Thursday, February 22, 2018

సుముహూర్తం

మనవైపు ఆచారం సుముహూర్త సమయానికి ఒకరినొకరు చూసుకోవాలి.కొన్ని చోట్ల సుముహూర్తానికి మంగళసూత్రం కడతారు.వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడటాన్ని సమీక్షణం లేక నిరీక్షణం అంటారు. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు.

ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు.అప్పుడు వరుడు తన ఇష్ట దేవతను ధ్యానిస్తూ వధువు కనుబొమ్మల మధ్యభాగాన్ని చూస్తాడు. జీలకఱ్ఱ బెల్లాని ఆమె నడినెత్తిన బ్రహ్మరంధ్రముపైన ఉంచుతాడు. అలాగే, వధువు కూడా తన ఇష్టదేవతా ధ్యానంతో పెండ్లికొడుకు కనుబొమ్మల మధ్య చూసి అతడి నడినెత్తిన జీలకఱ్ఱ ముద్దను ఉంచుతుంది.  దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు.

ఈ రెండిటి కలయిక వలన కొత్త శక్తి పుడుతుంది. నడినెత్తిన బ్రహ్మరంధ్రంపైన ఆ ముద్దను పెట్టిన తరువాత వధూవరులకు ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. వైజ్ఞానికులు కూడా సైన్సు పరంగా ఈ విషయాన్ని అంగీకరించారు. శుభమైన లక్షణాలలో కలిసిన అనురాగమయమైన ఆ మొదటి దృష్టి వారి మధ్య మానసిక బంధాన్ని క్షణక్షణానికి పెంచుతుంది.

బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట.

మంచిసంకల్పం - మనదోషాన్నితొలగిస్తుంది

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిషపండి తుడు నివసించేవాడు.

ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పి ఫలితం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమనీ తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతుకు కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు.

ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే.

ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పనిఉంది.

మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను అని అంటాడు.

జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు.

రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో విషయం చెబుతాడు.

కానీ మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.

ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్నిని మనసులో అనుకుంటాడు.

మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.

మండపాలు ఎలాకడితే బాగుంటుంది. అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు.

అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.

జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలని కేవలం తలింపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం.

మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.

ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం.

అందుకే అంటారు అందరూ మంచిగా ఉండాలి. మంచివారి సంకల్పాలూ మంచిగా ఉండాలి.

అహంభావ రహితం…దత్తాత్రేయ సందేశం

పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో…రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే…దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు .దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ…అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు…ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.దత్తుడిది జ్ఞానావతారం! పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి…పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి. పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా…విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా…ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా… బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది. అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత…జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే…కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం…గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా…ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా…’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. వివిధ సందర్భాల్లో… కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ…ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు…ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్‌ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, మహుర్‌లో నిద్రించేవాడని అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్‌కోట మహరాజ్‌ (అక్కల్‌), షిర్డీసాయి (షిర్డీ) దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి…తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం. మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ…తదితర ఆయుధాలుంటాయి. చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు…ఉపనిషత్తుల సారం. దత్తజయంతినాడు ఆస్తికులు…జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు. ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.

శ్రీ ఆదిశంకర విరచిత బాల కృష్ణాష్టకం

🕉లీలయ  కుచేల  మౌని  పాలితం  కృపాకరం  నీల  నీల  మింద్ర నీల నీలకాంతి మోహనం
బాలనీల  చారు  కొమలాలకం  విలాసగోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉ఇందుకుంద  మందహాస  మిందిరా  ధరధారం  నందగోపనందనం సనందనాది  వందితం  |
నందగోధనం   సురారి  మర్ధనం  సమస్త గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉వారి  హార  హీరా  చారు  కీర్తితం  విరాజితం  ద్వారకా  విహారమంబుజారి  సూర్య  లోచనం  |
భురిమేరు  ధీరమాది  కారణం  సుసేవ్య   గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే   ||

🕉శేషభోగ   సాయినం విశేష  భూషనొజ్వలమ్  ఘోషమాన కింకిణి  విభీషనాది పోషణం|
శోశనాక్రుథామ్బుధిమ్  విభీషనార్చితం పదం  గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉పండితాఖిలస్తుతం  పుండరీక  భాస్వరం  కుండలప్రభాసమాన తున్డగండమండలం |
పుండరీక  సన్నుతం  జగన్నుతం  మనోగ్న్యకం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉ఆంజనేయ  ముఖ్య  పాల  వానరేంద్ర  కృంతనం  కుంజరారి భంజనమ్  నిరంజనం  శుభాకరం  |
మంజు  కంజ  పత్ర నేత్ర  రాజితం  విరాజితం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రామనీయ యజ్ఞధామ భామిని  వరప్రదం  మనోహరం  గుణాభిరామ మున్నతోన్నతం  గురుం  |
సామ  గాన  వేణు  నాద లొలమర్చితాశ్టకమ్ గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రంగ  డింఢి రాంగమంగళాంగ   సౌర్యభాసదా  సంగదాసురోత్తమాంగా భంగక  ప్రదాయకం  |
తుంగవైర  వాభిరమ  మంగళామృతమ్  సదా   - గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉బాలకృష్ణ  పుణ్యనామ లాలితం శుభాస్తకం  యే పఠన్తి  సాత్వికోత్తమాసదా  ముధాచ్యుతం  |
రాజమాన  పుత్ర సంపాదాది శోభనానితే సాధయంతి  విష్ణులోకమవ్యయం  నరాష్టతే ||

వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.
మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి. ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను. అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది. నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోఅలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమె కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను మరిన్ని పనులు చెయ్యగలను. అదే విధంగా కేవలం మంత్రోచ్చ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతనధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు 108 నామాలు జపించమని, లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని కండిషన్ విధిస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతనం.

