Sunday, April 29, 2018

శ్రీ నృసింహ జయంతి

ఈ రోజు  28-04-2018 , శనివారం, వైశాఖ శుద్ధ చతుర్దశి )

_*ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం _*
_*నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ॥*_

శ్రీ నృసింహ జయంతి. శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో....
అవతార వృత్తాంతం:
వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శస్త్రం చేత గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.
కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా, బెదరించినా, చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా, లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.
ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా. "ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి" అని భక్తితో ప్రహ్లాదుడు "ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు" అని చెప్పగా, దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు "ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి" అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.
పాంచరాత్రాగమంలో 70కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం
*నవ నారసింహమూర్తులు. అవి...*
1) ఉగ్ర నారసింహుడు
2) కృద్ధ నారసింహుడు
3) వీర నారసింహుడు
4) విలంబ నారసింహుడు
5) కోప నారసింహుడు
6) యోగ నారసింహుడు
7) అఘోర నారసింహుడు
8) సుదర్శన నారసింహుడు
9) శ్రీలక్ష్మీ నారసింహుడు
నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.
అందరికీ *నరసింహ జయంతి శుభాకాంక్షలు....

జై నారసింహ !  జైజై నారసింహ !!

ప్రపంచ తోబుటువుల దినోత్సవ శుభాకాంక్షలు

                      పుట్టింటి బంధం

వివాహానంతరం కూడా అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం అలాగే వుండటం కోసం మన పెద్దలు ఆచారం అనే జాబితాలో ఎన్నో అంశాలను చేర్చారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల బాగోగులు సోదరులు తెలుసుకోవాలనీ ... అవసరమైతే అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఆడపిల్ల ఇంట జరిగే ప్రతి శుభకార్యంలో మేనమామ ప్రధాన పాత్రను పోషించేలా చేశారు.

మేనకోడలికి చెవులు కుట్టించడం దగ్గర నుంచి .... వివాహ సమయంలో పెళ్లి కూతురిగా బుట్టలో వేదికపైకి తీసుకు వచ్చేంత వరకూ మేనమామగా తన వంతు పాత్రను పోషించేలా చేశారు. అలాగే ఆడపిల్ల కూడా పుట్టింటి వారిని మరిచిపోకుండా వుండటం కోసం ... ఆ కుటుంబంలో తాను ఎప్పటికీ ఓ సభ్యురాలినేననే విషయాన్ని గుర్తించేలా ఆమె జోక్యాన్ని ఏర్పరిచారు. ఈ కారణంగానే పుట్టింటి వారు ఏ శుభాకార్యాన్నయినా ఆడపిల్ల చేతుల మీదుగా జరిపించాలనే ఆచారాన్ని ప్రవేశ పెట్టారు.

ప్రతి ఆడపిల్ల కూడా సోదరుడి వివాహానికి అందరి కంటే ముందుగా వచ్చి పెళ్లి పనులు చక్కబెడుతుంది. ప్రేమానురాగాలు పంచడంలో తన తరువాతే ఎవరైనా అనేలా, సోదరుడిని పెళ్లి కొడుకుగా అలంకరిస్తుంది. ఆడపిల్లగా తనకి పుట్టినింటి పై ఎప్పటికీ హక్కు వుంటుందన్నట్టుగా, తనకి రావలసిన లాంఛనాలను అధికారికంగా తీసుకుంటుంది. ఒకవేళ పుట్టింటి వారి పరిస్థితి బాగోలేకపోతే, వారికి అన్నివిధాలుగా ఆసరాగా నిలబడటానికి కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోను వెనుకాడదు.

28/04/2018

అక్షతలు అంటే...?

రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం.  నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం.

   *శ్వేతాక్షతలు :*

తెల్లని ఈ అక్షింతలను  పితృకార్యాలలో ఉపయోగిస్తారు. వీటిని నీటితో తడిపి, తర్పణాదులకు కర్తలను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తారు.

