Thursday, February 22, 2018

గాయత్రిలోని_24_శక్తులు

“గయాం  త్రాయతి ఇతి గాయత్రి” ప్రాణాలను రక్షించేది గాయత్రి. శక్తి పలురకాలు. కానీ అన్నింటికి మూలమైన శక్తి ఒకటి ఉంది. దానిని ఆత్మశక్తి అని, గాయత్రి అని, బ్రహ్మ సంకల్పం అని, ఇచ్ఛాశక్తి అని అంటారు.

ప్రకృతి పరంగా చూస్తే సంవత్సరానికి 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు కలసి 24 వస్తాయి. రోజుకు 24 గంటలు. వీటికి ప్రతీకయే గాయత్రి మంత్రం. ద్వాదశ రాశులలో సంచరించే సూర్యుడు సూర్యవిద్య, అమృత వర్షం కురిపించే చంద్రుడు చంద్ర విద్య కలిపి భూమి మీద చూపే ప్రభావం గాయత్రి.

శ్లో:- ఆదిశక్తి స్తధా బ్రహ్మీ వైష్ణవీ తిచ
వేదమాత దేవమాత విశ్వమాత ఋతంభరా
మందాకిన్య జపాచైవ బుద్ధి సిద్ధి ప్రకీర్తితా
వైదికానిటు నామాని పూర్వోక్తానిచ ద్వాదశ

ఆదిశక్తి, బ్రాహ్మీ, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతంభర, మందాకిని, అజప, బుద్ధి, సిద్ధి ఈ పన్నెండు జ్ఞాన పక్షానికి, మస్తిష్కానికి, దక్షిణ మార్గానికి సంబందించిన శక్తులు.

శ్లో:- సావిత్రీ సరస్వతీ జ్ఞేయ లక్ష్మీ దుర్గా తధైవచ
కుండలిని ప్రాణాగ్నిశ్చ భవాని భువనేశ్వరి
అన్నపూర్ణేతి మానాని మహామాయా పయశ్వినీ
త్రిపురా చైవేతి విజ్ఞేయా తాంత్రి కానిచ ద్వాదశ

సావిత్రి, సరస్వతి, లక్ష్మీ, దుర్గ, కుండలిని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయశ్విని, త్రిపుర, ఈ పన్నెండు తాంత్రికమైనవి. వామ మార్గానికి సంబంధించిన శక్తులు.  
 
దక్షిణ మార్గమంటే జ్ఞాన మార్గం, వామ మార్గం అంటే శక్తి సంచయం. ఈ విధంగా జ్ఞానాన్ని, శక్తిని సంపాదించి ఆధ్యాత్మిక భౌతిక శక్తులలో రెండింటిలోనూ సాధకుడు ఫలితాన్ని పొందుతాడు. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు ప్రకృతిలోని 24 శక్తులను, మానవ శరీరంలో గల 24 శక్తులను సూచిస్తాయి.

"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"  జ్ఞానానికి ఒక హద్దంటూ ఉండదు. గాయత్రీమంత్రం, సాధకునికి ఋషిత్వ స్ధాయిని ప్రసాదించి, దేవర్షి స్ధాయికి తీసుకొని పోతుంది. అందుకోసం జ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను, విజ్ఞాన పక్షానికి చెందిన 12 శక్తులను అందిస్తుంది  గాయత్రి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...