Friday, March 16, 2018

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు


ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

పక్షంలోని తిథులు

*తిథి*

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథిఅంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పాడ్యమి (అధి దేవత - అగ్ని)విదియ (అధి దేవత - బ్రహ్మ)తదియ (అధి దేవత - గౌరి)చవితి (అధి దేవత - వినాయకుడు)పంచమి (అధి దేవత - సర్పము)షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)సప్తమి (అధి దేవత - సూర్యుడు)అష్టమి (అధి దేవత - శివుడు)నవమి (అధి దేవత - దుర్గా దేవి)దశమి (అధి దేవత - యముడు)ఏకాదశి (అధి దేవత - శివుడు)ద్వాదశి (అధి దేవత - విష్ణువు)త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)చతుర్దశి (అధి దేవత - శివుడు)పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (అధి దేవత - చంద్రుడు)అమావాస్య (అధి దేవత - పితృదేవతలు)

*తిథులు అధిదేవతలు ఫలితాలు*

తిథిఅధిదేవతచేయతగిన కార్యములుఫలితములు1. పాడ్యమిశ్రద్ధశ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకతశ్రుతము, శాస్త్రముల ఆచరించుట2.విదియమైత్రికొత్త పరిచయాలు, మంచి మిత్రులు, చికిత్సారంభంప్రసాదము, మనోవికాసం3.తదియదయఆర్తులకు సేవచేయుటఅభయం- నిర్భయము, అభయమిచ్చుట4.చవితిశాంతిధ్యానము, సత్సంగముసుఖము-కార్యసిద్ధి5.పంచమితుష్టితృప్తి పడుట, అసంతృప్తిని విడచుట, ప్రజాహిత కార్యములుముదము-ఆనందము6.షష్ఠిపుష్టిఆతిథ్యము, మంచి భోజనము, కలహములు రాకుండా జాకరూకతస్మయము- గర్వము కలుగుట7.సప్తమిక్రియ ప్రియమునిష్టతో కార్యాచరణ, తపసు, వేద్యయనం, శరణాగతియోగము-దైవముతో యోగము, విగ్నములు తొలగుట, ప్రయోజనము8.అష్టమిస్వాహాదేవివ్యాయాయము, అగ్నికార్య్సములు, పోటీలో నిలుచుట, సిద్ధిని పొందుటకు చేయవలసిన కార్యములు, ఆరోగ్యకరమైన ఆహారంశ్రమతో విజయమును సాధించుట9.నవమిఉన్నతిసత్పురుషుల సన్నిధిలో వినయముతో మెలగుటదర్పం, అపురూపమైన విద్య, అధికారం, శక్తి, తెలివి వలన కలుగు దర్పం. గుర్తింపు కొరకు గొప్ప కొరకు పాటుపడుట నివారించని ఎడల పేదరికం సంభవించును10.దశమిబుద్ధివివేకముతో కార్యాచరణ చేయుటఅర్ధము-ప్రయోజనము, పరిస్థితులను సద్వినియోగపరచుట11.ఏకాదశిమేధకార్యములందు శుభం, విద్యలను సద్వినియోగపరచుకొనుటస్మృతి-కావలసిన సమయంలో విద్యలు స్పురించి ప్రయోజనం సమకూరుట12.ద్వాదశితితిక్షపరిస్థితులను, ఇతరుల ప్రవర్తనను ఓర్చుకొనుటక్షేమం- ఓర్పువహించిన వారికి ఆపదలు రావు13.త్రయోదశిహ్రీకార్యములందు శుభం, నైతికంగా దిగజారకుండా జాగరూయకత వహించుటప్రశ్రయం- చెడుపనులను చేయకుండుట, ఇతరుల విశ్వాసం చూరగొనుట14.చతుర్ధశిమూర్తిఏ పని చేయక ఆత్మధ్యానం, పరమాత్మ ధ్యానం చేయుటసకల సద్గుణములు కలుగును15.పూర్ణిమసతీదేవి (శక్తి, షోడశి మాంగల్యాది దేవతలు)దౌవధ్యానం, దేవీ ఉపాసనప్రజ్ఞ-జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి15.అమావాస్యపితృలోకముబ్రహ్మచర్య సాధన, పరబ్రహ్మ ధ్యానంతేజస్సు, ధారణ శక్తి, జ్ఞానం, విజ్ఞానం, బ్రహ్మనిష్ట

*తిథి శూలలు*

తూర్పు :- పాడ్యమి నవమి.ఆగ్నేయము :- తదియ, ఏకాదశి.దక్షిణము :- పంచమి, త్రయోదశి.నైరుతి :- చవితి, ద్వాదశి.పడమర :- షష్ఠి, చతుర్ధశి.వాయవ్యము :- సప్తమి, పూర్ణిమ.ఉత్తరము :- విదియ, దశమి.ఈశాన్యము :- అష్టమి, అమావాశ్య.

