Friday, February 23, 2018

లక్ష్మీ దేవి ఎక్కడ వుండదు? తెలుసుకోవాలి అనుకొంటున్నారా ?


     
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.... శ్రీ హరి కుడా ఉండడు....

లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుండదు అంటే:

💠 భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.
💠 శంఖద్వని వినిపించని చోటా.
💠 తులసిని పూజించని చోట.
💠 శంఖరుని అర్చించని చోట.
💠బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.... లక్ష్మి దేవి నివసించదు.
💠 ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట.
ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.
💠 విష్ణువును ఆరాధించకుండ.
💠 ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.
హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది.
💠 అనవసరం గా గడ్డిపరకలను తెంచిన.
చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది.
నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు....
💠 పసుపక్షులను హింసించే చోట వుందనే వుండదు.....
💠 సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు.

మరి లక్ష్మీ దేవి ఎక్కడ ఎక్కడ వుంటుంది అంటే :
     
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది....
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.... అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం  ఎక్కువలేదు.... దానితోనే సంతోషము కలుగుతుంది.... అప్పుడు ఎల్లవేళ  శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది....
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు ... ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన  ఐశ్వర్యం జారిపోతుంది....

     మారేడు పండులో లక్ష్మిదేవి ఉంటుంది
        
మారేడు పండులోనూ లక్ష్మిదేవి ఉంటుంది అంటారు..... ఒకసారి లక్ష్మిదేవి శివుడికి వెయ్యి కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటుంది.... శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక పూవును తీస్కుంటాడు.... అలాగ ఒక పువ్వు తక్కువయిన విషయాన్ని గమనించిన లక్ష్మి దేవి భూమి అంతా గాలించిన ఒక్క పువ్వు కుడా దొరకదు.......

అప్పుడు ఆ తల్లి తన ఒక స్తనాన్ని కలువపువ్వుగా సమర్పించదలుస్తుంది. ఆమె సాహసానికి, భక్తికి ముగ్ధుడైన శివుడు అమ్మవారి స్థనాన్ని మారేడుపండుగా మార్చి, తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని ప్రకటిస్తాడు....

           అద్దం పగిలితే అరిష్టమా?
     
అద్దం పగిలితే పగిలిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదు.....

పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. మరకలు పడి లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచ కూడదు.....
అద్దానికీ, లక్ష్మీదేవికీ చాలా దగ్గర సంబంధం ఉంది.... అద్దం అంటే లక్ష్మిదేవి స్థానం....
అద్దంలో ఎప్పడూ ఒకే బొమ్మ నిలకగా ఉండదు.... లక్ష్మీదేవికూడా అంతే....

అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలు చెబు తున్నాయి....

గాజు వస్తువు ఏదైనాసరే పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రపర చినా దానియొక్క రజను ఎక్కడో ఒకచోటవుండి చటుక్కున కాటు వేస్తుంది.....

కనుక అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సహనంతో పగిలిన అద్దంముక్కలను ఎవరు నడవని ప్రదేశాల్లో వాటిని పారెయ్యాలి...

గుడిలో ప్రదక్షణాలు చేస్తున్నారా ? అయితే ఈ విధంగా చేస్తే మీ కోరికలు తీరుతాయి....
        
చాలామంది దేవాలయానికి వెళ్తారు, తమ మనసులోని కోరికలు నెరవేరాలని ప్రదక్షిణాలు చేస్తారు... కానీ ఓ నియమబద్దంగా ఎలా చేయాలో మనలో చాలామందికి తెలియదు...
ప్రదక్షణ అంటే:

“ప్ర” అంటే పాపనాశనం
“ద” అనగా కోర్కెలు నెరవేర్చుట
“క్ష” అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనం
“ణ” అనగా జ్ఞానంతో ముక్తిని ప్రసాదించు అని అర్థం
సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ప్రదక్షణలు 2 రకాలు... సవ్యదిశ, అపసవ్యదిశ

⏩ సవ్య దిశ:
గడియారం ముళ్ళు తిరిగే దిశను సవ్యదిశ అంటారు. అంటే విగ్రహం మనకు ఎప్పుడు కుడివైపు ఉంటుంది దీన్ని శుభకార్యాలలో చేస్తారు.....

⏩ అపసవ్య దిశ:
అంటే ఎడమవైపు నుంచి చేస్తారు...... గడియారం ముళ్ళు తిరిగే దిశకు ఇది వ్యతిరేక దిశ దీన్ని ఆశుభ కార్యాలలో చేస్తారు...

గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్యానించుకోవలసిన స్తోత్రం!
* “శ్రీ పరాశర మహర్షి” వారు పెట్టిన నియమం ప్రకారం, మనం ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్నా, ప్రతి ప్రదక్షిణము ఎక్కడ అయితే ప్రారంభిస్తారో తిరిగి అక్కడే ఒక చోట ఆగి ఈ క్రింది శ్లోకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణ చేయాలి......

!! ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం
అరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం !!

ఏ గుడిలో అయినా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ తిరగాలి.... తొమ్మిది నెలల గర్భిణి ఎంత నిధానంగా నడుస్తుందో అంత నిధానంగా చేయాలి.... కాని కొందరు ఏదో ఇన్ని చేయాలి అని తొందర తొందరగా ఇంట్లో పని చేసినట్లుగా చేస్తుంటారు అలా మీరు ఎన్ని ప్రదక్షణలు చేసినా మంచిఫలితం రాకపోవచ్చు .....
💠 సాధారణంగా హిందూ దేవాలయాల్లో 3,5,9,11,108,116,1008 చేస్తుంటారు .... ఇది ఒకొక్క గుడిలో
విశేషమైన రోజులు బట్టి ప్రదక్షణల సంఖ్య ఉంటుంది .
💠 ఇలా ప్రదక్షణలు లెక్కపెట్టుకోడానికి, వక్కలుగాని, పసుపు కొమ్ములు లేక బియ్యం మాత్రమే వినియోగించాలి
💠 కర్పూరం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాన్నిస్తుంది.
💠 ముఖ్యంగా శివాలయాలలో ఒక్కో ప్రదక్షణకు   ఒక బిల్వదళము వేయడం ద్వారా విశేష ఫలితము ఉంటుంది అని గ్రంథాలు చెప్పుతున్నాయి....

     !!!!   ఓం శ్రీ  మత్రే నమః   !!!!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...