Thursday, June 21, 2018

గురుగ్రహ దోష నివారణకు "సిట్రిన్ స్టోన్ ట్రీ"

సిట్రిన్ స్టోన్ ట్రీని ఇంటిలో గాని ఆపీసు,వ్యాపార సంస్ధలలో గాని తూర్పు ఈశాన్య దిక్కుల యందు టేబుల్ పైన గాని,షోకేష్ నందు గాని ఉంచాలి.పిల్లలు చదువుకునే టేబుల్ పైన ఉంచిన చదువులో ఏకాగ్రత ఉంటుంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉన్నచో సంతాన సౌఖ్యత లేక పోవటం,కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట,నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట,ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం,షుగర్,క్యాన్సర్,మూత్ర రోగాలు,పెద్ద పొట్టతో కలిగిన దేహం,పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం,గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

రోగం వస్తే తొందరగా తగ్గదు.లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖము, సంతోషం లేక పోవుట, దైవం పై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకా లు, నియంతగా ప్రవర్తించుట,బృహస్పతి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. కేంద్రాధిపత్యం వచ్చిన బృహస్పతి బహుదోషి. ఈయన మారక స్థానంలో ఉంటే వెంటనే మారకం చేస్తారు అని శాస్త్ర వచనం. అలాగే జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు .గోచార ఫలితాంశ నిర్ణయంలో కూడా గురువు ప్రభావం అధికంగా ఉంటుంది. ఏలినాటి శని నడుచుచున్ననూ గురుచారం బాగుంటే కాలం బాగా నడచును.

గురువు మేధావి వర్గానికి ప్రతీక, గురువు ప్రభావం అధికంగా గల వ్యక్తులు మేధావులవుతారు. అతి మేధావుల చరిత్రలు పరిశీలిస్తే వారి ప్రవర్తన బహు చిత్రంగా ఉంటుంది. తమ టెలిఫోను నెంబరు తామే మర్చిపోవడం, తాము అన్నం తిన్నారో లేదో తమకే గుర్తుండకపోవడం, తమ ఇంటి అడ్రస్‌ తమకు తెలియక ఫోన్‌ చేసి కనుక్కోవడం మొదలైన చిత్రవిచిత్రాలు చేస్తారు. మహా మేధావులు అతిస్వల్ప విషయములలో ఏమరపాటు కలిగి ఉండడానికి కారణం వారు ఆలోచించే ధోరణిలో అతిగా ఏకాగ్రత కలిగి తాము ఏ నూతనాంశమును కనుగొంటున్నారో దాన్ని తప్ప మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడమే. నిజానికి అన్ని విషయాలూ పట్టించుకుంటే ఒక విషయంలో ఏకాగ్రత కలిగి ఉండడం అసంభవమే.

ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేక పోవుట, లివర్కు సంబంధించిన వ్యాధులు కలుగుచు న్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పారాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శిం చుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును.పసుపు కొమ్ము గణపతిని,పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది.పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం సాయిబాబా, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......

Sunday, June 17, 2018

సంతాన వేణు గోపాల వ్రతం

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

ఓం నమో భగవతే వాసుదేవాయ

సంతానగోపాలస్తోత్రం

1} శ్రీశం కమలపత్రాక్షం దేవకీనన్దనం హరిమ్
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్

2} నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్
యశోదాఙ్కగతం బాలం గోపాలం నన్దనన్దనమ్

3} అస్మాకం పుత్రలాభాయ గోవిన్దం మునివన్దితమ్
నమామ్యహం వాసుదేవం దేవకీనన్దనం సదా

4} గోపాలం డిమ్భకం వన్దే కమలాపతిమచ్యుతమ్
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుఙ్గవమ్

5} పుత్రకామేష్టిఫలదం కఞ్జాక్షం కమలాపతిమ్
దేవకీనన్దనం వన్దే సుతసమ్ప్రాప్తయే మమ

6} పద్మాపతే పద్మనేత్రే పద్మనాభ జనార్దన
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే

7} యశోదాఙ్కగతం బాలం గోవిన్దం మునివన్దితమ్
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్

8} శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత
గోవిన్ద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన

9} భక్తకామద గోవిన్ద భక్తం రక్ష శుభప్రద
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

10} రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా
భక్తమన్దార పద్మాక్ష త్వామహం శరణం గతః

11} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

12} వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

13} కఞ్జాక్ష కమలానాథ పరకారుణికోత్తమ
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

14} లక్ష్మీపతే పద్మనాభ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

15} కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా
నమామి పుత్రలాభార్థ సుఖదాయ బుధాయ తే

16} రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే

17} అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే

18} శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

19} అస్మాకం పుత్రసంప్రాప్తిం కురుష్వ యదునన్దన
రమాపతే వాసుదేవ ముకున్ద మునివన్దిత

20} వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో

21} డిమ్భకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ
భక్తమన్దార మే దేహి తనయం నన్దనన్దన

22} నన్దనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే
కమలనాథ గోవిన్ద ముకున్ద మునివన్దిత

23} అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే

24} యశోదాస్తన్యపానజ్ఞం పిబన్తం యదునన్దనం
వన్దేహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా

25} నన్దనన్దన దేవేశ నన్దనం దేహి మే ప్రభో
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే

26} పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే

27} గోపాల డిమ్భ గోవిన్ద వాసుదేవ రమాపతే
అస్మాకం డిమ్భకం దేహి శ్రియం దేహి జగత్పతే

28} మద్వాఞ్ఛితఫలం దేహి దేవకీనన్దనాచ్యుత
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునన్దన

29} యాచేహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసంపదమ్
భక్తచిన్తామణే రామ కల్పవృక్ష మహాప్రభో

30}ఆత్మజం నన్దనం పుత్రం కుమారం డిమ్భకం సుతమ్
అర్భకం తనయం దేహి సదా మే రఘునన్దన

31} వన్దే సన్తానగోపాలం మాధవం భక్తకామదమ్
అస్మాకం పుత్రసంప్రాప్త్యై సదా గోవిన్దమచ్యుతమ్

32} ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునన్దనమ్
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్

33} వాసుదేవ ముకున్దేశ గోవిన్ద మాధవాచ్యుత
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో

34} రాజీవనేత్ర గోవిన్ద కపిలాక్ష హరే ప్రభో
సమస్తకామ్యవరద దేహి మే తనయం సదా

35} అబ్జపద్మనిభం పద్మవృన్దరూప జగత్పతే
దేహి మే వరసత్పుత్రం రమానాయక మాధవ

36} నన్దపాల ధరాపాల గోవిన్ద యదునన్దన
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

37} దాసమన్దార గోవిన్ద ముకున్ద మాధవాచ్యుత
గోపాల పుణ్డరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్

38} యదునాయక పద్మేశ నన్దగోపవధూసుత
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక

39} అస్మాకం వాఞ్ఛితం దేహి దేహి పుత్రం రమాపతే
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే

40} రమాహృదయసంభారసత్యభామామనః ప్రియ
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో

41} చన్ద్రసూర్యాక్ష గోవిన్ద పుణ్డరీకాక్ష మాధవ
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే

42} కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దనన్దన

43} దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే
సమస్తకామఫలద దేహి మే తనయం సదా

44} భక్తమన్దార గమ్భీర శఙ్కరాచ్యుత మాధవ
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే

45} శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనన్దన
భక్తమన్దార మే దేహి తనయం జగతాం ప్రభో

46} జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో

47} శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

48} దాసమన్దార గోవిన్ద భక్తచిన్తామణే ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

49} గోవిన్ద పుణ్డరీకాక్ష రమానాథ మహాప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

50} శ్రీనాథ కమలపత్రాక్ష గోవిన్ద మధుసూదన
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన

51} స్తన్యం పిబన్తం జననీముఖాంబుజం
విలోక్య మన్దస్మితముజ్జ్వలాఙ్గమ్

52} స్పృశన్తమన్యస్తనమఙ్గులీభిర్వన్దే
యశోదాఙ్కగతం ముకున్దమ్

53} యాచేఽహం పుత్రసన్తానం భవన్తం పద్మలోచన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

54} అస్మాకం పుత్రసమ్పత్తేశ్చిన్తయామి జగత్పతే
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివన్దిత

55} వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేన్ద్రపూజిత

56} కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనన్దనమ్
మహ్యం చ పుత్రసన్తానం దాతవ్యంభవతా హరే

57} వాసుదేవ జగన్నాథ గోవిన్ద దేవకీసుత
దేహి మే తనయం రామ కౌశల్యాప్రియనన్దన

58} పద్మపత్రాక్ష గోవిన్ద విష్ణో వామన మాధవ
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ

59} కఞ్జాక్ష కృష్ణ దేవేన్ద్రమణ్డిత మునివన్దిత
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా

60} దేహి మే తనయం రామ దశరథప్రియనన్దన
సీతానాయక కఞ్జాక్ష ముచుకున్దవరప్రద

61} విభీషణస్య యా లఙ్కా ప్రదత్తా భవతా పురా
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ

62} భవదీయపదాంభోజే చిన్తయామి నిరన్తరమ్
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ

63} రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద
దేహి మే తనయం శ్రీశ కమలాసనవన్దిత

64} రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే
భాగ్యవత్పుత్రసన్తానం దశరథప్రియనన్దన
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ

65}కృష్ణ మాధవ గోవిన్ద వామనాచ్యుత శఙ్కర
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

66} గోపబాల మహాధన్య గోవిన్దాచ్యుత మాధవ
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే

67} దిశతు దిశతు పుత్రం దేవకీనన్దనోయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్

68} దిశతు దిశతు శీఘ్రం శ్రీశో రాఘవో రామచన్ద్రో
దిశతు దిశతు పుత్రం వంశ విస్తారహేతోః

69} దీయతాం వాసుదేవేన తనయోమత్ప్రియః సుతః
కుమారో నన్దనః సీతానాయకేన సదా మమ

70} రామ రాఘవ గోవిన్ద దేవకీసుత మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

71} వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

72} మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

73} చన్ద్రార్కకల్పపర్యన్తం తనయం దేహి మాధవ
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

