Monday, August 19, 2013
కొబ్బరి బొండాలు
మొన్నెప్పుడో మిట్టమధ్యాహ్నం మండుటెండలో ( నిజమే .. మా బెంగుళూరులో మధ్యాహ్నం మూడింటికి ముప్ఫై మూడు డిగ్రీ లు మండు టెండ కిందే లెక్క మరి )..
మా ఇంటి దగ్గరే ఉన్న ఒక కొబ్బరి బొండాల అతని దగ్గరకు వెళ్లి ఒక బొండం కొట్టి ఇవ్వమని అడిగాను..
" నీరా అమ్మా? కంజా? " అని అడుగుతూనే మళ్ళీ మర్చిపోతానేమో అన్నట్టు " ఒకటి పాతిక రూపాయలమ్మా " అన్నాడు ఇవ్వమంటారా అన్న ధోరణిలో.
నేను ఆశ్చర్యపోయాను.. మొన్నటి వరకు ఇరవై కదా, అని.. మెల్లిగానే అడిగాను.
"సప్లై ఇల్లమ్మా "అన్నాడు.. ఇలాగే సాగితే రేపు ఇంకో ఐదు రూపాయలు పెంచాలేమో అన్నాడు కూడా ...
పైన పెద్ద బోర్డ్ మీద 'థమ్స్ అప్ 'బాటిల్ పెద్ద అక్షరాలతో చెప్తోంది . 'రెండు లీటర్లు కేవలం యాభై రూపాయలే నంటూ
" సప్లై లేదా? అంటే కాయలే కాయడం లేదా? "అన్నాను అనుమానం గా.
" లేదమ్మా! కాయలున్నాయట.. అవి సిటీకి రావడం కష్టం గా ఉంది , రోజూ రావడం లేదమ్మా కాయలు.. నేనేం చెయ్యను చెప్పండి. " అన్నాడు..
అలా మా మాటల్లోనే అతనొక బొండం కొట్టి ఇవ్వడం, అందులోని గ్లాస్ నీళ్ళు నేను తాగడం జరిగింది..
నేను డబ్బు ఇచ్చి వెనక్కి తిరిగానో, లేదో సర్రున వచ్చి ఆగింది కోల్డ్ డ్రింక్ ల వాన్.
పదంటే పది నిమిషాల్లో చుట్టుపక్కల ఉన్న ఆని షాప్ ల లోనూ కావలసిన సరుకు నింపేసి, ఖాళీ డబ్బాలని తీసుకుని దుమ్ము లేపుకుంటూ వెళ్లి పోయింది.
చల్లటి నీటినీ , దాని చుట్టూ చిగురాకులాంటి లేత మీగడ దుప్పటిని కప్పుకుని దాహాన్ని, తగు మాత్రంగా ఆకలిని తీర్చే ఈ ఫలరాజానికి సప్లై కష్టం , రంగు రంగుల నీళ్ళ సీసాల కి మాత్రం ఆ బెడదే లేదు.. ఎలా సాధ్యం?
'ఈ వేళ ఏదోటి ఆదరగొడదామ్'.. అంటూ తెలుగులోనూ,
ఎక్కడెక్కడికో ఎగి రేసి, పాకేసి, దూకేసి, చివరికి క్రేన్ ల ద్వారా ట్రక్ లని కూడా ఎగరేసి చివరికి కోల్డ్ డ్రింక్ తాగేసే హీరోలు ప్రకటనలు గుప్పించనందు వల్లనా? ( అన్ని ఫీట్ లు చెయ్యడం అవసరమా?)
'ఇదే మన క్రికెట్ టీం యొక్క అఫీషియల్ డ్రింక్ 'అంటూ ఊదర గొట్టేస్తున్నందుకా?
'యంగిస్తాన్ , ఇంకో స్థాన్ అంటూ కుర్రహీరోలు సో కాల్డ్ యూత్ ఐకాన్లు" ఉన్నందుకా?
ఇంత రీచ్ ఉండడం ధరలు తక్కువలో ఉన్నందుకా ?
ఎప్పుడో కోకోబోర్డ్ వాళ్లకి గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఒక ప్రకటన తప్ప పాపం కొబ్బరి బొండాలని పట్టించుకునే నాధుడు లేకనా ? పాపం..
కిలోల లెక్కన చక్కెరా , గాస్, కృత్రిమమైన రంగూ తప్ప మరేమీ లేని ఈ రంగు నీళ్ళ పాటి చెయ్యవా మన ప్రకృతి తల్లి ప్రసాదాలు అని బాధపడ్డాను...
కట్ చేస్తే .. బాద్షా లొకి..
కొత్త తెలుగు సినిమాలు విడుదలైన
వెంటనే వెళ్లి చూసేయ్యాలన్నంత వెర్రి లేదు కానీ, అనవసరంగా వెబ్సైట్ల రివ్యూ
లు చూసి, ఈ అరివీర భయంకర సినిమా రివ్యూలన్నీ ఏకబిగిన చదివేసి (
ఎవరు చదవమన్నారు?), చాలామంది' బావుంది'అన్నారు 'కామెడీ అదీ 'అంటే
మొత్తానికి ఓ
దుర్ముహూర్తాన మేమూ చూసేసాము ఈ సినిమా. పూర్తిగా చూసామని చెప్పలేను
ఎందుకంటే చివరలో లేచి వచ్చేసాము కనక.. మనుషుల సహనానికీ ఒక హద్దు ఉంటుంది
కదా మరి..
