Wednesday, February 21, 2018

పూజ్యగురుదేవులు షణ్ముఖుల భాగవత మకరందాలు

🕉🕉🕉🕉🕉🕉

🌸 *తస్మై శ్రీ గురవే నమః*🌸

గజేంద్రమోక్షము పంచరత్న గీతాలు లో ఒకటి.

1.భగవద్గీత,2.విష్ణుసహస్రం3.భీష్మస్థవరాజ్యం4.అనుస్మృతి5.గజేంద్రమోక్షం.భారతం లో నాలుగు తీసుకొని భాగవతం లో గజేంద్రమోక్షము మాత్రమే తీసుకోటానికి కారణం వాటితో సమానంగా సరితూగేది.

గజేంద్రమోక్షం ఆనంగానే అందరికి ఒక ఉత్సాహం ఇందులో భక్తుని ఆర్తి కనపడుతుంది.కానీ అందులో నిగూఢమైన మోక్షసాధన కూడా వుంది. దారిద్ర్యం, అనారోగ్యం,శత్రుబాధలు ,అపకీర్తి ఈ నాలుగు బాధలు లేకుండా ఉండాలి అనుకోవడం ధార్మిక వాంచ కాబట్టి తప్పు లేదు.

ఇవి రావాలి అంటే భాగవదనుగ్రహం ఉండాలి.కనీసం తట్టుకోగలిగే శక్తి ఇస్తాడు.భగవంతుణ్ణి ఆశ్రయించి బాగుపడ్డాడు గజేంద్రుడు అనే గజము దీనితో మనకు ధైర్యం వస్తుంది.ప్రార్ధన వృధా పోదు.ఆత్రత్రాణపారాయణ..అని శ్లోకం అప్పయ్య దీక్షితులు వారు రచించి నారాయణ లీలలు అందులో పొందుపరిచారు.చాలా మంది గజేంద్రుడు లా నన్ను రక్షించు అని అంటారు కానీ ఆ శరణాగతి చూపించరు.ఆశ అందరికి ఉంటుంది కానీ అర్హత కొంతమంది కె వుంటుంది.
దీని సన్నివేశం గొప్పది.ఏనుగు ఏమిటి మొసలి పెట్టుకోవటం ఎమిటి ఆ ఏనుగు విష్ణువు ను ఆశ్రయించటమేమిటి .విష్ణు అనుగ్రహించి కాపాడి స్పర్శ ని ఇవ్వడం ఎమిటి.స్త్రోత్రం గొప్పది బ్రహ్మవిద్యా స్థానము లభించింది.
క్షీరసాగరం మధ్య లోత్రికూట పర్వతం దగ్గర జరిగింది.అక్కడ మూడు శిఖరాలు అవి వెండి, బంగారం,ఇనుము కూడినవి.గజేంద్రమోక్షం ఒక్కమాటలో చెప్పాలి అంటే జీవుని వేదన.ఆ పర్వతం లో వరుణ ఆధీనంలో ఒక ఉద్యానవము అక్కడ 54 రకాలు వృక్షాలు అవి నిత్యవసంతలక్షణము కలిగినటువంటివి.అక్కడ చాలా రకాలు అయిన జంతువులు వాటిల్లో ఏనుగుల్లో ఇంద్రుడు అంత శ్రేష్ఠుడు గజేంద్రుడు.భగవంతుడు భక్తులు గుంపులో కాకుండా గుంపులో గోవిందుడి లా వుంటారు.ఆ గజేంద్రుడు తన ఏనుగులతో విహారం చేస్తూ వృక్షాలను పెకిలిస్తూ ఉత్సాహంగా గడుపుతూ ఒక సరస్సు దగ్గరకు వచ్చారు.బంగారు కమలాల ఆ సరస్సు లో కేరింతలు కొడుతూ ఆ క్షమలాలు బైటకి వస్తాయా అన్నంత ఆడుతున్నారు.చివరకు అవి చెల్లాచెదురు అయ్యేంత ఆడారు.ఇంత లో ఒక మొసలి గజేంద్రుడు ని పట్టుకుంది ఎందుకు గజేంద్రుడు అంటే ప్రారభ్డము.వారిరువురు మధ్య యుద్ధమే జరిగింది.

