Saturday, October 27, 2018

శ్రీసూక్తము: అనగా

శ్రీ గురుభ్యో నమః 
శ్రీ అనగా సంపద.. మన వేదము సంపద ద్వార పరమత్ముని ఎలా చేరుకొవాలి అని పతిపాదన చేస్తున్నది. వేదము నందలి  కర్మ కాండలొని ఈ సూక్తము యొక్క వివరణ , దీని యొక్క వినియోగము చక్కగా  చెప్పబడినది.  శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరమ కటాక్షమును పొందుటకై  శ్రీసూక్తమును జప హోమాదీ రూపముగా వినియొగింపబడుతున్నది.

సూక్తము - అంటే సు + ఉక్తము - అంటే బాగా చెప్పబడినది..
శ్రీసూక్తము - అంటే - సంపదగురించి బాగా చెప్పబడిన మంత్ర సముదాయము.

శ్రీసూక్తము యొక్క స్వరూపము - ఇది ఋగ్వేదములో ఐదవ మండలమైన ఆత్రేయ మండలమునందు ప్రతిపాదింపబడినది. ఇందులొ 15 మంత్రములు ఉన్నాయి.. మిగిలినవి ఫలస్రుతిగా, ఋషి స్మరణగా ఉన్నాయి. ఈ విషయము శ్రీసూక్తమునందే చెప్పబడినది.
"శ్రియః పంచదశర్చంచ శ్రీకామస్సతతం జపేత్"

ఈ మంత్ర సముదాయము 4 రకములైన ఛందస్సులను కలిగి ఉంది (అనుష్తుప్పు, భృహతి, త్రిష్టుభ్, ప్రస్తార పంక్తి)
ఈ మంత్రముల యొక్క ఋషులు - ఆనందుడు, కర్ధముడు, చిక్లీతుడు. వీరు చాలా ప్రసిద్ధమైన ఋషులు.. 
ఈ మంత్రముల యొక్క అధిస్టానదేవత - సాక్షాత్ శ్రీదేవి అయిన శ్రీ మహాలక్ష్మీదేవియే

మన సంప్రదాయములొ పారాయణ చేసెటప్పుడు - ఆ మంత్రము యొక్క ఛందస్సును, ఋషిని, మంత్రాధిస్టాన దేవతను  స్మరించడము పద్దతిగా ఉంది. 
ఛందోస్మరణ అంటే ఆ వేద స్మరణయే
ఋషిస్మరణ అంటే -  ఏ మంత్రములను ఋషి తాను దర్శించి, తన శిష్య, ప్రశిష్యులద్వార మనవరకు అందేలా ప్రవర్థమానము చేసారొ వారిని స్మరించడము ద్వార మన కృతజ్ఞతను ప్రకటించడమే..
ఈ మంత్రముల యొక్క అధిస్టానదేవత - ఆ మంత్రములకు ఎవరు అధిస్టానమై ఉన్నారో  ఆ దేవత యొక్క స్వరూప స్మరణ.. శ్రీసూక్తమునకు సాక్షాత్ శ్రీదేవి అయిన శ్రీ మహాలక్ష్మీదేవియే మంత్రాధిస్టానదేవత..  అసలు ఈ తల్లి ఎవరు ? ఈమె తత్వం/స్వరూపము ఏమిటి ?

ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఉన్నవాడు ఒక్కడు, తాను ఏ మార్పుచెందకుండా అనేక రూపములుగా ఆ పరమత్ముడే ఇన్ని రూపములుగా దర్శనమిస్తున్నాడు. దేవత అంటే ఆ పరమత్ముని యొక్క శక్తి యొక్క రూపము..
ఉదాహరణకి:
దక్షిణాముర్తిగా  ఆ పరమత్ముని ప్రార్ధన చేస్తే - ఆయనలోని జ్ణానమనే దేవతను/శక్తిని మనము ప్రార్ధిస్తున్నట్టు లెక్క.. అప్పుడు మనకు కూడా ఆ శక్తి ప్రసాదింపబడుతుంది.
సూర్యుని గా ధ్యానము చేస్తె  పరమత్మునిలోని ఆరోగ్యమనే శక్థి ఇవ్వబడుతుంది ..
శ్రీ మహాలక్ష్మీదేవిగా  ప్రార్ధన చేస్తే - పరమత్మునిలోని సంపదను అనుగ్రహిస్తుంది
ఉన్నది ఒకే పరమాత్ముడు నన్ను అనుగ్రహించేందుకై ఇన్ని రూపములుగా ఉన్నాడు..నామ రూపములు, మంత్ర సముదాయము వేరుగా ఉన్నా తత్వతహా ఇవి అన్ని ఒక్కటే. శక్తిమాన్ కంటే శక్థి వేరుగా ఉండజాలదు కనుక. 

శ్రీదేవి/శ్రీ మహాలక్ష్మీ ఒక దేవతగా ఆ పరమాత్ముని సంపత్ప్రసాద శక్తి, కాని, పారమార్ధికముగా చూస్తె సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపమే..

వేదాంతపరమైన భాషలో
పరమాత్మ - నిష్క్రియము, అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అవ్యపదేశ్యం, ఏకాత్మప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం,  శివం, అద్వైతం అయిన శుద్ధ బ్రహ్మము
శ్రీదేవి - మాయశక్తి. బ్రహ్మాశ్రయమైన మాయశక్తి..

శుద్ధబ్రహ్మము ఈ మాయశక్తి కారణముగ ఈ జగత్తుని సృస్టి చేస్తున్నాడు, స్తితి, లయములు కూడా చేస్తున్నాడు.
శుద్ధబ్రహ్మము గా ఏమి చేయలేడు (నిష్క్రియుడు అవ్వడము వలన). "శివశక్త్యాయుక్తో " అని సౌందర్యలహరి మొదటి శ్లోకము.

ఈ మాయశక్తి కారణము వలన  సృస్టి, స్తితి లయములు చేస్తున్నాడు.  ఈ కోణములొ చతుర్ముఖ బ్రహ్మ, శ్రీమహావిష్ణువు, మహేశ్వరులు గా ఆ శుద్ధబ్రహ్మమునే భావన చెయ్యడం జరిగినది. అలాగే  మాయశక్తి కూడ మూడు రకములుగా , శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ పార్వతి గా వ్యక్తమైనది.. వీటిని విడదీసి చెప్పడము కుదరదు. మాయశక్తి వల్లనే బ్రహ్మము విశిష్టమైనాడు.

శ్రీ మహాలక్ష్మీ వల్లనే శ్రీమహావిష్ణువు విశిష్టుడైనాడు. వీరిరువురు వేరుగా లేరు. రెండుగా లేరు..ఇది దేవతా స్వరూపము.

నా చిత్త సౌలభ్యము కొరకు , నా ఉపాసనా సౌలభ్యము కొరకు నేను శ్రీ మహాలక్ష్మీని శ్రీసూక్తము ద్వారా మంత్రధిస్టాన దేవతగా ధ్యానము చేస్తున్నను, నిజానికి ఆమె సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణియే.. ఈ విధమైన ధ్యానము, ప్రార్ధన సంపూర్ణ ఫలితములను ప్రసాదిస్తుంది అని ఆర్యుల వాక్కు..

శ్రీసూక్తము యొక్క మరిన్ని విషయములతొ మళ్ళీ  మీ ముందు ఉంటాను

శ్రీ గురుభ్యో నమః
సర్వం శ్రీ బాలత్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...