ప్రపంచం నలుమూలనుంచి నలభై రకాల రివ్యూలు రాసాకా నేను ఈ పోస్ట్ రాసి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ మూడు గంటల మా సమయం ఎలా డ్రైనేజ్ కలిసిపోయింది తలుచుకుంటేనూ, ప్రేక్షకులని ఉత్త మతిలేని వాజమ్మలుగా భావిస్తూ, మేమేం తీసినా చూసేస్తారులే అనుకున్న వారి నిర్లక్ష్యాన్ని తలుచుకుంటే వచ్చే కోపం ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు, బాగా లేట్ గా నైనా సరే బయట పెట్టకపోతే నా ఆరోగ్యం దెబ్బ తింటుందేమో నని ఇలా ధైర్యం చేస్తున్నానన్నమాట.
నీ కోసం' అంటూ మొదలు బాగానే పెట్టాడు ఈ దర్శకుడు శ్రీను వైట్ల.. నిజంగానే మనకోసమే 'ఆనందకరమైన' సినిమాలే తీస్తాడు, 'మనందరివాడు' ( ఇదో చెత్త సినిమా) కదా అనుకున్నాం. కొంచం కొత్తగా "ఢీ" అంటే మనం ఢీ అన్నాము.. దాంతో అతను ఇంక ఇలాగే సినిమాలు తీస్తాను మీరు 'రెడీ' గా ఉండాలి మరి అన్నాడు.. మనం వెర్రి వెంగళప్పల్లా సరే అన్నామ్. అంతే .. ఇంక రెచ్చిపోయి తనే దర్శకింగ్ ననుకుని వీర దూకుడు తో తలా తోక లేని కధలకి కామెడీ రంగుల హంగులేసి మనమీదకి వదలడం మొదలు పెట్టాడు.. నమో వెంకటేశా అని దండం పెట్టుకుని మరీ.. అది వెంకీ అయినా, దుబాయి శీను అయినా ఒకే సీను.. వైట్ల శీను.. ఒకప్పుడు
ఉత్త ప్రేమకధలకి పరిమితం అయితే ఇప్పుడు సరదాగా వాటికి పోలీస్, డాన్ ల కలర్
అద్దుతున్నారు , అతను , ఆయన రచయితలూ కలిసి.. గ్లోబల్ ఫీల్ కదా.. '
ప్రపంచం నలుమూలనుంచి నలభై రకాల రివ్యూలు రాసాకా నేను ఈ పోస్ట్ రాసి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ మూడు గంటల మా సమయం ఎలా డ్రైనేజ్ కలిసిపోయింది తలుచుకుంటేనూ, ప్రేక్షకులని ఉత్త మతిలేని వాజమ్మలుగా భావిస్తూ, మేమేం తీసినా చూసేస్తారులే అనుకున్న వారి నిర్లక్ష్యాన్ని తలుచుకుంటే వచ్చే కోపం ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు, బాగా లేట్ గా నైనా సరే బయట పెట్టకపోతే నా ఆరోగ్యం దెబ్బ తింటుందేమో నని ఇలా ధైర్యం చేస్తున్నానన్నమాట.
చిన్నప్పుడు అమ్మ అనేది.. అందరి పెళ్ళిళ్ళూ ఒకటే, బొమ్మలు ( పెళ్లి
కొడుకు, పెళ్లి కూతురు) మాత్రం
మారతారు అని.. చిత్రంగా శ్రీను వైట్ల సినిమాలలోనూ అంతే. హీరో, హీరోయిన్ తప్ప ఒక పెద్ద పెళ్ళికి సరిపడేంత తారాగణం, అన్ని సినిమాలలోనూ సుమారుగా వాళ్ళే , ఎప్పుడూ ఏదో హడావుడి.. పాడుతూ, ఆగుతూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, గజిబిజి గా తిరుగుతూ స్క్రీన్ అంతా నింపేస్తూ ఉంటారు. సినిమాలకి హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టినట్టు స్క్రీన్ ఫుల్ అని కూడ ఒక బోర్డ్ పెడితే ఈయన సినిమాలే మొదట ఉంటాయి, నాదీ గారెంటీ . నాజర్, జయప్రకాశ్ రెడ్డి, సుధా, సురేఖ వాణి, తనికెళ్ళ భరణి ఇలా... అసలన్ని పాత్రలెందుకో నాకు అర్ధం కాలేదు ఈ సినిమాలో కొంతమంది సీనియర్ నటులకి కూడా ఒక్క సరి అయిన డైలాగ్ లేదు. వాళ్లకి లేని బాధ నీకెందుకు అంటే నేనేమీ చెప్పలేను.
