Sunday, December 15, 2013

రామ శబ్దం లోని గొప్పదనాన్ని చూద్దాం

రామ శబ్దం లోని గొప్పదనాన్ని చూద్దాం


.పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది.స్వామి !విష్ణు సహస్ర నామాల్ని సులభంగా ఎలాపలకవ చ్చు అని."కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఫట్యతై ర్పండితైర్నిత్యం శ్రో తుం ఇచ్హామి అహం ప్రభో "అని. అపుడు శివుడు ఇలచెప్తాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే" అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణుసహస్రనామాలుచదివిన ఫ లితం వస్తుంది అని. పై శ్లోకంలో "రమే రామే,వరాననే,మనోరమే"అన్న పదాలు,పార్వతిని ఉద్దేసించి తెల్పినవి.ఇంక మిగిలిన వాటిలో శ్రీరామ,రామ, రామేతి అన్న మూడుపదాలే సహస్ర నామాలికి సమానాలు అని. 
దీనిని గూర్చి పెద్దల చెప్పినవివరణ చుద్దాం.రామ పదంలో మొదటి అక్షరం'రా'ఇది య,ర,ల,వల్లో ర రెండవ అక్షరం.రామలో రెండవ అక్షరం మ ఇది ప,ఫ,బ,భ,మ వర్గలో మ ఐదవ అక్షరం.సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2*5=10 అవుతుంది .అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10* 10 = 100 అవుతుంది. ఇప్పుడు మూ డవరామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10*100 = 1000 అవుతుంది .ఇలా ' శ్రీ రామ ,రామ , రామ ఇతి అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .అని పరమ శి వుడు పార్వతికి తేల్పేడు .
ఇంకా రామనామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగామారుతాడు,రామ నామం వల్ల శబరి,గుహుడు,హనుమ,సీతామాత,ఇలా ఎందరోపునీతులౌతారు. ఇంకా 'రా' అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటేమనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి,అన్నమాట.ఇక 'మా'పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి.బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనాచెప్పవచ్హు.వశిష్టుడు "ఓం నమో నారాయణాయ"అన్న అష్టాక్షరి మంత్రం నుండీ’రా'అన్న అక్షరాన్ని,"నమశ్శివాయ"అన్న పంచాక్షరి మంత్రం లోంచి 'మ'అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు,అష్టాక్షరి,పంచాక్షరిమం త్రాలు జపించినట్లే. ఈవిధంగా రామాయణంలో రత్నాల వంటి విషయాలు ఎన్నైనా చెప్పుకోవచ్హు."స్ధాలీపులాక" (అన్నం ఉడికిందా,లేదా అనితెలుసుకొందుకు ఒక్క మెతుకు పట్టుకు చూసినట్లు.)న్యాయంగకొన్నిమాత్రమేతెలుసుకొన్నాం.స్వస్తి.

ఇట్లు 

 మీ  సుబ్రహ్మణ్య శర్మ

1 comment:

Unknown said...

you collected the information very well , I know some thing but after I have seen your blog I know some knew things.
thanks and best regards forever...
your's rameshbabu,
ramesh.dwht@gmail.com

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...