Friday, October 25, 2013

వానరులలో రాముడికంటే ముందు జన్మించిన వారెవరు? అంజనేయుడి తండ్రి ఎవరు?

రామాయణం బాలకాండ 17 వ సర్గ ఆధారణ్గా జాంబవంతుడు రామావతారం కంటే ముందుగానే జన్మించినట్లు తెలియుచున్నది. రామావతారం అయిన తదుపరి బ్రహ్మగారి ప్రేరణతో వివిధ దేవతల అంశల ప్రభావంగా వాలి, సుగ్రీవ, నల, హనుమంత మొదలగు వారు పుట్టిరి. దీనిని బట్టి వానరులలో రాముల వారికంటే ముందు జన్మించినది కేవలం జాంబవంతుడే. అంజనాదేవి, కేసరి (వానర రాజు) ల యొక్క పుత్త్రుడు అంజనేయస్వామి. అంజనాదేవి సంతానం కోసం వేంకటాచలం (ప్రస్తుత తిరుపతి కొండ) మీద తపస్సు చేయగా శివుని ఆజ్ఞతో వాయుదేవుడు శివతేజమును అంజనాదేవి గర్భమున ప్రవేశపెట్టెను. అందుకే అంజనేయస్వామి శివాంశ, వాయుపుత్రుడు, కేసరినందనుడుగా పిలువబడుతాడు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...