలు  ఉద్యోగాలు  ఇచ్చేటప్పుడు  స్థానికులకే  ప్రాముఖ్యతనివ్వాలి.

 ............................

 

ప్రజలు  తమ  సమస్యల  పరిష్కారానికి,  ఉద్యమాలు  చేయాలి  గానీ  రాజకీయులకు  ఉపయోగపడే  విధంగా  ఉద్యమాలను  చేసి  ఎందుకు  కష్టపడతారో  అర్ధం  కాదు. 

  దేశంలోని  రాష్ట్రాలను  విభజిస్తే  ఎంతో  అభివృద్ధి    ఉంటుందని     కొందరు  అరచేతిలో  స్వర్గాన్ని  చూపిస్తున్నారు. 

విభజించినా  మనకు  ఇదే  నాయకులు  ఉంటారు.  కదా  ! వీళ్ళు  ఫ్లోరైడ్  వంటి  సమస్యలను  ఇంతకు  ముందే  ఎందుకు  పరిష్కరించలేదో  అర్ధం  కాదు.

ఎన్నికలప్పుడు   అధికారం  కోసం  రాజకీయ  నాయకులు  ఎన్నో  వాగ్ధానాలను  చేస్తారు.  ప్రజలకు  అరచేతిలో  స్వర్గం  చూపిస్తారు. 

  ఎన్నికలలో  గెలిచిన  తరువాత  ఎక్కువమంది  నాయకులు  తాము  చేసిన  వాగ్ధానాలను  అమలు  చేయరు.  చేస్తే   స్వాతంత్ర్యం  వచ్చిన  ఇంతకాలం  తరువాత  కూడా  దేశంలో   ఇన్ని  సమస్యలు  ఎందుకుంటాయి  ?

...................................

ఎన్నో  భాషల  ప్రజలు  ఉన్న  మన  దేశంలో  భాషా  ప్రయుక్త  రాష్ట్రాల  ఏర్పాటు  వల్ల  ఎన్నో  లాభాలున్నాయి.  పరిపాలన  ఆ  రాష్ట్ర  ప్రజల  మాతృ  భాషలలో  ఉండటం  వల్ల  ప్రజలకు చట్టం  గురించి  సులభంగా  అర్ధం  అవుతుంది.

 ఎక్కువగా  తెలుగు  మాట్లాడే  ప్రజలున్న  ఒకే  రాష్ట్రంలో  తెలంగాణా  అని,  రాయలసీమ  అని,  కోస్తా  అని,  ఉత్తరాంధ్రా  అని  ఎందుకు  పేర్లు  పెట్టారో?  అంతా  మన  ఖర్మ.

 ఇప్పుడు  అన్ని  ప్రాంతాల  వాళ్ళు  రాజధాని  మా  ప్రాంతంలోనే  ఉండాలని  పట్టుబడుతున్నారు.  కొందరు  మూడు  లేక  నాలుగు  రాష్ట్రాలు  చేయమంటున్నారు.  కొందరు  మన్య  సీమ  రాష్ట్రం  కావాలంటున్నారు.  కొందరు   రాయలసీమలోని  కొన్ని  ప్రాంతాలను  కర్ణాటకలో  కలపాలంటున్నారు.  ఇలా   మనలో  మనము  తిట్టుకుంటుంటే  కొందరు  చిత్తూరు  సహా  తిరుమలను  తమ  రాష్ట్రంలో   కలపాలంటున్నారు.  

ఇవన్నీ  చూస్తుంటే  కొంతకాలానికి  తెలుగువాళ్ళకంటూ  ఒక్క   రాష్ట్రం    అయినా  ఉంటుందా ?  అనిపిస్తోంది.  

........................

 తమలో  తాము  గొడవలు  పడే  కుటుంబం  కాని  రాష్ట్రం  కానీ  దేశం  కానీ  బాగుపడినట్లు  చరిత్రలో  లేదు.

 

రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా ఎప్పటికీ ప్రక్కప్రక్కనే జీవించవలసిన ప్రజల మధ్యన ఇంతలా అపార్ధాలు, ఆవేశాలూ పెరగటం మంచిదికాదు.

అది ముందుముందు అనర్ధాలకు దారి తీస్తుంది.

 .........................

మనదేశ  రక్షణ శాఖలో    అన్ని  రాష్ట్రాలకు  చెందిన   సైనికులు    ఉన్నారు.  వాళ్ళందరూ   కాపలా  కాస్తుంటే  మనం  తీరికగా  మనలో  మనం  గొడవలు  పడుతున్నాము.

ఎంతైనా మనమందరం ఒకటి.

 ఈ సమస్యలు సామరస్యంగా , త్వరగా పరిష్కారం అవ్వాలనీ ,అప్పుడు పేదప్రజల సమస్యల పరిష్కారానికి  ఎక్కువ   సమయం ఉంటుందని ఆశిద్దాము.

 

ఈ  దేశ  ప్రజలతో పాటూ ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ ,ఇంకా లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...