Wednesday, February 21, 2018

రామేశ్వరం కాశీ సైకతయాత్ర

🕉🕉🕉🕉🕉🕉

     రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే, యాత్రనే  సైకతయాత్రగా పిలుస్తారు.ఈ యాత్ర "పితృదేవతల"కు సంబంధించినది.

     ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించవలసినది.

      ముందుగా రామేశ్వరం చేరుకుని సేతువు లో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని,మూడు లింగాలుగా(కుప్పలుగా) వుంచి,
శ్రీ సేతుమాధవుడు,
శ్రీ వేణీమాధవుడు,
శ్రీబిందుమాధవుడిగా స్వరూపంగా భావించి,షోడషోపచారాలతో అర్చించి,
శ్రీ సేతుమాధవస్వరూపాన్ని రామేశ్వరం లోని సముద్రంలో నిమజ్జనం చేయాలి.

     మిగిలిన రెండుస్వరూపాలను తీసుకుని అలహాబాద్ లోని త్రివేణిసంగమం చేరుకుని,
శ్రీ వేణిమాధవ,శ్రీబిందుమాధవ స్వరూపాలను,అర్చించి
శ్రీ వేణీమాధవున్ని త్రివేణీసంగమంలో నిమజ్జనం చేయాలి.

  మిగిలిన శ్రీబిందుమాధవస్వరూపాన్ని కాశీలోని, బిందుమాధవఘాట్ నందు అర్చించి,ఆ స్వరూపాన్ని అక్కడే నిమజ్జనం చేసి,

    తిరిగి అలహాబాద్ చేరుకుని,గంగతీసుకుని,
కాశీవచ్చి, శ్రీవిశ్వనాధునకు అభిషేకం చేసి,మరలా అలహాబాద్ చేరుకుని, మరలా గంగను తీసుకొని,రామేశ్వరం చేరుకొని, అక్కడగల కైలాసం నుండి తెచ్చిన స్ఫటికలింగానికి అభిషేకం చేయించుకొని,ఇంటికి చేరుకోవాలి.

    ఈ విధంగాచేయడం వలన పితృదేవతలు తరిస్తారని,వంశాభివృధ్ధి కి మంచిదని పెద్దలు చెపుతారు.

ఈ యాత్ర ప్రారంభించినప్పటి నుండి రామేశ్వరం స్ఫటికలింగానికి అభిషేకం చేయించేంతవరకు ఇంటికి రాకూడదు.

ఆపర్వతవర్ధనిసమేత
శ్రీరామేశ్వరుని,మరియు శ్రీగంగాఅన్నపూర్ణావిశాలాక్ష్మిసమేత శ్రీవిశ్వనాధుని కరుణాకటాక్షములు మనందరికీ కలగాలని,ఆశిస్తూ...

#సర్వేజనాఃసుఖినోభవంతు#

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...