Thursday, March 22, 2018

నవగ్రహ వివరణ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1.అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

2.సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.

3.బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమాట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన  కోపమట.

4.శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రి ని చులకన చేసిన కోపమట. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

5. పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

6.శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7. అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.

8. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9. రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట. ఈయన భ్రమ మాయ కి కారణము

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

బంధాలు-బాంధవ్యాలు



మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, –ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.

కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.

సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా

శాంతి: పత్నీ, క్షమా పుత్రా: షఢెతె మమ బాంధవా:

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయా స్నేహితుడు, శాంతి భార్య, వోర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.

ఏ జివికైన జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిష్టితులలో నైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.

జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జివించె ఉపాయాలు నేర్పడం ద్వార, సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషం గ జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.

సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉంది, అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.

దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.

శాంతి భార్య వంటిది. భార్య సుగుణ శీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతున్ది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.

ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గాతుల్యమే.

పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.. ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు.

Written By_ 

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ





జ్యోతిష్యం + వాస్తు= సంపూర్ణ జీవితం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

‘‘జ్యోతిషాం సార్యాదీనాం బోధక శాస్త్రం’’
సూర్యుని నుండి మొదలడి ఆకాశంలో కనప డే ప్రకాశ పదార్థాలను గురించి వివరించే శాస్తమ్రిది. అనగా నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన ఆకాశంలో కనిపించే వివి ధ కాంతి పదార్థాలను గూర్చి తెలిపేది జ్యోతి షం అని కొందరి అభిప్రాయం. కొందరి దృ ష్టిలో ఫలిత బాగంతో సంబంధం లేని ఖగోళ శాస్తమ్రే జ్యోతిష్యం. మరికొందరి అభిప్రాయం లోనైతే సిద్ధాంత భాగంతో సంబంధంలేని ఫలిత జ్యోతిష్యమే జ్యోతిశ్శాస్త్రం. అనాది నుండి నేటి వరకూ మానవ జీవితంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు అధికంగా చూపే జ్యోతిష్య శాస్త్రం యొక్క నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

ఈ శాస్తమ్రు మానవులకు మూఢనేత్రము లాంటిది. ఏదైనా ఒక విషయాన్ని వివరంగా తెలుపటాన్ని శాస్తమ్రు అంటారు. అట్టి జ్యోతిష శాస్తమ్రులో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి. అందుకే జ్యోతిష్యశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సకల మం త్రములలోనూ గాయత్రి ఎంత ప్రధానమో.. సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంత గొప్పగా చెప్పగలగాలి. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే... గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు. హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు మొదలగునవి ఉన్నాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే... అందులో మనకి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. దేవాలయ, తటాక, ఆరామ, గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం మొ అంశాలను గమనించవచ్చు.

జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే ‘సంహిత’ అనగా కూర్చబ డేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్తమ్రు. అం టే జ్యోతిష్యశాస్తమ్రులోని ఒక భాగమే వాస్తు శాస్తమ్రని అందరూ అర్థం చేసుకోవాలి. మరి కేవలం వాస్తు శాస్త్రాన్నే నమ్మి, జ్యోతిష్య శా స్త్రాన్ని వదిలేస్తే సరిపోతుందా? దశలను చెప్పే ది జ్యోతిష్య శాస్తమ్రు, దిశలను సూచించేది వాస్తు శాస్తమ్రు. ‘దశ బాగుంటే, దిశ బాగుం టుంది’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిష్యం ప్రకారం నడుసుస్తున్న దశ లు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థ వంతమైన సంగతే కదా!

దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది నిర్వివాదాంశం. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెం డు కన్నులే గాని ‘కేవలం వాస్తే ప్రధానం... కాదు.. కాదు.. జ్యోతిష్యమే ప్రధానం’ అని అనుకోకూడదు. వ్యక్తి జీవిత చక్రంలో వున్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంత ర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాం టి ప్రతిబంధకాలని అతను ఎదుర్కొంటున్నా డో గమనించి దానికి తగ్గ రెమెడీస్‌ (పరిహార క్రియలు... అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి) పాటిం చి... ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయ టపడగలిగిన తరువాతే ప్రశాంతత లభ్య మవుతుంది. యాభై పాళ్ళు పైగా జాతకం యొక్క ప్రభావం మనిషి పై ఉంటుంది.
ఇంక మిగిలిన వాస్తును సరిచేసుకోవాలి.

అనగా ఎలాంటి ఇంట్లో వుండాలి?ఏ ముఖ ద్వారం ఉండాలి. ఇలా ఇల్లంతా... లోపల, బయట కూడా వాస్తు ప్రకారం వుందా? వీధి శూలలు, వెన్ను శూలలు లేవుకదా? చుట్టూ సక్రమమైన ప్రహారీ ఉందా? అంతేగాక ఇంట్లో వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమి రాతయా లేదా?అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన వుండి తీరుతుంది. ఇంకో విచిత్రమైన అం శం ఏమిటంటే మనకి నడుస్తున్న దశలు సరి గ్గా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.

దీన్ని బట్టి మనకి అర్థం అవుతున్న అంశం ఏమి టంటే... వ్యక్తి జాతకాన్ని ముందుగా పరిశీ లించి అతను ఎదుర్కొంటున్న సమస్య లను విశ్లేషించి అట్టి వ్యక్తి ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము, ఎలాంటి సమస్యలు న్న ఇంట్లో ఉంటున్నాడో చెప్పగలుగుతు న్నాము. అంటే జ్యోతిష్య శాస్తమ్రును బట్టే ప్రధానంగా మనము గ్రహించి చెబుతున్నా ము. అప్పుడు ఆ దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటించి 60 శాతం వూరట చెందాక, ఆ ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరిచేస్తే పూర్తిస్థాయి మంచి ఫలితాన్ని అతను అనుభవించగలడు. కేవలం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టేసి అందు లో వ్యక్తిని వుంచితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు ఎంత అధ్వా న్నంగా ఉన్నా మామూలుగా మారిపోలేడు కదా? లేని రాజయోగాలు రావుకదా! అలా అని జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్‌ పాటించి వా స్తు బాగుండని ఇంట్లో ఉంటే ఫలితాలు సగమే ఉంటాయన్న విషయం మరిచిపోకూడదు.

ఎవరైనా సరే జ్యోతిష్యం ప్రకారం నడిచే దశలు, గోచారాన్ని ముందుగా చూపిం చు కొని అసలు ఆ వ్యక్తి జీవితంలో అతను ఆశిస్తు న్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం... ఇత్యాది విషయాలు వున్నాయా? ఉంటే అవి రాకుండా ప్రతిబంధకాలు ఏం వుంటున్నాయి? అవి సరిచే యగలమా? జ్యోతిష్య పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి అ న్ని అంశాలను పరిశీలించుకోవాలి. ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు వుం దా? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవ టానికి ఏం చేయా లి? జోతిష్యపరంగా అని ఆలోచించాలి? ఆ రకంగా జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయో గించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.

జ్యోతిష్య శాస్తప్రరంగా మనకి లేని ను దుటిరా తను వాస్తు బాగున్న ఇంటి లో ఉండి పొందలే ము. వాస్తు బాగుండని ప్రదేశంలో నివశిస్తున్నా.. జ్యోతిష్యపరంగా రావలసిన యోగాలని ఎలాం టి ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లే కుండా సాధించలేము. రెండూ కావాలి. రెం డింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వా రా సరిచేసుకోవాలి. కేవలం జ్యోతిష్యం చాలు. .. వాస్తు లేదు అనుకోవద్దు. అలాగే వాస్తు మాత్రమే జీవితాన్ని మారుస్తుంది, జ్యోతిష్యం అనవసరం అనుకో వద్దు. ముఖ్యంగా జ్యోతిష్యంలో ‘జన్మ కుండలిలోని లోపాలను పరిహార క్రియలు పాటించి సరిచేస్తే బుర్రకి స్థిరస్థ్వం చెయ్యాలనే సంకల్పం ఏర్పడితేనే వాస్తు ప్రకారం ఆలోచిద్దామనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది నగ్న సత్యం.

ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి జాతకం బా గున్నంత కాలము వాస్తు ప్రభావం అంతగా బయట కనపడదు. జాతకం బాగులేనప్పుడే వాస్తు ప్రభావం అమితంగా కనపడుతుంది. దశ బాగుంటే దిశ బాగుంటనేది దీనర్ధం. అనారోగ్యం (జలు బు) తో ఉన్న వ్యక్తి వర్షంలో వెళుతున్నప్పుడు ‘గొడుగు’ యొక్క అండతో కాపాడబడతాడు. అనారోగ్యం ఉండ డం (జాతకం బాగోని వ్యక్తి) జ్యోతిష్యం అయి తే గొడుగు అనేది వాస్తు శాస్త్రం. అంటే జాత కం బాగుండకపోతే ‘సమస్య జటిల మవు తుంది’ అని దీని సారాంశం.
అందుకే వ్యక్తికి జాతకం + వాస్తు = జీవితం. అన్నది అతి ముఖ్యమైన వి షతయం ఏదో ఒకటే చూడరాదు. రెండూ సరిచూసుకొని జీవితాన్ని సక్రమమార్గంలో పెట్టుకోవాలి.

ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రి యల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దు కోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి. జాత కాన్ని మార్చలేము గాని, వాస్తు మా ర్చుకోవచ్చు. కనుక అలా మార్చటానికి వీలైన పరిస్థితులు కల్పించేది ఆ వ్యక్తి జాతక బలమే.
అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రదానంగా తీసు కోవాల్సిన అవసరం ఉంది. ‘అప్రత్యక్షాణి శాస్త్రాణి వివాదన్తేషు కేవలం ప్ర త్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్క యాత్ర సాక్షి ణా’ సూర్యచంద్రుల సాక్షిగా ఈ శాస్త్రం ప్రత్యక్ష ఫలితాలందిస్తుందని భావం. ‘యధాశిభా మ యూరాణాం నాగానాం మణయో యథ తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిష్యం మూర్ధ నిస్తతం’ (ఋగ్జేతిహం)నెమళ్ళకు పింఛములాగా, పాము
లకు తలపై నుండే మణిలాగా వేదాంగ శాస్త్రాలన్నింటిలోనూ జ్యోతిష్యశాస్త్రం అఖండమైనది.‘వేదచక్షసా...’ వేదపురుషు నికి కన్నులాం టిది. ఆరు అంగాలలో జ్యోతిష్యం ఎవరూ మరచిపో రాదు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కదళీఫలం సమర్పయామి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల 'కదళి ' నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి గురికాకుండా ఉంటుండేది.

ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారు కున్నాడు. ఆయన అర్ధాంగి అయిన ' కదళి ' ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.

నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది. ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.

ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తనకుమార్తె గురించీ అడగ్గా, దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయం తో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట. అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.

దుర్వాసుడు తన మామగారితో " మీ కుమార్తె -‘ కదళి -‘అందరికీ ఇష్టురాలై’ కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదన కే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందు తుందని వరమిచ్చాడుట!

ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవునిముందుంచి కొద్దిగా తొక్క తీసి ' కదళీఫలం సమర్పయామి ' అంటూ నివేదన చేస్తాం.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గ్రహావస్థలు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.

    స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
    దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
    ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
    శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
    శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
    పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
    దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
    వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
    ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
    భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.

ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు. సూర్యునికి పదకొండు, పన్నెండు స్థానాలలో ఉన్న గ్రహాన్ని అత్యంత శీఘ్రగతిన ఉన్న గ్రహం అంటారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

వాస్తు అనగా

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మనము నివసించు గృహాము, వ్యాపార మరియు పరిశ్రమ నిర్మానములో పంచభూతాలైననీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశము లలో సమతుల్యతను ను సాదించడము. వాస్తుపురుషమండలములోని 45 దేవతల ఆదిపత్యము, వాటి లక్షణాల ఆదారంగా ద్వార నిర్మాణము, మనమునివాసములో 16 దిశలను పరిగణణలోకి తీసుకోని చేయు కార్యక్రమాలకు వసతులను ఏర్పాటుచేసుకోవడము.
వాస్తు ప్రకృతి (పంచ భూతములు) మరియు మానవుల మధ్య సామరస్యతను ప్రతిష్టించు శాస్త్రం.

వాస్తు అనగా నివాస యోగ్యమనైనది. ఇది వేదముల నుండి ఉద్బవించినది.
ఈ శాస్త్రం మానవాళి నివాస నిర్మాణ నియమావళి ని వివరిస్తుంది
మనుషులు నివసించుటకు, పని చేయుటకు అనువైన ప్రదేశం ను, నిర్మాణం ను నిర్మించు ప్రదేశం యొక్క ఆదిపత్యం ను తెలియచేయును

ప్రకృతి లోని పంచభూతములు (వాయువు, అగ్ని, ఫృథ్వీ, ఆకాశం మరియు జలం) సమ పాళ్ళ లో నిర్మాణం లొ విసరించి ఊండి నివసించే వారి పై ప్రభావం చూపును.
ఋగ్వేదమును అనుసరించి వాస్తుశాస్త్రం అత్యంత పురాతనమైనది. 

నాలుగు వేదాలలో, రామాయణం, మహాభారతం, అర్ద శాస్త్రం, జైన & బుద్ద మత గ్రందాలలో, ఆగమ, మంత్ర, తంత్ర శాస్త్రాలలొ, పురాణములు మరియు బృహత్ సంహీత వంటి గ్రంధాల లో ప్రస్తావన కలదు.
వాస్తుశాస్త్రం నకు 18 మంది మూల పురుషులు (మత్స్య పురాణం) - భృగు, అత్రి, వశిష్ట, వ్శ్వకర్మ, మయ, నారద, నగ్నజిత్, విశాలాక్ష, పురందర, బ్రహ్మా,  కుమార, నందీశ, శౌనక, గర్గ, వాసుదేవ, అనిరుద్ద, శుక్రుడు మరియు బృహాస్పతి. 

25 మంది మూల పురుషులు (అగ్ని పురాణం): మానసార పురణం ప్రకారం 32 మంది. 

మత్స్య పురాణం, 252 వ అధ్యాయం లో నివాస గృహాల శుభాశుభములు, ముహూర్తములు, నేల పరిక్ష, ఏకశితి పాద వాస్తుచక్రం మొదలైన వివరణ.

స్కంద పురాణం: మహేశ్వర ఖండం, వైష్ణవ ఖండ ద్వితీయ భాగము నందు నగర, మదిర, రథ, మడప నిర్మాణముల గూర్చి వివరంచడమైనది.

గరుడ పురాణం: 46,47 అద్యాయం లొ గృహా సంబంద మరియు 35,48 వ అద్యాయం ల లో రాజ భవన నిర్మాణం మరియు శిలా విగ్రహా వర్ణన ను చూడవచ్చు.