ఇతర విషయాలుసవరించు

తిథి అనగా... తేది, దినము, రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాలలో విదియ, తదియ, ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది. పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆవిధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏతిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.

అతిథిపూజకు ప్రేమే పుష్పం

కుచేలుడు పరమ దరిద్రుడు. బ్రహ్మజ్ఞాని. ఒక్క కాసుదొరికితే పదివేల కాసులని మురిసిపోతాడు. ఉంటే తింటాడు. లేకపోతే మానేస్తాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. ఒకనాడు భార్య ...‘‘ఏమండీ, కష్ణుడు మీకు స్నేహితుడు కదా, ఒక్కసారి ఆయనను దర్శించుకుంటే  మన దరిద్రం తీరిపోతుందికదా !’ అంది. అక్కడికి వెడితే కష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. ‘‘నీ సలహా మంచిదే. కానీ స్నేహితుడి దగ్గరకు వెడుతూ ఏమీ పట్టుకెళ్ళకుండా ఎలా..ఏదయినా ఉందా...అయినా నీ పిచ్చికానీ నేను వెడితే మన దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇస్తాడా !!!’’ అని కుచేలుడు అన్నాడు.

కలలోసయితం భగవంతుని పేరెత్తని వాడికి కూడా ఆపదవచ్చినపుడు తలచుకోగానే వచ్చి రక్షించే స్వభావం ఉన్నవాడు కదా ఈశ్వరుడు ! అటువంటివాడు నిత్యం భగవంతుని నమ్ముకుని ఉండే మీ  కోర్కె తీర్చడా.. వెళ్ళండి’’ అని భార్య చెప్పింది.కుచేలం అంటే చిరిగిన బట్ట. ఆయన ఒంటిమీద ఉన్న బట్టకన్నా దానికి కన్నాలు ఎక్కువ. ఇంట్లో ఉన్న అటుకులను ఆ చినుగుల ఉత్తరీయంలోనే మూటగట్టుకుని కుచేలుడు ద్వారకా నగరంలో కష్ణుడి నివాసం వద్దకు చేరుకున్నాడు.

సాక్షాత్‌ లకీ‡్ష్మదేవి అవతారమైన రుక్మిణితో కలిసి కష్ణుడు హంసతూలికా తల్పంమీద ఉన్నాడు. బయట సేవకులు కుచేలుడిని ఆపి ఎవరికోసం వచ్చావు, ఎవరుకావాలని అడుగుతున్నారు. కష్ణుడు తన ప్రియస్నేహితుడని కలిసిపోదామని వచ్చానని చెప్పాడు. ‘ఎలా వీలవుతుంది ! ఇప్పుడు ఆయన రుక్మిణీదేవితో ఆంతరంగిక మందిరంలో ఉన్నారు. ఇప్పుడు కలిసే అవకాశం లేదు’అని వాళ్ళంటున్నారు.

దూరంనుంచి కష్ణుడు కుచేలుడిని చూసి గుర్తుపట్టిఒక్కసారిగా మంచం మీదినుంచి దూకి పరుగుపరుగున వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుని ‘ఎన్నాళ్ళకొచ్చావోయ్, మిత్రమా..’అంటూ తీసుకెళ్ళి తన శయ్యామందిరంలోని హంసతూలికాతల్పంమీద కూర్చోబెట్టాడు. అతిథి సత్కారం ఎలా చేయాలో కష్ణభగవానుడు మనకు నేర్పాడు. అలా కూర్చోబెట్టి‘రుక్మిణీ ! అలా చూస్తావేం. ఇతను బ్రహ్మవేత్త, నా బాల్యమిత్రుడు– కుచేలుడు. బంగారు చెంబుతో నీళ్ళు తీసుకురా’..అని చెప్పి పళ్ళెంపెట్టి అందులో కుచేలుడి పాదాలుంచి రుక్మిణీ దేవి బంగారు కలశంతో నీళ్ళుపోస్తుంటే కడిగి అలా కడిగిన నీటిని పరమ భక్తితో తన తలమీద చల్లుకున్నాడు.

