Thursday, March 8, 2018

ధ్యానయోగ సాధనకి విఘ్నలు ఏమిటి??? అతిగా భుజించువారికి,ఏ మాత్రము భుజించని వారికి అలానే అతిగా నిద్రించువారికి ఏ మాత్రము నిద్రిమ్పక మేల్కొని ఉండే వారికి ధ్యాన యోగము సిద్దించకుండా ఉండటానికి కారణం ఏమిటి??

🕉🕉🕉🕉🕉🕉

*శ్రీమద్భగవద్గీత*
*6:16*

నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంత మనశ్నతః,
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున.

అర్జునా! ఈ ధ్యానయోగము అధికముగ భుజించువానికిని, బొత్తిగా భుజింపనివానికిని, అట్లే అధికముగ నిద్రించువానికిని, (బొత్తిగా నింద్రించక) ఎల్లప్పుడు మేలుకొని యుండువానికిని కలుగనే కలుగదు.

🌺 *పూర్తి వివరణ* 🌺

అతిగా భుజించుట వలన మత్తు వస్తుంది,సోమరితనము ఏర్పడుతుంది. జీర్ణ శక్తిని పట్టించుకోక అతిగా తిన్నచో వివిధ రోగములు ఉత్పన్నమగును. అట్లే ఆహారము పూర్తిగా త్యజించినచో వాని ఇంద్రియములు,ప్రాణములు,మనస్సు శక్తి హీనములు అవుతాయి. అప్పుడు అతను ఆసనముపై స్థిరంగా కూర్చోలేడు. పరమేశ్వరుడు యందు మనస్సు లగ్నము చెయ్యలేడు. ఈ విధముగా ధ్యాన సాధనకి విఘ్నము ఏర్పడుతుంది. కావున ధ్యాన యోగి అవసరముకి మించి భుజించరాదు. కటికి ఉపవాసములు చేయరాదు.

తగినంతగా నిద్రించుట వలన అలసట తొలగి,చురుకుదనం ఏర్పడుతుంది. ఆ నిద్ర అవసరం కంటే ఎక్కువ అధికమైనచో తమోగుణము హెచ్చును. దీని వలన సోమరితనం ఆవహింస్తుంది.స్థిరముగా కూర్చోవడం కష్టం అవుతుంది. దీనికి తోడు అతిగా నిద్రించుట వలన జీవితమును అమూల్యమైన కాలం వ్యర్థం ఐపోతుంది. అలానే ఏ మాత్రం నిద్రిమ్పక పూర్తిగా మేల్కొని ఉన్నా అలసట కలుగును. చురుకుదనం నశిస్తుంది.. శరీరము,ప్రాణము, ఇంద్రియాలు శక్తిహీనులై శిథిలమగును. క్రమక్రమంగా అనేక రోగాలు ఏర్పడతాయి. ఆ కారణముగా మబ్బుగా ఉండుట సోమరి అవ్వడం సంభవిస్తుంది. ఈ విధముగా ఎక్కువగా నిద్రించుట కానీ ఎల్లప్పుడూ మేల్కొని ఉండుట కస్ని ఈ రెండు ధ్యాన యోగ సాధనకి విఘ్న కారణాలే. కావున ధ్యాన యోగి తన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ధ్యానయోగ సాధనకి ఏ మాత్రము విఘ్నము కలుగ నీయరాదు. ఈ ఉద్దేశ్యం తోనే తన శరీర స్థితిని,ప్రకృతిని,ఆరోగ్యాన్ని గమనిస్తూ అవసరము కంటే ఎక్కువ మేల్కొనరాదు ఎక్కువ నిద్రింపరాదు.

🕉🕉🕉🕉🕉🕉

దేవుడు

*అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే నా అస్థిత్వాన్ని గుర్తిస్తూ, ఉహించినవాటికి వ్యతిరేకంగా జరిగితే నా అస్తిత్వాన్ని ప్రశించే వారు నా భక్తులెలా అవుతారు ?*

           మేలు జరిగినా ,
           విజయాలు చేకూరినా,
           ధనధాన్యాలు, సంపదలు
           చేకూరినా,
           భాగస్వామి లభించినా,
           బిడ్డలు పుట్టినా,
           సుఖ సంతోషాలు ,ఆనందాలు
           దరిచేరినా,
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా ?"* అని ప్రశ్నించరు. కానీ -
        ఎమన్నా కీడు జరిగినా,
        అపజయాలు చేకూరినా,
        ధనధాన్యాలు సంపదలు
        కోల్పోయినా,
        భాగస్వామి బాధించినా,
        బిడ్డలు బాధ పెట్టినా,
        సుఖ సంతోషాలు , ఆనందాలు
        దూరమైనా -
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా?"* అని ప్రశ్నిస్తారు. నా సృష్టి అంతా నా బిడ్డలే అయినపుడు -
     -  ఎవరి మీద "ప్రేమ",ఎవరి
         మీద "ద్వేషం"?
     -  ఎవరి మీద "అభిమానం" ,
         ఎవరి మీద "అనుమానం"?
     -   ఎవరి మీద "వాత్సల్యం",
         ఎవరి మీద "శత్రుత్వం" ?
     -   ఎవరు "అయిన"వారు,
         ఎవరు "కాని" వారు ?
*కేవలం ఎవరు చేసిన "కర్మ"ను అనుసరించి, వారికి ఫలితం లభిస్తుంది*
           *అయినప్పటికీ "కర్మ" ఫలితాన్ని మార్చగల , నిర్మూలన చేసుకోగల "శక్తి" - జీవుల*
    * "నిర్మలమైన భక్తి"కి ఉంటుంది;
    * "నిశ్చలమైన నమ్మకాని"కి
         ఉంటుంది;
    *  "నిరుపమానమైన సేవ"కి
         ఉంటుంది.
    *  "సర్వ సమర్పణా భావాని"కి
         ఉంటుంది.
             లేదా
     *  నా "అనుగ్రహాని"కి,
         "కరుణ"కి, "దయ"కు,
         "వాత్సల్యాని"కి ఉంటుంది.