కరిదిగుచు మకరి సరసికి, కరి దరికిని మకరి దిగుచు కరకరిబెరయన్
కరికి మకరి మకరికి కరి, భరమనుచును అతలకుతల భటులరుదుపడన్.(పోతన పద్యాలు పిల్లల చేత చదివించండి వారి ఆయువు పెరుగుతుంది.పోతనగారి పద్యాలు ,ఒక సంస్కృత శ్లోకం, ఒక తెలుగు పద్యం నోరారా చదివితే లోపల వాయువు ప్రాణశక్తి యేయే కేంద్రాలలో తగలాలి ఆయా కేంద్రాలను తగిలి స్పందించి నోట్లో దంతములు ఇత్యాది స్థానాలన్నీ స్పందించి మనలో ప్రాణశక్తి వృద్ధి చెంది ఆయువు వృద్ధి అవుతుంది. ఒక్క తెలుగు పద్యం పది ప్రాణాయామాలతో సమానం.
100 రకాల ప్రాణాయామాలు ఒక్క విష్ణుసహస్రనామము చదవడమువలన వస్తుంది అని ఒక రీసెర్చ్ లో తెలిసింది.పిల్లలు ఇవి నోరారా అంటుంటే ఎంత బాగుంటుంది..వినటానికి చెవులకి బాగుంటుంది తర్వాత వారి బ్రతుకు కూడా బాగుంటుంది.)
ఇలా మొసలి పట్టికున్న కాలు ని విడవటానికి మగ ఏనుగులు గట్టి ప్రయత్నిస్తున్నాయి.ఆడవి అయ్యోఅయ్యో అంటున్నాయి.జలజీవి అయిన మొసలి ఆ జలతీవ్రత వల్లా ఆ గజేంద్రుడు బలం తగ్గిపోయింది.ఆతని పరిస్థితి మన పరిస్థితి ఒకటే.హాయిగా చుట్టూ మనల్ని పొగుడుతూ ఉన్న జనాల తో బాధలు లేకుండా వున్నప్పుడు చటుక్కున ఒక దెబ్బ తగులుతుంది.మొహమనే మొసలి పట్టిన గజేంద్రుడే జీవుడు.నీటిలో మొసలి కి బలమెక్కువ సంసారం లో మోహానికి బలమెక్కువ.మోహాన్ని విడిచి విష్ణువు ని వేడిన గజేంద్రుడు కథే గజేంద్ర మోక్షం.
అప్పటిదాకా గజేంద్రుడు తో ఉన్న తోటి గజములు నెమ్మది నెమ్మదిగా జారుకుంటున్నాయి.నావాళ్ళు అని మురిసిపోయి దిగితే నీకొచ్చే ఆపద వాళ్లేమి చెయ్యగలరు.బాధలు వచ్చినప్పుడు ఎవరికి వారు ఒంటరే.ఇంక లాభం లేదనుకున్నాడు.ఇక్కడి వరకు అందరి కధ.ఇకపై ముముక్షువు కధ,ఆ పై ముక్తుడి కధ.ఇప్పుడు ఆ ముముక్షువు మోక్షము పొందాలి అని తపన పడడానికి అడుగులు వేస్తున్నాడు.తరించడానికి తపన పడేవాణ్ణి ముముక్షువు అంటారు.

గజేంద్రుడు ఆలోచిస్తున్నాడు పరిస్థితి గురించి కాపాడే వారు లేరా ఎలా వుండే వాణ్ణి ఎలా అయిపోయాను.దశలక్షకోటి ఆడ ఏనుగులు తో ఆనందంగా వుండేవాన్ని.

🌺 *దశలక్షకోటి వివరణ:౼*🌺

దశ అంటే 10 ఇంద్రియాలు.
లక్షకోటి అంటే అనంతం
దశాలక్ష కోటి అంటే 10 ఇంద్రియాలు వెంటపెట్టుకుని తిరుగుతున్న జీవుడే ఆడఏనుగుల తో తిరగడం లో అర్ధము.

అలా ఆనందంగా ఉన్నవాడిని ఇక్కడ కి ఎందుకు వచ్చాను.అంతర్ముఖుడనయి ఆనందంగా ఉన్న నేను బహిర్ముఖుడు గా ఎందుకు వచ్చాను.
వ్యవసాయత్మక బుద్ధి తో మనసు పెట్టి జపించాడు.హృదయం లోని బుద్ధిని స్ఫురించి చేసిన స్తోత్రం.మనసు వాక్కు కలిపితే పూర్తిగా బహిర్ముఖము నుంచి అంతర్ముఖమై పరమాత్మ ని పట్టుకోవడం సులభం.గతజన్మ ల తో వచ్చిన శిక్షణ తో ఈ స్తోత్రం చేసాడు.మహాత్ముల కష్టాలు అవకాశాలు సామాన్యులవి కింద పడేస్తాయి.ఆర్థ భక్తి తో మొదలు అయి జిజ్ఞాస చిగురించి జ్ఞాన భక్తి గా ఫలించిన భక్తి గజేంద్రుడు ది.పరమాత్మ ఆయన్ని పట్టుకోవడం ఇవి రెండే ఉంటాయి ఈ స్తోత్రం లో.దీనిపేరు నిర్విశేషబ్రహ్మ స్తుతి.నామరూపాతీతమైనది.
Universal prayer అన్ని మతాలకు ఇవ్వగల సత్తా ఒక universal అయిన hindu మతానికే ఉంది.
నిత్యము విచారణ చేస్తుపఠిస్తే మంచిది.ఇందులో ప్రణవం,ధీమహి ఉంటాయి.గాయత్రీ మంత్ర సమానం.

