Monday, February 26, 2018

దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి ? పూలకున్న ప్రాధాన్యతేంటి ?

పూలు కోసేటప్పుడు దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులపకూడదు. చేత్తోనే కోయాలి. కోసిన పూలను కిందపెట్టకూడదు. తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదట.
పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్లుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు.
దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని శాస్ర్తం చెబుతోంది. కలువ పూలంటే మహాలక్షికి ఎనలేని ప్రీతి. అలాగే తెల్లని పూలంటే.. చదువుల తల్లి సరస్వతికి, పసుపు రంగు పూలు పార్వతీదేవికి ఇష్టం. కాబట్టి ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగించడం శ్రేయస్కరం.
మహా శివుడిని బిల్వ పత్రాలతో, శ్రీ చక్రాన్ని, విష్ణువుని పారిజాత పుష్పాలతో పూజించాలి.
తామర, కలువ, జాజి, చామంతి, నందివర్దనం, మందారం, నీలాంబరాలు, కనకాంబరాలు, పారిజాతం, పద్మాలు, ఎర్రగన్నేరు, నిత్యమల్లి పూలు దేవుడి పూజకు శ్రేయస్కరం.
ముందు రోజు సమర్పించిన పూలను బొటనవేలు, చూపుడు వేలుతో తీసేయాలి. తాజా పూలను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో దేవుడికి సమర్పిస్తే మంచిది.
పూజలకు పూలు వాడటం పూర్వం నుంచి ఆచారంగా వస్తోంది. భక్తితో, పవిత్ర మనస్సుతో ఎవరైతే పూలుతో గానీ, పండుతోగానీ, నీటితో గానీ దేవుడికి పూజ చేస్తారో.. వాళ్ల భక్తి నైవేద్యాన్ని తృప్తిగా స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు గీతలో వివరించాడు.
అందుకే.. పూజలకు పూలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...