Sunday, March 4, 2018

శిక్ష అనుభవించాల్సిందే

🕉🕉🕉🕉🕉🕉

కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. ‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు... వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే. ... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది..’’ అంటూ ప్రశ్నించింది.

శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘‘వారు చేసిన పాపం ఏమిటి’’ రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు.‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు’ ‘‘ఏం తప్పు చేశారు?’’ ‘‘పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే, పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకుమించిన నేరమేముంది...’’ ‘‘మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా.

గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా’’ ‘నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధానుయోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి, పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు.

ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతిమంతమైనదేనా? న్యాయమైనదేనా? అని ఆలోచించాలి’’ సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్ముడు.

🕉🕉🕉🕉🕉🕉

కోరికలు తీర్చే శ్రీ కృష్ణ మంత్రములు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఈ మంత్రాలను జపిస్తే సుఖ-శాంతులతోపాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది.

  *శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :*

*" కృం కృష్ణాయ నమః "*

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి.

  *" ऊँ శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని సప్తదశాక్షర మహామంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు జపిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు.

  *" గోపివల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్నిరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

  *" గోకులనాథాయ నమః "*

అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.

  *" క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః "*

ఈ దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్నిరకాల సిద్ధులు సిద్ధిస్తాయి.

  *" ॐ నమో భగవతే శ్రీ గోవిందాయ "*

దీనిని ద్వాదశాక్షర శ్రీ కృష్ణ మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది.

  *" ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజనవల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీశత్వం ప్రాప్తిస్తుంది.

  *" ॐ శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి శుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు.

  *" ॐ నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే గోపీజనవల్లభాయ స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి, వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి.

*" లీలాదండ గోపీజనసంసక్తదోర్దండ బాలరూప మేఘశ్యామ భగవన్ విష్ణో స్వాహా "*

ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక లక్షసార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది.

*" నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా "*

ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి.

*" ॐ కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞ త్వం ప్రసీద మే. రమారమణ విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే "*

ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు.

వెలిగించవలసిన వత్తులు..............!!

1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.

2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వ్రత
సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు...

1. ఆరోగ్యము కొరకు - 1 ఏకవత్తి లేదా ద్వాదశ వత్తులు
2. మానసిక రోగములు నివారణకు - 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు - 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు - 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు - 4 చతుర్‌ వత్తులు
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు - 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు - 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు - 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు - 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ - 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు - 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు - 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు - 12 ద్వా దశ వత్తులు
14. నాయకత్వము కొరకు - 14 చతుర్దవ వత్తులు.

ఊరికే రారు మహానుభావులు

పరమేశ్వరుడు తనకు చేసిన దానికన్నా తనను నమ్ముకున్న భక్తులకు సేవ చేస్తే  ఎక్కువ ఆనందిస్తాడు. అందుకే పరమభక్తుడైన వాడిని, తనను నమ్ముకుని బతుకుతున్న వాడిని అతిథిగా పంపుతాడు. ఆ అతిథికి చేసిన మర్యాద చేత తను ప్రీతిచెందుతాడు. ఆ ప్రీతిని అడ్డుపెట్టి అభ్యున్నతినిస్తాడు. భాగవతం దశమ స్కంధంలో నందనందుని కుశలం తెలుసుకు రమ్మని వసుదేవుడు తన పురోహితుడైన గర్గుణ్ణి వ్రేపల్లెకు పంపుతాడు.

అతనికి సముచిత సత్కారాలుచేసిన నందుడు....‘‘ఊరకరారు మహాత్ములు వారధముల యిండ్లకడకు వచ్చుటలెల్లం గారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!’’ అంటాడు. అతిథులు సామాన్యుల ఇళ్ళకు రావడం సర్వశుభాలకు కారణం. ఊరకరారు మహాత్ములు... ఆయనకేం కోరికా? ఆయనకేం పంచలచాపు మీద, లేదా మీరు పెట్టే అన్నం మీద వెర్రా... ఆయనకేం కోరిక లేదు. ఆయన అలా వచ్చేవాడూ కాదు. వచ్చినా ఉండేవాడూ కాదు. కానీ ఆయన రావలసివచ్చింది, ఉండవలసి వచ్చింది. దేనికోసం? భగవత్‌  కార్యం మీద ఉన్నాడు. అతిథిగా ఈశ్వరుడే అలా పంపాడు.