మారతారు అని.. చిత్రంగా శ్రీను వైట్ల సినిమాలలోనూ అంతే. హీరో, హీరోయిన్ తప్ప ఒక పెద్ద పెళ్ళికి సరిపడేంత తారాగణం, అన్ని సినిమాలలోనూ సుమారుగా వాళ్ళే , ఎప్పుడూ ఏదో హడావుడి.. పాడుతూ, ఆగుతూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, గజిబిజి గా తిరుగుతూ స్క్రీన్ అంతా నింపేస్తూ ఉంటారు. సినిమాలకి హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టినట్టు స్క్రీన్ ఫుల్ అని కూడ ఒక బోర్డ్ పెడితే ఈయన సినిమాలే మొదట ఉంటాయి, నాదీ గారెంటీ . నాజర్, జయప్రకాశ్ రెడ్డి, సుధా, సురేఖ వాణి, తనికెళ్ళ భరణి ఇలా... అసలన్ని పాత్రలెందుకో నాకు అర్ధం కాలేదు ఈ సినిమాలో కొంతమంది సీనియర్ నటులకి కూడా ఒక్క సరి అయిన డైలాగ్ లేదు. వాళ్లకి లేని బాధ నీకెందుకు అంటే నేనేమీ చెప్పలేను.
వాళ్ళని చూసి ఈ మధ్యన మన సినిమాల్లో 'నేను డాన్ అయ్యి తీరుతాను' అని శపధాలు చెసుకోవడాలు.. అక్కడికి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినట్టూ.. లేదా చాలా గొప్ప కెరియర్ ఆప్షన్ అయినట్టు.. అదే నిజమైతే మొన్నటి వరకూ IIT అనీ, ఈ మధ్యన కొంచం రూట్ మార్చి సి.ఏ, చీ.పీ.టీ అని ఊదరగొడుతున్న విద్యాసంస్థలన్నీ ఇక పైన ' బెస్ట్ డాన్' అవడానికి మాసంస్థ బెస్ట్. ఆల్ ఓవర్ ది వరల్డ్ లో ఫస్ట్ రేంక్ .. ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తారేమో మరి ( వరల్డ్అనిఎందుకన్నానంటే మరి సినిమాలలో ఈ డాన్ లు ఎప్పుడూ మన దేశం లో ఉండరు కదా,). మరి మలేశియానో, మరో ఏషియానొ ఎలాలంటే ఆ మాత్రం ఉండాలి కదా..
ఆశీష్ విద్యార్ధి వంటి నటుడు పోషించిన జోకర్ లాంటి పాత్రని చూస్తే జాలి వేసింది, మంచి నటుడికి పట్టిన దౌర్భాగ్యం అది.. ఆయనెలా ఒప్పుకున్నాడో ?
సంఘసేవట, ఏదైనా మంచి పని చేస్తేనే కానీ అన్నం, టిఫిన్ కూడా తినని హీరోయిన్ గా కాజల్ ప్రహసనం ఎంత విసిగించిందో చెప్పటం కష్టం. ఇలాంటి తిక్క చేష్టలు చెయ్యడానికి కూడా ఇటలీలు, టర్కీలు వెళ్ళాలా? రివెంజ్ నాగేశ్వరరావు, సిరేంజ్ సుబ్బారావు ( ఇది నా పైత్యమే,, కావాలంటే ఎవరైనా వాడుకోవచ్చు..:)) లాంటి పాత్రల ద్వారా పండిన కామెడీ ఎంతో రాసిన వాళ్ళకి, తీసిన వాళ్ళకి తెలియాలి. వేఫర్ థిన్ స్టొరీ అంటారు కధ ఎక్కువగా లేకపోతే.. పూతరేకు థిన్ అనాలేమో ఈ సినిమాని.. .. ఎంత వెతికినా కధే కనబడదు.. కిచిడీ లా వండిన కలగూరగంప తప్ప.. ఒకవేళ ముందే కంచికి పంపేసారేమో ..
ఎక్కడ, ఏ మూల హిట్ అయిన కాన్సెప్ట్ నైనా వదలని గొప్పవారు మనవారు. అందరికీ ఎంతో బాగా తెలిసిన Inception concept ని ఇంత చీప్ గా ఇమిటేట్ చెయ్యవచ్చా? అనిపించి, కామెడీ అంటే ఇదేనా? అనుకునేలా చే శారు. మంచి పాత్రలతో ప్రేక్షకులకి బ్రహ్మానందాన్ని ( చాలా సినిమాలలో విసిగిస్తే విసిగించవచ్చు, అది వేరే విషయం) పంచి , సినిమాల విజయాలలో ముఖ్య పాత్ర పోషించే ఆ నటుడిని అన్నిసార్లు కొట్టించడం అవసరమా? కామెడీ పేరిట కాకోఫోనీ తప్ప మరేమీ చూపలేరా? ఎన్ని రకాల గెటప్ లు వేసినా, ఎంత కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడినా, ఎన్ని దేశాలలో తిప్పినా, చివరికి కామెడీ నే తురుపు ముక్కగా నమ్ముకున్నారా? దానివల్లనే సెకండ్ హాఫ్ లో హీరో ఎవరో? కమెడియన్ ఎవరో తెలియలేదా? సెన్స్, సెన్సిబిలిటీ, లాజిక్, కామన్ సెన్స్ ఇలాంటి పదాలన్నీ పట్టించుకోకుండా పది కామెడీ సీన్లు, ఐదు పాటలు, ఆరు ఫైట్లు , మిగిలిన టైములో ఏదో కలిపేసి అతుకుల బొంత గా కుట్టేసి మనమీదకి వదిలేస్తే చాలనా వారి అభిప్రాయం?
