Monday, February 26, 2018

వేద అంతరంగం.....


.
🌏ఓంశ్రీమాత్రేనమః🌍.
అద్వైత చైతన్యజాగృతి
.

సుగః పన్థా అనృక్షర ఆదిత్యాస ఋతం యతే |
నాత్రావఖాదో అస్తి వః ||
1-041-04 (ఋగ్వేదం)
ఈశ్వరుని అన్వేషించడానికి ముళ్ళు, ఎత్తుపల్లాలు లేని రాజమార్గం
ఓ ! అన్వేషులారా ఈ వైదికవిజ్ఞాన మార్గములోకి రండి..
---
వేదంలో  అందరికీ తండ్రి

ఉద్ యంయమీతి సవితేవ బాహూ ఉభే సిచౌ యతతే భీమ ఋఞ్జన్ |
ఉచ్ ఛుక్రమ్ అత్కమ్ అజతే సిమస్మాన్ నవా మాటృభ్యో వసనా జహాతి ||
1-095-07 (ఋగ్వేదం)

ఈశ్వరుడు భూలోకద్యులోకాలలో ఉండే సమస్త ప్రాణులను
తండ్రిలా ఉద్దరించడానికి రెండు చేతులనూ చాచుతున్నాడు
ఈ రెండు లోకాలను కాపాడటమే అతని ధ్యేయం,
ఎవరు ఎలా భావిస్తే అతను అలాగే కనిపిస్తాడు !

--
వేదంలో దేవుడు - జీవుడు

1-164-20 (ఋగ్వేదం) ..
ఇదే శ్లోకము అధర్వణవేదము - కాండము 9 - సూక్తము 9 -శ్లోకము 20-  నందు మరలాచెప్పబడినది !
-
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరి షస్వజాతే |
తయోర్ అన్యః పిప్పలం స్వాద్వ్ అత్త్య్ అనశ్నన్న్ అన్యో అభి చాకశీతి ||
-
రెండు పక్షులు (జీవాత్మ మరియు పరమాత్మ) ఎల్లప్పుడూ ప్రేమగా
ఒక చోటనే ఒక చెట్టు (దేహము)నే ఆశ్రయించి నివశిస్తున్నాయి.
ఒకటి ఆ చెట్టున కాసిన ఫలాన్ని (కర్మఫలాన్ని) ఆస్వాదిస్తే
మరియొకటి (పరమాత్మ) తినకుండానే (కర్మఫలం
అనుభవము లేకుండానే) స్వప్రకాశమై భాసిస్తున్నది..!
---------------------------------
వేదంలో ఆత్మతత్వం
-
ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః |
యస్ తన్ న వేద కిమ్ ఋచా కరిష్యతి య ఇత్ తద్ విదుస్ త ఇమే సమ్ ఆసతే ||
1-164-39 (ఋగ్వేదం)
-
ఆత్మతత్వం నుంచే విశ్వంలోని దేవతలు, సమస్తము పుడుతున్నారు.
ఆత్మతత్వం తెలియని వారికి ఋగ్వేదం వల్ల ప్రయోజనమేమి ?
ఆత్మతత్వం తెలిసిన వారికే నిజమైన ఆనందం !!
---

ఈశావాస్య ఉపనిషత్ ... (6, 7)

యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషుచాత్మానం తతో న విజుగుప్సతే
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః
.
"ఎవ్వడైతే ప్రపంచంలోని అన్ని ప్రాణులను ఆత్మస్వరూపుడగు తనలో చూచుచున్నాడో, అలాగే అన్ని ప్రాణులలోను ఆత్మ స్వరూపుడగు తనను చూచుచున్నాడో అతడు ఎవ్వరినీ ద్వేషించడు.  అలాగే బ్రహ్మజ్ఞాని అయినవాడు, సర్వాంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గుర్తెరిగి తనకు ఇతరులకు మధ్య భేద భావం పరిత్యజిస్తాడు.  అలాంటి వానికి శోకం గాని, మొహం గాని ఉండవు"

ఈనాడు ప్రజలలోనున్న అపోహలకు, అనుమానాలకు కారణం... పరబ్రహ్మ తత్వాన్ని ప్రజలకు పూర్తిగా అర్ధమయ్యేలా చెప్పకపోవటమే అసలు కారణం ! ఇది మాత్రం నిజం !!

-----
"సోయం విశ్వాసహ, సచ వైదికో ధర్మ:, ఇదానిం తత్సర్వం శిధిలాయతే"
"మన నిజమైన వైదిక ధర్మం శిధిలమౌతున్నదీ" -- ఆది శంకరులు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...