Sunday, December 15, 2013

దోషాలను తొలిగించుకోవాలంటే....

దోషాలను తొలిగించుకోవాలంటే....



జీవితం పాపపుణ్యాల సంగమం. జీవనం మంచిచెడుల కలయిక. మనకు తెలియకుండా కొన్ని పాపపుణ్యాలు చేస్తాం. మంచిచెడులను చేస్తాం. మనం చేసే పాపలకి, చెడులకి మన చుట్టూ ఎన్నో దోషాలు చుట్టుముట్టుకుంటాయి. అలాంటి సమయం వచ్చినప్పుడు మనం ఆ దోషాలను తొలగించుకోవాలని, వాటికి మనం దూరంగా ఉండాలని, అనుకుంటాము కదా ! అందుకోసం మనకు తెలిసిన పూజారులను, పంతుల్ని కలుసుకుంటాం. వాళ్ళు చెప్పింది చేస్తాం.
మనకు మన పురాణ కథలు గాని, పూజరులుగాని, పంతుళ్ళు గాని, మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. అవును. వాళ్ళు చెప్పేది నిజమే. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. ఇప్పుడు మనం విభిన్న రూపాలు కలిగిన మన గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం. -

* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
* కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
* బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
* శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
* కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
* ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
* పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.
* పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
* స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...