ఇలా రాస్తూ పొతే ఎన్నో ప్రశ్నలు.. మొత్తానికి పేరులోనే తప్ప గమనంలో నత్త నడక నడిచిన దూకుడు , వీర బాదుడు బాదేసిన బాద్షా సినిమాలు సినిమా హాళ్ళల్లొ మనిషికి మూడేసి వందలు చదివించుకుని చూసి వచ్చాకా, చస్తే మళ్ళీ శీను వైట్ల సినిమా థియేటర్ లో చూడను అని నాకు నేనే ధైర్యం చెప్పేసుకున్నాను..
ఇంక లాస్ట్ గా , అంటే చివరాఖరుగా ( నాకు ఈ దర్శకుడి లక్షణాలు వచ్చేస్తున్నాయా? చెప్పినదే మళ్ళీ రకరకాలుగా చెప్తున్నాను) నేను చెప్పే దేమిటంటే ఆ .. ఫేక్టరీలలొ ఫార్ములా ప్రకారం గా కొలతలు ఎక్కడా తేడా రాకుండా తయారయ్యే కోల్డ్ డ్రింక్ లన్నీ ఒకేలా ఉంటాయి, చూడడానికీ, రుచి చూడడానికీ కూడా.. అచ్చం ఇప్పుడొస్తున్న సినిమాల లాగానె. అందులో ఏ వెరైటీ ఉండదు, రుచి కూడా మొదట బావున్నట్టనిపించినా తర్వాత విసుగు వస్తుంది. ఆరోగ్యసమస్యల గురించి నేను చెప్పనే చెప్పను. ప్రస్తుతం అదే పరిస్థితి ఈ దర్శకుడి సినిమాలది అనిపిస్తోంది నాకు.
ఒకే గెలలోవైనా సరే, ఒకే చెట్టువైనా సరె.. ప్రతీ ఒక్కటీ విలక్షణం గానూ, ఆహ్లాదకరమైన రుచితోనూ ఉండే గంగా బొండాలకెందు లోనూ సాటి రావుఈ డ్రింకులు. అందుకే ఇంటి భోజనంలాగే కొబ్బరి బొండాలు కూడా ఎప్పుడూ బావుంటాయి అని నా అభిప్రాయం. మన దర్శకులు కూ డా ఇలా పాకేజ్ద్ కోలా డ్రింకుల్లాంటిసినిమాలు కాక 'గంగా బొండాల్లాంటి స్వచ్చమైన సినిమాలు తీస్తే చూడాలని ఆశ.. దురాశ అంటారా?
ఏమో మరి.. మీరే చెప్పాలి..
This is my wishful thinking..
మనిషి విలువలు మనిషికే తెలియదు
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనం కన్నా ధైర్యం మిన్నగా ఉండాలి. సమాజంలో
ఎదురయ్యే సమస్యల సుడిగుండాల అంచులనుంచి తప్పించుకోవాలంటే ధైర్యం ఉండాలి.
భర్తను కోల్పోయిన భార్యగాని, ప్రమాదాలలో సర్వస్వం కోల్పోయిన
నిరాశ్రయులుగాని, శారీరకంగా అంగవికలత్వం పొందిన చిన్నారులుగాని ధైర్యాన్ని
కోల్పోకుండా జీవనయానం సాగించాలి. ధైర్యం మన వెన్నంటి ఉంటే సాహసం లక్ష్మి మన
వెంట ఉంటాయి. అంగవికలురు ఎంత పట్టుదలతో ధైర్యంతో విజయాలబాట
పట్టినవారున్నారు. ఎందరో విద్యార్థులు పోలియో బారిన కాళ్ళు కోల్పోయినా
ఉత్తమ ఇంజనీరు, అధ్యాపకులుగా పేర్గాంచారు.
ధైర్యం ఏ సమయంలోనూ విడువరాదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లు స్ఫూర్తితో
ప్రతి ఒక్కరూ జీవనయానం సాగించాలి. చాలామంది ఊకదంపుడు ఉపన్యాసాలు
ఇస్తుంటారు. వారిని వేదిక మీదకు పిలిచి మాట్లాడమంటే మాటరాదు. కారణం ధైర్యం
లేకపోవడమే గదా!
యుద్ధంలో పోరాడటానికి ఒకడు శిరస్త్రాణం - విల్లంబులు - రధం గుఱ్ఱాలు
రథచోదకుడూ అన్నీ ఏర్పరచకుంటాడు కానీ యుద్ధంలో పోరాడే ధైర్యం లేక వెనుకడగుగు
వేస్తుంటాడు అందుకనే ముందు మనసులో ధైర్యం సాహసం ఉండాలి. దానితో మనలను
విజయలక్ష్మి వరించి వస్తుంది.
