Friday, October 25, 2013

ప్రేమ - పెళ్లి

నిదురిస్తున్న రేయి ఎదురు చూసేది ఉదయం కోసం ,
నిదుర లేచిన నా నయనం ఎదురు చూసేది నిను చూసే క్షణం కోసం...
అధరాలు కదిలేది మాటల సడి కోసం ,
నా పెదవులు సడి లేక మౌనమైంది నీ తీయని ముద్దు కోసం ...
గుండె చేసే అలజడి ప్రాణం కోసం ,
నా ప్రాణమైన నువ్వు నా గుండె గుడిలో నిదరోవడం కోసం ...
పాదాల పయనం జీవిత గమ్యం కోసం ,
నా అడుగుల గమనం నిను చేరుకునే ఆశ కోసం...తొలిసారి నాకు నచ్చింది నువ్వేనని ,
చివరి వరకు నీ తోడు నాకు కావాలని ,
నీ ప్రతి అడుగులో నీ నీడగా పయనించాలని ,
నా ఆశవు నువ్వై నను చేరుకోవాలని ,
నీ శ్వాసను  నేనై నీలో కలసి పోవాలని ,
నీకు చెప్పాలనుంది, కాని ....
"మొమాటంతో మనసు నిను అడగలేక
మౌనంతో దేవుణ్ణి కోరుకుంటోంది "
ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెతుకుతున్న నీ ప్రాణం నేనేనని ,
నీ కోసమే కోవెలగా మార్చిన నా హృదిలో నిను చేర్చమని .......నీ ఆశల పల్లకిలో అందమైన తారకలా ,
నీ కన్నుల లోగిలిలో పచ్చని తోరనంలా ,
నీ గుండె గుడిలో ఆరిపోని దీపంలా ,
నీ పెదవుల మాటున చెరగని చిరునవ్వులా,
నీ అడుగుల వెనుక తోడుగా ఉండే నీ నీడలా ,
ఉండిపోవలనుంది .......
నువ్వు అనుమతిస్తే , నీ చేతుల చెరలో బందీనై,
నిన్నే ఆరాధిస్తూ , నీ జతగా మిగిలి పోవాలనుంది........నా తనువుకు ప్రాణం నువ్వు ,
నా గుండెకు సవ్వడి నువ్వు ,
నా కనులకు అందం నువ్వు ,
నా కళలాడు ఆశవు నువ్వు ,
నా అడుగుల సవ్వడి నువ్వు ,
నా జీవితానికి అంతం నువ్వు.......కమ్మగా పాడే కోయిలనడిగాను,
నీ తీయని మాటలతో నను మురిపించేది ఎపుడని ...
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను ,
నీ చల్లని చూపుతో నను తాకేది ఎపుడని...
వర్షించే మేఘాన్ని అడిగాను ,
నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎపుడని ...
హాయిని పంచే వెన్నెలని అడిగాను ,
ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎపుడని ...
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,
నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను ,
నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......నేను నీ మెడలో వేసే మూడుముళ్ళ బంధం కోసం ,
నీతో కలసి నడిచే ఏడడుగుల కోసం ,
ఏకాంతంగా నీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయే హాయి కోసం ,
నన్ను నిన్ను దగ్గర చేసే వెచ్చని కౌగిలి కోసం ,
నువ్వు ప్రేమతో నాకు ఇచ్చే తీయని ముద్దు కోసం ,
నీ అన్నింటిలో నేనూ సగమై పంచుకునే క్షణం కోసం ,
నీలో నన్ను కలిసే మధురమైన అనుభూతి కోసం ,
..................    ............  .................
ఆ ఏడు క్షణాల కోసం , ఏడు వసంతాలే కాదు ,
ఎన్ని జన్మలైనా ..... ఇలానే ఎదురుచుస్తూ ఉంటాను

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...