గురువుగారు అమెరికా లో భాగవతం ప్రవచనం చెప్తున్నప్పుడు ఒక కుర్ర వాడు మాట్లాడే అవకాశము ఇమ్మని అంటే ఇచ్చారు అతను చెప్పింది మెదడు వ్యాధి తో బాధ పడుతున్న ఒక స్నేహిత కుటుంబము తాను కిలిసి గజేంద్రమోక్షం
పాటించామని పిల్లవాడు కొలుకున్నాడు అని.
గజేంద్ర మోక్షము లో ప్రవేశిస్తూ ఉన్నాము .

🌹 ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్
పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్
యోऽస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయమ్భువమ్. 🌹

ఈ రెండు శ్లోకాలు అయినా నిత్యం జపించుకోవాలి.
భగవానునికి నమస్కారం.ఎవరివల్ల చైతన్యమగు జగత్తు జరుగుతున్నదో అటువంటి ఆయనను సంపూర్ణంగా ధ్యానిస్తున్నాను.
ప్రపంచానికి ఆదిబీజుడు పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను.ఎవరి యందు  జగత్తు ఉన్నదో ,ఎవరి వల్ల ఈ జగము ఉన్నదో,ఎవరి చేత ఉన్నదో ఆ భగవంతుడే ప్రపంచము అయివున్నారు.

యః స్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వ చ తత్తిరోహితమ్
అవిద్ధదృక్సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలోऽవతు మాం పరాత్పరః
పరాత్పరుడు రక్షించు గాక ఎవరిఎందు ఆయన మాయాశక్తి వశించి ఉందో తిరిగి మాయశక్తి లోపలకి లాగబడుతూ ఉందొ అటువంటి ఆత్మమూలుడిని శరణువేడుతున్నాను.

దిదృక్షవో యస్య పదం సుమఙ్గలం విముక్తసఙ్గా మునయః సుసాధవః
చరన్త్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః స మే గతిః
ప్రపంచ వికారాలకు దూరమై వనం లోదేన్ని పొందాలని ప్రపంచంలో అందరూ బ్రహ్మచర్య వ్రతము ఆచరిస్తారో ఆ బ్రహ్మమునకు నమస్కారం.

న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా
తథాపి లోకాప్యయసమ్భవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి

ఎవడికి జన్మ కర్మా లేదో ఎవడికి నామము రూపము కూడా లేదో అటువంటి వానికి  నమస్కారం.జన్మ కర్మ లేనప్పటికీ ఈ విశ్వానికి ఉత్పత్తి ప్రళయం కోసం తన మాయ తో అనేక రూపాలు ధరిస్తాడో ఆయనకు నమస్కారం.
ఇలా చాలా స్టోతాములోని శ్లోకాలు వివరణ.
కలడో లేదో ప్రస్తావన.
మోక్షము చివరికి ఎవడికి వచ్చింది ఏనుగు కా మొసలి కా ..?మొసలి ఒక గంధర్వుడు శాపవశాత్తూ మొసలి అయ్యాడు.ఆయన మరణం పొందగానే మకరమోక్షం అని ఎందుకు పెట్టలేదు.పోనీ గజేంద్రుడు కి  మొసలి బారి నుంచి మోక్షం ఇచ్చాడా ?అసలు మోక్షం అని దేన్ని అంటారు.అసలు మోక్షము ఇవ్వమని గజేంద్రుడు స్పష్టంగా అడిగాడా అది
తెలియడానికి రేపు ప్రవచనం లో గురువు గారు చెప్తాను అనడం తో ఈరోజు ప్రవచనము పూర్తి అయింది
సర్వము శ్రీ గురుచరణారవిందార్పణ మస్తూ.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...