Sunday, December 15, 2013

వివాహం ఎన్ని విధాలు?

వివాహం ఎన్ని విధాలు?

వివాహం ఎనిమది విధాలు 

బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం.
1. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానం బ్రహ్మ వివాహం.
2. యజ్ఞంలో ఋత్విక్‌ కు అలంకరించిన కన్యాదానందైవ వివాహం
3. గోమిధునాన్ని వరుని నుండి స్వీకరించి కన్యాదానం చేస్తే అది ఆర్ష వివాహంఅవుతుంది.
4. మీరిద్దరూ కలిసి ధర్మాచరణ చేయండి అని వరుని పూజించి కన్యాదానం చేస్తే... ప్రాజాపత్య వివాహం.
5. జ్ఞానులమ కన్యకు తన శక్తిననుసరించి డబ్బిచ్చి వివాహం చేసుకుంటే... అసుర వివాహం.
6. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే అది గాంధర్వ వివాహం.
7. కొట్టి బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే �రాక్షస వివాహం
8. నిద్రిస్తున్న మత్తులో వున్న స్ర్తీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే... అది పైశాచ వివాహం. ఇలా వివాహాల్లో ఎనిమిది రకాలుంటాయి.

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...