!! ఓం నమః శివాయ !!

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

చాలా అరుదుగా దొరికే స్తోత్రం,మరియు మోస్ట్ పవర్ ఫుల్.

*సూర్యమండల స్తోత్రం*

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||

ఆది దేవ నమఃస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్

స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?

🕉🕉🕉🕉🕉

ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు(జ్యేష్ట దేవి) కూడా ఆహ్వానమే.జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు.

అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే భగవంతునికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం.

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా? తిరిగితే ఏమవుతుంది???

మీరు (స్త్రీలు) తలస్నానం చేసి జుట్టుని విరబోసుకొంటున్నారా?  జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా??? అయితే కింది సమాచారం తపకుండా చదవండి.

స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరగావచ్చా?
స్త్రీ జుట్టు విరబోసుకొని తిరిగితే ఏమవుతుంది?
పురుషులు పొడుగ్గా పెంచుకొనే జుట్టుకి ఏ నియమమైన ఉందా?

స్త్రీలు బ్రహ్మహత్యాపాతకాన్ని పంచుకున్నందుకు ఇంద్రుడు ఇచ్చిన వరమేమిటి?
స్త్రీ దేవతలు కేశములను పూర్తిగా వదిలినట్టుగా ఫోటోలు ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?
భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు ఏమిటి?

తలస్నానం చేసిన తర్వాత  స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహిస్థాయి

తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ,  శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆవిధంగా చేసినచో, లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.

దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.

పురుషులు కూడా జుట్టుని పొడుగ్గా పెంచుకోవడం లేదా మహర్షులు జటలు పెంచుకొంటారు కదా? వాళ్లకు ఈ నియమం వర్తించదా?

ఈ విధంగా చాలా మంది నాస్తికులకు ఒక సందేహం కలుగుతుంది. పురుషులు/మహర్షులు పెంచుకొనే జుట్టుకు నియమంలేదు ఎందుకంటే, కేశములను విరబోసుకొనే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం.

✨ వృత్తాంతం: ✨

ఒకనాడు బ్రహ్మజ్ఞానం కలిగిన విశ్వరూపుడు అను మహర్షి తనమన భేదాలు లేకుండా దేవతలకి ఇచ్చే హవిస్సులలో కొంతభాగం రాక్షసులకు ఇస్తున్నాడనే విషయం తెలుసుకొన్న ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ మరచి తన చంద్రహాసంతో విశ్వరూపుని మూడు శిరస్సులను(సురాపానం, సోమపానం,అన్నం తింటున్న శిరస్సు) నరికి వేస్తాడు.

అనంతరం సురాపానం చేసే శిరస్సు ఆడాపిచుకగా మారి పోయింది, సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోయింది. అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్ట(తీతువు పిట్ట)గా మారిపోయాయి. ఆ మూడు పక్షులు ఇంద్రుడు చేసిన బ్రహ్మహత్యాపాతకాన్ని సూచిస్తాయి. ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడి చెవ్వుల్లొ రొదగా ఉండేవి. వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి, భూమికి, స్త్రీలకు, నీటికి, వృక్షాలకు తలో పావుభాగం పంచుతాడు. బ్రహ్మహత్యాపాతకం పాపం తీసుకొన్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు.
భూమికి వరంగా ఇక్కడైన గోతులు తీస్తే ఆ గోతులు తమంతతాము పూడుకొనేటట్లుగా, వృక్షాలకు ఎవరైన మొదలు ఉంచి కొమ్మలు, ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతటతాము పెరిగేటట్లుగా, నీటికేమో ప్రక్షాళన గుణాన్ని, స్త్రీలకేమో కామభోగాలయందు కొద్దిపాళ్ళు ఎక్కువసుఖాన్ని ప్రసాదించాడు. బ్రహ్మహత్యపాతకం క్రింద వారు అనుభవించే బాధలు భూమి కొన్నిచోట్ల పంటలు లేకుండా ఉండడం (ఊసర క్షేత్రాలు), నీరు నురుగుతో ఉండడం, వృక్షాలు జిగురు, స్త్రీలకు ఋతుస్రావం. అందుకని కేవలం స్త్రీలకు మాత్రమే జుట్టు విరబోసుకు తిరగడం నిషిద్ధం.

స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి?

ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ,రజో,తమో (స్త్రీ)గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది). కాబట్టి  స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.

అందుచేత ఛాందస్సవాదులు ఇటువంటి ప్రశ్నలని కట్టిపెట్టి శాస్త్రాల్ని అనుసరించండి మంచిది.

భారతీయ మహిళల సాంప్రదాయ కేశాలంకరణలు:

జడ వేసుకొని ఆలయ దర్శనం చేయుట

సిగలో(తలలో) పుష్పములను ధరించుట

వృద్ధ మహిళలు సాంప్రదాయంగా కొప్పును వేసుకొనుట

✨ గమనిక: ✨

పై సమాచారం కేవలం శాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రస్తావన చేసే ప్రయత్నం మాత్రమే.  ఎవరిని విమర్శించి, వారి ఇష్టాయిష్టములను తిరస్కరించుట కొరకు కాదని మనవి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...