Monday, May 21, 2018

ఏకవింశతి దోషములు

1.పంచాంగ శుద్ధి హీనము, 2.సంక్రాంతి అహస్సు, 3.పాప షడ్వర్గు, 4.కునవాంశ, 5.కుజ అష్టమం, . 6.భృగుషట్కరి, 7.కర్తరీ, 8.అష్టమ లగ్న దోషము, 9.అష్టమ చంద్రుడు, 10.షడష్ట చంద్ర దోషం, 11.సగ్రహ చంద్ర దోషం, 12.వారజనిత దుర్ముహూర్త దోషం, 13.ఖార్జురి సమాంఘ్రిభం, 14. గ్రహణం దోషం, 15.ఉత్పాత దోషం, 16. .క్రూరయుక్త నక్షత్రం, 17. అశుభ వేధ, 18.విషయుత లగ్నం, 19.లగ్నాస్త దోషం, 20.గండాంతం, 21.వ్యతీపాత వైదృతి యోగములు. ఈ 21 దోషాలను సమస్త శుభకర్మల యందు విడిచి పెట్టవలెను.

ఏక వింశతి దోషములు అనేది ముహూర్త నిర్ణయంలో చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం. వివాహ, ఉపనయన, శంఖుస్థాపన, గృహ ప్రవేశ, గర్భాదాన, అక్షరాభ్యాసం వంటి ప్రధానమైన కార్యక్రమాలు ఈ ఏకవింశతి దోషములు లేకుండా సుముహూర్తము చేయవలసిన అవసరం చాలా అధికంగా ఉంది.

‘యః పంచాంగ విశుద్ధి హీన దిన కృత్ సంక్రాంత్యహః పాపినాం.
షడ్వర్గః కునవాంశకో ష్ట మకుజ ష్వట్కం భృగోః కర్తరీ’

ఇలా నాలుగు శ్లోకాలలో ఏకవింశతి దోషాలు నిక్షిప్తం చేశారు. అవి

1.పంచాంగ శుద్ధి హీనము: ప్రతి కార్యమునకు కొన్ని ఆధ్యాదులు ప్రత్యేకంగా చెప్పారు. ఏ కార్యమునకు ఏ తిథి వార నక్షత్రములు చెప్పారో వాటిని ఆచరించడం పంచాంగశుద్ధి అనియు, ఆచరింపక పోవడం పంచాంగ శుద్ధి హీనము అని చెప్పారు. ఉదాహరణకు కృష్ణ పాడ్యమి మంగళప్రదమని అంటారు. కానీ ఉపనయనం అక్షరాభ్యాసం విషయాలు బహుళ పాడ్యమి నిషిద్ధము కలిగిన తిథి. అలాగే మఘ నక్షత్రం వివాహానికి గ్రాహ్యత వున్న నక్షత్రం. ఇతరమైన ఏ కార్యమును మఘ నక్షత్రంలో చేయరు. ఇలా పంచాంగంములు ముహూర్త నిర్ణయాలు ప్రధాన భూమిక వహిస్తాయి.

2.సంక్రాంతి అహస్సు: ప్రతి నెలలో వచ్చే సంక్రమణము వున్న దినము అహస్సు అనగా పగలు అని అర్థం. రవి ప్రవేశమునకు 19 ఘడియలు ముందు వెనుకలు, మేష, కర్కాటక, తులా, మకర, సంక్రమణములకు ఆయన ప్రవేశములకు 30 ఘడియలుముందు వెనుకలు దోషము.

3.పాప షడ్వర్గు. హోర, ద్రేక్కోణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రిశాంశలను షడ్వర్గులు అంటారు. మనం నిర్ణయింపబోవు లగ్నము షడ్వర్గులలో పాప గ్రహాధిపత్యములు లేనిది అయి ఉండాలి. అందుకే మన ప్రాంతంలో పుష్కరాంశను గ్రహించారు.

4.కునవాంశ: పాప గ్రహ ఆధిపత్యములు వున్న మేష, సింహ, వృశ్చిక, కుంభ, మకర నవాంశలుగాగల లగ్న సమయము విడనాడమని అర్థం. ఈ కునవాంశ ఆధారం చేసుకొని కేవలం పుష్కరాంశకే సుముహూర్తం చేయనవసరం లేదని మంచి గ్రహ ఆధిపత్యం వున్న నవాంశ సమయం, ముహూర్త సమయంగా నిర్ణయించవచ్చని ఆంధ్రేతరుల వాదన.

5.కుజ అష్టమం. ముహూర్త లగ్నమునకు 8 వ ఇంట కుజుడు ఉండుట దోషం.  6.భృగుషట్క దోషం:-  ముహూర్త లగ్నమునకు 6  వ ఇంట శుక్రుడు ఉండుట దోషం అయితే కుజ శుక్రులు బలహీనమైన స్థాన బలం కలిగినప్పుడు దోషం ఉండదు.

7.కర్తరీ: మే నెలలో వచ్చే కర్తరీ కాదు. లగ్నానికి వ్యయంలో వున్న పాపగ్రహం ఋజు మార్గంలోనే వున్ననూ దోషం లేదు.

