Friday, February 23, 2018

కోపానికి బద్ధశత్రువు ఓర్పు


ఓర్పు కు ప్రతీక సాలెపురుగు.
గదిలో ఓ మూలన నిశ్శబ్దంగా - ఓర్పుగా - ఒంటరిగా అది గూడు కట్టుకుంటుంది.
ఎవరినీ సాయం అడగకుండా, ఎవరినీ బాధించకుండా, తననుంచి తాను విడివడుతూ, తనను తాను త్యాగం చేసుకుంటూ పోగు తరువాత పోగు గొప్ప ఏకాగ్రత తో ఒక శిల్పి చెక్కినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.

ఒక హడావుడి ఉదయాన, నిశ్శబ్ద సాయంత్రం సమయానో, గోడ మీద నుండి పెద్ద శబ్దం తో వచ్చే చీపురు కట్ట ఒక్క వేటు తో దాని శ్రమనంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది. సర్వనాశనమైపోయిన సామ్రాజ్యం లో నుంచి సాలెపురుగు అనాథలా నేలమీద పడుతుంది.

ఎవ్వరినీ కుట్టదు. ఎవ్వరిమీద కోపం ప్రదర్శించదు. మళ్ళీ తన మనుగడ కోసం కొత్త వంతెన నిర్మించుకోవడానికి సహనం పోగు లను నమ్మకం అనే గోడ మీద తిరిగి స్రవిస్తుంది.

ఎలా బ్రతకాలో మనిషి కి పాఠం చెపుతుంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...