పళ్ళెం తీసేసి తన ఉత్తరీయంతో పాదాలు తుడిచి, ఒళ్లంతా గంధం రాసి, విసెన కర్రతో విసిరి, మంచి ధూపం వేసి, హారతిచ్చాడు. ‘మిత్రమా! ఎన్నాళ్ళకొచ్చావ్, మనిద్దరి గురుకులవాసం గుర్తుందా..’ అంటూ పాతజ్ఞాపకాలు గుర్తుచేస్తూ మంచి భోజనం పెట్టి కాళ్ళొత్తి పక్కన కూర్చుని నాకోసం ఏదో తెచ్చి ఉంటావంటూ చొరవగా వెతికి ఉత్తరీయానికి వేలాడుతున్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకుని ‘చాలా బాగున్నాయి’ అంటూ పరమ ప్రీతితో వాటిని పరపర నమిలి తినేసాడు. మరో పిడికెడు తీసుకుని నోట్లో వేసుకోబోతుండగా రుక్మిణీదేవి వారించింది. ఇప్పటికే ఇవ్వాల్సిన ఐశ్వర్యమంతా ఇచ్చేసారు. రెండో గుప్పిటతో మిమ్మల్నీ నన్నూ సమర్పించుకుంటారని వారించింది.

అదీ అతిథి పూజంటే. ఇంటికొచ్చినవాడు ఏమిచ్చాడన్నది కాదు ప్రధానం, ఇంటికొచ్చినవాడిపట్ల నీవెలా ప్రవర్తించావన్నది ముఖ్యం. అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చేయక్కర్లేదు. ఎంత ప్రేమతో నీవు మాట్లాడిపంపించావన్నదికూడా అతిథిపూజే. అతిథిరూపంలో వచ్చినవాడికి నీకున్న వాటినిపెట్టి ప్రీతితో సేవించగలగాలి. వచ్చినవాడు ఈశ్వరుడు అన్నభావనతో, ఆ ప్రేమతో, ఆదరబుద్ధితో చేయాలి.

కనకధారా స్తోత్రం (తాత్పర్యము)

కనకధార స్తోత్రం చాల శక్తివంతమైనది. ఈ స్తోత్రంప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. మానాన్నగారు ఓ రోజు రైలు లో నెల్లూరు వస్తున్నారు. ఒకముస్లిం అతను మా నాన్న పక్కన కూర్చొని, కనకధారస్తోత్రం పుస్తకం తీసి చదువుతున్నారు, మా నాన్నఅది చూసి ఆశ్యర్యపోయారు. సాధారణంగా ముస్లింలుమన పుస్తకాలూ చదవరు కదా, తనని అడిగితే, "కనకధారా స్తోత్రం" చదివితే ధనముకు ఇబ్బంది వుండదు అని ఎవరోచెప్పారట, అప్పటినుండి చదువుతున్నాను, అంతా మంచేజరిగింది అని సమాధానం ఇచ్చారట. నమ్మకం వుండాలేకానీ ఈ మతాలు అడ్డురావు కదా. 
       శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద ఏమీ లేకపోయే సరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. "స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం. ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. 

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ 
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం 
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా 
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః 

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక 

ముగ్ధాముహుర్విదధతీ వదనే మురారేః 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని 
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ 
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః 

పెద్ద నల్ల కలువపై నుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక 

ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం 
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం 
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం 
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః 

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక. 

భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య 
హారావలీవ హరినీలమయీ విభాతి 
కామప్రదా భగవతోపి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాః 

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 

కాలాంబుదాలి లలితోరసి కైటభారేః 
ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ 
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక 

ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్ 
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన 
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం 
మందాలసం చ మకరాలయ కన్యకాయాః 

ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం 
ఆనందహేతు రధికం మధువిధ్విషోపి 
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః 

సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక 

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర 
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే 
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం 
పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ 

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక 

దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా 
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే 
దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః 

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక 

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి 
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై 

వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర
వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై 
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై 

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై 
నమోస్తు సోమామృత సోదరాయై 
నమోస్తు నారాయణ వల్లభాయై 

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు హేమాంభుజ పీఠికాయై 
నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై 
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై 

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు దేవ్యై భృగు నందనాయై 
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై 

భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై 
నమోస్తు దేవాదిభి రర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై 

తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము 

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యోతాని 
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే 

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక 

యత్కటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్ధ సంపదః 
సంతనోతి వచనాఞ్గ మానసై 
త్వాం మురారి హృదయేశ్వరీం భజే 

ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును 

సరసిజనిలయే సరోజ హస్తే 
ధవళతమాం శుక గంధమాల్యశోభే 
భగవతి హరివల్లభే మనోఙ్ఞే 
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం 

కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట 
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం 
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం 

దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

కమలే కమలాక్ష వల్లభేత్వం 
కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః 
అవలోకయ మా మకిఞ్చనానాం 
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః 

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము. 

స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం 
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాగినో 
భవంతి తే భువి బుధ భావితాశయాః 

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలు రగుచున్నారు.

సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం 
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్ 

శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును. 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...