ఎముకలను కాపాడే ఆలివ్ నూనె

ఆలివ్ నూనెతో ఉన్న
ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని కొత్త అధ్యయనం
పేర్కొన్నది. స్పెయిన్‌లోని డాక్టర్ జోసెఫ్ ట్రుయెట హాస్పిటల్‌కు చెందిన
పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. రెండేళ్లపాటు సమృద్ధిగా ఆలివ్ నూనె
ఉన్న మెడిటేరియన్ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎముకల నిర్మాణ గుర్తులు
పెరిగాయి. ఇవి ఎముకల మీద రక్షణ ప్రభావాన్నిచూపించాయి.
'బోలు ఎముకల వ్యాధి
నివారణలో భాగంగా ప్రయోగాత్మకంగా ఆలివ్ నూనెను వినియోగించాం' అని అధ్యయన
ప్రధాన రచయిత జోస్ మాన్యువల్ ఫెర్నాండెజ్ రీల్ తెలిపారు. 'ఆలివ్ నూనె
ఎముకలను రక్షిస్తుందని తెలుసుకోవడానికి ఈ అధ్యయనం యాదృశ్ఛికంగా జరిగింది'
అని జోస్ తెలిపారు.
అధ్యయనం కోసం ఇళ్లల్లో నివసించే 55 నుండి 88 ఏళ్ల
వయసున్న 127 మందిని ఎంపిక చేశారు. 'ప్రివెన్షన్ కన్ డైట మెడిటేరిన్'
అధ్యయన కేంద్రాల్లో వీరు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అధ్యయనం తర్వాత
వీరిని రెండేళ్లపాటు అనుసరించారు.
వీరిని మూడు భాగాలుగా విభజించారు. ఒక
గ్రూపులో మెడిటేరియన్ డైట్‌తోపాటు మిశ్రమ కాయలను, మెడిటేరియన్
డైట్‌తోపాటు అసలైన ఆలివ్ నూనె, మూడో గ్రూపు వారికి
తక్కువ కొవ్వు ఉన్న
ఆహారం తీసుకోవాలని సూచించారు. అధ్యయనానికి ముందు వీరి ఆస్టియోకాల్సిన్,
గ్లూకోజ్, పూర్తి కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్-కొలెస్ట్రాల్,
ట్రైగ్లిజరైడ్లు ఎంతుందో నమోదు చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ వీటిని
లెక్కించారు.
మెడిటేరియన్ డైట్‌తోపాటు ఆ
లివ్ నూనె వాడిన వారిలో టోటల్
ఆస్టియోకాల్సిన్ గణనీయంగా పెరిగింది.
కానీ ఇతర రెండు గ్రూపుల్లో మాత్రం సిరం కాల్షియం గణనీయంగా తగ్గాయి. ఈ
అధ్యయనం జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండొక్రినాలజి అండ్ మెటబాలిజంకు చెందిన
ఎండోక్రైన్ సోసైటీలో ప్రచురితమైంది.
No comments:
Post a Comment