Friday, February 23, 2018

ఆకారం చూసి మోసపోవద్దు


శ్లో" కాకః కృష్ణః పికః కృష్ణః
కో భేదః  పికకాకయోః,
వసంతకాలే సంప్రాప్తే
కాకః కాకః పికః పికః.

భావం;- కాకి, కోయిల రెండూ నల్లగానే ఉంటాయి. వీటి రెంటికీ తేడా ఏమిటి? వసంతకాలం వచ్చినపుడు కాకి కాకే, కోయిల కోయిలే. ఆకారాన్ని బట్టి ఎవరి ప్రజ్ఞనీ అంచనా వేయలేం. సందర్భం వచ్చినపుడు వాళ్ళ ప్రతిభ బయటపడుతుంది. సందర్భాన్ని కాలమే సంతరించి పెడుతుంది. పండితునిమాదిరి జరీపంచె, ఖండువా ధరిస్తే సరిపోతుందా? సభామధ్యలో మాట్లాడినపుడు పండితునికీ, పండితుడు కాని వాడికి తేడా ఇట్టే తెలిసిపోతుంది కదా! వేమన చెప్పినట్లు ఉప్పు, కర్పూరం ఒకే రకంగా ఉన్నా రుచిని బట్టి తేడా తెలుస్తుంది. ఈ విధంగా వసంత కాల కాకేదో కోకిల ఏదో బయటపెట్టే మాధ్యమ సమయం. కాకి కర్ణ కఠోరంగా అరుస్తుంది. కోయిల తీయగా పాడుతుంది.అలాగే ఒకే రకంగా కనిపించే వ్యక్తుల్లో ఎవరు శ్రేష్టులు, ఎవరు కారో అన్న విషయం సంధర్భం వచ్చినప్పుడే తెలుస్తుంది. సమయానికి ఉన్న ప్రాధాన్యం అది. ఎదైనా సహాయం అవసరమైనప్పుడు మొహం చాటుచేసుకున్నవాడు స్నేహితుడెలా అవుతాడు? స్నేహితులనిపించు కున్న వారి స్వభావం సందర్భం వచ్చినపుడే తేటతెల్లమవుతుంది కదా!
*శుభం భూయాత్*

1 comment:

Unknown said...

Thank for the information

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...