Tuesday, January 29, 2019

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞులు, గుప్తదాత, దేశభక్తులు, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, స్వాతంత్ర్య సమరయోధులు.

   
‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ.

భారతీయ పత్రికలను బ్రిటిష్‌ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణ లోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి.

ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు.  కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు.

1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు గారు అనే పండితులు మద్రాసు నుంచి వెలువ రిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథి నాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య గారు తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట.

జీవిత విశేషాలు:
----------------------------
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు మే 1, 1867 న కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు. తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది.  ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్‌ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచి పెట్టేశారు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి.

అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులు గారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు కామాక్షమ్మ. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది. అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు.

వ్యాపారం:
---------------------

1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్‌ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులు గారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు.

ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవారు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవారు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నారు.

పత్రికా రంగం:
-------------------------
బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్‌ కాంగ్రెస్‌ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది.

1910 లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్‌ ప్రింట్‌ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో  వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్‌ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు.

 కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్‌ సభలకు వెళుతూ గిర్గావ్‌లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు  ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి  ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.

భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్‌ చేరుకున్న తరువాత 1914 లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి.

దేశోద్ధారక :
------------------
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభ దశ నుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను దేశోధ్ధారక అనే బిరుదు తో సత్కరించారు.

ఆంధ్ర గ్రంధమాల:
-----------------------------
 పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్ర గ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు.

ఈ సంస్థ 30 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు గారు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్ది మొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావు గారిని పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.

ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన. కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు.

ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం.  ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు.

రాజకీయాలు:
-------------------------
టంగుటూరి ప్రకాశం గారి కి సమకాలీనుడైన నాగేశ్వరరావు గారు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నారు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు గారు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకరు. నాగేశ్వరరావు గారి పై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

హరిజనోద్ధరణ:
-----------------------
పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాల బాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్‌ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు.

 విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్‌ ఆయన చలవతో ఏర్పడినదే.  అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి. 

విశ్వదాత:
--------------------
నాగేశ్వరరావు గారు అసమాణ దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవారు.. ఆయన ఇంటినుండి వట్టి చేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడారు..

భారతి పత్రిక:
--------------------
1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది.

ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆంధ్ర  ఉద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్‌ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు కూడా పంతులు గారే. పంతులు గారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణ దేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం.

ఈయన...జైల్లోనే "భగవత్గీత" మీద వ్యాసాలు వ్రాశారు..."భగవత్గీత ఒక్క విశ్వాసానికో ఒక్క ధర్మానికో చెందినది కాదు "అని పేర్కొనేవారు.

వీరు కొనుగోలు చేసిన గృహములో జరిగిన ఒప్పందమె శ్రీబాగ్ ఒప్పందం అంటారు. "శ్రీబాగ్" అంటే వీరి గ్రుహము పేరు.గాంధీగారు చెన్న పట్నానికి వచ్చినప్పుదల్లా శ్రీబాగ్ నే వారికి విడిది.

మరణం:
--------------
కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1938లో మరణించారు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన సేవ ఎనలేనిది. వీరు అల్లుడు శివలెంక శంభు ప్రసాద్ గారు పంతులు గారి తదనంతరం ప్రముఖ పత్రికలను చాలా కాలం నడిపి అభివృద్ధి చేశారు

తమిళనాడు ప్రభుత్వం వీరి గృహానికి చుట్టు పక్కల ప్రాంతాన్ని వీరి గౌరవార్ధం "నాగేస్వరపురం" అని నామకరణం చేసింది.

భారతదేశానికి వీరు చేసిన సేవలకు గుర్తుగా వీరిని "దేశోధ్ధారక నాగేశ్వరరావు గారు" అని సంబోధించి భారత ప్రభుత్వం వీరి ముఖచిత్రం తో పోష్టల్ స్ఠాంప్ ముద్రించినది.

