Sunday, February 18, 2018

గౌరీశంకర్ రుధ్రాక్ష

గౌరీశంకర్ రుధ్రాక్షను మొదటిసారిగా ధరించేటప్పుడు శివాలయంలో అభిషేకించటం చాలా మంచిది. “ఓం గౌరీశంకరాయనమః” “ ఓం నమశ్శివాయ”అనే మంత్రాన్ని జపిస్తూ రుధ్రాక్ష ధారణ చెయ్యాలి.  

రెండు గింజలు కలిసి ఉన్న రుద్రాక్షలనే ‘గౌరీశంకర్’ రుద్రాక్షలుగా వ్యవహరిస్తారు.రెండు రుధ్రాక్షలలో ఒకటి పార్వతి, రెండవది పరమేశ్వర స్వరూపంగా కొలుస్తారు. బార్యభర్తల అన్యోన్నతకి ,వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులకు  “గౌరీశంకర్ రుధ్రాక్ష”ని తప్పనిసరిగా ధరించవలెను.

గౌరీశంకర్ రుధ్రాక్షను స్త్రీ,పురుష భేదం లేకుండా ఎవరైనా ధరించవచ్చు.“గౌరీశంకర్ రుధ్రాక్షను” ధరరించినను,పూజించినను కుటుంబంలో సకల సౌక్యములు కలుగును. గౌరీశంకర్ రుధ్రాక్ష శివపార్వతుల స్వరూపం కావటంవలన పేరుప్రఖ్యాతలు,అభివృద్ధి కలుగుతాయి.

గౌరీశంకర్ రుధ్రాక్ష మనిషి యొక్క ఆలోచనా విధానంలో  మార్పులను చూసిస్తుంది. . గౌరీశంకర్ రుధ్రాక్ష ఆద్యాత్మికతను మేలుకోల్పుతుంది. గౌరీశంకర్ రుధ్రాక్షను 12 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ధరించవచ్చు.గౌరీశంకర్ రుధ్రాక్షను వివాహం కానివారు ధరించిన సత్వరమే వివాహ ప్రయత్నాలు అనుకూలించును.

జాతకచక్రంలో కుజదోషం,కాలసర్పదోషం ఉన్నవారు గౌరీశంకర్ రుధ్రాక్షను ధరించటం మంచిది..జాతకచక్రంలో రాహు,కుజ,శుక్ర దశలు జరిగే వారు గౌరీశంకర్ రుధ్రాక్షను ధరించటం మంచిది.

గ్రహ దోషాలను తొలగించి, బుద్ధిని, వివేకాన్ని కలిగిస్తుంది. మెదడు హృదయానికి సంబంధించిన రోగాల్ని దూరం చేస్తుంది. హృద్రోహము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్ మరియు అనేక చర్మరోగాలను దూరం చేస్తాయి. మొత్తంపై రుద్రాక్షలోని రసాయనిక ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...