కొంతమంది ఇంటర్వ్యూ హాలులోకి వెళ్ళగానే విద్యార్థులు బిగుసుకుపోతారు వారికి
నోట మాట రాదు- నోరు పిడచ కట్టుకుపోతుంది. ఏం సమాధానాలు చెప్పాలో తెలియక
అల్లాడుతుంటాడు ఇలా కావడం వారిలో ధైర్యం లేకనే. తెలివిలేకకాదు.
ఏ విషయంలోనైనా అలసత్వం, నిరాశనిస్పృహ, అవినీతి లాంటి జాడ్యాలను దగ్గరకు
రానీక ధైర్యంతో అన్యాయం ఎదిరించాలి. కష్టాల్లో ధైర్యంతో పోరాడేవారిని మనం
అభినందించాలి. అభిమానించాలి. 1893లో చికాగోలో స్వామి వివేకానందుడు తన
వాణితో భారతీయ సంస్కృతీ వైభవాన్ని ధైర్యంగా ఎలుగెత్తి చాటి
చిరస్మరణీయుడైనాడు. మన భారతీయ కీర్తి పతాకం రెపరెపలాడటానికి ఆయన ధైర్యం
స్ఫూర్తే కూడా కారణమే. ధైర్యంకల్గి ఉంటే దాని వెంటే అన్నీ నడిచొస్తాయి.
ధైర్యానికి ఒక పరీక్ష ఉంటుంది అదీ ఓటమే! ఓటమిని ఎదుర్కోవటానికి ధైర్యం
కావాలి. మనోధైర్యంతో పోరాడాలి. మహాభారతంలో పాండవులు రాజ్యాన్ని, సిరిని
కోల్పోయినా ధైర్యాన్ని పట్టుదలను కోల్పోకుండా అరణ్య అజ్ఞాతవాసాలను
విజయవంతంగా పూర్తిచేయగలిగారు గదా!
ధైర్యం మన కంటికి కన్పించని ఆయుధం. అలాంటి ఆయుధం మన వెంటుంటే ఎంతటి శత్రువునైనా పాదాక్రాంతం చేసుకోవచ్చు.
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ధైర్యంతో పోరాడితే పోయేదేం లేదు వచ్చే విజయం తప్ప అన్నట్లుగా మనం ముందుకుసాగాలి.
ఎన్ని కష్టాలైనా అనుభవించు కానీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యే సాహసే
లక్ష్మిః అన్నారు మన పెద్దలు. కనుక ఏ విషయంలోనైనా మంచిని గ్రహించాలి,
చెడును దగ్గరకు రానీయకూడదు. మనకు తెలిసిన మంచిని నలుగురికి తెలియచేయాలి.
అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి ధైర్యంగా చెప్పాలి. అలా మాట్లాడటమే న్యాయం
చేయడం అవుతుంది. ఎవరికి వారు నీతిగా నిజాయతిగా వ్యవహరిస్తే చాలు ధైర్యం
దానంతట అదే ప్రోది అవుతుంది.
జాగృతి
వేదభూమిగా
పేరుగాంచిన ఈ పవిత్ర భారతావని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఎందరో
మహనీయులకు జన్మనిచ్చి తన ప్రత్యేకతను చాటుకుంటూ అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ
ధర్మసంస్థాపనలో ముందంజ వేస్తూ విశ్వమానవులకు సవ్యమైన జీవన విధానాన్ని
బోధిస్తూ దివ్యంగా విరాజిల్లుతోంది.
ఈ పవిత్ర భారతావనిని పరిపాలించిన ఎందరో రాజులు వేదములను ప్రమాణంగా
పరిగణించి లోక క్షేమానికై తహతహలాడుతూ యజ్ఞయాగాదులను నిర్వహించి
పునీతులయ్యారు.
‘్ధర్మో రక్షతి రక్షితః’- ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది
అనే అమూల్య సూక్తిలోని అంతరార్థం ఇదియే. యజ్ఞయాగాదుల ద్వారా హవిస్సును
దేవతలకు అగ్నిముఖంగా అందించుట- ఆనందపరవశులైన దేవతలు సకాల వర్షాన్ని
కరిపించి పాడిపంటలు వృద్ధిచెందుటకు సహకరించుట-
వేదములను ప్రమాణంగా స్వీకరించి ధర్మబద్ధమైన పాలన అందించే ప్రభువు
కొలువుదీరిన రాజ్యంలోని రాజులు యజ్ఞయాగాదులు, దానధర్మాలు, అన్న సంతర్పణలు,
మార్గమునకిరువైపులా చెట్లనునాటే కార్యక్రమాలు, పొరుగు రాజ్యం నుండి వచ్చిన
అతిథి అభ్యాగతులకు విశిష్ట మర్యాదపూర్వక సన్మాన సత్కారాలు - కవులు,
పండితులు, సంగీత నృత్య కళాకారులు తదితర సరస్వతీ పుత్రుల పట్ల విశేషమైన
రీతిలో గౌరవమర్యాదలు...చేస్తూ పరమేశ్వర కటాక్ష సిద్ధికిఅర్హత పొందినట్లుగా
భావించేవారు.