నిత్య జీవితంలో కర్పూరం

ఒక ఎంతో మంచి మనిషిని పది మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిత్వం వున్న వారిని మనం ఆ మనిషి కర్పూరం లాంటి మనిషి అని అంటూ వుంటాం. అలా ఎందుకని అంటామో తెలియాలంటే  కర్పూరంతో మనకు లభించే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. జాగ్రత్తగా పరిశీలించండి మరి. - గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ,
.
కర్పూరాలలో 15 రకాలు ఉన్నప్పటికీ హారతి కర్పూరం, పచ్చ కర్పూరం చాలా ముఖ్యమైనవి.
హారతి కర్పూరాన్ని శుభాకరమైనదిగా అనాదిగా ఎన్నో దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో భావిస్తారు. ఎంతో చక్కని మంచి పరిమాళాన్ని వెదజల్లే ఈ కర్పూరాన్ని దేవాలయాల్లో పూజల్లో వాడతారు. భగవంతుడిక్లి హారతి ఇచ్చేందుకు ఈ పదార్థాన్ని వినియోగిస్తారు. పూజలో ఇదొక అమూల్యమైన పదార్థం.
కాని మనలో చాలా మందికి తెలియని విషయం ఏవిటంటే, పచ్చ కర్పూరం మన శరీరానికి మంచి ఔషదం. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని గాగే నీటిలో కూడా వేసొ ఉపయోగిస్తుంటారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ తొలగిపోయి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం.
కర్పూరం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.
.
కర్పూరం ప్రయోజనాలు

1. స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే మన శరీరం మీద బాక్టీరియా సహజంగానే శుభ్రమౌతుంది.

2. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలు వేసి మంచం కింద పెడితే దోమలు దరిచేరవు.

3.వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం ఒక పది చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి నేల మీద డైనింగ్ టేబుల్స్ మీదా మన రోజూ వండుకునే గాస్ స్టవ్ దగ్గరా వంట చేసుకునే స్థలంలోనూ తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.

4. టూత్ బ్రష్ మీద దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుబ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి.

5. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె లో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదు.

6.మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.

7.కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డ లో చుట్టి రాత్రి పడుకునేముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది .శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి.

8. మనిషిలోని అన్ని ఆర్గాన్స్ నీ పరిశుభ్రం చేసే శక్తికూడా దీనికి వుందని చెప్తున్నారు.

9. దురద తగ్గడానికి కొద్దిగా కర్పూరం తీసుకుని, కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. కర్పూరం పూర్తిగా కరిగిన తర్వాత ముఖం, శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

10. కర్పూరం పాదాల పగుళ్ళను నివారిస్తుంది: పొడిబారిన, పగిలిన పాదాలను నివారించడంలో కొబ్బెరి నూనెలో వేసిన కర్పూరం చాలా సహాయపడుతుంది. పాదాల పగుళ్ళ సమస్యను పూర్తిగా నివారించడంలో ఈ కర్పూరం నూనెను వేడి నీళ్ళలో వేసి ఆ నీటిలో పాదాలను అరగంట ఉంచాలి. ఆ తర్వాత నీటిలో నుండి బయటకు తీసి, పొడి టవల్ తో తుడవాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చేస్తే మంచి నిద్రకూడా పడుతుంది.

11. కర్పూరం  మొటిమలను కూడా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. పది తులసి ఆకులు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి అందులో చిటికెడు పచ్చ కర్పూరం వేసి రెండు నుంచి మూడు చెంచాల తేనె వేసుకుని రెండు గ్లాసుల వేడినీటిలో వేసుకుని ప్రతి రోజూ రాత్రి తాగాలి. ఉదయం పూట ప్రతి రోజూ అదే మిశ్రమాన్ని  తర్వాత అందులో రెండు మూడు చుక్కల కర్పూరం కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. అరగంట ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తులసి, ఇలా క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మొటిమలు సులభంగా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు.

12. చిటికెడు బెల్లం చిటికెడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది.

13. మహిళల్లో మర్మావయవాల దురద తగ్గాలి అంటే పచ్చ కర్పూరాన్ని రోజ్ వాటర్‌లో కలిపి మెత్తగా నూరాలి. దీనిలో దూదిని ముంచి దురద ఉన్న చోట 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగివేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

14. చిటికెడు కర్పూరం అయిదు వెల్లుల్లి పాయ రెబ్బలలో వేసి  వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం వృద్ది చెందుతుంది.

15. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి చాలామంది వయాగ్రా టాబ్లెట్స్ వాడుతుంటారు. కాని వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పచ్చకర్పూరంతో సహజసిద్ధమైన వయాగ్రా వంటి పదార్ధాన్ని సైడ్ ఎఫెక్టులు లేని దానిని మీ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. పచ్చకర్పూరం-5 గ్రాములు, జాజికాయ-5 గ్రాములు, జాపత్రి- 5గ్రాములు, ఎండుద్రాక్ష- 5గ్రాములు. వీటన్నిటిని తీసుకుని వీటిని బాగా నూరి పొడిగా చేసుకుని ఆ పొడిని పడుకోబోయే ముందు ఒక చిన్న చెంచాడు వేసుకుని వేడి తేనె నీటిలో వేసుకుని ఒక తాగడం వల్ల లైంగిక సామర్ద్యం కూడా పెరుగుతుంది. వీర్యవృద్ధిని కూడా పెంచుతుంది.

16. ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని కాస్త గంధం కాని, కాస్త వెన్నను కాని కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది. తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి.

పంచదారను, పసుపుగా వుండె బెల్లం, కృత్రిమ ఉప్పునూ వాడరాదు. వాటి బదులుగా సైందవలవణాన్ని తేనెనూ నల్ల బెల్లం, తాటి బెల్లం ను సమృద్దిగా ఉపయోగించుకోవచ్చు. అల్లం మసాలా మసాలా దినుసులు ఎర్ర కారం పూర్తిగా నిషేధం.

Tuesday, January 22, 2019



జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును.

1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి.
2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి.
3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి.
4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి.

అగ్నిభూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది.

పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే

అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28 సింహరాశిలో 26 ధనస్సురాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 81 తూర్పు దిక్కును తెలియజేస్తాయి.

భూతత్వ రాశులైన వృషభరాశిలో 30 కన్యారాశిలో 26 మకరరాశిలో 27 మొత్తం సర్వాష్టక బిందువులు 83 దక్షిణ దిక్కును తెలియజేస్తాయి.

వాయుతత్వ రాశులైన మిధునరాశిలో 36 తులారాశిలో 20 కుంభరాశిలో 31 మొత్తం సర్వాష్టక బిందువులు 87 పడమర దిక్కును తెలియజేస్తాయి.

జలతత్వ రాశులైన కర్కాటకరాశిలో 35 వృశ్చికరాశిలో 30 మీనరాశిలో 21 మొత్తం సర్వాష్టక బిందువులు 86 ఉత్తర  దిక్కును తెలియజేస్తాయి.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశుల సర్వాష్టక వర్గుల బిందువుల మొత్తం 87 వచ్చాయి.ఈ మొత్తం అగ్ని,భూ,జలతత్వ రాశుల సర్వాష్టక బిందువుల కంటే అధికంగా ఉన్నాయి కాబట్టి జాతకుడికి పడమర దిక్కు బాగా కలసి వస్తుంది.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Friday, January 18, 2019

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది?



ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.

నిద్ర ఎప్పుడు లేవాలి..?

ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.

సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.

మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.

వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.

ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?

నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.

దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.
Written by_ Mr గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కర్ణవేధ

చెవులం అనగా 'కర్ణవేధ' అను విశేషార్థం కలదు. కర్ణవేధ అనగా చెవులను పోటుతో వేధించడం. చెడు మాటలు విన్నప్పుడల్లా ఆ పోటు గుర్తుకు రావాలి అని అంతరార్థం. కర్ణవేధ చేయించినపుడు పురోహితుడు 'మాశృణు పాప్నానం, మాశ్రావయ పాప్నానం మోచ్ఛారయ పాప్నానం మాచర పాప్నానం మాపశ్య పాప్నానాం' అని చెవిలో చెప్పి బంగారుతీగను ఈ మంత్రంతో ప్రోక్షించి మొదట దైవానికి పురోహితునికి అర్పించి కంసాలికి ఇచ్చి చెవులు కట్టించెదరు.

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.

చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధల్రు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టిం చుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.

ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.

ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొస్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారు చేయించుకుని ధరిస్తున్నారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Thursday, January 17, 2019

ఏమైంది నాకు?