74} విద్యావన్తం బుద్ధిమన్తం శ్రీమన్తం తనయం సదా
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దన ప్రభో

75} నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్
ముకున్దం పుణ్డరీకాక్షం గోవిన్దం మధుసూదనమ్

76} భగవన్ కృష్ణ గోవిన్ద సర్వకామఫలప్రద
దేహి మే తనయం స్వామింస్త్వామహం శరణం గతః

77} స్వామింస్త్వం భగవన్ రామ కృష్న మాధవ కామద
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః

78} తనయం దేహిఓ గోవిన్ద కఞ్జాక్ష కమలాపతే
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

79} పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్న జనక ప్రభో
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః

80} శఙ్ఖచక్రగదాఖడ్గశార్ఙ్గపాణే రమాపతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

81} నారాయణ రమానాథ రాజీవపత్రలోచన
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువన్దిత

82} రామ రాఘవ గోవిన్ద దేవకీవరనన్దన
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత

83} దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

84} మునివన్దిత గోవిన్ద రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

85} గోపికార్జితపఙ్కేజమరన్దాసక్తమానస
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

86} రమాహృదయపఙ్కేజలోల మాధవ కామద
మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః

87} వాసుదేవ రమానాథ దాసానాం మఙ్గలప్రద
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

88}కల్యాణప్రద గోవిన్ద మురారే మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

89} పుత్రప్రద ముకున్దేశ రుక్మిణీవల్లభ ప్రభో
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

90} పుణ్డరీకాక్ష గోవిన్ద వాసుదేవ జగత్పతే
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

91} దయానిధే వాసుదేవ ముకున్ద మునివన్దిత
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

92} పుత్రసమ్పత్ప్రదాతారం గోవిన్దం దేవపూజితమ్
వన్దామహే సదా కృష్ణం పుత్ర లాభ ప్రదాయినమ్

93} కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే
నమస్తే పుత్రలాభాయ దేహి మే తనయం విభో

94} మస్తస్మై రమేశాయ రుమిణీవల్లభాయ తే
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

95} మస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ
పుత్రదాయ చ సర్పేన్ద్రశాయినే రఙ్గశాయినే

96} రఙ్గశాయిన్ రమానాథ మఙ్గలప్రద మాధవ
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక

97} దాసస్య మే సుతం దేహి దీనమన్దార రాఘవ
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే

98} యశోదాతనయాభీష్టపుత్రదానరతః సదా
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

99} మదిష్టదేవ గోవిన్ద వాసుదేవ జనార్దన
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

100} నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే
భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేన్ద్రపూజిత

ఫలశృతిః

యఃపఠేత్ పుత్రశతకం సోపి సత్పుత్రవాన్ భవేత్
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ

జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః

ఇతి సంతానగోపాల స్తోత్రం సంపూర్ణమ్

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Saturday, June 16, 2018

శని దోష నివారణకు నేరేడు పండ్లు

చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.

దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు దేవుడిని నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు.

నేరేడు పండును శ్రీ శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలుగవు.

నేరేడు పండును శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల నవ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు.

భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.

శనైశ్చర స్వామికి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నేరేడు పండును నైవేద్యం పెట్టాలి. తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.

శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 19 సార్లు పఠించిన శనిదోషం తొలగిపోవును.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, June 15, 2018

షట్చక్రాలు

మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు. శ్రీ విద్యలోను, వివిధ తంత్రములలోను చెప్పిన ప్రకారము మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు

మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
– వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1.  ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం  :  మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు.

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కోలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.

2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.

3. మణిపూరక చక్రం :  బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.

4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది.  పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.

5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.

6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.

7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Wednesday, June 13, 2018

బుధ గ్రహ దోష నివారణకు విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం

జాతకచక్రంలో బుదుడు సూర్య గ్రహంతో అస్తంగత్వం చెందినప్పుడు బుదుడు తన బలాన్ని కోల్పోతాడు.బుదుడు నీచలో ఉన్న చెడు ఫలితాలు ఇస్తాడు.దోష నివారణకు బుదగ్రహనికి అదిదేవుడు అయిన విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం సమర్పించిన సూర్య,బుధ గ్రహ దోష నివారణ జరుగుతుంది.రాగి సూర్యగ్రహ లోహం .రాగి సూర్యగ్రహ దోష నివారణకు ఉపయోగపడుతుంది. రాగిపాత్రలో నీటిని తాగిన రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.

సాధారాణంగా ఆలయదర్శనానికి వెళ్ళినపుడు, అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతుండటాన్ని చూస్తుంటాం. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ వుంది. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడుండేవాడు. అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికి, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతుండే వాడు.

గుడాకేశుడు విష్ణుభక్తుడు. నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తుందేవాడు. ఇదిలాఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సుచేయాలనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేసాడు. అతని తపస్సు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి గుడాకేశుడు, తనకు ఏమి అక్కరలేదని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు.

విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధాన మయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా? అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు.

విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించదమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలాడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యాన్ని సమర్పంచడం వెనుక కధ ఇది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...