Friday, October 25, 2013

తనకు మాలిన పనులు

మగధ దేశంలో అరిదుర్గము అను పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో శుభదత్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతడు కోటీశ్వరుడు. కాని సంతానం లేదు. అందువలన అతడు తరచు ధనధాన్యములను దానం చేసే వాడు. అనేక కొలనులను కట్టించాడు. దేవాలయములను నిర్మించాడు.
అరిదుర్గంలో ఒక ప్రాచీన దేవాలయం ఉండేది. అది పూర్తిగా శిధిలమైపోయింది. దానిని పునఃనిర్మాణం చేయాలని శుభదత్తుడు సంకల్పించాడు. దాని కోసం అనేక మంది వడ్రంగులను పిలిపించి, తగిన జీతములను ఇచ్చి, గుడిని నిర్మించమని అడిగాడు. వారు గుడికి కావలసిన దూలములు, తలపులు, ద్వారములు తయారు చేయసాగారు.
ఒక రోజు వడ్రంగులు ఒక పెద్ద దూలాన్ని నిలువుగా రంపంతోకోస్తూ, అది సులభంగా చీలుటకు వీలుగా అక్కడక్కడ మేకులను దిగకొట్టారు. మధ్యాహ్న భోజన సమయాంలో వారందరు భోజనానికి వెళ్ళారు.
గుడికి సమీపంలో ఒక చెట్టు మీద అనేక కోతులు ఉన్నాయి. అవి క్రిందకు దిగి గుడి గోడలు ఎక్కి ఆడుకోసాగాయి. వాటిలో కొన్ని చెట్టుకొమ్మలపై తలక్రిందులుగా వ్రేలాడుతూ, ఇతర కోతులను వెక్కిరిస్తూ ఆనందించసాగాయి. వాటిలో ఒక ముసలికోతి సగం బయటబడిన దూలం పైన అటు ఒక కాలు, ఇటొక కాలు వేసి కూర్చొన్నది. దాని తోక దూలం మధ్యలో నున్న చీలికలో వ్రేలాడుతున్నది. కోతి దూలంలో దిగగొట్టిన మేకును బలవంతముగా ఊడదీసింది. దాని వలన చీలి ఉన్న దూలం ఒక్కటైపోయి, కోతి తోక, వేలు దానిలో ఇరుక్కుపోయి నలిగిపోయాయి.
కోతి ఆ బాధను భరించలేక ఏడ్చింది. చివరకు బాధను తట్టుకోలేక చనిపోయింది.
అందుకే అనవసరమైన పనులజోలికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోరాధని పెద్దలు చెబుతారు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...