Friday, February 23, 2018

యజ్ఞోపవీతం దాచుకొనేది కాదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం

బ్రాహ్మణోత్తములారా, కొందరు మనలో అత్యంత పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ఎవరైనా చూస్తే బావుండదేమోనని
నడుముకు చుట్టుకోవడమో లేదా తీసివేయడమో చేస్తూ మహాపాతకాన్ని మూటగట్టుకొంటున్నారు. అత్యంత హేయమైన చర్య ఇది.
ఎన్నోజన్మల తరువాత మానవజన్మ లభిస్తుంది. అందునా గాయత్రీమాత కటాక్షానికి నోచుకొనే యజ్ఞోపవేతాన్ని ధరించే బ్రాహ్మణ పుట్టుక అంత సులభంగా రాదు. ఎవరేమనుకున్నా అనవసరం. యజ్ఞోపవేతాన్ని దాచుకోవాల్సినంత ఖర్మేమీ పట్టలేదు. ఇష్టమొచ్చినట్ట్లు ధరించడానికది ఆభరణం కాదు. నియమనిబంధనలకు విరుద్ధంగా ధరిస్తే జీవితం ఏదో విధంగా వినాశమవ్వడం ఖాయం.

*యజ్ఞోపవీత పవిత్రత*

యజ్జోపవీతం ఒక 'బ్రాహ్మణ కన్య ' చేత 'భమిడి ప్రత్తి' తో వడకించి తర్వాత 'బ్రాహ్మణుడి' చేత మెలికలు వేయిస్తారు. జంద్యం పొడవు సుమారుగా సాధారణ వక్తి ఎత్తుకు సమానంగా ఆరు అడుగులు (చేతి నాలుగు వ్రేళ్ల వెడల్పుకి ఇరవైనాలుగు రెట్టు) ఉంటుంది. నాలుగు వేళ్ళు మనిషి యొక్క జాగరణ, నిస్వపన, స్వప్న మరియు బ్రహ్మ(తురీయ) స్థితులు అనే నాలుగు స్థితులను తెలియజేస్తాయట.

జంద్యానికికుండే మూడు పోగులు ఒక మూడు (బ్మహ్మ గ్రంధి) చేత కట్టబడి ఉంటాయి. ఈమూడు పోగులు ఋషి ఋణం, పితృ ఋణం మరియు దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. మూడు పోగులను కలిపి వేయబడిన రుధ్రలో గ్రంథి త్రిమూర్తులు ఏకమై ఉన్నారు, అనే విషయాన్ని తెలియజేస్తాయి. అంతే కాదు, మూడు పోగులు అంటే కేవలం మనకు ఉండే రెండు నేత్రాలతో పాటు మూడవది అయినటువంటి 'జ్ఝాన నేత్రం' కూడా ఉండాలని అర్ధం. శుభకార్యాలలో మరియు మామూలు సమయంలో 'యజ్ఝోపవీతాన్ని' ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు 'కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్లు' వేసుకుంటారు. మలమూత్ర సమయంలో మెడలో దండ (తావళం) లాగ, చెవి పై ఉండేటట్లు వేసుకుంటారు. భూమికి తాకకూడదు. రజస్వల గాలి తాకకూడదు. మరణ అసౌచం తదుపరి తిలోదకాల తర్వాత జ్ఞాతులు/దాయాదులు/సగోత్రికులు మార్చాలి.

ఇలాంటి అత్యంత పవిత్రమైన యజ్ఞోపవేతాన్ని ఇష్టమొచ్చినట్టు ధరించండి. ఏమైనా అనుమానాలుంటే పండితుణ్ణి, గురువును సంప్రదించండి. లేదా జందెం, జంద్యం లేదా జందియం గురించి పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు. చదివితెలుసుకోండి.

నిత్యం సంధ్యావందనం, గాయత్రీజపం అనుష్టానాలని వదిలిపెడితే బ్రాహ్మణజన్మకి సార్ధకముండదు.

వ్యతిరేకఫలితాలతో జీవితం దుర్భరమౌతుంది.

                          శుభం

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...