అలా కాక ఏ రాజైతే యజ్ఞయాగాదులు అనవసరమనే దురుద్దేశ్యంతో ఉంటూ ‘నేను
చెప్పిందే వేదం’ అంటూ అధికార మదాంధుడై విర్రవీగుతాడో ఆ రాజుచే
పరిపాలింపబడుతున్న రాజ్యంలో అతివృష్టి అనావృష్టులు కలిగేవి. ఆ రాజ్యంలోని
ప్రజలను, పశుపక్ష్యాదులను నానా బాధలకు గురయ్యేవారు.
అలాంటి రాజులు కొంత కాలం తర్వాత వారి తప్పును తెలుసుకొనేవారు. తమతమ
ప్రవర్తనను ధర్మవిరుద్ధంగా ఉందని అనుకుని దాన్ని సరిదిద్దుకొనేవారు. అలా
కానప్పుడు వారిని సరిదిద్దడానికి దేవుడుఏదో ఒకరూపంలో అవతరించి వారిని
సరిచేసేవారు. తిరిగి భూమి సస్యశ్యామలం అయ్యేది.
సిరిసంపదలంటే పచ్చనోట్లు, బంగారు ఆభరణములు, ఆకాశ సౌధాలు... ఇవి కావని,
దేవతల అనుగ్రహం కరువైతే ఇవన్నీ ఎందుకూ పనికిరావని, ధర్మచక్రం నిరాటంకంగా తన
పని తాను చేసుకుని పోతేనే ఏ కాలంలోని వారైనా నిజమైన సుఖశాంతులను
అందుకోగలుగుతారు. ఈ ధర్మకార్యాలు అనేవి ప్రతియుగంలోనూ ఒక్కటే ఉంటాయ. కాని
దేశకాల రీత్యా అనుసరించాల్సిన ధర్మాన్ని జనులే తెలుసుకోవాలి. ధర్మం
ఆచరించడం ముఖ్యమైన కర్తవ్యంగా ప్రతివారు భావించాలి. ధర్మసూక్ష్మాన్ని
తెలుసుకోకుండా ఇతరులను అవహేళనచేయడం కాని అధర్మాన్ని ధర్మంగా భావించడం కాని
చేయకూడదు. ధర్మాచరణలో అందరూసమానులే. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని
ధర్మదేవతే రక్షిస్తుంది. ఇదే ఎన్నో యుగాలల్లో నిరూపించబడింది.
అందుకే కలియుగం ఈ యుగంలో ఇది చేయచ్చు అది చేయొచ్చు అని కాక ధర్మప్రకారమే
జీవితాన్ని నడిపించాలి. సత్యం పలుకడం, ఇతరులను కష్టపెట్టకుండా ఉండడం,
ఇతరులకు చేతనైనంత దానం చేయడం అనేవి ఏయుగానికైనా వర్తిస్తాయ.
మనిషి విలువలు మనిషికే తెలియదు
జన్మలన్నింటిలో మానవజన్మ ఉత్తమైనది.. ఉత్కృష్టమైనది! ఏ ఇతర ప్రాణులకు లేనన్ని ఉత్తమ గుణాలు, విలువలు, అవకాశాలు మనిషికిచ్చాడు దేవుడు. అలాగే తను శోధించి, సాధించవలసినవి ఎన్నో వున్నాయి. ఎన్నో విలువలతో కూడిన మానవ జీవితానికో లక్ష్యం.. గమ్యం వుంటుంది.. ఉండాలి! అప్పుడే మనిషి సుఖపడగలుగుతాడు. అటువంటి వ్యక్తులు... లక్ష్యసాధకులతో కూడిన సమాజమూ రాణిస్తుంది.
లక్ష్యసాధకులకు వ్యక్తిత్వం, విలువలు అవసరం. లక్ష్యసాధనకు కృషి అవసరం. వారిలో ఉన్నతమైన భావాలుంటాయి. హృదయం స్పందిస్తుంది. ఇటువంటి వారు మన సమాజంలో ఏ రంగంలోనైనా వుండవచ్చు!
విలువలను గురించి ప్రసంగించడం వేరు, విలువలతో బ్రతకడం వేరు. అందరికీ ‘నీతి- నియమాలను’ పాటించాలన్నమాట తెలుసు. కాని, దాన్ని ఆచరణలో పెట్టడం, కొనసాగించడం అంత సులువైన పని కాదు. ‘నీతి’ మంచిదని తెలుసు, కాని నీతిగా మసులుకోవడం తెలియదు. భక్తి ఉత్తమమైనదని తెలుసు.. ఆ భక్తి నిలుపుకోవడం తెలియదు. అన్నిటికి సాధన అవసరం. సాధనమున పనులు సమకూరు ధరలో అన్నారు. కాని సాధన కొనసాగించడమూ సాధ్యం కాదు. ‘మంచితనం’ అన్నిటికన్నా శ్రేష్ఠమైన విలువ అని తెలిసి కూడా మంచిగా జీవితం కొనసాగించలేరు!