ఇంటిలోపలికి వచ్చిన అతిథులకే కాదు, బాటసారులకు కూడా మనం పూర్వం అతిథి మర్యాదలు చేసేవాళ్ళం. ప్రధానదారుల వెంబడి ఇల్లు కట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా ప్రహరీగోడల బయట పొడవుపాటి అరుగులు కట్టేవాళ్ళు. అలసిసొలసిన బాటసారులు కాసేపు వాటిమీద సేదదీరేవారు. బయట ఎవరు వచ్చేదీ పోయేదీ కూడా ఆ ఇంటి యజమానికి తెలియదు. చూడటం తటస్థిస్తే మాత్రం ఫలితమేమీ ఆశించకుండా మంచినీళ్ళు, మజ్జిగ వంటివి ఇచ్చి సేవలో తరించేవారు. భక్తుడు సేదతీరడానికి నీ అరుగు ఉపయోగపడింది. కాబట్టి నీ పుణ్యం ఖాతా పెంచేస్తాడు.

భాగవతంలో ఒక ఘట్టం – యశోదాదేవి చిన్ని కృష్ణుడిని పెట్టుకుని కూర్చుని ఉంది. అకస్మాత్తుగా తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలిరూపంలో గిరగిర తిరుగుతూ వచ్చి కృష్ణుడిని ఎత్తుకుపోయాడు. ఈ హఠాత్‌ పరిణామానికి మొదట విస్తుపోయినా తరువాత తేరుకుని గుండెలు బాదుకుంటూ... దూడవెంట ఆవు పరుగెత్తినట్లు కృష్ణా, కృష్ణా అంటూ అరుస్తూ పోతున్నది. కృష్ణుడు భయపడిపోయిన పిల్లవాడిలాగా తృణావర్తుడి మెడ గాఠ్ఠిగా పట్టేసుకుని మెల్లగా బిగించడంతో వాడు ఊపిరాడక నేలమీద చచ్చిపడిపోయాడు.

యశోదాదేవి వచ్చి చూసేసరికి తృణావర్తుడి శరీరం మీద పిల్లవాడు ఆడుకుంటున్నాడు. గబగబా వచ్చి వాడిని ఎత్తుకుని... ఏ జన్మలో ఏ నోము నోచుకున్నానో... ఎవ్వరికి ఏమి పెట్టితినో... నా బిడ్డ నాకు క్షేమంగా దక్కాడు... అని అంటుంది యశోద. ఎప్పుడు ఏ అతిథి ఏరూపంలో వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాడో కానీ దాని ఫలితం ఈవేళ నాబిడ్డ పెనుప్రమాదం తప్పించుకున్నాడంటుంది. వాల్మీకి మహర్షి కూడా సుందరకాండలో...‘‘ఏమీ తెలియని చేతకానివాడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమేశ్వర స్వరూపుడే’ అంటాడు.

అయినప్పుడు ప్రాజ్ఞుడు, శాస్త్రం చదువుకున్నవాడు పరమభాగవతోత్తముడయినవాడు, పాత్రత కలిగినవాడు ఇంటిముందుకు వచ్చి నిలబడి ఆయన చేతిలో ఏదయినా పెట్టే అవకాశం దొరకడమంటే జన్మజన్మాంతర సుకృతమే అది. లేకుంటే నీకు అటువంటి అతిథి దొరుకుతాడా!  అదృష్టం పడితేనే అటువంటి అతిథి ఇంటికొస్తాడు. లేకపోతే నీ దగ్గరకెందుకొస్తాడు? ఎందుకు చెయ్యి చాపుతాడు? ఎందుకు స్వీకరిస్తాడు? స్వీకరించడు. అటువంటి మహాత్ములు ఇంట్లోకి అడుగుపెట్టడం చాలు. ఒక్కొక్కరికి పెట్టింది ఒక్కొక్కరి దశతిరగడానికి కారణమవుతుంది.