ఉదయం 6 గంటల సమయం…….ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం
చేస్తున్నాను. కానీ……లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి……
” ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? ” ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత
నొప్పి వచ్చింది…స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు
తెలియదు…..
కాఫీ కావాలి నాకు……..నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు…….ఇంటి బయట చాలా మంది గుంపుగా
ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు……అయ్యో! అది నేనే! దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు…..బిగ్గరగా
పిలిచాను……..నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను…. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును పట్టుకుని…….భార్యను పిలిచాను……..తనకు నా మాటలు
వినిపించలేదు……..మరో గదిలోకి వెళ్ళి చూశాను……
ఆ గదిలో మా అమ్మ …నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు
దు;ఖంలో…….

” నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ” అని బిగ్గరగా అరిచాను…….ఎవ్వరూ నన్ను
చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను…….అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు…..వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు…….
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి………..వాడితో సంవత్సరం నుండి నేను
మాట్లాడ్టం మానేశాను…….ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి
వాడెందుకు ఏడుస్తున్నాడు………అవును నేను చనిపోయాను……నిజంగానే
చనిపోయాను.
‘ దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని
ఇవ్వు…..ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా
ప్రేమగా చూసుకోలేకపోయాను…..నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..
నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను……..
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను……నేను వచ్చేలోగానే నా
బిడ్డ నిద్రపోయేవాడు……

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను……..చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని
వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను.” అని బి్గ్గారగా
ఏడుస్తున్నాను…….” దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు……నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి………నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! ”
ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు……కళ్ళు తెరిచి చూశాను.
నా భార్య……” ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
ఏమైంది మీకు ?” అని అడుగుతోంది.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
” నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని…..నీలాంటి అమ్మాయి నాకు
భార్యగా దొరకడం……నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా
ఉన్నావో తెలుసా ? ” అన్నాను……ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,

మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది… మీ ఈగో లను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి….అన్నీ పోగొట్టుకున్నతర్వాత
బాధపడి ఏమీ లాభం లేదు……కుటుంబంతో గడపండి………స్నేహితులతో
మంచిగా ప్రవర్తించండి……ఈ జన్మ దేవుడిచ్చినది……ఆనందంగా
జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా
మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!
……….ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు

Tuesday, January 8, 2019

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వేంకటేశ్వరున్ని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈమాసం మొత్తం  శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ థనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత ...మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్దారు. 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు.

ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 16వ రాత్రి 10గo.52ని ల నుంచీ ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికార్లు. ఈ నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్ధానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు. దీని వెనుక పురాణ గాధను పరిశీలిస్తే  గోదాదేవి  తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయన చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు.

గోదాదేవి రచించిన ఈ 30 పాశురాలను రోజుకోక పాశురం చోప్పున.... పటిస్తారు జీయంగార్లు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు అర్చకులు. అనంతరం యధావిదిగద అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున దరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.

ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం  భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి  బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరో వైపు  నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసిఆకులకు బదులుగా బిల్వ  పత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

జాతకకర్మ సంస్కారం

గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''

ఈ జాతకర్మ సంస్కారముచే శిశువు గర్బమునందు, గర్భ జలపానాది దోషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

"కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం జాతేన కర్మణా సగ్గ్స్కరిష్యే అని సంకల్పము, ఇందు ఫలీకరణ హోమమను పేర హోమకార్యముగలదు ఈ హోమ కార్యముచే, "ఆయుష్యాభివృద్ధర్థం, అనయోర్బాల సూతికయోః చండాలాదిపిశాచే భ్యోరక్షణార్థం. ఫలీకరణ హోమం కరిష్యే||" అని సంకల్పింతురు,

జన్మించిన బాలునికి పిశాచాది బాధలనుండియు, బాలగ్రహాది బాధల నుండియు, రక్షణార్థమై యీ ఫలీకరణ హోమము చేయుదురు. దీని వల్ల బాలారిష్టాదులకు శాంతికల్గును.

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను.

“స్నాతోలంకృతః పితా అకృత నాలచ్ఛేదం అపీతస్తన్యం అన్త్యెరస్పృష్టం ప్రక్షాళితం కుమారం మాతురుత్సాం  గేకారాయిత్వా..... అస్యకుమారస్య గర్భాంబు పాతజనిత దోష నిబర్హణాయుర్మేధాభివృద్ధి బీజ గర్భ సముద్భావైనో నిబర్హణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం జాతకకర్మ కరిష్యే “ అని ధర్మ సింధువు జాతకకర్మ  సంకల్ప విధానాన్ని నిర్దేశిస్తున్నది. దీన్నిబట్టి జాతకకర్మ ప్రయోజనం మాత్రమే కాక అది ఎప్పుడు చేయవలసిందో కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ విధానంలో కొంత ఇబ్బంది లేకపోలేదు.