‘నిజమే పలకాలి’ అన్నమాట, చిన్నతనం నుంచి జీర్ణంచుకుపోయిన విలువ! ‘నిజం చెప్పు నాయనా’ అని బోధించి, ‘నాకోసం ఫలానా వారొస్తే..’ నాన్న ఇంట్లో లేడు అని చెప్పు అని తండ్రి అంటే, అప్పుడా కొడుకు పరిస్థితి ఎలా వుంటుంది. వాడు దేనిని నమ్మాలి? దేనిని ఆచరించాలి. నాన్న చెప్పిన సూక్తినా? నాన్న చెప్పమన్న మాటనా?
విలువ యొక్క విశిష్టత ఆంతర్యంలో అందరికీ తెలుసు! విలువలు మనిషికి ఒక ఉన్నత స్థానాన్నిచ్చేందుకు దోహదపడతాయని, ఆదర్శప్రాయుని చేస్తాయని తెలుసు, కాని సమాజంలో ఈనాడు ఆ మాట మనిషికి జీర్ణం కావడం లేదు.
నిజం పలకాలనేది ఒక విలువ. అవసరమైనప్పుడు అబద్ధం చెప్పవచ్చు అనేది రెండవ విలువ! సంకట పరిస్థితులలో మనిషి ఏ విలువకు విలువనిస్తాడు? వంటబట్టని ఆహారం వాంతియైనట్లు, వంటబట్టని విలువలనే త్యజిస్తాడు. అబద్ధానే్న ఆలింగనం చేసుకుని అందలం ఎక్కిస్తాడు.
అన్యాయాలకు సేవ చేస్తాడు. ఎందుకంటే. మొక్కనాటగానే ఫలమందినట్లు.. అన్యాయాలు, అక్రమాలే తక్షణం ఫలితాన్నిచ్చి, అవసరాలు తీర్చి, అక్కున చేర్చుకుని, అందలం ఎక్కిస్తాయి. నిలకడమీద తేలే నిజాన్ని ఆశ్రయించేకన్నా, అబద్ధాలాడి ఆనందడోలలూగడం సమంజసంగా తోస్తుంది. దాదాపు ప్రపంచమంతా ఈ బాటలోనే నడుస్తోంటే.. విలువలు.. విలువలు అంటూ విలువలను పట్టుకుని వ్రేలాడుతానంటే ఆ మనిషికే విలువ లేకుండా పోతున్న రోజులివి! నలుగురితోపాటు నారాయణా అనుకుంటూ విలువలకు స్వస్తి చెప్పి దారి తప్పి నడిస్తే నారాయణుని చేరే దారీ తప్పినట్లే! మనుష్యుల మనస్తత్వాలు ఇలా మారడానికి కారణం జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడమే!
మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చి శాశ్వతంగా వుండిపోడు. మనిషే కాదు ఈ ప్రపంచంలో ప్రతీది అశాశ్వతమే! అలా అని వాటిమీద ముద్రపడే వుంటుంది. కాని మనిషి దాన్ని గమనించకపోవడంవల్లే తను ఈ లోకంలో శాశ్వతంగా వుండిపోతానన్నట్లు భ్రమలలో పడి వస్తు సంచయనం చేస్తాడు.
మానవ జన్మ అరుదుగా లభించే జన్మ. ఎప్పటికీ మనిషి తిరిగి మనిషిగానే పుడతాడని ఖచ్చితంగా చెప్పలేనిది. బ్రతుకును తీర్చిదిద్దుకునే అవకాశమున్నది మానవజన్మలోనే! అందువల్ల అజ్ఞానం అంతం చేసుకుని జీవిత విలువలను తెలుసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు.. వాటిని వంట పట్టించుకుని సక్రమంగా వినియోగించుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మానవ జన్మకు న్యాయం చేకూర్చినవారై సమాజంలో విలువున్న మనిషిగా గుర్తించబడడమేగాక భగవంతుని దృష్టిలోనూ పడి ధన్యులవుతారు. బ్రతుకు విలువ వెలకట్టలేనిది!
హ్యాకింగ్ అంటే ఏమిటి?
మనిషి
మేథస్సు నుండి పుట్టిన అద్వితీయమైన ఆవిష్కరణలు కంప్యూటర్లయితే కంప్యూటర్ల
ద్వారా ఇతరుల రహస్యాలను చేదిస్తారు హ్యాకర్లు. వినడాని కి ఈ మాట కొత్తగా
ఉన్నా హ్యాకర్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్
కార్యకలాపాలు బాగా పెరుగుతున్నాయి.ఈ తరుణంలో హ్యాకింగ్ పట్ల ప్రాథమిక
ఙ్ఞానం ప్రతిఒక్కరూ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
హ్యాకింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ఒక కంప్యూటర్ నకు గానీ వెబ్ సైటు కి గానీ అనధికారికంగా చొరబడటాన్నే హ్యాకింగ్ అంటారు.