తులసి ఉపయోగాలు


🏹ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం తులసి కి ఎంతో ప్రాధాన్యం ఉంది.
🌿 తులసి సర్వరోగ నివారిణి.
🌿తులసి అమ్మ లాంటిది.
🌿తులసి ఒక సంజీవిని.
అందుకే ప్రతి ఒక్కరూ sriతులసి డ్రాప్స్ ని త్రాగే నీటి లో 1 లీటర్ కు ఒక చుక్క వేసుకొని త్రాగితే ఆరోగ్యం బాగుంటుంది.
💉 బ్యాక్టీరియాను నిర్ములించి నీటిలో ని P.H.వ్యాలుని బ్యాలెన్స్ చేస్తుంది.
తాగే నీటి ధ్యారా సంక్రమించే అనేక ఆరోగ్య సమస్యలకు జలుబు,దగ్గు,దమ్ము,గ్యాస్ట్రిక్,ఆస్తమా,చర్మ వ్యాధులు చుండ్రు నివారణ వెంట్రుకలు రాలుట మరియు ఇలా 200 రకాల అనారోగ్య సమస్యలు నివారణకు sriతులసి ఒక దివ్యమైనది.
: శ్యాంతులసి,రాంతులసి,శ్వేతతులసి,వనతులసి,నిమ్మతులసి
అనే 5 రకాల తులసినే శ్రీతులసి అంటారు

వేదాలను వెక్కిరించే వెధవలకు, మన ఘనమైన పురాతన విజ్ఞాన సర్వస్వం కలలో కూడా ఊహకందని నిజాలు :

వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును. ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

వాక్య పాఠం: దీనినే సంహిత పాఠం అని కూడా అంటారు. అంటే ఒకే క్రమంతో ఉచ్చారణ, స్వరం, మాత్రలను జాగ్రత్తగా మంత్రాన్ని పఠించడం. A-B-C-D-E పద్ధతిలో చెప్పే ఈ విధానం plain data transfer లాంటిది.

పద పాఠం: దీనిలో పదాలుగా విభజించి పదాలు పదాలు గా గుర్తు పెట్టుకోవడం. దీనివల్ల తప్పు జరగడం తక్కువ అవుతుంది. ఒకొక్క పదాన్ని ఒకొక్క సెట్ గా ఉంచుకుని వాక్య, పద పాఠాలు కలిపి చదువుకుంటే తప్పులుంటే తప్పక తెలిసిపోతాయి. SECDED అనే పద్ధతి నేటి ఎర్రర్ కరెక్షన్ లో అతి సాధారణంగా మనం చూస్తూ వుంటాం. ఇది అదే పద్ధతి. ఉదాహరణకు ఒకరి ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలంటే మొత్తం పది digits గుర్తుపెట్టుకోవడం వాక్యపాఠం పద్ధతి. దాన్నే రెండు రెండు digits గా గుర్తు పెట్టుకోవడం వల్ల తప్పు జరిగే అవకాశం తక్కువ. లేదా మూడు మూడు digits గుర్తు పెట్టుకుంటే తప్పు జరిగే అవకాశం మరింత తక్కువ.

ఈ పై రెండు పద్ధతులు ప్రాకృతిక పద్ధతులు. వాటి natural order లో చదువుతాము.
అలా కాక natural order ని చేదించి artificial order లో వెళ్తే ఎర్రర్ కరెక్షన్ కి మరింత అవకాశం వుంటుంది. వీటిలో మూడు ముఖ్యమైన పద్ధతులను చూడండి.

క్రమ పాఠం : A,B; B,C; C,D; D,E – ఇది ఒక పాయింటర్ పద్ధతి ప్రకారం చైన్ కనెక్షన్ లా మొత్తం encrypt + single redundancy మెథడ్. నేటి కాలంలో మనం విరివిగా చూస్తున్న చైన్ బేస్డ్ మెమరీ టెక్నిక్ ఇదే. చూడండి నేడు కొంతమందికి వండర్ మెమరీ అని పేరు చెప్పి ఎంత పెద్ద సీక్వెన్స్ అయినా గుర్తు పెట్టుకునేలా నేర్పుతున్నారు. మధ్యనుండి అడిగినా మరల మొత్తం సీక్వెన్స్ reconstruct చెయ్యవచ్చు. A  B  C D E …చూసారా ఇంజనీరింగ్ చదివిన వారు ఇతి యిట్టె పట్టేస్తారు పాయింటర్ లాజిక్. ఇది మనం నేడు చదువుకుంటున్నాం. కానీ ఈ పద్ధతి మనం వాడుకలో ఎప్పటి నుండి వాడుతున్నామో చూడండి.

