Friday, October 5, 2018

లక్ష్మీదేవి అనుగ్రహానికి "శ్రీ లక్ష్మీ నారికేళం"

          శ్రీఫలాన్నే ఏకాక్షి నారికేళం,లఘు నారియల్,లక్ష్మీ నారికేళం, పూర్ణ ఫలం అని కూడ అంటారు.శ్రీఫలాలు క్షార వృక్ష జాతికి చెందినవి. సముద్ర తీర ప్రాంతాలలో క్షార వృక్ష జాతికి చెందిన వృక్షాలయందు పండుతాయి. క్షార వృక్షములకు చంద్రుడు అధిపతి.చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేని వాళ్ళు , బాలారిష్ట దోషం ఉన్నవారు శ్రీఫలాన్ని పూజించాలి. శ్రీపలాన్నే లఘు నారికేళం అని కూడ అంటారు.   

        శ్రీలక్ష్మీ ఫలాలు కొన్నిబూడిద రంగులో ఉంటాయి.కొన్ని తెలుపు రంగులో ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం చూడటానికి చిన్న సైజులో ఉన్న దీనిప్రభావం చాలా శక్తి వంతమైనవి. శ్రీలక్ష్మీ ఫలం అనేది కొబ్బరికాయ ఆకారంలో చిన్న,పెద్దసైజు ఉసిరికాయ ఆకారంలో ఉంటాయి. కొబ్బరి కాయలాగే దీనికి కూడా పీచు ఉంటుంది.పీచు దిగువున మామూలు కొబ్బరి కాయలకు ఉండే  విధంగానే మూడు బిందువులు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు.

        శ్రీ లక్ష్మీ ఫలాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగినస్త్రీల ఋతు సమస్యలు, అతి మూత్ర వ్యాదులు,తెల్ల బట్ట,సుఖ వ్యాదులు,గర్బ సంబంధ రోగాలు నయం అవుతాయి. మనస్సు ప్రశాంతంగా లేనివారు, ఎప్పుడు జలుబు,జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవు తున్నవారు శ్రీ లక్షీ ఫలంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని స్వీకరించిన అనారోగ్యాలు మటుమాయం అవుతాయి.  

       శ్రీలక్ష్మీ ఫలాన్ని ఏదైనా శుభముహూర్తంలో ఇంటికి తెచ్చుకొని శుభ్రమైన నీటితో కడిగి పవిత్ర గంగాజలంతో అభిషేకించాలి.ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసు కొని పసుపు,గంధంతో శ్రీలక్ష్మీ ఫలానికి మొత్తం పూయాలి.తరువాత కుంకుమతో బొట్లు పెట్టాలి.శ్రీఫలం చుట్టు పుష్పాలతో అలంకరించాలి. లవంగాలు, యాలకులు,పండ్లు నైవేద్యం ఇవ్వాలి. కర్పూరం, సాంబ్రాణితో ధూపం చూపాలి. తరువాత పసుపు గాని,ఎరుపు గాని, తెలుపు గాని వస్త్రాన్ని తీసుకొని అష్టలక్ష్మీ స్వరూపంగా ఎనిమిది శ్రీఫలాలను గాని,లాభలక్ష్మీ స్వరూపంగా పద కొండు శ్రీలక్ష్మీ ఫలాలను  ,కొన్ని నాణేలను గుడ్డలో చుట్టి పెట్టి లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావిస్తూ ధూపదీపనైవేద్యాలతో పూజించాలి. శ్రీలక్ష్మీ ఫలం తో పాటు పెట్టిన నాణేలను అప్పుడప్పుడు తీసుకొంటు,నాణేలను అప్పుడప్పుడు చేరుస్తూ ఉంటే ఇంట్లో ఎల్లప్పుడు ధనాభివృద్ధి ఉన్నట్లే. "ఓం శ్రీం శ్రియై నమః"అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపమాలతో జపం చేసి పూజ అనంతరం శ్రీలక్ష్మీ ఫలాలను ఎర్రటి వస్త్రంలో కుంకుమ, నాణేలను మూటకట్టి వ్యాపారసంస్ధలలోగాని ఇంట్లోగాని ఉంచిన సుఖ సౌఖ్యాలు, ధన దాన్యాభివృద్ధి కలుగుతాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...