అగ్ని పురాణము: 13 వ అద్యాయం లో ని వాస్తు విబాగం నందు గృహా నిర్మాణం, , చెరువుల నిర్మాణం, శతుశ్శీతిపాద వాస్తు చక్రం మరియు వాస్తు దేవతల వివరణ.
భవిష్య పురాణము: మూడు అద్యాలలో వాస్తుశాస్త్ర వివరణ కలదు
ఆగమ గ్రంధములు - వాస్తుశాస్త్రం మొత్తము 92 ఆగమ గ్రందాలలోని ప్రతి ఆగమమునందు గల జ్ణాన, యోగ, చర్య, క్రియ అను నాలుగు పాదాలలోని క్రీయా పాదములో వాస్తు మరియు శిల్ప శాస్త్ర ల గూర్చి వివరించడమైనది.

కామికాగము: 62, 75 వ అద్యాయములలొ వాస్తు/శిల్ప వివరణ గృహా ప్రవేషం, శంఖుస్తాపన, దేవాలాయలపై వివరణ కలదు.
కర్ణాగమము: 3 నుంచి 8 వ అద్యాయం వరకు వాస్తుశాస్త్ర ప్రకారం విధులను, ప్రకారం ల పై వివరణ.

శువ్రఖేధాగమము: 15 వ అద్యాయం లో శిల్ప కల గురించి వివరణ
కాశ్యపీయ: శివుని భంగిమల శిల్పాక్ర్తుల పై వివరణపురాణములు -

వైఖాన ఆగమము:  కశ్యప ముని రచించిన ఈ గ్రంధం లో గృహ, నగర, రాజ మందిర మరియు దేవాలయ నిర్మాణములను వివరించడమైనది.

తత్రనముచ్చయ ఆగమము: నారణుడు రచించిన ఈ గ్రంధం సాంప్రధాయక వాస్తుశాస్త్ర నియమాలను వివరిస్తుంది.

సమరాంగణ సూత్రదారి: భోజ రాజ విరచితమైన అత్యంత పెద్ద వాస్తు గ్రందం 93 అద్యాలు, 10 వేల పంక్తుల తో అంత:పురంఉ, దేవాలయాలు, సభా మండప నిర్మాణముల గురించి వివరిస్తుంది.

మానసార: వాస్తుశాస్త్రము (70 అద్యాలతో కూడినది) పూర్తి వివరాలతో గూడిన గ్రందము  అయోద్యా నగరం నిర్మాణం న కు ఉపయోగించిన గ్రందము.

  వ్శ్వకర్మ వాస్తు శాస్త్రము: బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంబించిన తరువాత వృదుమహారాజు లోకములను సృష్టించుటకు ఎంచుకోని వాస్తుశాస్త్ర పరిజ్ణానం గల విశ్వకర్మ సహాయం తో లోకములను సృష్టించేను. తన అనుబవాలను మూడు గ్రంధాలలో వివరించినారు.

విశ్వకర్మ వాస్తుశాస్త్రం:  విశ్వకర్మ ప్రకాశిక లో వాస్తుశాస్త్రమునకు 13 అద్యాయములు ప్రత్య్కించడమైనది. గౄహ నిర్మాణం మరియు శిల్ప కళ గురించి వివరించడమైనది.
విశ్వకర్మ ప్రకాశిక: ఈ గ్రంధమునందు వాస్తు పురుషుని ఉత్పత్తి, నేల లక్షణాలు, నిర్మాణ ప్రారంబములు, దేవతా ప్రతిష్ట మొదలైన వాటి వివరాలు కలవు.

విశ్వకర్మీయ శిల్పము: 17 అద్యాయలు గా విభజించి తక్షక, వర్దక మరియు స్థపతి పద్దతులను వివరించబడినది.
మయుని గ్రంధములు: మయుడు వాస్తు శాష్త్రము లొ ప్రఖ్యాతి నోంది అనేక గ్రంధాలను వ్రాసినాడు అందులోని ఏదు చాలా ప్రాముఖ్యతను పొందినావి.

మయమతము, మయమత శిల్పశాత్ర విధానము, మయశిల్పకాళిక, మయశిల్పము, మయవాస్తు, మయవాస్తు శాస్త్రము మరియు మయమత వాస్తుశాస్త్రం.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...