*ఎన్ని జన్మలు ఎత్తినా జీవులు, తమ తమ "కర్మ ఫల" నిర్మూలనకే !*
         *నా నుంచి దూరమైనా, నా అస్థిత్వాన్ని స్థిరంగా నమ్మిన నాటి నుంచి నా వైపు పయనం మొదలవుతుంది.*
           *"నేనే సర్వం ,నేనే సకలం, నన్నే చేరుట పరమార్ధం !" అనుకున్న వారు నాకు చేరువవుతారు.*
          *నన్ను తనలోనే కాక, నా సృష్టిలో అన్ని జీవులందు దర్శించినవారు, నాలో భాగమై - "ముక్తి" పొందుతారు.*

-  దేవుడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” ..యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః తత్రాఫలాః క్రియాః అని చెప్పింది మనుస్మృతి...అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది.

స్త్రీ ని దేవతగా కొలిచే భారతావనిలో ప్రతి స్త్రీ కి వందనం....

ఇంటి ఇల్లాలు సంతోషంగా లేనప్పుడు ఆ ఇంటి యజమాని దేవతార్చన అర్హతను కోల్పోతాడు.  దేవతలు ఆ ఇంటి మొహం గూడా చూడరు.

ముఖ్యో ధర్మః స్మ్రితిషు విహితో భర్త్రు శుశ్రుషాణం హి  :

స్త్రీకి ఆమె భర్త యొక్క సేవ ప్రాథమిక కర్తవ్యంగా విధించబడింది.

"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

              ఇల్లాలే ఈ జగతిగి జీవన జ్యోతి "అని

ఇంటా..బయటా అంతా నీవే...కుటుంబ భారాన్ని మోస్తూ... విశ్రాంతి లేక, నీ బాధ వినేవారు లేక భూమాతకు భారంగా మారుతున్నానని ఆవేదన చెందుతున్న ఓ మహిళా మేలుకో..

ప్రతి మనిషికి తల్లిగా, చెల్లిగా, తోబుట్టువుగా, జీవిత భాగస్వామిగా నేటి మహిళలు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నా, వారి గౌరవం నానాటికి ప్రశ్నార్థకంగానే మారుతోంది. మహిళను పూజించే చోటే పవిత్రత ఉంటుందన్న నానుడ్ని ప్రపంచానికి చాటిచెబుతున్న మనదేశంలోనే మహిళల పట్ల వివక్ష, అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరగటం దురదృష్టకరం.

మహిళలు పూజించబడే చోట దేవతలుంటారంటారు. పూజించడం మాట అటుంచి కనీస గౌరవానికి కూడా వారు నోచుకోవడం లేదు. వనితలకు దక్కాల్సిన గౌరవం దక్కగపోగా వారిపై వేధింపులు నానాటికి హెచ్చుతున్నాయి. సమాజం ఎంత ముందుకు వెళ్లినా స్త్రీలపై హింస విషయంలో మాత్రం రాతియుగమే నయమనిపించేలా ఉంది నేటి పరిస్థితి.

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.

1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)

భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు. కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.

Wednesday, March 7, 2018

పూర్వజన్మ సుకృతమా? పెరిగిన వాతావరణమా?

🕉🕉🕉🕉🕉🕉

ఒక ఆశ్రమంలో గురు శిష్యుల మధ్య చర్చ జరుగుతోంది. మానవులలో కొంతమంది సన్మార్గులుగా, మరికొంతమంది హింసా ప్రవృత్తి కల దుర్మార్గులుగా, కొందరు ఆస్తికులుగా, మరి కొందరు నాస్తికులుగా జీవించడానికి గల కారణమేమిటని శిష్యుడి సందేహం. మనిషి పుట్టిన వాతావరణము, అక్కడి స్థితిగతులను బట్టి గుణభావములు ఏర్పడతాయి, అని చెపుతూ గురువుగారు శిష్యుడికి ఒక పిట్టకధను యిలా తెలియజేసారు.

ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం మీద చిలక ఒకటి గూడు కట్టి గుడ్లను పెట్టింది. ఒక రోజు ఆ చిలక బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చెట్టుమీది గూటిలోనుండి ఒక గ్రుడ్డు క్రిందపడి పగిలిపోయి అందులోంచి చిన్న చిలక బయటకు వచ్చి ఎగరలేక అవస్థలు పడుతూంటుంది. ఆది చూసిన ఒక కసాయివాడు ఆ చిలకను తనతోపాటు తీసుకుపోతాడు. తర్వాత, యింకొన్నాళ్ళకు మరొక గ్రుడ్డు కూడా క్రిందపడి చితికిపోయి మరో చిలక బయటకు వస్తుంది. ఆ దారిన పోతున్న ఒక సాధువు దానిని చూసి జాలిపడి తనతో తీసుకు పోయి జాగ్రత్తగా పెంచసాగాడు.

ఒకరోజు, ఆ రాజ్యాన్నేలే రాజు వేట కోసం అడవికి వచ్చి అలసిపోయి విశ్రాంతికోసం అనువైన చోటుకోసం వెతుకుతూ, కసాయివాడి గుడిసె వేపు వెళతాడు. రాజుగారిని చూసి, కసాయివాడు పెంచుతున్న చిలక గట్టిగా,  "  చెట్టుకు కట్టేయండి, చంపండి, నరకండి, బాగా చితక్కొట్టండి, చంపండి, చంపండి" అంటూ గోల గోలగా అరవడం ప్రారంభించింది.  రాజుగారు ఆ చిలక పలుకులకు నివ్వెరపోతూ , అక్కడనుండి వెడలి, సాధువున్న ఆశ్రమం వైపు వస్తాడు. రాజుగారిని చూసిన ఆ చిలక, గట్టిగా,"  అతిధులొచ్చారు. లోపలకు తీసుకువెళ్ళండి. ముందు దాహాన్ని తీర్చి, పళ్ళూ, ఫలహారాలు సమర్పించండి. విశ్రాంతికి ఏర్పాట్లు చేయండి " అంటూ చిలక పలుకులు పలుకుతుంది.
రాజుగారు ఆ ఆశ్రమవాసులు కల్పించిన ఆతిధ్యం తీసుకుని ఆనందంగా వెళతాడు.
ఒకే జాతి పక్షులే కానీ వాటి మాటలో, చేష్టలో ఎంతో తేడా . కారణం , అవి పెరిగిన వాతావరణం. పెంచినవారి సంస్కారం. ఆ సంస్కారం ఎలా లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం వలన.
మరొక విషయం చెపుతాను. ఆకాశం వర్షిస్తుంది. మేఘాలలోంచి వచ్చే నీరు శుధ్ధమైనదే. కానీ అది క్రింద పడినప్పుడు ఉండే పరిసరాలను బట్టి ఆ నీటియొక్క, లక్షణమూ మారుతుంది. బురదలోపడిన వాన బురదమయంగా, నల్లమట్టిలో పడ్డ వాన నల్లగా త్రాగడానికి అనువైనదిగా ఉండదు. కానీ, అదే వర్షపు నీరు, బావులలో, చెరువులలో, నదులలో చేరితే దానిని మనం అనుభవించగలుగుతున్నాము. అంటే స్థల ప్రభావం అని తెలుస్తోంది.
మరొక విషయం చూడు. మన రామాయణ గాధే ఉంది. విభీషణుడు ,రావణ కుంభకర్ణుల సోదరుడు. జన్మతః అసురుడు. కానీ, ఏ పూర్వపుణ్యఫలం వలననో శ్రీరాముని మైత్రి చేసి ఆయన అనుగ్రహం పొందాడు. లోకమంతటిచేత ప్రశంసించబడ్డాడు.
మహాభారతగాధలోని కర్ణుడు సూర్యాంశతో జన్మించి, వీరాధివీరుడిగా,  దాతృత్వంలో అసమాన్యుడిగా, స్వామి భక్తుడిగా పేరుపొందాడు. కానీ, కర్ణుడిలోని మంచి లక్షణాలన్నీ దుర్యోధనుడి సహచర్యం వలన మరుగున పడిపోయాయి. దుష్ట సహవాసం చేసి దుష్ట చతుష్టయంలోని వ్యక్తిగా అందరిచేత పరిగణింపబడ్డాడు. దుర్యోధనుని అక్రమకార్యాలలో భాగస్తుడై బలి అయిపోయాడు."
గురువుగారు చేసిన హితోపదేశం శిష్యుడికి సంతోషం కలిగించింది. మన  జీవిత గమ్యాన్ని చేరడానికి,  లక్ష్యాన్ని సాధించడానికి సజ్జన సాంగత్యం, సుహృద్భావ వాతావరణం ఎంతో అవసరమని ఆ శిష్యుడు గ్రహించాడు.

🕉🕉🕉🕉🕉🕉

‘శివాలయ దర్శన విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాత శివలింగం అని అంటారు.

అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, సృష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు, పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే. శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీమనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్శనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వాతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురాణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ, మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"

హర హర మహా దేవ శంభో శంకర !

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. 

లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...