ముహూర్త దర్పణం నందు
“తస్మిన్ జన్మముహూర్తే పి సూతకామ్టే ధవా శిశోః కుర్యాద్వైజాతకర్మాఖ్యం పితృపూజని తత్పరః” శిశువు జన్మించిన వెంటనే గాని పురుడు తొలగిన తరువాత గాని జాతకకర్మ చేయవలెనని నిర్దేశిస్తున్నది. ఈ విధంగా చేయబడుతున్నదే ఈనాటి బారసాల. ముహూర్త చింతామణిలో “తజ్జాతకర్మాది శిశోర్విధేయం పర్వఖ్యరిక్తోన తిధే శుభే హ్ని ఏకాదశ ద్వాదశకే పి ఘస్రేంమృధ్రువ క్షీప్రచారోడుశుస్యాత్” అని 11 వరోజుగాని, 12 వ రోజు గాని జాతకకర్మ చేయవలెనని చెప్పినది. పర్వతిధులు, రిక్త తిధులు, జాతకకర్మకు పనికిరావు. మృధు,ధృవ,క్షిప్ర, చర నక్షత్రాలలో ఏవైనా జాతకకర్మ చేయవచ్చును. చవితి, నవమి, చతుర్ధశి రిక్త తిధులు, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు, ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు, హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు, స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు, మంగళ, శనివారాలు జాతక కర్మకు పనికి రావని ధర్మ సింధువు వచనం.

ప్రస్తుతం బారసాలకు తిధులు నక్షత్రాలు చూడటం ఆచారంగా లేదు. పైగా అది వైదిక జాతకర్మ సంస్కారంగా నిర్వహించబడటం కానరాదు. అంతేకాదు జాతకర్మాదులను ప్రాయశ్చిత్త పూర్వకంగా ఉపనయనానికొక రోజు ముందుగా (ఒకొక్కప్పుడు ఆదేరోజు కూడా) జరిపించేయటం ఆచారంగా మారిపోయింది.

దేవర్షి పితృ ఋణాలు మూడింటిలో పిత్ర జననం వలన పితృ ఋణాలు విముక్తి కలుగుతుందని భారతీయుల పవిత్ర భావన. జాతకకర్మ, నామకరణం, డోలారోహణాలతో పాటుగా బాలింతరాలి చేత మొట్టమొదటగా నూతిలో చేద వేయించి నీరు తోడించే కార్యక్రమాన్ని కూడా కలిపి లౌకికాచారంగా ఇరవై ఒకటో నాడు నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కానవస్తుంది. ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా మాత్రం చూస్తున్నారు.

శిశువు జన్మించిన సమయము ననుసరించి, మాతా పితరులకు క్షేమకరమగునా? లేదా? యనియు, జన్మించిన శిశువునకు బాలరిష్టాది దోషములు లేకను, ఆయుర్వృద్ధికరమైన విధానమున్నదా? లేదా యనియు విచారింపదగియున్నది. అట్లు తల్లి దండ్రులకు, మేనమామలకు, జన్మించిన శిశువునకు దోషములున్నచో, నవగ్రహ, జప, హోమదానాదులచేతనూ తదితర జప హోమశాంతుల చేతను దోషనివారణమునకు శాంతికలాపములుగలవు వానిని యెరింగిన మహనీయులనడిగి, తగిన శాంతులు జరుపుకొని యంనతరము దాని జాతకర్మ నామ కరణాదులు జరపుకొనుట పెద్దలయాచారము. తల్లి దండ్రులకు మేనమామలకు, దోషకరమైన రీతిని కొన్ని జన్మలుండునుగాన విధిగ పెద్దలనడిగి శాంత్యాదులు జరుపుకొనుట శ్రేయస్కరము. ఈ జన్మ దోషాదులు జ్యోతిషము తెలిసిన పెద్దలు చెప్పగలరు. వానికి శాంతులు చక్కని పురోహితులు జరిపించగలరు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...