ఖాట్మండూ నేపాల్ దేశపు రాజధాని. ఘోరఖ్‌పూర్,
వారణాసి నగరాల నుంచి రోడ్డు మార్గాన కానీ, ఢిల్లీ నగరం
నుంచి విమానంలో కానీ ప్రయాణం చేసి ఇక్కడకు
రావచ్చు. అంతకుముందీ ఊరిని కాష్ట మండప్‌గా పిలిచే
వారని ప్రతీతి. తరువాత కాలంలో కాట్‌మండప్ అనీ
తర్వాత కాట్మండనీ నేటికి ఖాట్మండ్ అన్న పేరున
స్థిరపడింది.
అందమైన హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్న ఈ ఆలయ దర్శనం అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మందిరం రెండంచెల బంగారు కప్పుతో, వెండి ద్వారాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అద్భుతమైన వాస్తు, శిల్పకళా సౌందర్యం ఈ మందిరంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలోని పశుపతి నాథ లింగం ’పరసువేది’ అంటారు. అయితే ఇందుకు తగిన సాక్ష్యాధారాలు లేవు. ఏదిఏమైనా పశుపతి నాధ లింగ దర్శనం మానవ జీవితంలో కెల్లా పుణ్యకార్యమన్నది జనవాక్యం.
నేపాల దేశో దేవేశి సాధకానాం సుసిద్ధితః ’
హిమాలయాల్లోని జటేశ్వరం మొదలు యోగేశ్వరం వరకు పరివ్యాప్తమైన దేశానికి నేపాళమని పేరు. ఈ ప్రదేశం సాధకులకు సిద్ధిప్రదమైంది. అందుకే నేపాల్‌నీ, అక్కడ వెలసిన పశుపతినాధుణ్ని చూడనిదే ఆధ్యాత్మిక అన్వేషణ పూర్తి అయినట్లు కాదని మన భారతీయుల విశ్వసిస్తాం. ఇక ఇక్కడ ప్రకృతి సౌంధర్యం కూడా మనోరంజకంగా ఉంటుంది. భారతీయులకు అత్యంత పుణ్యప్రదమైన ఈ క్షేత్రాన్ని అందరూ దర్శించి, పశుపతినాథుని అనుగ్రహం పొందవలసినదే
ఇట్లు
మీ సుబ్రహ్మణ్య శర్మ
No comments:
Post a Comment