8.అష్టమ లగ్న దోషము: జన్మ లగ్నము నుండి ముహూర్తము చేయబోవు లగ్నము ఎనిమిదవ లగ్నం అవకూడదు. అదే రీతిగా జన్మరాశిని కూడా చూడాలి. దీనికి మతాంతరం ఉన్నది.

9.అష్టమ చంద్రుడు: ముహూర్త కాలంలో చంద్రుడు వున్న స్థానం. మన జన్మ రాశి నుండి ఎనిమిదవ రాశి అవకూడదు.

10.షడష్ట చంద్ర దోషం  ముహూర్త లగ్నంలో చంద్రుడు లగ్నం నుండి 6,8,12 స్థానముల యందు ఉండరాదు. పాపగ్రహములతో కలిసి ఉండరాదు.

11.సగ్రహ చంద్ర దోషం.ముహూర్త లగ్నం నందు చంద్రునితో ఇతర గ్రహములు కలసి ఉండుట దోషం

12.వారజనిత దుర్ముహూర్త దోషం: ప్రాంతీయంగా దుర్ముహూర్తముల వాడకంలో పాఠాంతరములు ఉన్నాయి. పంచాంగంలో రోజూ దుర్ముహూర్త కాలం రాస్తారు. అయితే లగ్నం ఆరంభం నుండి అత్యంత వరకు కూడా దుర్ముహూర్తం తగులరాదు.

13.గ్రహణభం గ్రహణం ఏర్పడిన నక్షత్రం ఆ తరువాత ఆరు మాసాల వరకు ఆ నక్షత్రంలో ఏ విధమైన శుభ కార్యములూ చేయరాదు.

14.ఉత్పాత, భూకంపం ఏర్పడిన ప్రాంతాలలో వారు ఆ రోజున వున్న నక్షత్రమును ఆరు మాసాల వరకు శుభ కార్య నిమిత్తంగా వాడరాదు.

15.క్రూరయుక్త నక్షత్రం: పాప గ్రహములు వున్న నక్షత్రం శుభ కార్యములకు నిషేధము.

16.అశుభ వేధ: సప్తశలాక వేధ, పంచశిలాక వేధ అని రెండు రకాలయిన సిద్ధాంతములు వున్నాయి. వాటి ద్వారా వేధాక్రాంతలు అని రెండు రకాలైన విశేషములు వున్నాయి. వీటిని గురు ముఖం నేర్చుకోవలసిందే.

17.‘ఖార్జురి సమాంఘ్రిభం’ అనే 17వ దోషం కూడా గురువు ద్వారా తెలుసుకోవలసిన అంశం.

18.వ్యతీపాత వైధృతి పంచాంగంలో రాసిన యోగాలలో శుభకార్యాములు చేయుట నిషేధముగా చెప్పబడినది.

19.విషయుత లగ్నము: లగ్నారంభం నుండి లగ్నాంతము వరకు వున్న కాలములో వర్జ్యము స్పృశింపరాదు. అలా వర్జ్యము తగలదని లగ్నములు మనము శుభకార్యములు చేయవచ్చు.

20.గండాంత దోషము: తిథి గండాంతం, లగ్న గండాంతం, నక్షత్ర గండాంతం అని మూడు రకాలు. రేవతీ చివరి 48 ని.లు అశ్వినీకి మొదటి 48 ని.లు అలాగే ఆశే్లష జ్యేష్ఠలలో చివరి 48 ని.లు మఘ మూల నక్షత్రములు ప్రారంభ 48 ని.లు గండాంతము అంటారు. మీనం కర్కాటకం వృశ్చికం లగ్నములు చివరి 48 ని.లు మరియు మేషము సింహం ధనస్సు లగ్నములలో ప్రారంభం 48 ని.లు. గండ సమయం అంటారు. దీనికి లగ్న గండాంతం అని పేరు. అలాగే పంచమి దశమి పౌర్ణమిలకు చివరి 48 ని.లు షష్ఠి ఏకాదశీ, పాడ్యమి తిథులకు ప్రారంభ 48 ని.లు తిథి గండాంత సమయము అంటారు. దీనికే గండాంత దోషం అని పేరు.

21.ఉదయాస్త శుద్ధి: సుముహూర్త నిర్ణయం చేయబడిన తరువాత ఆ ముహూర్తము యొక్క లగ్నాధిపతి నవాంశాధిపతి ఇరువురూ శుభ గ్రహముల చేత లేదా మిత్ర గ్రహముల చేతనయిననూ చూడబడు ముహూర్తం నిర్ణయించాలి. లగ్నాధిపతికి నవాంశాధిపతికీ పాప గ్రహములు శత్రు గ్రహముల వీక్షణ పనికిరాదు. ఈ విధంగా పైన చెప్పబడిన 21 దోషములు లేకుండా ఉండే మంచి ముహూర్తం నిర్ణయించాలి. ఇంకా ఒక్కో ముహూర్తానికి ఒక్కో విశేషం, దోషం చెప్పబడిననూ ప్రధానమయినవి పైన చెప్పిన ఏకవింశతి దోషములు. ఇవి బాగా పరిశీలించి ముహూర్త నిర్ణయం చేయవలెను.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...