మనం రూపొందించుకునే మెయిళ్ళు, వెబ్ సైట్ల భద్రత కోసం
పాస్వర్డ్ను ఎంతో రహస్యంగా ఇచ్చుకుంటాం. హ్యాకర్లు ఆ పాస్వర్డ్ లను
కనిపెట్టి అక్రమంగా చొరబడి విలువైన సమాచారాన్ని, రహస్యాలను తెలుసుకునే
ప్రమాదం ఉంది.
పాస్వర్డ్ ఇచ్చేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు:
పాస్ వర్డ్ అన్నది సింపుల్ గా ఉండకూడదు.
(చాలా మంది పాస్ వర్డ్ గా వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు పెట్తుకుంటారు.) తెలిసిన వారి ఊహ కందే విధంగా పాస్వర్డ్ ఉండకూడదు.
కనీసం 13 నుండి 14 క్యారెక్టర్లు ఉండాలి.
పాస్వర్డ్ లో ఒక అంకె , ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, , ఒక స్మాల్ లెటర్ ఉండాలి.
పాస్వర్డ్ ఎంటర్ చేసే చోట కీ లాగర్స్ ఉన్నయేమో చూసుకోవాలి.
ఒక వేళ ఉన్నట్లయితే అవి మీ పాస్వర్డ్ ను పట్టేస్తాయి.
అవి ఉన్నచోట పాస్వర్డ్ ను ఎంటర్ చేయకూడదు.
బయటి ప్రాంతాల్లో ( ఇంటర్నెట్ లలో ఈ విషయం గుర్తుంచుకోక తప్పదు.)
మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే వెబ్సైటు నిజమైనదా లేక నకిలీదా అన్న సంగతి కూడా పరిశీలించుకోవాలి.
మీరు పాస్వర్డు ఎంటర్ చేసే ముందు ఎస్ .ఎస్. ఎల్. సర్టిఫికేట్
(లాగ్ సింబల్ లో ) ఉందో లేదో సరి చూసుకోవాలి.
అది హెచ్.టి. టి.పి.ఎస్. కనెక్షన్ అయితే మంచిది.
దాదాపు అన్ని మెయిల్ సర్వీసులు (జిమెయిల్, యాహూ,హాట్మెయిల్ మున్నగునవి) హెచ్.టి.పి.ఎస్. నే వాడుతున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా యూ.ఆర్.ఎల్. సరైనదీ కానిదీ చూసుకోవాలి.
పాస్వర్డ్ ప్రతిసారీ టైప్ చెయ్యటమెందుకులే అని కొందరు బద్ధకించి కంప్యూటర్ కి పాస్వర్డ్ గుర్తుంచుకోమన్న ఆదేశాన్ని ఇస్తారు.
పర్సనల్ కంప్యూటర్ల కి మినహా ఇది ఇంకెక్కడా అంత శ్రేయస్కరం కాదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి, ఆరు అక్షరాలు ఉన్న ఎలాంటి పాస్ వర్డ్ నైనా 8 గంటలలో ఛేదించవచ్చు ..
అదే ఏడు అక్షరాలున్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి రెండు రోజులు పదుతుంది.
కానీ ఎనిమిది అక్షరాలు ఉన్న పాస్‍వర్డ్ ని ఛేదించడానికి అచ్చంగా మూడు సంవత్సరాల కాలం కావాలి
పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే చాలా వరకు మీ మెయిళ్లకి భద్రత లభించినట్లే.
హ్యాకింగ్ రకాలు:
హ్యాకింగ్ చేసే వారిని బట్టి, చేసే విధానాన్ని బట్తి అది రెండు రకాలు.
వైట్ హాట్ హ్యాకర్స్ :
హ్యాకింగ్ పద్ధతులపై ఆసక్తితో , అధునాతన శాస్త్రీయ విఙ్ఞానాన్ని అందించే
కంప్యూటర్ అదనపు ఆవిష్కరణలపై ఆసక్తితో కంప్యూటర్ పరిఙ్ఞానాన్ని
పెంపొందించుకోవటం కోసం హ్యాకింగ్ చేసే వాళ్ళని ’ వైట్ హాట్ హ్యాకర్స్ ’
అంటారు.ఇతరుల కంప్యూటర్లలోని సమాచారాన్ని , సాఫ్ట్ వేర్లని పాడుచేయకుండా
కేవలం వ్యక్తిగత ఙ్ఞానాన్నిపెంచుకోవడానికి హ్యాకింగ్ చేస్తారు.వీరివల్ల
ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
బ్లాక్ హ్యాకర్స్:
స్వీయ అవసరాలకోసం , స్వంత లాభాలకోసం ఇతరుల సమాచారాన్ని, రహస్యాలను దొంగిలించటానికి ఇతర కంప్యూటర్ల పనితీరును పాడు చేయటానికి హ్యాకింగ్ ను మార్గంగా ఎంచుకునే వారిని బ్లాక్ హాట్ హ్యాకర్స్ అంటారు.వీరివల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అందువల్ల సంస్థలు వీరి బారిని పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి.
మీ,
సుబ్రహ్మణ్యం
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...