వివాహ సంబంధాల్లో కుజదోషం గురించి..
మనలో
 ప్రతి ఒక్కరూ సహజంగా వివాహ సమయంలో జాతకాలు చూసేటప్పుడు కుజదోషం అనే 
పదాన్ని వింటూనే ఉంటాం. కుజదోష నిర్ధారణ విషయంలో ఒక్కో పండితుడు ఒక్కోరకంగా
 నిర్ధారిస్తారు. అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా?
నవగ్రహాలలో కుజుడిది మూడో 
స్థానం. కుజుడికి మంగళుడని, అంగారకుడని పేర్లు కూడా కలవు. మేష, వృశ్చిక 
రాశులకు ఈయన అధిపతి. మకరం ఉచ్చస్థానం, కర్కాటకం ఇతనికి నీచస్థానం. మృగశిర 
చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు.
కుజుడు కోప స్వభావం కలిగినవాడు కావడంతో కుజుడి ఆధిపత్య కాలంలో సోదరుల మధ్య వివాదాలు, రుణబాధలు, భూవివాదాలు తలెత్తుతాయి. 
వివాహం చేసుకోబోయే వధూవరుల
 జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుండినట్లైతే ఎలాంటి దోషం లేదు. 
ఇలాంటి స్థానాల ఆధిపత్యం గల జాతకులకు సంసార జీవితంలో ఎలాంటి 
లోటుపాట్లుండవు. 
అయితే... ఒకరి జాతకంలో 
మాత్రమే కుజదోషం ఉంటే కష్టనష్టాలు కలుగుతాయి. ఇందులో భాగంగా... పురుషులకు 
2, 12 స్థానాల్లోనూ, స్త్రీలకు 4, 7 స్థానాల్లోనూ... ఒకవేళ ఇద్దరికీ 
ఎనిమిదో స్థానంలో కుజుడు ఆధిపత్యం వహించినట్లైతే కుజదోషం తప్పకుండా 
ఉంటుందని జ్యోతిష్కులు అంటున్నారు.
వధూవరులకు కుజదోషం లగ్నం 
నుండి, చంద్రుని నుండి, శుక్రుని నుండి 1, 2, 4, 7, 8 మరియు 12 స్థానాలలో 
అంగారకుడు ఉన్నట్లైతే... అలాంటి దంపతులు దీర్ఘకాలం సుఖసంతోషాలతో 
జీవిస్తారు. సంతాన సంపత్తి కూడా కలుగుతుంది. 
అయితే ఒకరి జాతకంలో 
కుజదోషం ఉండి, మరొకటి జాతకంలో లేనివారికి వివాహం జరిపిస్తే ఆ దాంపత్యం 
చిరకాలం వర్ధిల్లదు. పుత్రనాశనం, మరణభయం కలుగుతుంది. వధూవరులిద్దరికీ 
కుజదోషం అనేది ఉంటే మంచిదే. దీనివల్ల శుభాలు కలుగుతాయని జ్యోతిష్కులు 
అంటున్నారు.
అలా కాకుండా ఇద్దర్లో ఏ ఒక్కరికో కుజదోషం లేకుంటే... అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరిపించటం మంచిది కాదు.
 
No comments:
Post a Comment