చాలా చక్కటి ప్రశ్న. "కృష్ణం వందే జగద్గురుమ్" అని శ్రీ కృష్ణపరమాత్మను
నిత్యం స్తుతించే ఈ భారతదేశంలో కృష్ణుని పేర అవార్డు యివ్వవచ్చు గదా?
అలాకాక ద్రోణుని పేర యిస్తున్నారేమిటి? అని మీ సంశయం కావచ్చు. యిక్కడ శ్రీ
కృష్ణపరమాత్మ ద్వాపరయుగంలో భూమి మీదకు వచ్చినది మొదలు తన అవతారం
చాలించేవరకు నడచిన ప్రతినడవడీ కూడా ప్రతిమనిషికీ ఒక పాఠమే. అంతేకాదు
ప్రతిమనిషి అజ్ఞానం పొగొట్టి వారు చక్కటి విజ్ఞానంతో బ్రతకడానికి గాను-
శ్రీ కృష్ణపరమాత్మచే అర్జునునికి చెప్పబడి- తద్వారా లోకానికి అందించబడినది
భగవద్గీత. ప్రతిమనిషీ సుఖజీవనం చెయవలెను అనినా (లేదా) ఎదేని సమస్యలో
వున్నా ఒక శ్రీకృష్ణుఅని గూర్చి భారత భగవతాలలు శోధన చేస్తే తప్పనిసరిగా మన
సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సుఖజీవనం లభిస్తుంది. అందుకే ఆయన జగత్ కు
గురుజీ ఆయ్యారు. అయితే తాను ప్రత్యక్షంగా ఎప్పుడూ గురుస్ధానంలో లేరు.
యికద్రోణుణి గూర్చి పరిశీలిస్తే భారతంలో ద్రొణ పాత్ర గురువుగానే ప్రారంభం
అక్కడి నుండి ద్రోణుని చివరి శ్వాసవరకు గురుస్ధానంలోనె వున్నారు. ఆయన
పరస్పరం శతృవులయిన కౌరవపాండవులను విద్యభ్యాసం చేయించారు. అలాగే ఎంతోమంది
ఆనాటి రాజులు రాజపుత్రులు ఆయన శిష్యులే. యిక ఆయన గురువుగా గొప్పస్ధానం
సంపాదించుటకు కారణాలు ఎన్నోవుండగా అందలి ప్రధాన కారణం గూర్చి చూద్దాం.
ద్రుపదుడు అనే మహారాజు ద్రోణాచార్యుల వారిని తీవ్రంగా అవమానించాదు. అయితే
పాండవులు గురుదక్షిణంగా ద్రుపద మహారాజును యుద్ధంలో ఓడించి బంధించి
ద్రోణునికి అప్పగించారు. ద్రోణుడు ద్రుపదుడు ఒక గురువు శిష్యలే. అయితే ఆ
పాత స్నేహంతో ద్రోణుడు ద్రుపదుని విడుదల చేశారు. ఆ తర్వత " ద్రోణుని
సంహరించు పుత్రుని కావలి" అని కోరికతో ద్రుపదుడు యాగంచేసి యజ్ఞ ప్రసాదంగా
ద్రౌపదిని, దుష్టద్యుమ్నుని పొందాడు. దుష్టద్యుమ్నుని జన్మకు ప్రధాన
లక్ష్యం ద్రోణుని వధించడమే. అది తెలిసి కూడా ద్రోణాచార్యులవారు
దుష్టద్యుమ్నుని చేత విద్యాభ్యాసం చేయించారు. గురువు యొక్క ధర్మం తన
దగ్గరకు ఎవరైనా వచ్చి విద్య నేర్పమంటే ఆ అడిగినవాడు అర్హుడే కనుక అయితే
తప్పనిసరిగా విద్యను నేర్పాలి. ఆ కోణంలోనే దుష్టద్యుమ్నుడు విద్యార్ధిగా
అర్హత కలవాడే అందువలన ద్రోణాచార్యుల వారు "దుష్టద్యుమ్నుడు తనను వధించుటకు
పుట్టినవాడు" అనే విషయం పక్కన పెట్టి అతనికి చదువు చెప్పి లోకంలో, కీర్తి
పతాకను ఎగురువేశారు. అంతేకాక ద్వాపరయుగంలో విద్యా ప్రదర్శన చేసి
కీర్తిగడించిన వారిలో ఎక్కువమంది ద్రోణుని శిష్యులే. గురువు స్ధానం
ఆక్రమించి గురువుగా కీర్తి గడించి గొప్పగా గురువు లక్షణాలు ప్రదర్శించిన
ద్రోణుడి పేర అవార్డులు యివ్వడంలో అతిసయోక్తి లేదు.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment