Wednesday, April 25, 2018

కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏం చేయాలి?


కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని, ఒకవేళ అది కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు - వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నోములు - వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోను కలశారాధన జరుగుతూ వుంటుంది. రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు - కుంకుమలు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు. ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతూ వుంటుంది. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను 'పూర్ణాహుతి'కి వాడుతుంటారు. ఇళ్లలో వాడిన కొబ్బరిని బ్రాహ్మణులకు ఇవ్వడం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చేయాలని పండితులు చెబుతున్నారు.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

జీవితమనే గణితపుస్తకంలో అన్నీ సందేహాలే?


మనుషులందరూ తప్పుడు లెక్కలే చేస్తున్నారు ఎందుకో?

గుణించాల్సిన ప్రేమను భాగించి,
కూడాల్సిన అనుబంధాలను తీసివేస్తున్నారు.

ఆప్యాయతలకు అసలే కాదు వడ్డీ అయిన కట్టట్లేరు కనీసం.

ఆలోచనలెప్పుడూ సమాంతర రేఖలే,
చచ్చేదాక కలవరు కాబోలు.

మనసుల్ని ఖండించే వక్రరేఖలు ఎందరో లెక్కేలేదు.

కోపాలకు కామాలేనా?
ఫుల్స్టాపులెందుకు పెట్టరు?

అవసరాలకోసం ఆశయాల్ని సంవృత పటాల్లో బంధిస్తే?
భారీ మనసులకు బయటికి వెళ్లే దారేది?

సాటి మనిషిలో సమత కోసం వెతక్కండి,
అందరూ మాత్రికల రిక్తికలే.

కిరణంలా సూటిగ ఉండాల్సిన జ్ఞానం,
వృత్తంలా గుండుబారింది.

జీతాల లెక్కలతో,
జీవితాలు దొర్లిస్తుంటే?
వయసు పెద్దంకెను చెప్పకుండానే చేరి,
చటుక్కున సున్నా అయిపోతుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...