   *హరిద్రాక్షతలు *

అలంకార ప్రియుడైన విష్ణువును అర్చించడానికి వైష్ణవ మత అనుయాయులు పసుపుతో చేసిన అక్షింతలను వాడతారు. స్వర్ణం లక్ష్మీదేవికి ప్రతీక కనుక హరిద్రాక్షతలు లక్ష్మీపూజలలో, వివాహాది శుభకార్యాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

  *కుంకుమాక్షతలు *

ఈశ్వరునికి, అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం. కనుక కుంకుమాక్షతలను శైవ, శాక్లేయులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

తలపై వేసే అక్షింతల శక్తిని బ్రహ్మ రంద్రం గ్రహించి నేరుగా శరీరాంతటికీ అందజేసి ఆశీర్వచన ఫలితాలను పొందగలరు.

  మానవుడిలోని దైవశక్తిని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడానికి మరియు మంత్ర శక్తిని, దేవతారాధన ఫలితాన్ని లేదా పెద్ద ఆశీర్వచన శక్తిని ఇంకొకరికి బదిలీ చేయడానికి జలము మరియు అక్షింతలు వాహకంగా ఉంటాయనేద మన శాస్త్రం చేబుతోంది. మంత్ర పఠనంతో మనస్సు పూర్వకంగా ఆశీర్వచనం చేస్తూ శిరస్సున అక్షింతలు వేసి ఆశీర్వచనం చేయడంతో బ్రహ్మరంధ్రం వాటి శక్తిని నేరుగా గ్రహించి, శరీరంలోని సహస్త్ర చక్రాలను ఉత్తేజపరుస్తూ శరీర మంతటికీ అందిస్తుంది. శరీరంలోని షట్‌ చక్రాలు #బ్రహ్మరంధ్రానికి అనుసంధానమై ఉంటాయి.

శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిసి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.మనుషుల్లో తమో, రజో, సాత్తియాకాలనే త్రిగుణాలకు కారకము. పెద్దలు వధువరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో , దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి .ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విధ్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమమామలు వివాహ సమయంలో శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థం ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపు కుంకుమకుంది , అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చుకొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతే కాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
వివాహ శుభకార్యంలో జీలకర్ర , బెల్లం పెటటే వేళ , మాంగల్యధారణ వేళ వధువరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి 'దీర్ఘాయుష్మాన్ భవ' ,'చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్యప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు'అంటూ ఆశీర్వదిస్తుంటారు.

వివాహంలో #తలంబ్రాలలో వధూవరులు దోసిలితో పోసిన తలంబ్రాలకు మంత్రోక్తంగా....

*ప్రజామే కామ సమృద్యాతాం*
*పశవోమే కామ సమృద్యాతాం*
*యజ్ఞోమే కామ సమృద్యాతాం*
*శ్రీయోమే కామ సమృద్యాతాం*

అంటూ గృహస్తుల జీవితంలో వారు ఎలాంటి మనోవాంచులను కోరుతున్నారో జీవితంలో వారికి ఎలాంటి కోరికల సిద్ధిద్వార సుఖ జీవనం గడుపుతారో మంత్రోక్తంగా చెబుతూ (గృహము, సంతానం, యజ్ఞము, ధనము, పశువులు, పంటలు ఇలా మరెన్నో కోరుకలు) వధూవరులు ఒకరి శిరసుపై మరొకరు తలంబ్రాలు పోసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీంతో గృహస్తు జీవితంలోమ తమన ఇష్ట కోరికలు తీరి వారిమధ్య అన్యోనత పెరుగుతుంది. అంతే కాకుండా వివాహంలో తలంబ్రాలు ఘట్టం వధూవరుల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. వారిలో అనురాగాన్ని పెంచుతుంది. ఇదే మన పూర్వీ మహర్షుల మన సనాతన ధర్మ గొప్పతనం. ప్రతి సంప్రదాయంలో ఒక గొప్ప విలువైన సైన్స్‌ సూత్రాలను కూడా ఇమిడ్చి ఉంచారు. అదే మన సంస్కృతి మహత్యం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...