జట పాఠం: A –B – B – A – A – B; B –C – C- B – B –C; C – D – D- C- C – D; (A-B) ఒక సెట్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ (B – A ) మరల (A – B ). దీన్ని redundancy, అలాగే క్రిప్టోగ్రఫీ కలగలిపిన పద్ధతి. ఇప్పుడు ఈ రకంగా డేటా పంపితే దీనినుండి మూలకమైన (A, B) ఏ రకంగాను డేటా లాస్ కి లోను కాక మొత్తం decrypt చెయ్యగలం. నేటి redundant codes, ఎన్క్రిప్షన్ methods మన జటపాఠం లో ఎలా నిబిడీకృతమై ఉన్నదో ఒకసారి చూడండి.

ఘనపాఠం: A – B – B-A – A-B-C - C-B-A- A-B-C; B-C- C-B- B-C-D – D-C-B – B-C-D; ఇదొక అడ్వాన్స్డ్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా డేటా మరింత బలంగా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అలాగే ఇటువంటి పద్ధతిలో డేటా లాస్ అనేది చాలా చాలా తక్కువ.
ఋగ్వేదం మొత్తం ఘనంలా పఠించాలంటే ఏకంగా 450 గంటలు పడుతుందిట. అంత వారు నేర్చుకుని అలా పఠించగలిగే సాధన వారికి కనీసం 25 సంవత్సరాల అభ్యాసం మీద వస్తుంది. ఇటువంటి ఘనమైన చరిత్ర, పద్ధతి మనది. తలచుకుంటేనే మన ఒళ్ళు గుగుర్పాటుకు గురవ్వక మానదు. ఇటువంటి గొప్ప పద్ధతులు పేటెంట్ అయి లేవు. వేదం జ్ఞానం అందరికీ అందాలని చెప్పింది తప్ప IP లా దాచుకోమని ఎన్నడూ భోదించలేదు..🕉🕉🕉
జయహో సనాతన హిందూ విజ్ఞాన భాంఢాగారం

పూజకు సిద్ధమై పోయారా? మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా?

మరైతే పదండి మీ తోటకి వెళ్ళి తెద్దాం ...అన్నట్టు   భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....🌠🌹

అహింస  ప్రథమం  పుష్పం!
           పుష్పం  ఇంద్రియ  నిగ్రహః !!

సర్వ భూత  దయా పుష్పం !
          క్షమా  పుష్పం  విశేషతః !!

జ్ఞాన  పుష్పం  తప: పుష్పం !
         శాంతి  పుష్పం  తథైవ  చ !!

సత్యం  అష్ట విధం  పుష్పో: !
          విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!

1.అహింసా పుష్పం:
            🌹🌠.....ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం....🌠🌹

2.ఇంద్రియ నిగ్రహం:
           🌹🌠 .....చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం....🌠🌹

3.దయ:
        🌹🌠 ....కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.....ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.....🌠🌹

4.క్షమ:
        🌹🌠 ....ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ....ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.....🌹🌠🌹

5.ధ్యానం:
         🌹🌠....ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం....ఇది దేవుని  నమస్కారం అంటే - నమ
  
                    !!!!ఓం నమః శివాయ!!!!

వస్తువులను ఉపయోగించుకోవాలి! బంధాలను ప్రేమించాలి!!

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా  ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు, వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.

"నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.

"అయితే...?"

"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."

అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!

నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా  స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
పడున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

భార్య చదువుతుంటే... విన్న భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.

"మన కొడుకు" అంది భార్య  కన్నీరు కారుతుండగా!

వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!

నీ విలువ ఎంత --?

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు "నా జీవితం విలువ ఏంత” అని.

అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా...

కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.

ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు.

కనుక ఆ వ్యక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరి నుండి వెళ్ళిపోయాడు.

తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు.

ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ, ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిదండీ ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్నా , మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు

... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు....

ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు....

వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి.

కానీ, నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి...Human LIFE  is a great boon🙏🙏
Love your life and try to associate with the people,  who can appraise your value. 👍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...