దేవి భాగవతం మన ఈ సంశయాన్ని తీర్చగలదు. జన్మతోనే బ్రాహ్మణుడుగా
తెలుపబడుతుంది. ఉపనయనంలో గాయత్రీ ఉపదేశం చేయబడుతుంది. వేదశాస్త్ర విజ్ఞాన
అర్జనకు అర్హత ప్రారంభం అవుతుంది. ఈ గాయత్రీ ఉపదేశంతోనే కొన్ని నియమాలు
కూడా విధింపబడినవి. బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యులకు ఉపనయంతో గాయత్రీ దీక్ష
ప్రారంభం అవుతుంది. ప్రతి బ్రాహ్మణునికీ గాయత్రీ శాశ్వత దీక్ష. అందుకే
బ్రాహ్మణులు అందరూ శాక్తేయులు అని వర్ణించినది దేవిభాగవతం. అయితే శైవులు
వైష్ణవులు అనే వర్గీకరణ కేవలం మనం సృష్టించుకున్నదే. శివారాధన ప్రాముఖ్యం
కలవారు శైవులు. విష్ణు ఆరాధన ప్రాముఖ్యం కలవారు వైష్ణవులు. సృష్టికి
శివకేశవులు యిరువురూ ఒకటే. అంతేకాక శివ, కేశవులకు భేదం చూసినవారు నరక
ప్రాప్తిని పొందుతారు అని పురాణములు తెలుపుతున్నవి. అంతేకాక బ్రాహ్మణులు
అంతా శైవులు కారు, వైష్ణవులు కారు, "శాక్తేయులు" అని దేవిభాగవతం
సూచిస్తున్నది. శైవులు శివకేశవ ఆరాధన చేయవలసినదే. వైష్ణవులు శివకేశవ ఆరాధన
చేయవలసినదే. శివకేశవ ఆరాధనల యందు భేదం చూపరాదనే పురాణాలు తెలుపుచున్నవి.
యింకా విశేషములు కావలెను అనిన ఎడల శివపురాణం, విష్ణు పురాణం, దేవిభాగవతం
చదవండి. మీకు మరిన్ని విశేషాలు తెలుస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
జ్ఞానం తో కానీ అజ్ఞానం తో కానీ చేసిన సకల తప్పులను ఒప్పులను మన్నించి మమ్ములను కాపాడువాడివి దయగల హృదయుడవు కరుణ స్వామివి కలియుగ దైవం ఐన హర...
-
🔔 *పాడ్యమి* శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే. *ఈ త...
No comments:
Post a Comment